(ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో…

(ఈదుల్ ఫితర్) సమీపిస్తున్న తరుణంలో,ప్రధాన ఈద్గా వద్ద మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ మహ్మద్ యూనుస్, స్థానిక కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులతో కలిసి ఈద్గాను సందర్శించారు. పండుగ రోజున వేలాది మంది ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈద్గా ఆవరణలో ఉన్న సౌకర్యాలను చైర్మన్ స్వయంగా పరిశీలించి, పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
నమాజ్ సమయానికి మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్ సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా చూడాలని సంబంధిత విభాగాలకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులతో పాటు ఈద్గా కమిటీ సభ్యులు ఉన్నారు. పండుగ ఏర్పాట్లలో కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని చైర్మన్ తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పట్టణంలోని ముస్లిం సోదరులందరూ ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలన్నదే తమ లక్ష్యమని, మున్సిపాలిటీ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.

మున్సిపల్ కమిషనర్ ని కలిసిన నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు….

మున్సిపల్ కమిషనర్ ని కలిసిన నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు*

జహీరాబాద్ నేటి ధాత్రి:

రంజాన్ పండగ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం పట్టణంలో తగు ఏర్పాట్లు చేయాలని ,ముఖ్యంగా ప్రార్థన మందిరాల వద్ద పరిశుభ్రత,స్ట్రీట్ లైట్ లు,రోడ్లు యొక్క మరమత్తులు ,ప్రతి రోజు త్రాగు నీరు సరఫరా, పండగ రోజు ఈద్గా వద్ద భద్రత ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు నూతన బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు మున్సిపల్ కమిషనర్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు 4వ వార్డ్ కౌన్సిలర్ స్వప్న – ప్రవీణ్ కుమార్ ,5వ వార్డ్ కౌన్సిలర్ ప్రేమలత శంకర్ రెడ్డి, 9వ వార్డ్ కౌన్సిలర్ పాండు ముదిరాజ్,11 వ వార్డ్ కౌన్సిలర్ గౌస్ఉద్దీన్ గోరి 12 వ వార్డ్ కౌన్సిలర్ తంజీమ్,20వ వార్డ్ కౌన్సిలర్ విజయ రాజు 24 వ వార్డ్ కౌన్సిలర్ పర్వీన్ జహాన్ యాకూబ్ ,31 వ వార్డ్ కౌన్సిలర్ జహీద్,32 వ వార్డ్ కౌన్సిలర్ సుజిత విశ్వేశ్వర్, 35 వ వార్డ్ కౌన్సిలర్ పర్వీన్ బేగం అబ్దుల్లా ,మైనారిటీ నాయకులు హంజా తదితరులు పాల్గొన్నారు..

ముప్పనపల్లి దర్గా ఉరుసు రోడ్డు మరమ్మతులు

ముప్పనపల్లి దర్గా ఉరుసు ఉత్సవాలకు రోడ్డు మరమ్మతులు
ఏటూరునాగారం, నేటిధాత్రి

కన్నాయిగూడెం మండలం, మొప్పనపల్లి గ్రామంలో నిర్వహించనున్న పవిత్ర దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం ముప్పనపల్లి గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు చిదరి సుమన్ గారి సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఉరుసు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, వారి సౌకర్యార్థం ఈ రోడ్డు మరమ్మతులు ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయి.
గ్రామాభివృద్ధి, ప్రజా సౌకర్యాల పట్ల నిరంతర శ్రద్ధ చూపుతున్న ఉప సర్పంచ్ చిదరి సుమన్ గారి సేవలను గ్రామస్తులు, దర్గా కమిటీ సభ్యులు అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ ఉరుసు ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడాలని గ్రామ పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.

 ఏకదంతుడి రూపాలు ఎన్నెన్నో..

 ఏకదంతుడి రూపాలు ఎన్నెన్నో..

 

మరో నాలుగురోజుల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు జరగనున్నాయి. ఏకదంతుడిని ప్రతిష్ఠించేందుకు ఎన్నెన్నో రూపాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. రాష్ట్రంలో ఈ ఏడాది పీఓపీ గణపతులకు పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టారు.

బెంగళూరు: మరో నాలుగురోజుల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు జరగనున్నాయి. ఏకదంతుడిని ప్రతిష్ఠించేందుకు ఎన్నెన్నో రూపాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. రాష్ట్రంలో ఈ ఏడాది పీఓపీ గణపతులకు పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టారు. పీఓపీ గణపతులు ప్రతిష్ఠించేందుకు అనుమతులు ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల పరిధిలో గడిచిన రెండేళ్లుగా పూర్తిస్థాయిలో మట్టితో తయారు చేసిన గణపతులనే కొలిచారు.

రాష్ట్రంలో వినాయక చవితిని ప్రాంతానికో ప్రత్యేకంగా జరుపుతారు. చిత్రదుర్గలో జరిగే ఉత్సవాలు జాతీయస్థాయిలోనే పేరొందాయి. తుమకూరులో నెలరోజులపాటు వినాయకుడిని ప్రతిష్ఠ చేసి పూజలు చేసే సంప్రదాయం ఉంది. బెళగావి(Belagavi)లో జరిగే ఉత్సవాలు మహారాష్ట్ర(Maharashtra) సంప్రదాయాలతో కొనసాగుతాయి. బెంగళూరులో వినాయక ప్రతిష్ఠ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా దేశమంతటా చవితిరోజున వినాయకుడిని ప్రతిష్ఠించి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులకు నిమజ్జనం చేస్తారు.

 

కానీ బెంగళూరులో ప్రాంతాలవారీగా మూడు రోజులపాటు ప్రతిష్ఠించి పూజలు చేసే సంప్రదాయం నెలన్నరపాటు కొనసాగుతుంది. కాగా బసవనగుడిలో జరిగే బెంగళూరు గణేశ ఉత్సవ్‌లో నిర్వహించే సంగీత కార్యక్రమాలు జాతీయస్థాయిలోనే పేరొందాయి. దక్షిణాది, బాలీవుడ్‌ ప్రముఖ గాయకులు పాల్గొంటారు. వీరు 11రోజులపాటు ఉత్సవాలు జరుపుతారు. వినాయక విగ్రహాలను నగరంలోని ఆర్‌వీ రోడ్డుతోపాటు పలు చోట్ల విక్రయిస్తారు. ఆర్‌వీ రోడ్డులో గణేశ విగ్రహాల విక్రయాలు ఐదు దశాబ్దాలకుపైగా పేరొందాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version