తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా
స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం
మంచిర్యాల నేటి ధాత్రి:
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్దిదారులకు మరియు నస్పూర్ కు చెందిన 529 మంది లబ్ధిదారులకు మరియు హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును ఇస్తామని చెప్పి మాటను నిలబెట్టుకొని మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలో ఈ రోజు మొత్తం1,193 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చామని చెప్పారు.
మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మొత్తం 3,098 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి కి, రాష్ట్ర రెవెన్యూ ,గృహ నిర్మాణం & సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ఈ కార్యక్రమంలో సంబంధింత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు