భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను.

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి

ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి.

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

shine junior college

మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ “జయశంకర్ బడిబాట “లో భాగంగా FLN LIP దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM) వివిధ తరగతులలో ఆశించిన అభ్యసన ఫలితాల చార్థులు ప్రదర్శించి,వీటి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇట్టి ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల భోదన సులభతరం చెయ్యడమే కాకుండా,TLM ద్వారా భోదిస్తే విద్యార్థులు బడి పట్ల ఆకర్షితులై హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులచే గత సంవత్సరం వారు చదివిన కథల, పాఠ్య పుస్తకాలు చదివించి బాగా చదివిన వారికి “నేను బాగా చదువగలను “అనే గుర్తింపు బ్యాడ్జ్ తో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, రాసూరి రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version