జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో ఉచిత విద్యను అందించాలి
టి ఎస్ జి యు ఎన్యుజే ఇండియా.
కేసముద్రం/ నేటి ధాత్రి
shine junior college
మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించి ఉచిత విద్యను అందించాలి అని,మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా నేతలతో కలసి వినతి పత్రం అందించిన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ ధీర్, వారు మాట్లాడుతూ రాత్రానకా పగలనక నిరంతరం వార్తల కోసం తిరుగుతూ,ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరి శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు తప్పకుండా కల్పించాలని,మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యా భోధన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు,జిల్లా విద్యా శాఖా అధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందించామని తెలిపారు.ఇటీవల టి ఎస్ జే యు ఎన్యుజే ఇండియా పోరాటంతో ములుగు జిల్లా కమిటీ అక్కడి జర్నలిస్టుల పిల్లలకు వందశాతం ఫీజు రాయితీ కల్పించిన సంగతి గుర్తు చేస్తూ కాపీ వినతిపత్రానికి జత చేసినట్లు కలెక్టర్ ,విద్యా శాఖాధికారి సత్వరం ఈ వినతి పై సానుకూల స్పందన ప్రకటించాలని కోరారు.
Private Schools.
కార్యక్రమంలో డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్,జిల్లా టీయస్ జేయూ నేతలు పోతుగంటి సతీష్,గాండ్ల కిరణ్,జెల్లీ శ్రవణ్, మల్లారపు నగేష్ శెట్టి వెంకన్న,మిట్టగడుపుల మహేందర్,తాడూరి ఉమేష్ శర్మ, కేసముద్రం మండల అధ్యక్షులు మంద విక్రం ప్రధాన కార్యదర్శి గంధసిరి యాకాంబరం, ఉపాధ్యక్షులు కందుకూరి రాజేందర్,సతీష్,జన్ను శ్రీనివాస్
??వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు.??
-‘‘నేటిధాత్రి’’ కొన్ని వందల కధనాలు రాసింది.
-గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
-ఇప్పటికీ మించిపోలేదు..
-ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి నుంచి కక్కిస్తే చాలు.
-ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఓ వైపు వేలు, లక్షల్లో జీతాలు తీసుకుంటే అడుగుడునా అవినీతి చేసుకుంటూ, కోట్లు సంపాదించిన ఉద్యోగులున్నారు. ఉద్యోగుల సహకారంతో వందల కోట్లు సంపాదించిన వ్యాపారులున్నారు. ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, అటు వ్యాపారులు నుంచి పెద్దఎత్తున ముడుపులు తీసుకున్న ఉద్యోగులు అనేక శాఖలో వందల మంది వున్నారు. మరి అలాంటి వారికి శిక్షలు పడలేదా? అంటే పడలేదు. వారిపై చర్యలు తీసుకోలేదు. కారణం వారికి రాజకీయ పార్టీ నాయకులతోడు, ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా వుండడంతో ఇలాంటి అవినీతి కార్యకలాపాలు పెద్దఎత్తున జరిగిన సందర్భాలు అనేకం వున్నాయి. అలా తెలంగాణలో ఈ పదేళ్లకాలంలో జరిగిన అవినీతి కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్, మైనింగ్ ,వైద్య శాఖల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు తేలింది. అవినీతి ఆరోపణలు రాగానే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వౌరీ వేయడం, అదికారులు వెల్లడం తూతూ మంత్రమైపోయింది. కొన్ని సార్లు ఒక రోజు, మరికొన్ని సార్లు మూడు నాలుగు రోజులు హడావుడి చేసి, వందల పేజీల ఎంక్వౌరీ రిపోర్టులు తయారు చేసిన సందర్బాలు కూడా అనేకం వున్నాయి. కాని ఫలితం ఏం జరిగింది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుంది. ఆ ఎంక్వౌరీ రిపోర్టు బుట్టదాఖలౌతోంది. ఇదే తంతు. గత పదేళ్ల కాలంలో అనేక ఎంక్వౌరీలు జరిగాయి. వాటిని నేటిదాత్రి అనేక సార్లు రాసింది. కాని ఏం జరిగింది? ఎంక్వౌరీ చేయడం దగ్గరే ఆగిపోయింది. ఎంక్వౌరీ రిపోర్టు బైట పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. అయినా ఎక్కడా ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నది లేదు. ఏ అక్రమ వ్యాపారి మీద చర్యలు లేవు. ఇలా పదేళ్ల కాలంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. ప్రబుత్వానికి రావాల్సిన రాయల్టి కూడా అందకుండా పోయింది. వ్యాపారులు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఆస్ధులు కూడబెట్టుకున్నారు. ఉద్యోగులు కూడా హైదరాబాద్‌లో ఆస్దులు పోగేసుకున్నారు. కాని వారి మీద ఈగ కూడా వాలలేదు. వాటిలో కొన్ని మచ్చుకు చెప్పుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున గ్రానైట్ వ్యాపారం సాగుతుంది. ఒక్క కరీంనగర్ పట్టణ చుట్టుపక్కలే కొన్ని వందల క్వారీలలో గ్రానైట్ వ్యాపారం సాగుతోంది. ఇక్కడి నుంచి విదేశాలలకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలిపోతుంది. అలా గ్రానైట్ వ్యాపారం సాగించే వ్యాపారులందరూ రాయల్టీ పెద్ద ఎత్తున ఎగవేతదారులే. అందులో బడాబడా వ్యాపారులే కాదు, రాజకీయ నాయకులు కూడా వున్నారు. దాంతో అదికారులు ఆ వ్యాపారాల వైపు తొంగి చూడరు. వాళ్లు చెప్పిందే రాసుకుంటారు. క్షేత్ర స్దాయి పరిశీలన జరగదు. ప్రభుత్వ అనుమతులు ఎంత వరకు వున్నాయి. వ్యాపారులు ఎంత వ్యాపారంచేస్తున్నారు. ప్రభుత్వం ఎంత స్థలానికి పర్మిషన్ ఇచ్చింది. వ్యాపారులు ఎంత స్ధలంలో గ్రానైట్ తవ్వకాలు సాగిస్తున్నారు. అనేది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అదో మాయా ప్రపంచం అనికూడా నేటిధాత్రి అనేక కధనాలు రాసింది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన స్ధలం పక్కన దళిత రైతుల భూములు కూడా తీసుకొని గ్రానైట్ వ్యాపారం సాగిస్తున్నకంపనీలున్నాయి. కంపనీలు సాగిస్తున్న వ్యాపారంపై ప్రభుత్వం పూర్తి స్ధాయి దృష్టిపెట్టాల్సిన అవసరంవుంటుంది. గ్రానైట్ కంపనీల మూలంగా వ్యాపారికి తప్ప ప్రభుత్వానికి కూడా పెద్దగా రాయల్టీ అందడం లేదు. పైగా పర్యావరణం పాడౌతోంది. చెరువులు ఆనవాలులేకుండాపోతున్నాయి. వ్యవసాయ పొలాలు ఆగమౌతున్నాయి. గ్రానైట్ రాళ్ల రవాణ వల్ల ప్రజలకు అనేక అవస్దలు ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రజలుకూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా లెక్కకు మించి గ్రానైట్ తవ్వకాల జరుపుతున్న కంపనీలపై విజిలెన్స్ ఎంక్వౌరీలు జరిగాయి. కాని రిపోర్టులు కూడా సమర్పించారు. కాని ఆయా కంపనీలపై చర్యలు తీసుకున్నది లేదు. వ్యాపారుల చెల్లించాల్సిన రాయల్టీ వసూలు చేసింది లేదు. కింది స్ధాయి అదికారుల నుంచి పై స్ధాయి దాకా అదికారులు అవినీతి మూలంగా ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్ము మధ్యలోనే మాయమౌతోంది. విజిలెన్స్ రిపోర్టులు మరుగున పడిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇసుక వ్యాపారం ఒక పెద్ద మాయా ప్రపంచం. ఈ గ్రానైట్ వ్యాపారం కరీంనగర్‌తోపాటు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెద్దఎత్తున జరగుతుంది. ఈ మూడు జిల్లాల్లో అనేక సార్లు ఎంక్వౌరీలు జరిగాయి. కాని రాయల్టి వసూలు చేసింది లేదు. మొత్తం ఈ వ్యవస్ధలో పూర్తిస్దాయి ఎంక్వరీలు చేపడితే ప్రభుత్వానికి వేల కోట్లు చేరుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్‌లో గతంలో గోదావరి నది మీద జరిగే అక్రమ వ్యాపారంపై పెద్దఎత్తున నేటి దాత్రి స్టోరీలు రాసింది. ఇసుక వ్యాపారం మొదలు పెట్టినప్పుడు చిన్న స్ధాయి వ్యక్తులంతా డాన్‌లుగా మారిన సందర్భాలున్నాయి. అలాంటి వారిలో ఒక డీలర్‌గా పనిచేసిన వ్యక్తి , ఇసుక వ్యాపారంచేసి డాన్ శ్రీను అనేంత పేరు సంపాదించుకున్నాడు. అలా అదికారులు అతనికి సహకరించారు. ఈపదేళ్ల కాలంలో వందలకోట్ల రూపాయలు ఆ వ్యక్తి సంపాదించాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ కోట్లలో ఎగ్గొట్టాడు. ఈ విషయం అధికారులందికీ తెలుసు. దానిపై విచారణ కూడా జరిగింది. కాని రాయల్టీ వసూలు చేసిన దిక్కులేదు. ఇలా ఇసుక వ్యాపారులు ఎంతో మంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ వందల కోట్లలో వుంటుంది. ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై గతంలో అనేకసార్లు విజిలెన్స్ ఎంక్వౌరీ జరిగింది. రిపోర్టులు కూడా సమర్పించారు. కాని ఏం జరిగింది? ఏ ఒక్కరి మీద కూడా కేసు నమోదు జరగలేదు. వారికి శిక్షపడిరది లేదు. అలా ఇసుక వ్యాపారం సాగిస్తున్న వారిపై వున్న రాయల్టీ వసూలుకు ఇప్పటికైనా పూనుకుంటే కొన్ని వందల కోట్లు వసూలుచేయొచ్చు.అది ఆ ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయమే. కాని కరీంనగర్‌తోపాటు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్‌లో పెద్దఎత్తున ఇసుక వ్యాపారం సాగుతుంది. భూపాల పల్లి నుంచి పెద్దఎత్తున ఇసుక తరిలిపోతుంది. ఖమ్మం నుంచి నుంచి కూడా ఇసుక పెద్దఎత్తునరవాణ జరగుతుంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా ఇసుక వ్యాపారులకు కోట్లు కుమ్మరిస్తుంది. ఇవే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇసుక వ్యాపారం సాగని ప్రాంతం లేదు. కాని ఎంత ఇసుక తరలి వెళ్తోంది. ఎంత ప్రభుత్వానికి రాయల్టీ వెళ్తోందనేది లెక్కలు తీస్తే అసలు నిజం బైట పడుతుంది. తెలంగాణలో జరిగే మొత్తం ఇసుక వ్యాపారాల మీద ఏక కాలంలో విజిలెన్స్ ఎంక్వౌరీలు వేసి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అదికారుల నుంచి మొదలు, వ్యాపారుల దాకా తిన్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించొచ్చు. ఇక మరో కుంభకోణాలు అనేకం వెలుగులోకి వచ్చిన శాఖలో రిజిస్ట్రేషన్ శాఖలో బైట పట్టాయి. ఈ శాఖలో అవినీతి అనేది కింది స్ధాయి నుంచి పై స్దాయిదాకా వుంటుంది. ఇది అందిరికీ తెలిసిందే. అయినా చర్యలు తీసుకునేవారు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో బైట పడిన బాగోతాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా రిజిస్ట్రేషన్ స్టాంపుల తయారీ వెలుగులోకి వచ్చింది. అది అప్పట్లో పెద్ద సంచనలమైంది. కాని ఏం జరిగింది. అదికారుల మీద చర్యలు తీసుకున్నది లేదు. ఇలా తెలంగాణలోని అనేక రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన అవినీతిపై అనేక విజిలెన్స్ ఎంక్వౌరీలు జరిగాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే? ఎక్కడైతే అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయో? అక్కడ విజిలెన్స్ ఎంక్వౌరీ చేసేది కూడా ఆరోపణలుఎదుర్కొంటున్న అదికారే కావడం విశేషం. ఇలాంటి ఎంక్వౌరీలు ఎక్కడైనా జరుతాయా? ఏ అధికారి మీద ఆరోపణలు వస్తే అదే అదికారి చేత ఎంక్వైరీ చేయించడం అంటేనే ఆ ఎంక్వౌరికీ ఎంత నిజాయితీ వుంటుందో,ఎంత పకడ్భందీగా సాగుతుందో అర్దం చేసుకోవచ్చు. ఇలా జరిగిన అనేక విజిలెన్స్ ఎంక్వౌరీలు బుట్టలకే చేరాయి. విచిత్రమేమిటంటే ఆరోపణలు ఎదుర్కొన్న అదికారే, తన కార్యాలయంలో విజిలెన్స్ ఎంక్వౌరీ చేపట్టడమనేంత గొప్ప విచారణ ప్రపంచంలో కూడా ఎక్కడా జరక్కపోయి వుండొచ్చు. ఇక వైద్య శాఖలో కూడా జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్ధితి. ముఖ్యంగా డిహెచ్‌గా పనిచేసిన గడల శ్రీనివాస్‌పై విజిలెన్స్ ఎంక్వౌరీ జరిగింది. పెద్దఎత్తున అవినీతి జరిగిందని తేలింది. కరోనాసమయంలో కేంద్రంనుంచి వచ్చిన నిధులను కూడా వదల్లేదని తేలింది. ఆఖరుకు ఆసుపత్రులకు వేసే సున్నాల సొమ్ముకూడా మింగిండన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. పైగా ఆయన ఉద్యోగంలో వుండగానే రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని చూశాడు. ప్రజా ప్రభుత్వం రాగానే వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకొనివిదేశాలు చెక్కేశాడు. ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే తవ్వితే కొన్ని వందలు ఎంక్వౌరీలు బైట పడతాయి. ఒక ఉద్యోగిగా గడల ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తా, టికెట్ ఇస్తే అని ఓ రాజకీయ పార్టీతో బేరం కూడా అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, గత ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదు. ఆయన కూడా ఖమ్మం జిల్లా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. కాని కుదలేదు. ఇలా ఈ శాఖలే కాదు, దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి, ఎంక్వౌరీలకు లెక్కలేదు. వాటికి మోక్షం జరిగింది లేదు. అధికారులకు శిక్ష పడిరదిలేదు. వ్యాపారుల నుంచి వసూలు చేసింది లేదు. అంతా మాయా…ఎంక్వౌరీ మరో పెద్ద మాయ.
కురవి భద్రకాళి సమేత వీరభద్రుని దర్శించుకున్న టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్
మరిపెడ/కూరవి నేటిదాత్రి
shine junior college
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని పవిత్ర పుణ్యక్షేత్రమైన కురవి శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,మాజీ పార్లమెంట్ సభ్యులు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మధుయాష్కి గౌడ్,ట్రైకా చైర్మన్ బెల్లయ్య నాయక్,కలసి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ వీరభద్ర స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు,రాష్ట్రంలోని ప్రజా పాలన అద్భుతంగా సాగుతుందని రేవంత్ రెడ్డిగారి పాలనలో రైతులు సబండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ముందు ముందు ఇంకా మంచి పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని వచ్చే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్రుని వేడుకోవడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో కొరవి దేవస్థానం చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, కోరవి మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రo గౌడ్, ఓబీసీ సెల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్,ప్రధాన కార్యదర్శి ఆవిరె మోహన్ రావు,మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగ్య నాయక్,శ్యామల శ్రీనివాస్,దైద భద్రయ్య,కురవి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దయ్యాల శ్రీధర్,నల్లెల్ల గ్రామపార్టీ అధ్యక్షులు బండి మల్లయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ఇద్దరు నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రెండు కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు, పట్టణ అధ్యక్షుడు బావండ్ల మధు,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం, తెలంగాణ జాగృతి అధ్యక్షుడు దారమోని గణేష్, భగత్ సింగ్, కనుక సత్యం,అల్లుడు కృష్ణ.కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు వాస శేఖర్, ప్రధాన కార్యదర్శి సంబు ముత్యాలు,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పూరి రమేష్,ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండూరు కృష్ణయ్య, యువజన సంఘం అధ్యక్షుడు సంబు తరుణ్, కోశాధికారి గుండ్ల రేవంత్, సంఘం నాయకులు గందె రవి, బచ్చు మురళి,రాము, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలం ఇందారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ముఖ్య సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా జైపూర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 75 వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మన రైతులు సుభిక్షంగా ఉండేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను ఇప్పటికి అమలు చేసి వివిధ రాష్ట్రాలకు ఒకదశ,దిశ చూపించారని అన్నారు. అదేవిధంగా రుణమాఫీ,సన్న ధాన్యానికి బోనస్,అన్ని రకాల పంటలకు మద్దతు ధర కొనుగోలు,అన్ని పంటలకు రాయితీపై సూక్ష్మ,సేంద్య పరికరాల సరఫరా వంటివి అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో శ్రీనివాసరావు,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏఈఓ మాళవిక,పంచాయతీ కార్యదర్శులు,ప్రజా ప్రతినిధులు,రైతులు ప్రజలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మండల కేంద్రంలో సోమవారము పేదలకు గ్రామ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ ఎంపీడీవో సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శేఖర్ పటేల్ గ్రామపంచాయతీ సెక్రెటరీ వీరన్న మాజీ సర్పంచ్ రుద్రప్ప పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సయ్యద్ గోసుద్దీన్ అష్రఫ్ అలీ ల్యాఖత్ అలీ నిస్సార్ అహ్మద్ రాజేందర్ సింగ్ మొహమ్మద్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని మాదారం కాలనిలో ఎమ్మార్వో విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూ భారతి రేవన్యూ సదస్సు ను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని,ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుమన్ కుమార్,ఎంఆర్ఐ దామోదర్, సర్వేయర్ విజయకుమార్ మరియు రేవన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, పాత దాంరాజుపల్లి, ముద్దుబిడ్డ అయినటువంటి జంగు రమ్య సుమన్ బావపూర్ (కే) విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు,వీరు మల్లాపూర్ కనక సోమేశ్వర టెంపుల్ కు వచ్చినారు, వాళ్లు ముఖ్యంగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయానికి సంబంధించిన మంచి మంచి వీడియోలు చేస్తూ 3,46,000 సబ్స్క్రైబ్ ను సాధించి సిల్వర్ ప్లే బటన్ అనగా యూట్యూబ్ నుండి అవార్డు పొందారు, నేటి సమాజానికి మంచి మెసేజ్ అందిస్తూ విడియోలు తీస్తున్న సుమన్ రమ్య ,మల్లపూర్ ఎక్స్ ఎఎంసి పెద్దిరెడ్డి లక్ష్మన్ చిరు సన్మానం చేయడం జరిగింది,మాకిలి రాకేష్, రుద్రా రామ్ ప్రసాద్, ముద్దం సత్తన్న, ఎండీ రఫి భాయ్,ఉయ్యాల లక్ష్మన్,ఏనుగు వెంకట్ రెడ్డి,నల్ల లక్ పతి, దళిత రాజ్,దామెర ప్రశాంత్,జక్కుల వెంకటేష్, ఆవుసుల సాగర్, చిప్ప రాజేష్,రాచకొండ నర్సయ్య, ముస్కెరి బుమయ్య, తదితరులు పాల్గొన్నారు.
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన * జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి
జమ్మికుంట :నేటిధాత్రి
shine junior college
ఈరోజు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు గారు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి తనిఖీ లో భాగంగా ఫార్మసీ రూమ్, ల్యాబ్ మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది ఆరోగ్యశాఖ సిబ్బందికి క్రింది విషయాలపై దిశా నిర్దేశం చేశారు అందులో 1.NCD క్లినిక్స్ ను పగడ్బందీగా నిర్వహించాలి అందులో ఎన్ సి డి పరీక్షలు హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్ ,ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు నిర్వహించాలి 2.లెప్రసి సర్వేను ఆశా కార్యకర్తలు ప్రతి గ్రామంలో విధిగా నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించాలిACF camp పెట్టి,Sputum Samples సేకరించాలి. అవసరం అనుకున్న వారికి Xray తీయించాలి. 3.ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్ర వారం తప్పనిసరిగా నిర్వహించాలని అందులో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని 4.జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శుక్రవారం సభను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని 5.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని 6.వర్షాకాలంలో వచ్చే వ్యాధుల మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద ప్రజలకు అవగాహన కల్పించాలని 7.సిబ్బంది సమయపాలన పాటించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ABHA కార్ట్స్ ను ఇంప్రూవ్ చేయాలని ప్రజలందరూ ప్రభుత్వ వైద్యాన్ని వినియోగించుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ , హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ సదానందం,ఫార్మసిస్ట్ శ్రీధర్,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు
ఆర్టీసీలో భద్రతతో పాటు సురక్షితం మల్లాపూర్ 16 నేటి ధాత్రి
shine junior college
ఆర్టీసీలో భద్రతతో పాటు సురక్షితం మెట్‌పల్లి డిపో మేనేజర్ టి దేవరాజ్ మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో సోమవారం మెట్‌పల్లి టీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ టి దేవరాజు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో భద్రతతో పాటు సురక్షిత గమ్యాన్ని చేరవచ్చు అన్నారు. అలాగే ప్రైవేట్ వాహనాలను హైదరాబాదు లాంటి దూర ప్రయాణాలకు రెంటుకు తీసుకువెళ్తే కనీసం ఐదువేల రూపాయలు ఖర్చవుతున్నాయని అదే ఆర్టీసీ ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులలో హైదరాబాద్ వెళ్తే ఒక్కొక్కరికి 400 నుండి 500 రూపాయలు టికెట్కు అవుతున్నాయన్నారు. నూతనంగా ఖానాపూర్ నుండి వయా ఆర్మూర్ హైదరాబాద్ కు లగ్జరీ బస్సు ప్రారంభించామని ప్రయాణికులు ఈ బస్సును వినియోగించుకోవాలన్నారు. ఖానాపూర్ నుండి ఉదయం ఐదు గంటలకు వయా ఓబులాపూర్ మీదుగా మెట్‌పల్లి వచ్చి వయా ఆర్మూర్ నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ గా వెళ్తుందన్నారు.
జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి మల్లాపూర్ జూన్ 16 నేటి ధాత్రి:
shine junior college
ప్రశ్నించే గొంతును నొక్కడం సరికాదు ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్ జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహసిల్దార్ రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు కనుక సంజీవ్, మల్లాపూర్ ప్రెస్ క్లబ్ 143 అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ…జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు తోకల పవన్, రుద్ర రాంప్రసాద్, చింతలూరి రంజిత్, తోట శేఖర్, మిడిదొడ్డి మల్లేష్, ఉడుగుల గంగాధర్, రాజేందర్, మోర సతీష్, తదితరులు పాల్గొన్నారు.
రైతు భరోసా పథకంకు అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలి…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
shine junior college
ఈనెల 5వ తేదీకి ముందు పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉండి, రైతు భరోసా పథకంలో పేరు నమోదు కాని రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం తో సంబంధిత రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని ఐదవ వార్డ్ అమరవాది లో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ తెలిపారు. రైతు కార్డ్ తీసుకోనీ వారు కూడా సంబధిత అధికారులను కలిసి తీసుకోవాలని కోరారు. భూ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని బత్తుల వేణు ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దాంక రమేష్ ,రోడ్డ రమేష్ క్యాతం పురుషోత్తం,రొడ్డ మల్లేష్, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ “జయశంకర్ బడిబాట “లో భాగంగా FLN LIP దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM) వివిధ తరగతులలో ఆశించిన అభ్యసన ఫలితాల చార్థులు ప్రదర్శించి,వీటి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇట్టి ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల భోదన సులభతరం చెయ్యడమే కాకుండా,TLM ద్వారా భోదిస్తే విద్యార్థులు బడి పట్ల ఆకర్షితులై హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులచే గత సంవత్సరం వారు చదివిన కథల, పాఠ్య పుస్తకాలు చదివించి బాగా చదివిన వారికి “నేను బాగా చదువగలను “అనే గుర్తింపు బ్యాడ్జ్ తో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, రాసూరి రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను సోమవారం రోజు డాక్టర్ రఘు చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రఘు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం ఎంతో అభినందనీయం అని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్న విలేకరులకు ప్రభుత్వం ద్వారా కూడా అందవలసిన సహాయ సహకారాల కోసం నేనెప్పుడూ పాటు పడుతా అని డాక్టర్ రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, అఫ్రోజ్,విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఆగ సురేష్,ఏసవేని గణేష్ ,ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి, పెండింగ్ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజులలో పరిష్కారం చూపాలని, తదుపరి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యలు నిమిత్తం ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 53 దరఖాస్తులు వచ్చాయని వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికార్లు
సిరిసిల్ల టౌన్ : ( నేటి ధాత్రి )
shine junior college
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో స్కానింగ్ సెంటర్ల ల్లో తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల తనిఖీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీల వివరాలతో ఫారం ఎఫ్ ఆడిట్ లను పరిశీలించి, సి సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు ప్రోత్సహించవలసిందిగా సూచిస్తూ, లింగ నిర్ధారణ చేయడం నేరమని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలిపినారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ పి ఓ ఎమ్ హెచ్ ఎన్, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, హెచ్.ఈ బాలయ్య పాల్గొన్నారు.
రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో తారు వేసిన నెల రోజులకే దారి గుంతలమయంగా మారింది. రాయికోడ్ నుంచి కప్పాడ్ వరకు ఆర్అండ్బై ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు వేశారు. చాలా చోట్ల తారు లేచి.. కంకర తేలుతోంది. వర్షా నికి సైడ్ బర్న్స్ కోతకు గురవుతున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు చొరవచూపి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదా రులు కోరుతున్నారు.
మహాత్ములు లోక కల్యాణం కోసమే పుడతారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగమానోత్సవము మరియు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమం భూత్పూర్ రోడ్ లోని వాసవి కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కాశీ, ఉజ్జయిని ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
MLA Yenna Srinivas Reddy
పట్టణంలోని ప్రజలు పీఠాధిపతులను దర్శించుకొని వారు ఇచ్చే సందేశాలను వారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జె.పి.ఎన్ సి.చైర్మన్ కె.యస్. రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టం మరియు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్ మచ్చ రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనకు కృషి చేయలేదు.మరోపక్క విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు. ఏఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది.కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేషబోయిన రాము, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లోని లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి .అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు పూజ కార్యక్రమం చేసి,పనులను ప్రారంభించారు.నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థితిగతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని.ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు సొంత ఇల్లు సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి,ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి తమ కృతజ్ఞత చాటుకోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకోని పేదలకు న్యాయం చేయడం మా లక్ష్యమని,ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం కావాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారుగానీ, అమలు చేయలేదు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన సంక్షేమ పాలన అమలవుతోంది అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాల అమలుకు ముందుకు సాగుతోందన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి నాణ్యమైన, పక్కా ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లను మంజూరు చేసి ప్రతి అర్హుడికి ఇళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.53 వ డివిజన్ పేదలు అధికంగా ఉన్నారని కేటించిన వాటికంటే అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాబాయ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజీజ్ ,రహీమున్నీసా నాయకులు ఎర్ర మహేందర్,మట్టెడ అనిల్ కుమార్,శ్యామ్,రేణికుంట ప్రవీణ్,సత్తార్,కాసిం,ఎర్ర చందు ,రజిత్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.