· గతంలో మిశ్రమ ఫలితాలిచ్చిన సర్వేలు
· వార్డు స్థాయిలో ఓటర్ల మనోగతం తెలుసుకోవడం కష్టం

· సర్వేలు సాధారణంగా రాష్ట్రవ్యాప్త ట్రెండ్‌నే సూచిస్తాయి
· మహిళా ఓటింగ్ పెరగడం కాంగ్రెస్‌కు అనుకూలం కావచ్చు
· ఉచితబస్సు, మహిళలను కోటీశ్వరులను చేసే పథకాలు పనిచేసే అవకాశం
· గెలుపు శాతం పెరగకపోతే వచ్చే రేవంత్ జాగ్రత్త పడక తప్పదు
· బీఆరఎస్ రైజింగ్ ఎంతవరకు సాధ్యమో తేల్చనున్న ఫలితాలు
· గత ఎన్నికల్లో 90శాతం బీఆరఎస్ కైవసం
· స్థానిక ఫలితాలు సాధారణంగా అధికార పార్టీకే అనుకూలం
· బీజేపీకి వచ్చేదీ, పోయేదీ ఏమీ లేదు
· అనుకున్న విజయం సాధిస్తే రేవంత్‌కు ఢోకా వుండదు
హైదరాబాద్, నేటిధాత్రి:
అధికశాతం పోలింగ్ నమోదైనప్పుడు ప్రజల్లో ప్రజాస్వామిక చైతన్యం అత్యధికంగా వున్నట్లు అ ర్థం. ఇదే సమయంలో అధికారంలో వున్న పార్టీ పట్ల వ్యతిరేకత కూడా అధిక పోలింగ్ శాతం నమోదుకు కారణమనేది సాధారణ అంచనా. అంటే తక్కువశాతం ఓట్లు పోలయ్యాయంటే అధికారంలో వున్న ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతప్తి వ్యక్తమవుతున్నట్టు పరిగణించడం సర్వసాధా రణం. అయితే ఇది అన్ని సందర్భాల్లో నిజమవుతుందనుకోవడానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో అత్యధికశాతం ఓట్లు పోలయినప్పుడు, అధికార పార్టీ థంపింగ్ మెజారిటీతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన సంఘటనలు మనదేశంలో చాలా సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఫిబ్రవరి 11న తెలంగాణలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 73.01% ఓటింగ్ నమోదైంది. మొత్తం మహిళా ఓటర్లలో 73.39%, పురుష ఓటర్లు 72.63% తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ 70.26% నమోదు కాగా, వీరిలో సుమారు 69.94% మహిళా ఓటర్లు, 70.26% పురుష ఓటర్లు. పోలింగ్‌శాతం పరంగా పరిశీలిస్తే గత ఎన్నికలకంటే ఈసారి సుమారు మూడుశాతం ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక మహిళల ఓటింగ్‌ను పరిశీలిస్తే 3.45% పెరగడం ఇక్కడ కీలకం. అదేవిధంగా పురుష ఓటర్లు కూడా 2.89% అధికంగా గతంతో పోలిస్తే ఓటింగ్‌లో పాý£్గన్నారు. మొత్తంమీద పరిశీలిస్తే ఓటింగ్ పరంగా ప్రజల్లో ప్రజాస్వామ్య చైతన్యం పెరుగుతున్నదనేది సుస్పష్టం! ఇదొక సానుకూల పరిణామం.
ఎన్నికలు జరిగిన వెంటనే పోల్‌సర్వేలు ప్రకటించడం పరిపాటి. ఎవరి అంచనాలు వారివి. ఎవరు అనుసరించే విధానం వారిది! కొన్ని సందర్భాల్లో సర్వేలన్నీ ముక్త కంఠంతో చెప్పిన అంచనాలు తారుమారైన సందర్భాలు చాలానే వున్నాయి. అందువల్ల సర్వే ఫలితాలను కేవలం ఒక “హెచ్చరిక”గా పరిగణించడం సముచితం. సర్వేలు అనుకూలంగా వచ్చిన పార్టీలు ఆనందం వ్యక్తం చేయడం, ప్రతికూలంగా వచ్చిన పార్టీలు వాటిని తప్పుల తడకలుగా కొట్టిపారేయడం సహజమే.ఉదాహరణకు 2021లో వరంగల్, ఖమ్మం జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన మినీ ఎన్నికల్లో అప్పటి అధికార టీఆరఎస్ (బీఆరఎస్)దే ఆధిపత్యమని చెప్పిన అంచనా నిజమైంది. 2020లో 120 మున్సిపాలిటీల్లో టీఆరఎస్ హవా నడుస్తుందని పేర్కొన్న సర్వే అంచనా ప్రకారం109 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. ఆవిధంగా ఈ రెండు సందర్భాల్లో సర్వే అంచనాలునిజమయ్యాయి. అదే 2020 జీహెచఎంసీ ఎన్నికల్లో వీటి అంచనాలు తల్లక్రిందులు కావడం గమ నార్హం. టీఆరఎస్‌కు తిరుగులేదని ఇవి అంచనా వేయగా, అప్పటివరకు 4సీట్లు మాత్రమే వున్న బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో గెలుపొందడం, బీఆరఎస్ 99 నుంచి 55కు పడిపోవడం చరి త్ర. ఈ సర్వేలు జీహెచఎంసీ ఓటర్లలో వస్తున్న మార్పును పసికట్టలేకపోవడం గమనార్హం.
ఎందుకని ఈవిధంగా సర్వే అంచనాలు ఒక్కోసారి తల్లక్రిందులవుతాయన్న ప్రశ్న ఉదయించడంసహజమే. తెలంగాణ సమాజంపై నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, ఓటర్లపై మద్యం పంపిణీ 62%, డబ్బు పంపిణీ 32% బలీయమైన ప్రభావం చూపుతున్నాయని వెల్లడైంది. ఇవి సరిగ్గా పోలింగ్‌కు ఒక్కరోజు ముందు చోటుచేసుకోవడం వల్ల సర్వేలు ఓటర్లలో వచ్చే ఈ మార్పును పసికట్టలేవు. ఇక మున్సిపల్ ఎన్నికలు వార్డుల వారీగా జరుగుతాయి. ఒక్కోవార్డు విస్తీర్ణం చాలా తక్కువ. ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీల కతీతంగా వ్యక్తిగతంగా మంచి పలుకుబడి వున్న అభ్యర్థులు, వార్డుల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అదీకాకుండా సర్వేలు నిర్వహించినప్పుడు చాలా మంది పట్టణ ప్రాంత వోటర్లు తమ మనోగతం బయటకు వెల్లడించరు. పైకి ఒకటి చెప్పినా వ్యక్తిగత అభిప్రాయం భిన్నంగా వుండవచ్చు. ఇటువంటి వారి నాడిని పసికట్టడం కష్టం. అందువల్ల సర్వేలను ప్రస్తుత ట్రెండ్ ఏవిధంగా వున్నదనేదాన్ని విశాలదక్పథంతో అవగాహన చేసుకోవాలి తప్ప, ఇవే నిజమని గుడ్డిగా విశ్వసించడం సమంజసం కాదు. గ్రామీణ స్థాయి నుంచి రాజధాని వరకు ఓటర్లకు ఒకేవిధమైన ఆలోచనాధోరణి వుండదు. పల్లెల్లో ఓటర్లపై స్థానిక అభ్యర్థి పలుకుబడితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభావం చూపితే, మున్సిపల్ పరిధిలో ఓటర్లు మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తారు. అదే కార్పొరేషన్లలో మౌలిక వసతులు, రవాణా సదుపాయాలపై దష్టి కేంద్రీకరి స్తారు. జీహెచఎంసీ స్థాయిలో రవాణా, వైద్యసదుపాయాలు, నీటి సరఫరా వంటి అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి.
2026 మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 73.01% పోలింగ్ జరగడం, ముఖ్యంగా మహిళా ఓటర్ల సంఖ్య గతంలో కంటే 3.45%, ఇదే సమయంలో పురుషులకంటే ఎక్కువ నమోదు కావ డం ఈ సారి ఎన్నికల్లో కీలకం. మొత్తం ఓటింగ్ గతం కంటే మూడుశాతం ఎక్కువ నమోదైంది.సర్వే ఫలితాలు సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న వేవ్‌ను వెల్లడిస్తాయి తప్ప, వార్డు స్థాయిలో ఓడర్ల నాడిలోని గతిశీలతను అంచనా వేయడం కష్టం. ముఖ్యంగా తటస్థ ఓటర్ల నాడిని పట్టడంచాలా కష్టం. గ్రామీణ ఓటర్లతో పోలిస్తే పట్టణ ఓటర్లు తమ అభిప్రాయాలను అంత తేలిగ్గా బ హిర్గతం చేయరు. దీనికి తోడు ధనబలం ఎట్లాగూ వున్నది. చివరిక్షణంలో అప్పటివరకు వున్న గాలివాటును ఒక్కసారిగా మార్చివేయగలదు. ఈసారి యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చౌటుప్పýల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 ఓట్లు పోలవగా, నందికొండ మున్సిపాలిటీలో అతి త క్కువ అంటే 59.68% ఓట్లు పోలయ్యాయి. కార్పొరేషన్లలో అతితక్కువ ఓట్లు 59.12% పోల యింది నిజామాబాద్ కార్పొరేషన్‌లో! ఈసారి ఓటింగ్‌లో ఒక విచిత్ర ట్రెండ్ కనిపిస్తోంది. కార్పొ రేషన్ స్థాయిల్లో తక్కువ ఓట్లు పోలయితే, మున్సిపల్ స్థాయిల్లో అత్యధిక ఓటింగ్ నమోదవడం గమనార్హం.
మొత్తంమీద సర్వేల సారాంశం కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా వుండగా, ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్‌ల్లో బీజేపీకి విజయావకాశాలున్నట్లు తేల్చాయి. 9 కార్పొరేషన్లలో ఏడు కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. మున్సిపాలిటీల్లో కూడా 65` 85 వరకు కాంగ్రెస్ కిందికే వెళతాయని సర్వేల అంచనాలు. ఇక బీజేపీ రెండు కార్పొషన్లలో గెలిచే అవకాశముండగా, ఏఐఎంఐఎం కింగ్‌మేకర్ కానున్నదని సర్వేలు తేల్చాయి. బీఆరఎస్‌కు ఒక్క కార్పొరేషన్ కూడా దక్కే అవకాశం లేదని వీటి అంచనా. గత ఎన్నికల్లో దాదాపు 90% సీట్లను ఈ పట్టణ ప్రాంతాల్లో గెలుచుకున్న బీఆరఎస్ ఆ పట్టును ఇంకా కొనసాగించాలని గట్టిగా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఆ పార్టీ ఎంతమేర విజయం సాధిం స్తుందనేది 13వ తేదీ కౌంటింగ్‌లో తేలనుంది. ఈసారి పురుషులకంటే అత్యధికంగా మహిళలు అధికంగా ఓటింగ్‌లో పాý£్గనడం రేవంత్ ప్రభుత్వం కల్పించిన ఉచితబస్సు సౌకర్యం, మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో స్వయం సహాయక గ్రూపులకు పెట్రోల్ బంకుల ఏర్పాటు, ఆర్టీసీ అద్దె బస్సుల కొనుగోళ్లలో సహాయం చేయడం వంటివి సానుకూల ఫలితాలిచ్చాయని చెప్పాలి. మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందంటే కచ్చితంగా అది అధికారపార్టీకి సానుకూల సంకేతంగా పరిగణించాలన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అయితే ఇక్కడ ఒక్క సత్యాన్ని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్నపార్టీకే స్థానిక ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వుంటాయి. కాకపోతే ఈ సానుకూలతా శాతా న్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భవితవ్యాన్ని కొంతమేర అంచనా వేయవ చ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రస్తుత ఓటర్ల నాడిని బట్టి భవిష్యత్తులో అది ఏవిధంగా మార బోతున్నదనేది అంచనా వేసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు.
ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలకు చాలా కీలకం. బీఆరఎస్ గెలిస్తే, మరింత ఉత్సాహంతో రేవంత్ ప్రభుత్వంపై తమ దాడులను మరింత పెంచి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లవచ్చు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే, రాష్ట్రంలో క్రమంగా తెలంగాణ సెంటిమెంట్ తగ్గుతోందని, హరీష్, కేటీఆర్‌ల నాయకత్వ పటిమ అధికా రాన్ని కైవసం చేసుకునే స్థాయికి చేరుకోలేదన్న స్పష్టమవుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పరిస్థితి సానుకూలంగా వుంటుంది కనుక అధిక స్థానాలకంటే, ఎన్నిశాతం స్థానాల్లో విజయం సాధించామన్నది ప్రధానాంశంగా వుంటుంది. పంచాయతీల్లో మాదిరిగానే 50`60శాతంగా ఇవి వున్నట్లయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం చేసుకోక తప్పదు. 80`85 శాతం మధ్య విజయం సాధిస్తే, ప్రస్తుతం సానుకూలత ఉన్నదని, దీన్ని ఇలాగే కొనసాగేలా వ్యవహరించాలన్న సూచన ఇమిడి వుంటుంది. రెండు కార్పొరేషన్లలో విజయావకాశాలున్న బీజేపీకి వచ్చింది లేదు పోయిందీ లేదు. ఎంఐఎం కొన్ని కార్పొరేషన్లలో కింగ్‌మేకర్ కావడం, ఆ పార్టీ క్రమంగా ఎదుగుదలను సూచిస్తోంది. ఏ స్థానమైనా ఒక్కసారి ఎంఐఎం సొంతంగా గెలుచుకు న్నదంటే, ముస్లిం అనుకూల విధానాలు అనుసరించే కాంగ్రెస్ కూడా అక్కడ కాలు మోపడం కష్టం. ఇది అర్థం చేసుకోకుండా ఇంకా బుజ్జగింపు రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం.