శివరాత్రి సందర్భంగా శివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు…

శివరాత్రి సందర్భంగా శివాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

వీణవంక, నేటి దాత్రి:

 

వీణవంక మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆహ్లాదపరిచాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సిరి – సాయిల కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిల్వగా,ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుండి మాతృభూమి మీద మమకారం తో విచ్చేసిన చిన్నారులు వోరేం సిరి సాన్విత మరియు సాయి సుధీక్ష లు తమ అద్భుతమైన నృత్యాభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
సంప్రదాయ వస్త్రధారణలో, లయబద్ధమైన అడుగులతో, భావప్రకటనతో శివతాండవాన్ని ఆవిష్కరించి సభికుల ప్రశంసలు అందుకున్నారు.
కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు మరియు గ్రామ పెద్దలు చిన్నారులను అభినందించారు.
ప్రతిభావంతులైన చిన్నారులు గద్వాల జిల్లా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీణవంకకు చెందిన వోరేం విజయ్ కుమార్ కుమార్తెలు కావడం భక్తులు సంతోషాన్ని వ్యక్తపరిచారు
చిన్నతనంలోనే కళా బాల, శివ నంది, నటరాజ్ పురస్కారాలు అందుకుని ప్రతిభ చాటారు. నాట్య మువ్వ, నంది, తెలంగాణ బెస్ట్ డాన్సర్ అవార్డులతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తమ పేరు నమోదు చేయించుకోవడం గర్వకారణం శివరాత్రి పర్వదినాన శివాలయంలో జరిగిన ఈ నృత్య సమర్పణ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.గత 3 సంవత్సరాలుగా ఇలా సొంతం ఊరిలో ప్రదర్శన ఇవ్వటం వలన అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారుల భవిష్యత్తు లొ ఉన్నత శికరాలకి చేరుకోవాలని, ఖ్యతి గడిo చాలని గ్రామ పెద్దలు, ప్రజలు ఆశీర్వదించారు.

మహాశివరాత్రికి సర్వం సిద్ధం…

మహాశివరాత్రికి సర్వం సిద్ధం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించుటకు ఏర్పా ట్లు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు.15వ తేదీ ఆది వారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ప్రధమ రుద్రా భిషేకం ఆరు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అభిషే కాలు పూజలు నిర్వహిస్తా మని రాత్రి 9:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని రాత్రి 12 గంటలకు లింగో ద్భవ పూజ శివపార్వతుల పంచులోహ విగ్రహాల ఊరే గింపు నిర్వహిస్తున్నట్లు కావు న భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగల రని చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version