బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

వడగళ్ళ వాన తో దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండల కేంద్రంలో ని జీలకుంట పోత్కపల్లి శానగొండ బయమ్మపల్లి ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వాన ప్రభావం తో నష్ట పోయిన వరి మొక్కజన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి మాట్లాడుతూ
రైతులు ఆరుకాలం కష్టపడి పoడించిన పంట అకాల వర్షం తో నేలపాలు కావడం జరిగింది పంట చేతికి వచ్చే దశలో ఈవిదంగా వర్షం పడి రైతుల పొట్టకొట్టిననట్టు కావడం దురదృష్టకారం అన్నారు తక్షణమే నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలనివారు డిమాండ్ చేసారు మండలం లోని AO మరియు AEO తో మాట్లాడిన సంజీవ రెడ్డి దాదాపు 500 వందల ఎకరాల్లో పంట నష్ట జరిగిందని ఈ యొక్క వడగళ్ళ వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లా లో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి యాభై వెల రూపాయలు ఇస్తున్న విదంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం తోపాటు అన్నీ మండలాల్లో ఇవ్వాలని కోరడమైనది. లోకల్ వరిపంటలు ఇంకా చాలా రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల వివరాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపి వారికీ నష్ట పరిహారం వచ్చే విదంగా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది రైతుల పంటలు కోసి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారని ఇంకా ఐకేపీ సెంటర్ లు ప్రారంభం చేయలేదని కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేసి వడ్ల కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈకార్యక్రమంలో లో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్ ఎర్రవెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వి రాజ్,చర్లపల్లి రాజు,తజ్ ఉద్దీన్,పుల్ల సదయ్య,భూషణవేణి సత్యం, రవీందర్, బిక్షపతి, రమేష్,నరసింహ చారి, భాస్కర్ రెడ్డి,అగ్గి శ్రీనివాస్,కుక్కల మహేందర్,మధునయ్య,ఐలయ్య,పులి కొమురయ్య,మీడుదూల రాజు,రాజా మనోహర్,సతీష్,వినయ్,సాయి కృష్ణ, అనిల్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version