శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కల్యాణ్….

శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కల్యాణ్

 

వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారాయన.

వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచరాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.
వైసీపీ హయాంలో పాలకమండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలకమండళ్లు పని చేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు రూ.10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికీ ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలతం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్‌ పేర్కొన్నారు.

గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్..

అసెంబ్లీలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్‌పై చర్చలు కొనసాగాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకెళ్లే బడ్జెట్ ఇదని చెప్పుకొచ్చారు. అపార అనుభవంతో గత ప్రభుత్వ వారసత్వ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ‘నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా…’ అని కవి శేషేంద్ర చెప్పిన కవితను.. మోదీని ఉద్దేశించి కొనియాడారు పవన్ కల్యాణ్.

పట్టు’ను వణికిస్తున్న చలి..!

పట్టు’ను వణికిస్తున్న చలి..!

 

చలిపులి పట్టు రైతులను వణికిస్తోంది. చలి వల్ల పట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.

– ముడుచుకుపోతున్న మల్బరీ ఆకుమడకశిర(అనంతపురం): రోజురోజుకు చలి పెరిగిపోతుండడంతో పట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వేసవిలో వంద గుడ్ల పెంపకంతో 100 కిలోలకు పైగా పట్టుగూళ్ల దిగుబడి వచ్చేది. ప్రస్తుతం చలి అధికం కావడంతో 50 నుంచి 60 కిలోల లోపే దిగుబడి వస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుపరిశ్రమ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా మల్బరీ తోటలు సాగుచేస్తుండేవారు.
ప్రస్తుతం ఏడువేల ఎకరాల లోపే సాగుచేస్తున్నారు. చలికి మల్బరీ పంట ఎదగడంలేదు. ఆకులు ముడుచుపోవడంతో పట్టుపురుగులు సరిగా తినడంలేదు. దీంతో గూళ్లు అరకొరగా అల్లుతున్నాయని రైతులు వాపోతున్నారు. పట్టు పురుగులకు సున్నంకట్లు రోగం సోకి దిగుబడి పడిపోతోందని రైతులు చెబుతున్నారు.

 

దారిపై మంచు భూతం..

దారిపై మంచు భూతం..

 

 

 

గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

చలితీవ్రత పెరగడంతో జిల్లా వ్యాప్తంగా పొగ మంచు కమ్మేస్తోంది. కనీసం పదడుగుల దూరంలోని మనుషులు, వాహనాలు సైతం కనిపించనంతగా పొగమంచు ఉంటోంది. ఉదయం 8 గంటలు దాటినా దీనిప్రభావం ఉంటోంది. ఈనేపథ్యంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో 44వ జాతీయ రహదారి దాదాపు వంద కిలోమీటర్ల మేర ఉంది. కొడికొండ చెక్‌పోస్టు నుంచి శిర జాతీయరహదారి, మడకశిర నుంచి కళ్యాణదుర్గం రహదారి, కదిరి జాతీయరహదారి విశాలంగా ఉన్నాయి. దీంతో వాహనాలు అతివేగంగా పరుగులు తీస్తుంటాయి. ఈక్రమంలో రోడ్డుపై ఎక్కువ భాగం పొగమంచు కప్పివేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రతిఏటా డిసెంబరు, జనవరి మాసాల్లో తెల్లవారుజామున, ఉదయం జరిగే రోడ్డు ప్రమాదాలు అధిక పొగమంచు కారణంగానే జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వారం కిందట మడకశిర-బెంగళూరు రహదారిపై తెల్లవారుజామున మంచు అధికంగా ఉండటంతో దారి కనిపించక వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.

– గతవారం జాతీయరహదారిపై తెల్లవారుజామున బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న కారు మంచు ప్రభావంతో మలుపు గుర్తించ లేకపోవడంతో నేరుగా వెళ్లి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్నవారు గాయపడ్డారు.

– కొద్దిరోజుల క్రితం కదిరి, అనంతపురం హైవేపై కదిరి సమీపంలో పొగమంచు ప్రభావంతో రోడ్డు దాటుతున్న మహిళ కనిపించక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version