మండలంలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ
నడికూడ,నేటిధాత్రి:
మండలంలో నేటి నుండి రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడతలో భాగంగా మండలంలోని గ్రామాలలో నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎంపీడీవో రామ రామ కృష్ణ తెలిపారు.మండలంలోని 14 గ్రామ పంచాయతీ సర్పంచ్, 138 వార్డు సభ్యులకు ఈనెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.6న నామినేషన్ల పరిశీలన,7వ తేదీన అప్పిల్ ,8న తిరస్కరణ,9వ తేదీన నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మండలంలో 6 క్లస్టర్లలో నామినేషన్లు స్వీకరించబడతాయని, కంఠాత్మకూర్ క్లస్టర్ పరిధిలో కంఠాత్మకూర్,ధర్మారం, రామకృష్ణాపూర్,కౌకొండ క్లస్టర్లో కౌకొండ,సర్వాపూర్ నడికూడ పరిధిలో నడికూడ, ముస్త్యాలపల్లి,చౌటుపర్తి, రాయపర్తి పరిధిలో రాయపర్తి,నర్సక్కపల్లి, పులిగిల్ల క్లస్టర్ లో పులిగిల్ల,వరికోల్,చర్లపల్లి క్లస్టర్ పరిధిలో చర్లపల్లి నార్లాపూర్ గ్రామాల నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు.
