ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేట వాణిజశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు క్షేత్ర పర్యటనలో (జిజ్ఞాస విద్యార్థుల స్టడీ ప్రాజెక్ట్‌లో) భాగంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇండెల్ మనీ నర్సంపేట శాఖను సందర్శించారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలియజేశారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన ప్రాయోగిక జ్ఞానం విద్యార్థులకు అందించడమే ముఖ్య ఉద్దేశ్యం అని విద్యార్థులు క్షేత్ర పర్యటన ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని విద్యార్థులను ఇలాంటి పర్యటనలు అవసరమని విభాగాధిపతి ఎం.సోమయ్య తెలియజేశారు.ఇండెల్ మనీ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ శ్యామల రాజు మరియు శాఖ సిబ్బంది విద్యార్థులకు ఆర్థిక సేవలు, రుణాల విధానం, బంగారం రుణాలు, కస్టమర్ సేవలు, మరియు శాఖ నిర్వహణ విధానాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. విద్యార్థులు వాళ్లతో మమేకమవుతూ ఆసక్తిగా ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా వాణిజ్య విభాగం తరఫున ఇండెల్ మనీ నర్సంపేట శాఖ మేనేజర్ శ్యామల రాజు గారికి మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ విద్యా పర్యటనకు అనుమతి ఇచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గారికి వాణిజ్య విభాగం తరుపున వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం సోమయ్య ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన పెరిగి, భవిష్యత్తులో వారి విద్యా ప్రయాణానికి ఉపయోగపడే విలువైన అనుభవం లభించిందని డాక్టర్ రాజీరు తెలియజేశారు.

నస్కల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

నస్కల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

నిజాంపేట: నేటి ధాత్రి

మండలంలోని నస్కల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రకు వెళ్లి పలు చారిత్రక కట్టడాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సాగరిక మాట్లాడుతూ.. విద్యార్థులకు వివిధ చారిత్రాత్మక కట్టడాలు వాటి విశ్లేషణల గూర్చి అవగాహన కల్పించడానికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. విజ్ఞాన విహారయాత్రలో భాగంగా జూ పార్క్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, అమరవీరుల స్తూపం, సచివాలయం, హైకోర్టు, ట్యాంక్ బండ్ లాంటి వాటిని చూపించడం జరిగిందన్నారు.

విద్యార్థులకు విజ్ఞానం, వినోదం రెండూ ముఖ్యమే- ఉప్పుల శ్రీనివాస్..

విద్యార్థులకు విజ్ఞానం, వినోదం రెండూ ముఖ్యమే- ఉప్పుల శ్రీనివాస్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి హై స్కూల్ విద్యార్థులు విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ లోని వండర్ లాను ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం రెండూ ముఖ్యమేనని, నిత్యం పుస్తకాలతో కుస్తీపడే విద్యార్థులకు విహారయాత్రలతో కాస్త విరామం పొందుతారన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రై- ప్రైమరీ విద్యార్థుల అవగాహన పర్యటన…

ప్రై- ప్రైమరీ విద్యార్థుల అవగాహన పర్యటన

నేటిదాత్రి అయినవోలు :-

 

పాత్ ఫైండర్ పాఠశాల ప్రీ-ప్రైమరీ విద్యార్థులు శనివారం సమాజంలో ముఖ్యమైన సేవలపై అవగాహన కలిగించడానికి ఒక విద్యా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు సూపర్ మార్కెట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్యాంక్ మరియు పెట్రోల్ బంక్ లను సందర్శించారు.సూపర్ మార్కెట్‌లో విద్యార్థులు నిత్యావసర వస్తువులు ఎలా కొనుగోలు చేస్తారు, బిల్లింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాలను నేర్చుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, నర్సులు ప్రజలకు ఎలా సేవలు అందిస్తారో తెలుసుకున్నారు. బ్యాంకులో డబ్బును ఎలా ఆదా చేస్తారు, దాన్ని ఎలా భద్రపరుస్తారు అనే విషయాలను గమనించారు. చివరిగా పెట్రోల్ బంక్‌లో వాహనాలకు ఇంధనం ఎలా నింపుతారు, దాని ప్రాధాన్యత గురించి అవగాహన పొందారు.
ఈ పర్యటన విద్యార్థుల్లో సామాజిక అవగాహనను పెంపొందించి, పాఠశాల పాఠ్యాంశాలను నిజజీవిత అనుభవాలతో అనుసంధానించేలా చేయడంలో సహాయపడింది అని ప్రిన్సిపాల్ సుభానోద్దీన్ వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కవిత, హైమావతి, నాగశ్రీ మరియు లక్ష్మి లు ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version