బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ .!

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్

కీసర నేటి దాత్రి :

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ .

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక.

బిజెపి మండల అధ్యక్షునిగా బుర్ర వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన బుర్ర వెంకటేష్ గౌడ్ జాతీయ సమైక్యతే లక్ష్యంగా..హిందూ భావజాల వ్యాప్తికై విద్యార్థి దశలోనే జాతీయ భావాలను అలవర్చుకొని..దేశ సమైక్యతే లక్ష్యంగా పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత చేరి..అనేకమంది విద్యార్థులను..ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది..విద్యారంగ సమస్యలపై అనేకమైన పోరాటాలు చేశాడు. ఈ క్రమంలో విద్యార్థి పరిషత్ నాయకత్వం ఆయనకు వివిధ హోదాల్లో పని చేయడానికి అవకాశం కల్పించింది. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పటిష్టతకు విశేష కృషి చేస్తూ..ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ..ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్న క్రమంలో ఆయనను బిజెపి చిట్యాల మండల ప్రధాన కార్యదర్శిగా, అనంతరం బిజెపి మండల అధ్యక్షుడిగా నియమించింది. కాగా రెండవసారి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల సంస్థగత ఎన్నికల బుర్ర వెంకటేష్ గౌడ్ ను రెండవసారి భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, నాగపురి రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిశిధర్ రెడ్డి వెన్నంపల్లి పాపయ్యా ,కన్నం యుగదిశ్వర్, దొంగల రాజేందర్ ,మరియు జిల్లా మండల నాయకులకు వెంకటేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బృహత్తరమైన బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టాన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపితానికి నిరంతరం కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేస్తానన్నారు.

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం.!

ఆక్రమ పాకిస్థానీ లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో అక్రమంగా నివసిస్తున్న నిషేధిత పాకిస్తానీలను వెంటనే దేశం విడిచి పంపేల చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ నిర్ణిత సమయం ఇచ్చిన కూడా పాకిస్థానీ దేశస్తులు భారత దేశంలో అక్రమంగా ఉంటున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని అన్నారు, వెంటనే వారిని గుర్తించి దేశం విడిచి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశ భద్రతని దృష్టిలో పెట్టుకొని వారి జాబితా తయారు చేసి బహిష్కరించాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ నాయకులే గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కారుపాకాల అంజిబాబు, అంబటి నర్సింగరావు, కళ్లెం శివ, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల ఓబిసి మోర్చా అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్ చారి, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల కార్యదర్శి సిరిమల్ల మదన్ మోహన్, బూత్ కమిటీ అధ్యక్షులు రాగం కనకయ్య, ఉత్తేమ్ కనుకరాజ్, వేముల శ్రీనివాస్, నాగి లచ్చయ్య, మంద రాజశేఖర్, కత్తి సాయి, వడ్లూరి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్.!

పహల్గాం టెర్రరిస్టుల దాడికి నిరసనగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగినది.
పహాల్గంలోని టెర్రరిస్టులు అమాయక హిందువులను కాల్చి చంపడంలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత దేశంలో ఉన్న పాకిస్థానీయులందరినీ వెంటనే బహిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నేడు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా

BJP district president

 

అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ దుమాల శ్రీకాంత్,జిల్లా కార్యదర్శి శ్రీ గొప్పాడి సురేందర్ రావు, ఒబిసి మోర్చా అధ్యక్షుడు శ్రీ నంద్యాడపు వెంకటేష్, మరియు మాజీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు శ్రీ పొన్నాల తిరుపతి రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీ నాగుల శ్రీనివాస్ మరియు రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మరియు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే సాధ్యం..

బి జే పి జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్

మంగపేట నేటిధాత్రి :

 

మంగపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….. దేశంలోని జనగణనలో కులగణనను చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని నిరూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నే అని ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించినా ఏనాడు కూడా జనగణన కుల గణనను చేయించిన దాఖల లు లేదని ఇంత బృహోత్కరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నిర్వహించిన సందర్భంగా మండల నాయకులు అందరూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యరంగారి వీరన్ కుమార్, గుండు రాజేష్, రామ గాని నరేందర్, బట్ట బాబురావు, కాసర్ల మల్లారెడ్డి, , సునీల్ కుమార్, గుండారపు రోహిత్ కుమార్, వై ప్రకాష్, కాక లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది

పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు.!

పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు.

మహదేవపూర్ నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఎర్ర చెరువు వద్ద పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారికి బిజెపి మండల అధ్యక్షుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని పిఎసిఎస్ నిర్లక్ష్యం అడవికి సమీపంలో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం వలన అడవిలోని వర్షపు నీరు వడ్ల కల్లం లో వచ్చి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది అని, అలాగే కొనుగోలు కల్లం వద్ద ఉన్న నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని, ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తడిసిన ప్రతి ధాన్యం గింజలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతుల కన్నీటికి కారణమైన టి ఏ సి ఎస్ కొనుగోలు కేంద్ర నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మనోజ్, శ్రీధర్, రవి ,వంశీ, వెంకటేష్, పూర్ణచందర్,రాజు ,లుపాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్.

సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు సిరిసిల్ల
జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కులగణన చేయలేదని, 1931 లో బ్రిటిష్ ప్రభుత్వం కులగణన తర్వాత, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కులగణన పై సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీసీ సంఘాల కులగణనను సొంత పార్టీ కార్యకర్తలే చించేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆర్టికల్ 370 రద్దు, వక్ఫ్ బిల్లును బీజేపీ ఆమోదించిందని, ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తి బీజేపీకే ఉందని అన్నారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోతోందని, కులగణన బిల్లు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు వారంలో చెల్లించకపోతే, రైతుల తరఫున సంఘర్షణ చేస్తామని హెచ్చరించారు.

కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం బీజేపీ.

కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం-బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం వారికి మనస్పూర్తిగా యావత్ తెలంగాణ మరియు భారతదేశ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెళ్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కాడే నర్సింగమ్, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిత్తవేణి అంజిబాబు, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల యువ మోర్చ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేమ్ కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

బిజెపి ఆధ్వర్యములో మోడిచిత్ర పటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

దేశవ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం అని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గత రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్త కులగనన చేయడం హర్షించదగ్గ విషయమని శుక్రవారంనాడు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బీసీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా బీసీలను జెండాలు మోసే బానిసలుగానే వివిధ రాజకీయ పార్టీలు చూసాయని కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు రాజ్యాధికారం అందాలని ప్రతి ఒక్క బిసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆశించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అని ఆయన అన్నారు ఇప్పటికైనా మిత్రులందరికీ ఏకతాటి మీద నిలబడి నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ ఓదెల శ్రీహరి నల్ల శ్రీనివాస్ రెడ్డి, మైదం శ్రీకాంత్ అనుప మహేష్ వల్లల ప్రవీణ్ కేంసారపు ప్రభాకర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ.!

ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ ర్యాలీ
మృతుల కుటుంబలకు సంతాపం

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యం లో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రవాదుల దాడి కి నిరసన గా సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌక్ లో నిన్న రాత్రి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ పాకిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న భారత్ లోని సెక్యులర్ పార్టీలను రాజకీయంగా అణిచివేయాలని హిందువులంతా ఒక్కటై పోరాడితేనే హిందువులకు భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఇలా జరగకుండా ఉండాలంటే హిందువులంతా సంఘాటీతంగా ఒక్కటి కావాలని పిలుపునిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న సెక్యులర్ పార్టీలను అంతం చేయాలని తెలియజేస్తూ నిన్న ఈ మరణకాండలో మృతి చెందిన కుటుంబలకు వారికి కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా జననివాళి అర్పిస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పత్తిపాక సురేష్, ఉరవకొండ రాజు,జ్ఞాన రాంప్రసాద్,దూడం శివప్రసాద్ ,దుమాల శ్రీకాంత్,కోడం రవి,మోర రవి,పండగ మాధవి,వైశాలి హరీష బండారి వెంకటేశ్వర్లు సురేష్ దూడం సురేష్ ఇంజాపూర్ మురళి, రాజేందర్ మరియు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.!

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం

-అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఒప్పందం

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు విమర్శించారు. గురువారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారు చేసిన అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీకి దాసోహమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బలహీనతలను ఆసరాగా చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి స్వయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. గత పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చింది బీఆర్ఎస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకు బీజేపీ ఊడిగం చేసింది నిజం కాదా? అని అడిగారు. సంఖ్యా బలం లేని బీజేపీ ఏ అండ చూసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ పార్టీ తాపత్రయపడుతుందన్నారు. 15 నెలల స్వల్ప కాలంలోనే తమ సర్కార్ గొప్ప పనులను చేపట్టిందని, అలాంటి సర్కార్ ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదన్నారు.

బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

వడగళ్ళ వాన తో దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ని జీలకుంట పోత్కపల్లి శానగొండ బయమ్మపల్లి ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వాన ప్రభావం తో నష్ట పోయిన వరి మొక్కజన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి మాట్లాడుతూ
రైతులు ఆరుకాలం కష్టపడి పoడించిన పంట అకాల వర్షం తో నేలపాలు కావడం జరిగింది పంట చేతికి వచ్చే దశలో ఈవిదంగా వర్షం పడి రైతుల పొట్టకొట్టిననట్టు కావడం దురదృష్టకారం అన్నారు తక్షణమే నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలనివారు డిమాండ్ చేసారు మండలం లోని AO మరియు AEO తో మాట్లాడిన సంజీవ రెడ్డి దాదాపు 500 వందల ఎకరాల్లో పంట నష్ట జరిగిందని ఈ యొక్క వడగళ్ళ వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లా లో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి యాభై వెల రూపాయలు ఇస్తున్న విదంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం తోపాటు అన్నీ మండలాల్లో ఇవ్వాలని కోరడమైనది. లోకల్ వరిపంటలు ఇంకా చాలా రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల వివరాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపి వారికీ నష్ట పరిహారం వచ్చే విదంగా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది రైతుల పంటలు కోసి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారని ఇంకా ఐకేపీ సెంటర్ లు ప్రారంభం చేయలేదని కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేసి వడ్ల కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈకార్యక్రమంలో లో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్ ఎర్రవెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వి రాజ్,చర్లపల్లి రాజు,తజ్ ఉద్దీన్,పుల్ల సదయ్య,భూషణవేణి సత్యం, రవీందర్, బిక్షపతి, రమేష్,నరసింహ చారి, భాస్కర్ రెడ్డి,అగ్గి శ్రీనివాస్,కుక్కల మహేందర్,మధునయ్య,ఐలయ్య,పులి కొమురయ్య,మీడుదూల రాజు,రాజా మనోహర్,సతీష్,వినయ్,సాయి కృష్ణ, అనిల్,తదితరులు పాల్గొన్నారు.

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’.

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’. 

తల్లోజు ఆచారి.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

 

కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బిజెపి విజయ దుందుభి మోగిస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బీజేపీ ఎంపీల పాలనలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బీజేపీ దేనని.. దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు.

ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు

నిజాంపేట, నేటిధాత్రి

 

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ ను బిజెపి నాయకులు మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ , టెలికం బోర్డు మెంబర్ ఆకుల రమేష్, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్.!

*డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ . . .

రాయికల్ .నేటిదాత్రి.తేదీ 11.04. 2025 

 

 

శుక్రవారం రోజున డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం లో భాగంగా డిపో మేనేజర్ కల్పన మేడం గారితో జగిత్యాల – బోర్నాపెల్లి బస్ కడెం వరకు కొనసాగించడం ద్వారా రామాజీపేట, భూపతిపూర్,లింగాపూర్,చింతలూరు, బొర్నపెల్లి గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులకు గురిఅవుతుంద్రు అని ప్రస్తావించగా, ప్రభుత్వ ఆదేశానుసారం కడెం వరకు బస్సు వేయడం జరిగింది అని మేడం తెలుపారు, కాబట్టి ఇక్కడున్న స్థానిక ఎంఎల్ఏ గారికి విజ్ఞప్తి, మన నియోజక వర్గంలో చివరి గ్రామం బోర్నపెల్లి,కావున ఇక్కడి ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి కొన్ని నెలల క్రితం పరిమితికి మించి ప్రయాణికుల ఎక్కడం ద్వారా రాయికల్ కు వచ్చే బస్ వెనక టైర్లు రెండు ఊడి పోవడం జరిగింది అదృష్ట వశాత్తూ ఆ సంఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, అన్ని రోజులు ఒక్కల ఉండవు కావున అలాంటి సంఘట మరొకటి జరుగకముందే బోర్నపెల్లి బస్ అక్కడి వరకే కొనసాగిస్తూ కడేంకు ఇంకొక బస్ వేయడం ద్వారా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వ స్పందించక ఇలాగే పరిస్థితి కొనసాగిస్తే ప్రజల సౌకర్యార్థం ఎలాంటి నిరసనలు ఉద్యమాలు చేయడానికి అయినా సిద్ధం అని మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ అనడం జరిగింది

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి.

బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్

బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిన్నటి రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి.ఏదో కాగితాలు తెచ్చాడు.

అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని. అంతేకాకుండా నిన్న ప్రారంభించినటువంటి సన్న బియ్యం కార్యక్రమం కోట సంవత్సరానికి అయ్యే ఖర్చు పదివేల కోట్ల రూపాయలు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మైనటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు.

అంతేకాకుండా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్రం వాటాన చెల్లిస్తుందని తెలియజేశారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గరీబ్ యోజన కింద ప్రతి మనిషికి ఐదు కిలోల బియ్యం కేంద్రం నుండి లభిస్తుంది మిగిలిన ఒక కిల బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి లభిస్తుందని తెలియజేశారు.

BJP

 

మంత్రి పొన్నం తేవాల్సింది సన్న బియ్యం కాగితాలు తేక బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని వేరే ముచ్చట్లు చెయ్యడం కరెక్ట్ కాదు.

అని సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, ఉరవకొండ రాజు,మెరుగు శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా.

ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా

 

సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )

 

బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది.
₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000 అందించాలని, పంటల బీమా యోజన అమలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బిజెపి జిల్లా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్
హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు సమయం వృధా అవుతుందని అన్నారు వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉండడంతో ఆయా రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది గతంలో జమిలి ఎన్నికలు అనేవి 1952 నుంచే ఎన్నికలు జరిగినవి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను మార్చి రాష్ట్రపతి పాలన పెట్టడం తద్వారా దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,బిజెపి నాయకులు మార్త రాజభద్రయ్య,చందుపట్ల రాజేందర్ రెడ్డి,బెజ్జంకి పూర్ణ చారి,కుక్కల విజయకుమార్, మార్త బిక్షపతి,సంగా పురుషోత్తం,దంచనాల సత్యనారాయణ,మారేడుగొండ భాస్కరాచారి,ఆకుల రాంబాబు,బూత్ అధ్యక్షులు మరాఠి నరసింగరావు,ముత్యాల దేవేందర్,సంఘ నరేష్, ఉడుత చిరంజీవి,బీరం రాజిరెడ్డి,గాజుల రంజిత్ బిజెపి కార్యకర్తలు  పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).

 

గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.

ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.

నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version