బాధిత మెకానిక్ కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సాయం.

బాధిత మెకానిక్ కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సాయం

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 21:

ముగ్గురు బాధిత టు వీలర్స్ మెకానిక్స్ కు తిరుపతి టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి తెలియజేశారుతిరుపతికి చెందిన గోపాల్ (హార్ట్), చంద్రగిరి కి చెందిన చిన్న తంబి ( కిడ్నీ), తలకోనకు చెందిన సుబ్రహ్మణ్యం ( కాలు విరిగి) సమస్యలతో బాధపడుతున్న ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఆవుల ముని రెడ్డి తన తోటి అసోసియేషన్ నేతలు సభ్యులతో కలిసి అందజేశారు. అలాగే 70 మంది మెకానిక్ లకు స్పెషల్ టూల్ కిట్స్ అందజేశారు. అంతేకాకుండా బోస్ డి ఎస్ 7 కంపెనీ ఏరియా మేనేజర్ సతీష్ చంద్ర తో త్వరలో ఆ కంపెనీ బైక్ ను గురించి టూవీలర్స్ మెకానిక్లకు అవగాహన కల్పించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు సెక్రెటరీ గురు ఆచారి జాయింట్ సెక్రెటరీ తేజారెడ్డి ట్రెజరర్ బాబు కమిటీ మెంబర్లు నాగరాజు పాపయ్య మురుగ, బాధిత మెకానిక్స్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్చుమీరుతున్న రుణ యాప్​ల ఆగడాలు..

హెచ్చుమీరుతున్న రుణ యాప్​ల ఆగడాలు.. బలైతున్న జీవితాలు ……!!!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

రుణ యాప్​ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. యాప్ నిర్వహకులు వివరాలు నమోదు చేసుకుని లోన్​ తీసుకునే వరకు.. ప్రజలతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. వారి తీరు నమ్మి మోసపు ఊబిలో చిక్కుకున్న బాధితులకు అందులోంచి రావటం కష్టంగా మారుతోంది. లోన్​గా ఇచ్చిన నగదు కంటే రెట్టింపు సొమ్ము వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

 

 

 

రుణ యాప్‌ల ఆగడాలు

రాష్ట్రంలో పెరిగిపోతున్న రుణ వేధింపులు

డిజిటల్‌ రుణ యాప్‌ల ఆగడాలు ఇటీవల కాలంలో హెచ్చుమీరుతున్నాయి. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేని వారిని యాప్‌ నిర్వాహకులు.. మానసికంగా వేధిస్తున్నారు. రుణాలు తీసుకుని చెల్లించలేని వారు.. రుణ యాప్​ల బ్లాక్‌ మెయిలింగ్‌ను భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.

 

 

 

 

యాప్ డౌన్‌లోడ్ చేసి వివరాలు పొందుపరిస్తే చాలు.. క్షణాల్లో లోన్ ఇస్తామంటూ రుణ యాప్‌ నిర్వాహకులు మొదట్లో ఆకర్షిస్తున్నారు. వారి మాటలు నమ్మి వివరాలు నమోదు చేసి లోన్‌ తీసుకున్న తర్వాత.. వారి ఆగడాలను బయట పెడుతున్నారు. ఇచ్చిన డబ్బు కంటే రెట్టింపు వసూలు చేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బు కట్టలేని వారిని మానసికంగా వేధిస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల గొల్లపూడికి చెందిన ఓ యువకుడు రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఓ మహిళ సైబర్‌ నేరగాళ్ల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

 

 

 

 

“పదో తేదీన మా ఖాతాలో నగదు జమా చేశారు. మళ్లీ 23 వ తేదీన తిరిగి చెల్లించమని ఫోన్​ చేశారు. అప్పుడు అడిగిన మొత్తం వారికి తిరిగి చెల్లించాము. మళ్లి రెండు రోజుల తర్వాత ఫోన్​ చేసి ఇంకా కొన్ని డబ్బులు చెల్లించమని ఫోన్​ చేశారు. నగదు లేవని చెప్పటంతో అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తున్నారు.” -దేవి, బాధితురాలు

 

 

 

 

 

ఆన్‌లైన్‌ రుణాల పేరుతో పేద మధ్య తరగతి ప్రజలకు ఎర వేస్తున్న నిర్వాహకులు వాటిని తిరిగి చెల్లించకపోతే నరకం చూపిస్తున్నారు. కీలక నిందితులు చైనా, మలేషియా దేశాలకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. నాన్ బ్యాంకింగ్ యాప్‌లను వినియోగించేటప్పుడు ఆర్​బీఐ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులపై.. 14440 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

 

 

 

 

 

“గత నాలుగు సంవత్సరాలు లోన్​ యాప్స్​ బాధితులు పెరిగిపోతున్నారు. కొత్త కొత్త కంపెనీలు ప్లే స్టోర్​లో యాప్​ తీసుకువచ్చి.. వాటిని ప్రాచూర్యంలోకి తీసుకువచ్చి వల వేస్తున్నాయి. చాలా వరకు సైబర్​ మోసాలకు పాల్పడే వారు తప్పుడు బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. వారిని అంత సులభంగా ట్రాక్​ చేయటం కష్టంగా ఉంటోంది.”

బాధిత కుటుంబలను పరామర్శంచిన.

బాధిత కుటుంబలను పరామర్శంచిన కుంజ కుసుమంజలిసూర్య

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారాం గ్రామానికి చెందిన జంగా సంపత్ ఎల్లయ్య ఇద్దరు సోదరులు వారి కుమార్తెలైన
జంగా మౌనిక జంగా నవ్యలత అను అక్కాచెల్లెలు. బుధవారం రోజు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగిన సంగతి విధితమే.. బాధితుల బాధను కన్నీళ్లను చూసిన స్థానిక నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు ధనసరి సీతక్క కు విషయం చెప్పడం జరిగిందని మంత్రివర్యులు సీతక్క ఆదేశాల మేరకు వారి కోడలు ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుంజ కుసుమాంజలిసూర్య గురువారం రోజు దుర్గరాం గ్రామానికి విచ్చేసి బాధిత కుటుంబాలను ఓదార్చి కన్నింటి పర్యంతమయ్యారు
బోలెడు భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయిలు రోడ్డు ప్రమాదాలు చనిపోవడం చాలా బాధాకరమని వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వారికీ ప్రగడ సానుభూతిని తెలియజేసి ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కుంజ కుసుమాంజలిసూర్య, అన్నారు వారి వెంట మాజీ ఎంపీపీ బానోత్ విజయ, రూపు సింగ్ ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,మాజీ జడ్పిటిసి పుల్సం పుష్పలత, టీపీసీసీ సభ్యులు చల్ల నారాయణరెడ్డి, మాజీ జెడ్పిటిసి కారోజు రమేష్, డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపాయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ర జనార్దన్ రెడ్డి,నోముల ప్రశాంత్ యాదవ్, ఉపేంద్ర చారి, ముస్కు, వెంకన్న గొందిరాజు పల్లె రమేష్ గ్రామ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి.

తీవ్ర ఎండతో పడిపోయిన ఉపాధి హామీ కూలీకి మెరుగైన వైద్యం అందించాలి- కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తీవ్ర ఎండతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పడిపోయిన సిరిసిల్ల గణపతికి మెరుగైన వైద్యం అందించి వారికీ ఆర్ధిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆడుకోవాలని బికెయంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

శనివారం తీవ్ర ఎండతో పడిపోయిన గణపతిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చగా వారిని పరమార్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.

ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో రోజులాగే ఉపాధి హామీ పనికి వెళ్లిన కార్మికులు పని ప్రదేశం గట్టిగా ఉండడం వల్ల ముందు రోజే ఆప్రదేశంలో నీటితో తడిపి శుక్రవారం రోజున పనికి వెళ్లగా ఎండ తీవ్రంగా ఉండడం వల్ల నీటితో పని ప్రదేశాన్ని తడిపిన చెట్ల పొదలు ఎంత తీసిన రాకపోయే సరికి ఇంటికి వెళ్లి గడ్డపార తీసుకు రావడానికి వెళ్ళుతుండగా ఎండ ఎక్కువ ఉండడంతో అక్కడే కల్లు తిరిగి పడిపోవడంతో 108కు ఫోన్ చేయగా అంబులెన్సు వచ్చి కరీంనగర్ ప్రభుత్వ అస్పత్రిలో చేర్చారని, ఇప్పటికి సంబంధిత అధికారులు అస్పత్రికి రాలేదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలికి ప్రమాదం జరిగిన ఇప్పటివరకు అధికారులు బాధితున్ని పరమార్శించకపోవడం బాధ్యత రహిత్యమని, ఆగ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అని వేంటనే ఉపాధి హామీ అధికారులు స్పందించి వారికీ మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకోవాలని అన్నారు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, నీడ సౌకర్యం తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణి చేయాలని, ఎండ ప్రమాదాల నుండి కూలీలకు రక్షణ కల్పించాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణపల్లి యుగేందర్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, రాజయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version