భూభారతి చట్టంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం.!

భూభారతి చట్టంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం

రైతుల భూములకు రక్షణ కవచంలా భూభారతి
* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులకు విశ్వాసం కల్పించే విధంగా, వారి భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మొగుళ్ళపల్లి, మండలంలోఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకు వచ్చిందన్నారు. అంతకుముందు భూ భారతి చట్టం యొక్క అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టా జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం సీనియర్ అధికారులతో అన్ని రాష్ట్రాల్లో విచారణ చేసి సులువైన పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.

 

MLA

భూములు కొన్నా, అమ్మినా లైసెన్స్డ్ సర్వే యర్ ద్వారా హద్దులతో మ్యాపు తయారు చేసి పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేస్తారని తద్వారా భూమి గుర్తింపుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. తహసీల్దార్ ద్వారా ఏదేని పొరపాటు జరిగితే ఆర్డిఓ, ఆర్డిఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి భూ ట్రిబ్యునల్ నకు వెళ్ళడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సహాయ సేవలు అందించడానికి అవకాశం కల్పించారని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రికార్డుల నవీకరణలను చేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రామ పహణి కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ధరణి వచ్చిన తరువాత పహణిలో నమోదులు జరగలేదని తెలిపారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 12-10-2020 నుండి 10-11-2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం సన్న చిన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డిఓ విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ప్రకారం భూ హక్కులు జారీ చేస్తారని అన్నారు.

అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం.!

గ్రామ పంచాయితీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం = ఎంపీడీవో ఇందిరమ్మ.

ఆర్ సి పురం లో ఘనంగా జాతీయ. పంచాయతీరాజ్ దినోత్సవం

పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన నేతలు.

రామచంద్రపురం(
నేటి ధాత్రి) ఏప్రిల్ 24:

 

 

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీడీవో ఇందిరమ్మ అన్నారు, గురువారం మండలంలోని చుట్టుగుంట రామాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కె సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభింపజేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ కే సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం అందించాలని కోరారు. టిడిపి సీనియర్ నాయకుడు‌ కొట్టే నరసింహారెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి కుంటి బడిందన్నారు.. కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్ లో
జమ చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లు గ్రామీణాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణం, తాగునీటి పథకాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీ కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సి రామాపురం గ్రామపంచాయతీని సమస్యల రహిత పంచాయితీగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఇంటి పన్ను,తాగునీటి కనెక్షన్ పన్నులను సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ప్రజలను కోరారు. పంచాయతీలోని గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత, ఈ వేస్ట్ సేకరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను, సిబ్బందిని, స్థానిక టిడిపి నాయకులు కె. గిరిధర్ రెడ్డి, ముద్దు కృష్ణారెడ్డి, ముని రామిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి,రంజిత్ కుమార్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు, వీఆర్ ఓ
ఝాన్సీ,డిజిటల్ అసిస్టెంట్ భరత్ కుమార్ రెడ్డి,బిల్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు…

భూభారతి రైతులకు మేలు చేస్తుంది.!

‘భూభారతి రైతులకు మేలు చేస్తుంది’

దేవరకద్ర /నేటి ధాత్రి:

ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

మదనాపురం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వీవర్స్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, తనదనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :

కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి కి నిరసనగా న్యాయవాదుల ర్యాలీకి మద్దతు.

కేంద్ర ప్రభుత్వం , సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం అండగా ఉందాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో న్యాయవాదులు చేపట్టిన ర్యాలీ కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర భావంతో జీవిస్తున్నామని, పాకిస్థాన్ ఉగ్రవాదులు, భారతదేశంలో కులమతాల మధ్యన చిచ్చు పెట్టి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పన్నాగం పన్నారన్నారు. భారత ప్రభుత్వం, దేశ సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం రాజకీయాలకు అతీతంగా, పార్టీ భావ జాలాలకు అతీతంగా ఏకతాటి మీద ఉండి, అండగా ఉండాల్సిన సమయం అని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ కళకళలాడుతూ.. ఉందని, టూరిస్టులు పెరగడంతో కాశ్మీర్ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, అక్కడ వారి జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, పాఠశాలలు కూడా అభివృద్ధి చేసుకుంటూ కులమతాలకు అతీతంగా వారు సంతోషంగా మంచి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్నారని ఆయన అన్నారు. ఈ దేశం నాది, ఈ దేశం మనది అనే భావన మనకందరికి ఉండాలని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి వెంకటేష్, గుండా మనోహర్, వీరబ్రహ్మచారి, రమాకాంత్ గౌడ్, మురళి కృష్ణ, లక్ష్మయ్య, కృష్ణయ్య, అనంతచారి, శ్రీపాదరావు, విక్రం గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము.

జమ్మూ కాశ్మిర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము…_

— మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్

కాప్రా నేటిధాత్రి 24

 

 

జమ్మూ కాశ్మిర్ లోని అనంత నాగ్ జిల్లా పెహల్గామ్ లో నిన్న జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు పత్తి కుమార్ అన్నారు.
జమ్మూ కాశ్మీర్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వo పూర్తి బాధ్యత వహించాలని దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము..
గాయపడిన కుటుంబాలకు మెరుగైన చికిత్స అందించి వారి కుటుంబాలకు ధైర్యాన్ని చేకూర్చాలి అదేవిధంగా ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకొని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది దాడికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకొని ఉరిశిక్ష అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమయంలొ దేశప్రజలు అందరు ఒక్కటై బాధితకుటుంబలకు అండగా నిలబడాలని కోరుతున్నాము.

నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి.

నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి

ఎస్పీ రావుల గిరీదర్

వనపర్తి నేటిదాత్రి :

 

పదోన్నతి పొందిన ఖిలాఘనపూర్ ఏ ఎస్సై ఎం సుధాకర్ ఎస్సైగా. వనపర్తి రూరల్ కానిస్టేబుల్ రాజగౌడ్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వారు గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావు ల గీరీదర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశరు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ అదనపు ఎస్పీ.మహేశ్వరరావు
పదోన్నతి పొందిన ఎస్సై పోలీస్ సిబ్బంది ఉన్నారు

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

వరంగల్ కేసీఆర్ సభను విజయవంతం చేయండి.గీత

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

వరంగల్లో జరిగే మహాసభకు మండల ప్రజలందరూ కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిన ఫలాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితుల పై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడం కొరకు తెలంగాణ జాతిపిత కెసిఆర్ సారధ్యంలో నిర్వహించబడునున్న మహాసభకు తరలిరావాలని, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, గీతా బాయ్ అన్నారు. ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి చలో వరంగల్ గూడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అలాగే గూడ పత్రికను పలుచోట్ల గోడలకు అంటించిన అనంతరం, గీతా బాయ్ మండల ప్రజలు పెద్ద సంఖ్యలో సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా విభాగం నాయకురాళ్లు, టిఆర్ఎస్ యువజన విభాగం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల.!

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా క్యాతనపల్లి మునిసిపాలిటీకి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ లు కరీంనగర్ జిల్లా పరిశీలకులుగా తనను నియమించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామం, మండలం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే తీరును పరిశీలించేందుకు పరిశీలించేందుకు జిల్లా పరిశీలకునిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో.!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

జహీరాబాద్: నేటి ధాత్రి:

 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
కొన్నింటి.నర్సింలు డిమాండ్ చేశారు. గురువారం జహీరాబాద్ ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలు ఏర్పాటు చేసి జాబ్ కార్డ్స్ ఇచ్చి 150 రోజులు పని కల్పించాలని అన్నారు. .రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు 5 శాతం ఎస్సి ఎస్టీ బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో కేటాయించాలని కోరుతున్నాము.2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాము అన్నారు.మండలంలో వికలాంగులను కించపరుస్తూ మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జహీరాబాద్ మండల అధ్యక్షుడు ఎం రాజ్ కుమార్
అల్గోల్ మచ్చేందర్ బిస్మిల్లా శోభమ్మ వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం.!

తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం టీటీడీ బోర్డుమెంబర్ కు కృతజ్ఞతలు

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి పట్టణానికి చెందిన జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ న్యాయవాది దార వెంకటేష్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని ఎం వెంకటరమణ లగిశెట్టి శ్రీకాంత్ బసవరాజ్ రాకేష్ తిరుమలలో శ్రీవారిని గురువారం ఉదయం దర్శనము చేసుకున్నారు వీ ఐ పీ బ్రేక్ దర్శనం కల్పించినందుకు టీ టీ డీ బోర్డు మెంబర్ తెలుగుదేశం నన్నారి నర్సిరెడ్డికి టీ టీ డీ అధికారులకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

మా ఊరి కథలలో అచ్చ సుదర్శన్ జీవిత కథ.

మా ఊరి కథలలో అచ్చ సుదర్శన్ జీవిత కథ

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అచ్చ సుదర్శన్ జీవిత చరిత్ర భవాని సాహితీ వేదిక కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గుండ మీది కృష్ణమోహన్ అనే కవి మా ఊరి కథలు(స్ఫూర్తి మంతుల చరిత్రలు) అను పుస్తకాన్ని రాయడం జరిగింది.ఈ పుస్తకాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది.అట్టి పుస్తకంలో అచ్చ సుదర్శన్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కవి రాయడం జరిగింది.తాను బీదరికం నుంచి నుంచి ఎదిగి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా చేరుకున్న కథను ఇతర ఉపాధ్యాయులకు,యువకులకు స్ఫూర్తిగా ఉందని,చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడని కవి గుండ మీది కృష్ణమోహన్ అన్నారు.అందుకే స్ఫూర్తి మంతుల చరిత్ర లో అచ్చ సుదర్శన్ కు స్థానం దక్కిందని అన్నారు.

కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు.

కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
హైకోర్టును ఆశ్రయించిన కౌశిక్ రెడ్డి
ఈనెల 28 వరకు అరెస్టు వద్దని ఆదేశించిన హైకోర్టు
జమ్మికుంట: నేటిధాత్రి

 

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై 21వ తారీకు రోజు కమలాపూర్ మండలం గుండేడు క్వారీ యజమాని అయిన కట్ట మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి హనుమకొండ పోలీస్ స్టేషన్లో నా భర్తను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు 50 లక్షలు కావాలని వేధిస్తున్నాడని మానసికంగా కృంగిపోతున్నాడని మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయగా దానిపై కేసు నమోదయింది అది అలా ఉండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి వాదన ఏమనగా గతంలో క్వారీ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల నష్టం జరుగుతుంది కనుక మా ఊరికి ఏదైనా ఒక అభివృద్ధి చేయాలని చెప్పడం వల్ల అప్పుడు 25 లక్షలు ఒప్పుకున్నాడు 15లక్షలు ఇచ్చాడు ఇంకా మిగతా 10 లక్షల రూపాయలు ఇవ్వలేదని నాకు గ్రామస్తులు నా దగ్గరికి రావడం వల్ల ఫోన్ చేసి ఇవ్వాలని చెప్పాను దాని విషయంపై నాపై నేనే వసూలు చేస్తున్న నేనే అడుగుతున్నాను నేనే ఒత్తిడి చేస్తున్న అని దురుద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ 27వ తారీకు ఉంది ఆ సభకు నేను ఉండకూడదని ప్రత్యర్థులు ఆలోచించి నాపై అక్రమ కేసును బనాయించి నన్ను అరెస్టు చేసి ఉండకుండా నేను సభలో ఉంటే ఆ సభకు పూర్తిస్థాయిలో జనాన్ని సమీకరిస్తా సక్సెస్ అవుతది కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటా ఉంటే ఈ సభ నీరుగారిపోతుంది అనేటువంటి ఉద్దేశంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ఆ సభను ఆపడానికి ఆ సభను విజయవంతంగా జరగకుండా ఉండడానికి ఎన్నో రకాల పాచికలు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రైతుల అనుమతి లేకుండా రైతుల భూములను స్వాధీన పరచుకొని మీటింగ్ పెడుతున్నారు కొన్ని కాలువలు మొరంతో కూడిపినారని కూడా ఆరోపణ చేసినారు నన్ను అరెస్టు చేసి నేను ఉండకుండా చేస్తే ప్రభావం తగ్గుతది అనేటువంటి ఉద్దేశంతో దేశ పూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు దానిపై నేను హైకోర్టును సంప్రదించగా ఈరోజు నాకు స్టే వచ్చింది నా ప్రజల వైపున కొట్లాడుతున్న భగవంతుని ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కనుకనే న్యాయం గెలిచింది న్యాయ పరంగానే నేను వెళ్తా న్యాయ పరంగానే నాకు స్టే వచ్చింది ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు సభను ఆపాలన్న ఆగదు ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది ప్రజల యొక్క సంఘీభావంతో ఆ సభ జరుగుతుంది కనుక సభ విజయవంతం అయితది కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ సభతో ని   తెలుస్తది.

బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి.!

బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలి

పరకాల మాజీ ఎంపీటీసీ చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి

పరకాల నేటిధాత్రి:

టిఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రజలు తరలిరావాలని పరకాల మాజీ ఎంపీటీసీ,మలిదశ ఉద్యమకారుడు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ కష్ట నష్టాలకు ఓర్చి తెచ్చుకున్న తెలంగాణ, మోసపూరిత కాంగ్రెస్ చేతుల్లో పడి ఆగమైపోతున్నదని,వారి పాలనను ఎండగట్టి తెలంగాణను కాపాడుకునే దశలో ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీ ఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా జనాలు తరలివచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదువులను లెక్కచేయలేదని, చావుదాకా వెళ్లి తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.ఈ నెల 27న ప్రతి ఒక్కరు గులాబీ జెండాతో సభకు కదలాలని కోరారు.

పహాల్గమ్ లో పర్యాటకుల పై జరిగిన దాడి.!

పహాల్గమ్ లో పర్యాటకుల పై జరిగిన దాడిని నిరసిస్తూ విధులను బహిష్కరించిన న్యాయవాదులు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

గురువారం రోజున హన్మకొండ మరియు వరంగల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో కాశ్మీర్ లోని పహాల్గమ్ లో మంగళవారం యాత్రికుల పై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించి కోర్టు గేట్ ముందు బైఠాయించారు. ఆతర్వాత న్యాయవాదులు ర్యాలీ గా వెళ్లి తీవ్ర వాదుల మారణహోమాన్ని నిరసిస్తూ వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల కలెక్టర్లకు భారత ప్రభుత్వానికి మరియు ఆర్మీకి మద్దతుగా లేఖలు ఇవ్వడం జరిగింది.

 

Lawyers

తీవ్ర వాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు న్యాయవాదులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో హన్మకొండ/వరంగల్ బార్ అసోసియేషన్ ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుదీర్ మరియు ఇరు బార్ అసోసియేషన్ ల ప్రధాన కార్యదర్శులు రవి, రమాకాంత్, ఇరు బార్ అసోసియేషన్ల కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్  న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.!

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

మంథని మండలం పుట్టపాక గ్రామంలో దుర్కి లక్ష్మయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్.!

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలో మొగిలి కిరణ్ – స్వప్న పుత్రిక సౌధమిని నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో బోర్ ఏర్పాటు

జహీరాబాద్. నేటి ధాత్రి:

డైవర్స్ కాలనీలో నీటి సమస్యను స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు.దీంతో గురువారం రోజున బోర్ డ్రిల్ చేసేందుకు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి బోర్ తవ్వకాన్ని ప్రారంభించారు.ప్రజలు నీటితో కష్టాలు పడకుండా ఉండేందుకు బోర్ డ్రిల్ చేయిండం పట్ల స్థానిక ప్రజలు హర్షవ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా౹౹ఉజ్వల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ళ.శ్రీకాంత్ రెడ్డి,యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,అశ్విన్ పాటిల్, ప్రతాప్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,బి.మల్లికార్జన్,అక్బర్,హర్షద్ పటేల్,ముస్తఫా,నిజాం,బర్కత్ మరియు డైవర్స్ కాలనీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబలను పరామర్శంచిన.

బాధిత కుటుంబలను పరామర్శంచిన కుంజ కుసుమంజలిసూర్య

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారాం గ్రామానికి చెందిన జంగా సంపత్ ఎల్లయ్య ఇద్దరు సోదరులు వారి కుమార్తెలైన
జంగా మౌనిక జంగా నవ్యలత అను అక్కాచెల్లెలు. బుధవారం రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిన సంగతి విధితమే.. బాధితుల బాధను కన్నీళ్లను చూసిన స్థానిక నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క కు విషయం చెప్పడం జరిగిందని మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు వారి కోడలు ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుంజ కుసుమాంజలిసూర్య గురువారం రోజు దుర్గరాం గ్రామానికి విచ్చేసి బాధిత కుటుంబాలను ఓదార్చి కన్నింటి పర్యంతమయ్యారు
బోలెడు భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలు రోడ్డు ప్రమాదాలు చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారికీ ప్రగడ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కుంజ కుసుమాంజలిసూర్య, అన్నారు వారి వెంట మాజీ ఎంపీపీ బానోత్ విజయ, రూపు సింగ్ ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,మాజీ జడ్పిటిసి పుల్సం పుష్పలత, టీపీసీసీ సభ్యులు చల్ల నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి కారోజు రమేష్, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపాయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ర జనార్దన్ రెడ్డి,నోముల ప్రశాంత్ యాదవ్, ఉపేంద్ర చారి, ముస్కు, వెంకన్న గొందిరాజు పల్లె రమేష్ గ్రామ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు మానసిక.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు మానసిక,ఆరోగ్య అవగాహన సదస్సు

శాంతి భద్రతల పరిరక్షణకు ముందుండే అధికారుల,సిబ్బంది యొక్క భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి

పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత పెంపొందించుకోవాలి.

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి భద్రతల పరిరక్షణకు ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది,అధికారులకు మానసిక స్థితి ఎంతో కీలకం వారి మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రఖ్యాత మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్& టీం చే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమనికి ముఖ్య అతిదిగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పీ.ఎస్ హాజరైనరు.

ఈఅవగాహన సదస్సులో పోలీసు అధికారులు,సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ మానసిక ఒత్తిడులపై సమగ్ర అవగాహన ఇచ్చారు.

 

ముఖ్యంగా నిరంతర ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో, వాటిని ఎలా గుర్తించాలి ఎలా పరిష్కరించుకోవలెనే మార్గాల, ఒత్తిడి నిర్వహణ,మానసిక స్థైర్యం,ఆత్మవిశ్వాసం పెంపు, కుటుంబ వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ,ఫైన్షియల్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాల పై అవగాహన, పలు సూచనలు అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ , ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని అట్టి సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

సిబ్బంది అధికారుల మానసిక స్థితి ,మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డి.జి.పి జితేందర్ ఐ.పి.ఎస్ ఆదేశాలమేరకు జిల్లా పొలిస్ అధికారులకు,సిబ్బందికి మానసిక ఆ అగహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పోలీస్ సిబ్బందికి శాఖపరమైన, వ్యక్తిగత సమస్య వుంటే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకరవలని ఆయా సమస్యల పరిష్కరనికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

వ్యక్తిగత సమస్యలకు గురై ఒంటరిగా ఉన్నామనే భావన నుండి బయటకు రావాలని మీ భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి అని సిబ్బందికి భరోసా కల్పించారు.

ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత కలిగి ఉండాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రతి నెల సిబ్బందితో సవేశాలు నిర్వహించి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకోవలన్నారు.

తాత్కాలిక ఆనందాల కోసం ప్రాణాలను,కుటుంబ సభ్యులను ప్రమాదంలో పెట్టవద్దని అధికారులు, సిబ్బంది విరామ సమయంలో కుటుంబలతో గడపాలని తెలిపారు.

మహిళ సిబ్బందికి సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని,మహిళ సిబ్బందికి అన్ని రకాల అండగా ఉంటామని ఎస్పి తెలిపారు.

జిల్లా పోలీస్ శాఖ జిల్లా సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అధికారులకు, సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు,యోగ తరగతులు, క్రీడలు,చేపడుతు సిబ్బందిలో నూతనోత్సాహం నింపడం జరుగుతుందన్నారు.

నిత్యం యోగ,వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదురుకోవచ్చని అధికారులకి,సిబ్బంది సూచించారు.

పిలువగానే వచ్చి జిల్లా అధికారులకు, సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర ఆత్మహత్యలు నివారణ సంస్థ టీమ్ సబ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆత్మహత్యలు నివారణ సంస్థ చైర్మన్ డాక్టర్ అశోక్, సభ్యులు రామకృష్ణ ,సైకాలజిస్ట్ లు శైలజ,రామోజిరావు, బోడా అరుణ,సి.ఐ మొగిలి, మధుకర్, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు రమాకాంత్, రామ్మోహన్, ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్, సాయి కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version