ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

 

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.

దీంతో ఇరుదేశాల మధ్య యుద్దం ముగిసింది.

ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప కీలక సూచన చేశారు.

 

 

 

 

 

వాషింగ్టన్, జూన్ 24: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీటిని దయ చేసి ఉల్లంఘించవద్దని ఆయా దేశాలకు ఆయన సూచించారు. మంగళవారం ట్రూత్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లోని పలు భూభాగాలపై ఇరాన్ దాడులు చేసింది. కొన్ని గంటల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం నేటితో ముగిసిందన్నారు. ఇరాన్ అన్ని కార్యకలాపాలను తొలుత నిలిపివేసిందని.. మరో 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సైతం ఆ బాటను అనుసరిస్తుందని చెప్పారు.

ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రదేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. అనంతరం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో ఏడుగురు మరణించారని వివరించింది. ఇక క్షిపణి దాడులు ముగియడంతో.. ప్రజలు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గత కొద్దిరోజులుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలిచింది. ఆ క్రమంలో ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై దాడి చేసింది. అనంతరం ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌లోని పలు కీలక ప్రాంతాలపై దాడి చేసింది. అయితే అణుస్థావరాలపై దాడి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని ఘాటుగా స్పందించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేసింది. కానీ అమెరికాపై ఖమేని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ ఇర్వానీ మాత్రం అమెరికతోపాటు ఇజ్రాయెల్‌పై మండిపడిన విషయం విదితమే. ఇరాన్‌కు చెందిన ఈ ఇద్దరు ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పై విధంగా స్పందించారు.

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.!

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం

-అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఒప్పందం

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు విమర్శించారు. గురువారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారు చేసిన అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీకి దాసోహమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బలహీనతలను ఆసరాగా చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి స్వయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. గత పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చింది బీఆర్ఎస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకు బీజేపీ ఊడిగం చేసింది నిజం కాదా? అని అడిగారు. సంఖ్యా బలం లేని బీజేపీ ఏ అండ చూసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ పార్టీ తాపత్రయపడుతుందన్నారు. 15 నెలల స్వల్ప కాలంలోనే తమ సర్కార్ గొప్ప పనులను చేపట్టిందని, అలాంటి సర్కార్ ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదన్నారు.

బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి..

బాండు సమస్త, రైతుల మధ్య ఒప్పందం జరగాలి..

బాండు మిర్చితో రైతుల ఆవేదన ..

పురుగుల మందుల షాప్ల కు అధిక లాభాలు ఎలా…

నూగూర్ వెంకటాపురం మార్చి 01(నేటి దాత్రి ):-

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని పాత్రపురం గ్రామంలో తుడుం దెబ్బ అత్యవసర సమావేశం వెంకటాపురం మండల అధ్యక్షులు బాడిస. కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో,తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు మాట్లాడుతూ రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టు బాటు ధర కల్పించాలని అన్నారు. రైతు శ్రమను గుర్తచక కంపెనీల పేరుతో అగ్రిమెంట్ లేకుండా వ్యవసాయం చేయిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. విత్తనాలు విత్తనా శుద్ధి లేకుండా రైతులకు సరఫరా చేసి రైతులను నట్టేట ముంచారాని అయన అన్నారు. రైతులకు, సమస్త కు మధ్య ఒప్పంద పత్రాలు రాసుకోవాలి. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు పోయినప్పుడు,సమస్యే రైతులకి నష్టపరిహారం అందించాలని అయన నన్నారు. .సంబంధిత అధికారులపర్యవేక్షణ లోపించిందని అయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం ద్రుష్టి సారించి చాలని అయన డిమాండ్ చేశారు . ఈకార్యక్రమంలో ప్రశాంత్, సతీష్, నర్సింహారావు, రాంకి, గణేష్, తిలక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version