వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది నిపుణులు ఏం చెబుతున్నారంటే.

 వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది నిపుణులు ఏం చెబుతున్నారంటే…

 

వచ్చే వారం భారత స్టాక్ మార్కెట్‌ (Stock Market Outlook) ఎలా ఉంటుందోనని అనేక మంది ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. లాభాల వైపు వెళ్తుందా, లేదంటే మళ్లీ నష్టాల బాట పడుతుందా అని ఆలోచిస్తున్నారు. అయితే నిపుణులు ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్ (Stock Market Outlook) ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఒక రోజు సెన్సెక్స్, నిఫ్టీ ఆకాశాన్ని తాకుతాయి. మరో రోజు ఊహించని విధంగా కిందకు జారుతాయి. ఈ క్రమంలో జూన్ 30 నుంచి మొదలయ్యే వారంలో ఎలా ఉండబోతుంది. నిపుణులు ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టాయి. కెనడా, మెక్సికో, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25%, 10% సుంకాలు విధించినట్లు ట్రంప్ ప్రకటించడంతో గత వారాల్లో భారత మార్కెట్లు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే, ఈ సుంకాలను 30 రోజుల పాటు వాయిదా వేసినట్లు ఇటీవల ప్రకటించడంతో మార్కెట్లలో తాత్కాలిక ఉపశమనం కనిపిస్తోంది.

దేశీయ ఆర్థిక సూచనలు

జనవరి 2025లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపింది. ఆర్థిక సర్వే ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.3-6.8% వృద్ధి సాధించవచ్చని అంచనా వేయడం మార్కెట్లలో ఆశావాదాన్ని పెంచింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు ఈ వారం కూడా మరింత రాణించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వారం సూచీలు సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల (బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $75.83 వద్ద ఉంది) మార్కెట్లలో అస్థిరతను కొనసాగించవచ్చని ఆక్షయ్ చించాల్కర్ వంటి విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ వారం బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ రంగాలు దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. జనవరిలో కార్ల విక్రయాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేయడంతో టాటా మోటార్స్, మారుతి సుజుకీ వంటి ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో ఉండవచ్చు. ఇక బ్యాంకింగ్ రంగంలో కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు సానుకూల ట్రెండ్‌ను చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే RBI రేట్ కట్ సూచనలు రుణ వృద్ధిని పెంచుతాయి.

ఐటీ రంగంలో ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కంపెనీలు గత వారం లాభాలతో ప్రారంభించాయి. ఈ జోరు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన రంగాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లలో అస్థిరత కనిపించవచ్చు. ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టే ముందు మరింత విశ్లేషణ అవసరం.

నిపుణుల సూచనలు

నిపుణులు ఈ వారం మార్కెట్‌లో ఆశావాదాన్ని అంచనా వేస్తున్నప్పటికీ, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. గత వారం సెన్సెక్స్ 511 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయాయి. ఇది అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలకు సంకేతం. అయితే, ట్రంప్ టారిఫ్‌ల వాయిదా, RBI రేట్ కట్‌లు, బడ్జెట్ ఆశలు మార్కెట్‌ను లాభాల బాటలో నడిపే అవకాశం ఉంది. ఈ వారం బ్యాంకింగ్, ఆటో రంగాలు రాణించే అవకాశం ఉంది. కానీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

గమనిక: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

 ఒక పథకం ప్రకారం  ​సన్ నెక్స్ట్ ఓటీటీలోనూ  అదరగొడుతోంది.

 ఒక పథకం ప్రకారం  ​సన్ నెక్స్ట్ ఓటీటీలోనూ  అదరగొడుతోంది…

ఒక పథకం ప్రకారం జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.  ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది.

పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ (Sairam shankar) కథానాయకుడిగా నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaram) . వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. వినోద్ విజయన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. సంస్థలపై గార్లపాటి రమేష్‌తో వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇంటర్వెల్ తర్వాత విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తామని యూనిట్ చేసిన ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. థియేటర్‌కు ఒకరు చొప్పున 50 థియేటర్ల నుంచి 50 మంది విజేతలను ఎంపిక చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది. మీడియా ప్రతినిధులకు వేసిన షోతో పాటు మిగతా థియేటర్లలో విజేతలకు డబ్బులు అందజేసింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో చక్కటి విజయాన్ని అందుకున్న ‘ఒక పథకం ప్రకారం’ జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రికార్డ్ వ్యూస్ సాధిస్తూ వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతోంది. ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో సాయిరామ్ శంకర్ చక్కటి కమ్ బ్యాక్ ఇచ్చారని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో హీరో సాయిరామ్ శంకర్ నటించారు. విశాఖ నగరంలో జరిగిన వరుస హత్యల మీద అతని మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. నిజంగా ఆ హత్యలు సిద్ధార్థ్ చేశాడా? లేదంటే వాటి వెనుక వేరొకరు ఉన్నారా? అనేది సినిమా.  (Sun next ott) 

సినిమా థియేటర్‌లు

నిర్మాతలు గార్లపాటి రమేష్‌, వినోద్ విజయన్ మాట్లాడుతూ ”మంచి సినిమా తీస్తే ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రమే కాకుండా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది. ఓటీటీ రిలీజ్ ప్లానింగ్, ప్రొసీజర్స్ విషయంలో మాకు సహాయం చేసిన సన్ నెక్స్ట్ కంటెంట్ హెడ్ శశి కిరణ్ నారాయణ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా దర్శక నిర్మాణంలో నాకు అండగా నిలబడిన మా హీరో సాయిరామ్ శంకర్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ థాంక్స్” అని చెప్పారు.

పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

#అసలైన లబ్ధిదారులకు అందని ద్రాక్షల ఇందిరమ్మ ఇల్లు.

#ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తున్న నాయకులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి;

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాయకుల వ్యవహార శైలితో గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు చేయకుండా. తమకు నచ్చిన వ్యక్తులకు ఇండ్లు మంజూరు చేయించి ఆర్థికంగా బలోపేతం కావడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారని అర్హులైన లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయలను వెచ్చించి ఇల్లు నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా పథకాన్ని దిగ్విజయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటే గ్రామాలలో ఉన్న చోటామోటా నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం అర్హులైన లబ్ధిదారులను పక్కనపెట్టి. కమిషన్లు ఇచ్చే వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసి పబ్బం గడుపుతున్నారని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అవకతలపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని నిరుపేద కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’.

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’. 

తల్లోజు ఆచారి.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

 

కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బిజెపి విజయ దుందుభి మోగిస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బీజేపీ ఎంపీల పాలనలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బీజేపీ దేనని.. దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version