ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం.

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి:

 

చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకొని 11 వ సంవత్సరం ముగించుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది
అనంతరం మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతోనే ఏర్పరచుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల కోరిక నెరవేర్చుకోవడానికి చిన్న పెద్ద తేడా అని లేకుండా తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యోగులు రైతులు అని తేడా లేకుండా యువతీ యువకులు అందరూ పాల్గొని తెలంగాణ సాధన కోసం ఎంతోమంది అమరులై సాధించుకున్న తెలంగాణలో మన నిధులు మన నియమకాలు మన ఉద్యోగాలు అనే నినాదంతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకతాటిపై నిలబడి ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం జరిగిందని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతీయ జనతా పార్టీ కృషి ఎనలేనిదని మొదటి నుండి ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి మద్దతుగా నిలిచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే క్రీ. శే. మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ తల్లి సూక్ష్మ స్వరాజ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని అన్నారుఅనంతరం భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలాధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా కార్యకర్తలు బుర్ర వెంకటేష్ గౌడ్ కు శాలువాతో ఘనంగా సన్మానించడం .ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ గుండ సురేష్ సాధసదానందం కుమార్ శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి సారంగపాణి మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ రాయిని శ్రీనివాస్ సదానందం చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.

వ్యవసాయ మార్కెట్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

జెండా ఆవిష్కరించిన ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి జెండావిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల బలిదానాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావాన్ని మనం జరుపుకోవడం సంతోషకరమైనదని ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ నారాయణ,తహాసిల్దార్ విజయలక్ష్మి,కాంగ్రెస్ మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ,మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్,మార్కెట్ డైరెక్టర్స్ దాసరి బిక్షపతి,బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళి,భోగం కమల,నల్లెల కుమారస్వామి,
పెండ్యాల కుమారస్వామి,
ఎండి రంజాన్,వైద్యుల వెంకటరాజిరెడ్డి,శానం కుమారస్వామి,గాదె విజయ్,
బుడిమే రాజయ్య
మల్లక్కపేట భక్తాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్,కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, , రాయపర్తి మాజీ ఎంపిటిసి పర్నెం మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు , తాజా మాజీ కౌన్సిలర్స్ పరకాల మండల పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పరకాల మండల పట్టణ నడికూడ మండల సీనియర్ బ్లాక్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు,మార్కెట్ కార్యదర్శి,వ్యవసాయ అధికారులు,సిబ్బంది
రైతులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఐనవోలులో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు

అయినవోలు నేటిదాత్రి:

ఐనవోలు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కలపల్లి చందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వినర్ తంపుల మోహన్, బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా భరోసా అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్ అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు చేతగాని అడ్డగోలు హామీలు ఇచ్చి తాము అధికారం చేపట్టే సరికి రాష్ట్ర పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాకపోతే, ప్రభుత్వం గద్దె దిగిపోవాలని కేసీఆర్ నాయకత్వంలో మరోమారు బంగారు తెలంగాణను సాధించేందుకు భారస పార్టీ సిద్ధంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారస గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, మండల నాయకులు కావటి స్వామి, కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుపెల్లి రాజు, పట్టపురం ఎల్లగౌడ్,బొక్కల స్వామి, గద్దల ప్రభాకర్,సంతోష్,రవి తదితరులు పాల్గొన్నారు..

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

కొత్తగూడ నేటిధాత్రి:

కొత్తగూడ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్త గూడబిజెపి మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి మురళి మాట్లాడుతూ .
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఆరవది ఏండ్ల ఆరాటం ప్రజల అస్తిత్వపు ఆత్మ గౌరవ పోరాటం
నా తెలంగాణ అమరవీరుల పోరాట ఫలితంగా చిన్నమ్మ సుష్మ స్వరాజ్ గారి వంటి ఎందరో మహానీయులు యోగ దనంతో స్వరాష్ట్రమై పులకించిన పుడమి తల్లి నా తెలంగాణ మహానీయులు ఆశయాలతో ఆశయ సిద్ది కై అమరవీరుల ఆత్మ ఫలితంగా అవతరించిన నెల నా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు బోనాల ప్రవీణ్ కుమార్ చారి. వజ్జరవి . జిల్లా నాయకులు వాసంసారయ్య. మండల ఉపాధ్యక్షులు బూర్గసారంగపాణి. శ్రీనివాస్. రామయ్య పిన్నింటి రవీందర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు…

ఘనంగా కొల్లూరులో 11వ తెలంగాణ ఆవిర్భావ ధీనోత్సవ వేడుకలు.

ఘనంగా కొల్లూరులో 11వ తెలంగాణ ఆవిర్భావ ధీనోత్సవ వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కొల్లూరులో తెలంగాణ ఆవిర్భావ ధినోస్తవా వేడుకలను పంచాయతీ కార్యాలయం మరియు పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపిటిసి సి హెచ్ రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,యుత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,మాజీ వార్డ్ సభ్యులు ఎం విష్ణు,సామాజికవేత్త దంరాజ్ గౌడ్,ఫీల్డ్ అసిస్టెంట్ సి సుబాకర్,పాఠశాల ఉపాధ్యాయురాలు అక్షర,అంగన్‌వాడీ టీచర్ సంఘమణి, సి శకుంతల,సి నర్సిములు రిపోర్టర్,సి డేవిడ్,సతీష్ గౌడ్, సి ప్రకాష్, సి సంజీవులు, సాయి గౌడ్,దేవదాస్,నర్సిములు,అనిల్, గ్రామ పెద్దలు సి హెచ్ రాములు పంతులు,ఎం రాములు, ఎం బాలప్ప, లక్ష్మయ్య,సంగప్ప మరియు యువకులు,విద్యార్థులు పాల్గోని భారత దేశ త్రివరణ పథకాన్ని ఎగురవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి శుభకాంక్షలు తెలియజేసారు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోవనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబి ఎస్పీ రావుల గీరీదర్ మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు జరుపుకున్నారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  జెండా ఎగరవేశారు

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

రాష్ట్ర సాధనలో మాజీ సీఎం కెసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి.

రాష్ట్రం సిద్ధించడంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి.

మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

14 ఏళ్ల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ఉద్యమ రథసారథి కెసిఆర్ సారధ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థుల పోరాటాలు సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరో దశబ్దాల కల సహకారం అయిందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్థానం యావత్ భారత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ గడ్డపై పురుడుపోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి దారి చూపే దీప స్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ష చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, వైనాల వీరస్వామి, ఇంగ్లీశివాజీ, మాజీ సర్పంచులు నాన బోయిన రాజారాం యాదవ్, ఊరటి అమరేందర్ రెడ్డి, మామిండ్ల మోహన్ రెడ్డి, చీకటి ప్రకాష్, వెంకన్న, మాజీ ఎంపిటిసి జన్ను జయరావు, నాయకులు ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, ఆకుల సాంబారావ్, బోట్ల పవన్, బూస సదయ్య, గుండాల శ్రీశైలం, గుమ్మడి వేణు, పరికి కోర్నిల్, రాజు, వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు.

వేములపల్లిలో తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …
గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్

మొగుళ్ళపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని వేములపల్లి బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిపారు గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది ఆత్మహత్య చేసుకున్నారుప్రత్యేక తెలంగాణ అంశంపై 2017 శ్రీకృష్ణ కమిటీ ఎప్పటి ఆరు ప్రతిపాదనలు చేసి ఆ ప్రతిపాదనలు జూలై 2013 జూలై 31 తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది 2013 అక్టోబర్ 3న కేంద్రం మండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 13 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు లోకసభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొంది 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వికరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు అని ప్రవేశపెట్టింది 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించాక 2014 దేశంలో 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది . తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంలో తెలంగాణ సాధించారని ఉద్యమ సారధి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమేష్ ఎండి రహీం బండారి తిరుపతి బీసీ సంఘం అధ్యక్షులు భాష బోయిన శ్రీశైలం వికలాంగుల అధ్యక్షులు రమేష్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్ లు బడుగు ఎల్లయ్య, మ్యాకల స్వామి, జక్కుల బాబు, కుంబాల రాజేశం, వేణుగోపాల్ రెడ్డి, కోట్ల మల్లేశం, మార్కెట్ సిబ్బంది, రాజేశం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అనిత సుధాకర్ రెడ్డి, లావణ్య శ్రీనివాస్, సుమిత్ర సురేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ షఫీ, మాజీ వార్డ్ మెంబర్ శ్రీనాథ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహమూర్తి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మదర్ తెరిసా సమైక్య మండల కార్యాలయంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి, రైతు వేదిక వద్ద ఏవో బన్న రజిత, జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలాపించి అమరవీరులకు జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో ముప్పు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు సబ్బండ వర్గాల త్యాగ ఫలితం తోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగిందని. రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క సూచనల మేరకు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు త్రివర్ణ పతాకం జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు తధానంతరం వారు మాట్లాడుతూ…
జూన్ 2 స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయిన రోజు
ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరిన రోజు
నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ నినాదం
ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం
అలుపెరగని పోరాటాలతో సాధించిన అంతిమ విజయం
అసాధ్యభావనను, సుసాధ్యాం చేసిన శుభదినం స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం, అభివృద్ధితో విరాజిల్లుతున్న మన ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనం..తెలంగాణ ప్రజల కాంక్షను తీర్చిన తల్లి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ..రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి,
కొత్తగూడ బ్లాక్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు,
బానోత్ విజయ రూప్సింగ్ ఎక్స్ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి.
పులుసం పుష్పలత ఎక్స్ జెడ్పిటిసి.
బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ మండల అధికార ప్రతినిధి.
బోయినేని ప్రశాంత్ రెడ్డి యూత్ మండల అధ్యక్షులు.
వల్లపు రంజిత్ జిల్లా ఓబీసీ నాయకులు.
నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు
సిరిగిరి సురేష్ మండల సోషల్ మీడియా.
కే దాసుప్రసాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు.
బోడ ఈరియా నాయక్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు.
కట్రోజు బిక్షపతి బీసీ సెల్ మండల నాయకులు.
శిరబోయిన సాయి
యాదగిరి కిరణ్.
మెకానిక్ కృష్ణ. జితేందర్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నేటి ధాత్రి గార్ల:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,నీళ్లు, నిధులు,నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అన్నారు.అమరుల ఆకాంక్షలు, ఆశయాల కోసం సకల జనులందరూ కృషి చేయాలని ఆయన కోరారు.స్వరాష్ట్రము కోసం అసువులు బాసిన తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై రియాజ్ పాషా, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద విశ్వ జంపాల,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారదా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్,సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్,కడియం వెంకన్న, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు, గిన్నారపు మురళి తారక రామారావు, భూక్యా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మల్లీ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

మల్లీ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా న్యాల్కల్ మండల్ మల్లీ గ్రామ పంచాయతీ కార్యాలయం & అంగన్వాడి కేంద్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతీ మాజీ సర్పంచ్ బాబురావు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ వార్డు సభ్యులు సిద్ధారెడ్డి తాత్కాలిక పంచాయత్ కార్యదర్శి జై సింగ్ సిఏ నర్సారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అంబిక అంగన్వాడీ టీచర్లు వసంత సుకుమారి ఆశ వర్కర్లు జగదేవి శివలీల పంచత్ కార్మికులు చంద్రయ్య డేవిడ్ గణపతి సంగమ్మ చిన్నమ్మ కన్నమ్మ మైనార్టీ నాయకులు అఖిల్ స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం.

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం

హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి

హన్మకొండ వరంగల్ నేటిధాత్రి (లీగల్):

శనివారం నాడు వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా పొగాకు నిరోధక అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి పాల్గొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో వరంగల్ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా అనేక విధాలుగా చెడుగా ప్రభావితం చేస్తుంది అని తెలిపారు. పొగాకు వినియోగ దారులలో అవగాహన కల్పించడం మరియు దానిని మానేయడానికి తగిన కారణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. పొగాకు కోరికను అధిగమించడానికి తన దృష్టి మరల్చుకొని పొగ రహిత ప్రాంతానికి వెళ్లడం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు సంగీతం వంటి ప్రత్యామ్నాయ సడలింపు పద్ధతులను ప్రయత్నించాలని సూచించారు.

legal services

హనుమకొండ ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు వినియోగం వలన కలిగే చెడు ప్రభావాలను వివరించారు. పొగాకు వాడకం గుండె మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధులకు దారితీస్తుంది, ధూమపానం గుండెపోటు లకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది కనుక పొగాకు కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు.ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో న్యాయమూర్తులు పొగాకు రహిత ప్రతిజ్ఞ ను చేయించారు.

ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ కోర్ట్ న్యాయమూర్తి నారాయణ బాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్, హనుమకొండ జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా.ఏ.అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ డా.మోహన్ సింగ్, డా. శ్రీనివాస్, పల్మనాలజిస్ట్ డా.పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మే – 30 సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బి.వై. నగర్ లోని సి.ఐ.టి.యు ఆఫీసు వద్ద CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం , హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం CITU అని 1970 మే 30 వ తేదీన ఐక్యత – పోరాటం అనే నినాదంతో కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని గత 55 సంవత్సరాలుగా దేశంలో , తెలంగాణ రాష్ట్రంలో , రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక హక్కుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని పోరాటంలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సి.ఐ.టి.యు కు అండగా ఉంటూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
ఈరోజు సిఐటియు 55 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కార్మిక వర్గ ఉద్యమ పోరాట కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గుర్రం అశోక్ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , గుండు రమేష్ , దొబ్బల లచ్చయ్య , వావిలాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు ఘనంగా శ్రీ మద్ రామాయణ మహా యాగం.

రెండో రోజు ఘనంగా శ్రీ మద్ రామాయణ మహా యాగం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి రజతోత్సవ వేడుకల సందర్భంగా మిథిలా ప్రాంగణంలో సోమవారం రమణీయంగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.

యాగశాలలో తీర్థ గోష్టి ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అనంతరం మిథిలా ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ యాగం ఆరంభానికి మంగళ శాసనం అందించారు.

Maha Yagam

 

 

అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడం కోటి సూర్య ప్రభల భగవానుడి ప్రకాశం వల్లే తొలగి పోతాయని చెప్పారు.

ప్రహ్లాదుడు అపారమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాడని, ఆ అపర భక్తుడి కోసమే విష్ణువు నారసింహుడి రూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేసిన విధానాన్ని జీయర్ స్వామి ఈ సందర్భంగా చాలా విశదీకరించారు.

విష్ణు తత్వాన్ని చూపుతూ..

సన్మార్గంలో నడిపించే వాడు సుదర్శనుడు. సుదర్శన భగవానుడు అని చెప్పారు.

Maha Yagam

ఆరాధిస్తే ప్రతి వస్తువులో ప్రతి చోటా దేవుడు ఉంటాడని జీయర్ స్వామి ఉద్బోధించారు.

ఇష్టి శాలలో ఈ యాగానికి పూర్ణాహుతి ప్రకటించిన అనంతరం..

యాగశాల హోమ గుండం వద్ద సైతం పూర్ణాహుతి హవనంతో కార్యక్రమం ముగిసినట్లు ప్రకటించారు.

Maha Yagam

కార్యక్రమంలో యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాస చార్యులు, గోవర్ధనగిరి అనంతచారీ, కుమారాచార్యులు నవీన్ చార్యులు, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి స్థానా చార్యులు డింగరి కృష్ణ చైతన్య చార్యులు, శ్రీకాంతా చార్యులు, నరసింహ చార్యులు, ఆలయ ధర్మకర్త దివంగత సురేందర్ రావు కుటుంబ సభ్యులు, మందమర్రి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

జాతీయ డెంగ్యూ దినోత్సవం.

జాతీయ డెంగ్యూ దినోత్సవం

– డెంగ్యూ డే సందర్భంగా

– ప్రజల కు అవగాహన కల్పించేందుకు ర్యాలీ.

– దోమల వ్యాప్తిని అరికడుదాం.

డాక్టర్ గుగులోతు రవి

మరిపెడ నేటి ధాత్రి:

దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వైద్యాధికారి డాక్టర్ గూగులోతు రవి పేర్కొన్నారు,డెంగ్యూ డే సందర్భంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మరిపెడ పట్టణం కార్గిల్ సెంటర్ మరియు బస్టాండ్ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఆర్ధోవైరస్‌ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు.ఇది మనిషి నుండి మనిషికి ఏడిస్‌ ఈజిప్టై దోమలద్వారా సంక్రమిస్తుందన్నారు.ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండుటవలన దీనిని టైగర్‌ దోమ అనికూడా పిలుస్తారన్నారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉండి,పగటిపూట మాత్రమే కుడతాయన్నారు.ఇవి ఎక్కువ దూరం (400 మీటర్లు) ఎగరలేవని, అన్ని రకాల దోమలకంటే ఈ దోమ చాలా బరువైనదగా ఉంటుందన్నారు.డెంగ్యూ వైరస్‌ తో ప్రభావం అయిన దోమలోనే కాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్‌ ఉంటుందన్నారు.కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుందని,ఈ వైరస్‌ వలన ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా డెంగీ రావచ్చన్నారు,వ్యాధి లక్షణాలు ముఖ్యం గా
ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి,విపరీతమైన కండరాలు,కీళ్ళ నొప్పులు
కళ్ళు నొప్పులు, కంటి కదలిక తగ్గటం,నొప్పి,ఒక్కొక్కసారి శరీరంలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయన్నారు
చిగుళ్ళ నుండి రక్తస్రావం
అధిక దాహం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు.
డెంగీ వ్యాధి మూడు రకాలుగా బయటపడవచ్చు..
డెంగీ జ్వరం,డెంగీ హెమరేజ్‌ జ్వరం,డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ గా వెల్లడి అవుతుందన్నారు.
నివారణ చర్యలు ముఖ్యం గా ఇంటిలోపల, ఇంటి ఆవరణలో ఎక్కడా మూతలేకుండా కొద్దిగా నీళ్ళుకూడా నిల్వ ఉండకూడదన్నారు
ఉదాహరణకు పూలకుండీల క్రింద, పెంకులు, కొబ్బరిబోండాలు, రుబ్బురోళ్ళు, పనికిరాని వస్తువులు, పాతటైర్లు, తాగి పడేసిన టీ కప్పులు, సీసాలు, , నీటి ట్యాంకులు, సంప్‌ లు, కూలర్లు, నీటి గుంటలుల్లో ఈ దోమ ఉత్పత్తి అవుతుందన్నారు.
దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ, ఆచార్యులు, సుదర్శన్, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది సాయి శ్రీ, సిరి, సతీష్, ఝాన్సీ, తరణి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, నర్సయ్య, ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

తలసేమియా దినోత్సవం .

తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్బంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది తో కలిసి అవగాహన ర్యాలీ మరియు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే రక్త వ్యాధినే తలసేమియా అంటారు.హిమోగ్లోబిన్ రక్తంలోని ఆక్సిజన్‌ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆల్ఫా (α) మరియు బీటా (β) అనే రెండు ప్రోటీన్లతో ఏర్పడుతుంది. త‌ల‌సేమియా వ్యాధిగ్రస్తుల్లో ఎముక మజ్జ (బోన్ మ్యారో) శ‌రీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ లేదా ఎర్ర ర‌క్త క‌ణాల‌ను త‌యారుచేయ‌కపోవడంతో శరీరంలోని అన్ని కణాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా అందదు.తలసేమియా ఎక్కువగా రెండు సంవత్సరాల్లోపు గల వారిలో గమనించవచ్చు.మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు లేదా హిమోగ్లోబిన్ ఉండాల్సిన మోతాదులో లేన‌ప్పుడు తలసేమియాతో పాటు ర‌క్త‌హీన‌త సమస్య కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, సాయిశ్రీ,సిరి,పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ,ఆచార్యలు,సరళ, నర్సబాయి, ఝాన్సీ,శ్రీదేవి, నాగమణి, ఆశ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని వద్ద యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సిహెచ్.భీమ్రావు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగే స్వామి జెండాను ఆవిష్కరించి,కేకును కట్ చేశారు.అనంతరం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కార్మికులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.1947 మే 3న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య బేబీ కృపాలాని ఐఎన్టీయూసీ ని స్థాపించారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కులు,సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిపెట్టిన ఘన చరిత్ర ఐఎన్టియుసి యూనియన్ ది అని కొనియాడారు.30 మిలియన్లకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక కార్మిక సంఘం అని అన్నారు. జాతీయస్థాయిలో ఇన్ని సభ్యత్వాలు కలిగి ఉండడానికి ప్రధాన కారణం జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి,జాతీయ ప్రధాన కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ లు కార్మికుల హక్కులను సాధించడమే ధ్యేయంగా నేటి వరకు కృషి చేయడమే అన్నారు.రానున్న రోజులలో యూనియన్ను మరింత బలమైన కార్మిక సంఘంగా నిర్మించడం కోసం వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు పేరం రమేష్,ల్యాగల శ్రీనివాస్,ఫిట్ కార్యదర్శి నంబయ్య,జిల్లా కార్యదర్శి బీమ్ రవి, ఉపాధ్యక్షులు జే.నర్సింగ్,ఫిట్ అసిస్టెంట్ కార్యదర్శిలు మహేష్ రెడ్డి,శ్రీను,రవి, కార్యదర్శులు చందు పటేల్,బి.అశోక్,చిన్నయ్య, మహేందర్ రెడ్డి,రాజు,మల్లేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version