ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేట వాణిజశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు క్షేత్ర పర్యటనలో (జిజ్ఞాస విద్యార్థుల స్టడీ ప్రాజెక్ట్‌లో) భాగంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇండెల్ మనీ నర్సంపేట శాఖను సందర్శించారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలియజేశారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన ప్రాయోగిక జ్ఞానం విద్యార్థులకు అందించడమే ముఖ్య ఉద్దేశ్యం అని విద్యార్థులు క్షేత్ర పర్యటన ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని విద్యార్థులను ఇలాంటి పర్యటనలు అవసరమని విభాగాధిపతి ఎం.సోమయ్య తెలియజేశారు.ఇండెల్ మనీ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ శ్యామల రాజు మరియు శాఖ సిబ్బంది విద్యార్థులకు ఆర్థిక సేవలు, రుణాల విధానం, బంగారం రుణాలు, కస్టమర్ సేవలు, మరియు శాఖ నిర్వహణ విధానాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. విద్యార్థులు వాళ్లతో మమేకమవుతూ ఆసక్తిగా ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా వాణిజ్య విభాగం తరఫున ఇండెల్ మనీ నర్సంపేట శాఖ మేనేజర్ శ్యామల రాజు గారికి మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ విద్యా పర్యటనకు అనుమతి ఇచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గారికి వాణిజ్య విభాగం తరుపున వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం సోమయ్య ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన పెరిగి, భవిష్యత్తులో వారి విద్యా ప్రయాణానికి ఉపయోగపడే విలువైన అనుభవం లభించిందని డాక్టర్ రాజీరు తెలియజేశారు.

రామాయంపేటలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభం..

రామాయంపేటలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభం..

రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ కొత్త బ్రాంచ్‌ను జోనల్ హెడ్ శ్రీ గంధం కృష్ణ కుమార్ ప్రారంభించి జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ 1887లో తిరువనంతపురం, కేరళలో స్థాపించబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3600కు పైగా బ్రాంచులతో విస్తరించింది. ఈ బ్రాంచ్‌లు హైదరాబాద్ జోన్‌లోకి వస్తాయి” అని తెలిపారు.

తక్కువ డాక్యుమెంటేషన్‌తో గోల్డ్ లోన్స్,
టూ వీలర్ లోన్స్, బిజినెస్ లోన్స్,
చిన్న వ్యాపారుల అభివృద్ధికి రుణ సదుపాయాలు.
మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు,
బీమా ఉత్పత్తులు (జీవ, ఆరోగ్య, జనరల్)
ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ సేవలు,
బిల్లు పేమెంట్లు, మొబైల్ రీఛార్జీలు, ఇతర డిజిటల్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ శ్రీపద్ శాస్త్రి, ఏరియా మేనేజర్ అమర్నాథ్, బ్రాంచ్ మేనేజర్ శేఖర్ రెడ్డి, నందిని, వనిత, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version