నల్లగండ్లలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
శివాజీ మహారాజ్ పరాక్రమం అందరికీ స్ఫూర్తిదాయకం: పల్లపు సురేందర్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి
నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లపు సురేందర్ ఆధ్వర్యంలో స్వరాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పల్లపు సురేందర్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షకుడిగా, అపార ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన శివాజీ మహారాజ్ దేశభక్తి మనందరికీ ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువత శివాజీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన సమాజం కోసమే శివాజీ నిరంతరం శ్రమించారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నల్లగండ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
