కొడవటంచ దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం…

కొడవటంచ దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

నూతన పాలక వర్గం సభ్యులు ఐక్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు దేవాలయం నూతన చైర్మన్‌గా నాయినేని సంపత్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవాలయాలు భక్తి, ఆధ్యాత్మికతకు నిలయాలే కాకుండా సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. నూతన పాలక వర్గం సభ్యులు ఐక్యంగా పనిచేసి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అలాగే భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు,గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య..

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ కావ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో ఈ నెల 21వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము పున:ప్రతిష్ఠాపన నేపథ్యంలో గురువారం ఆలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణలో రెండవ యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 12.15 కోట్ల భారీ నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టిందన్నారు. ఇటీవల ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అభివృద్ధి పనులను, అతిథి గృహాన్ని ప్రారంభించారని తెలిపారు. యాదాద్రి తరహాలో కొడవటంచను తీర్చిదిద్ది, గ్రామీణ పర్యాటక రంగాన్ని, ఆర్థిక ప్రగతిని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యం అని ఎంపీ డా.కడియం కావ్య స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, మాజీ వరంగల్ డిసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ – వరద రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి..

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి

స్వామి వారి పున:ప్రతిష్ఠ జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా రానున్న సీఎం రేవంత్ రెడ్డి.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం
కొడవటంచ ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వివిధ శాఖల అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.బుధవారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా బాలాలయంలో ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యవార్లు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పలు కీలక సూచనలు చేశారు. మరో 50 రోజుల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. ఫిబ్రవరి నెలలో జరిగే స్వామి వారి పున:ప్రతిష్ఠ శ్రీ స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అట్టి పనులన్నీ నాణ్యతతో పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. దాదాపు వందేళ్ల కిందట నిర్మించిన ఆలయాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రములోని మొట్టమొదటి సారిగా భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచ ఆలయ పున:అభివృద్ధికి పనులను కొరకు రూ.12.15 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆలయంలో విమాన గోపుర అర్ధ మండపం, మహా మండపం, అద్దాల మండపం, ఆళ్వార్ నిలయం, పాకశాల, క్యూలైన్లు, అన్నదాన సత్రం, కాంపౌండ్ మరియు తాగు నీటి సౌకర్యం తదితర పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులు, సౌకర్యాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version