తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని తొలగించాలని

తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని తొలగించాలని

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండలం గుండ్రాతిపల్లి గ్రామపంచాయతీకి సంబంధించి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని వెంటనే తొలగించాలని, అలాగే రెండవ స్థానంలో నిలిచిన గోనే ముకుంద ని సర్పంచ్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, గోనే ముకుంద పార్టీ జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ,
గుండ్రాతిపల్లి గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల సమయంలో సమర్పించిన నామినేషన్ అఫిడవిట్, కుల ధ్రువీకరణ పత్రం తప్పుడు వివరాలతో కూడినవని, వాటిని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు తక్షణమే తనిఖీ చేసి, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు స్పందిస్తూ,
ఈ అంశంపై తప్పకుండా సమగ్ర విచారణ (ఎంక్వయిరీ) నిర్వహిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని, అలాగే అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రవి పటేల్ తెలిపారు.
అలాగే, ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించకపోతే,
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న స్వయంగా భూపాలపల్లికి వచ్చి జిల్లా కలెక్టర్ తో నేరుగా మాట్లాడతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పటికీ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ప్రజాపోరాటాలకు దిగుతామని, మీడియా ముఖంగా అధికారులను రవి పటేల్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే అనుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్…

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే అనుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్

 

బిహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఉంటాయని తనకు అనిపిస్తోందని జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తమ పార్టీకి క్షేత్రస్థాయిలో లభించిన మద్దతుకు, పోలింగ్ సరళికి పొంతన లేదని తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ బిహార్ ఎలక్షన్లలో కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే తాను నమ్ముతున్నట్టు చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం తన వద్ద లేవని అన్నారు జన్ సురాజ్ పార్టీ తొలిసారిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇది భారీ పరాజయమేనని ప్రశాంత్ కిశోర్ అంగీకరించారు. కానీ క్షేత్రస్థాయిలో తమ ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఓటింగ్ సరళికి, పాదయాత్ర సమయంలో తమ టీమ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌‌కు తేడా ఉందని అన్నారు. కాబట్టి ఏదో జరిగే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించారు.

‘ఏవో అదృశ్య శక్తులు ఈ ఎన్నికల్లో పని చేశాయి. ప్రజలకు పెద్దగా పరిచయం లేని పార్టీలకు కూడా లక్షల కొద్దీ ఓట్లు వచ్చాయి. ఈ విషయంలో నేను స్పందించాలని కొందరు కోరుతున్నారు. ఈవీఎమ్‌ల విషయంలో అవకతవకలు జరిగాయని అంటున్నారు. అయితే, ఓడినప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజం. కానీ నా వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పొంతన కుదరట్లేదు. ఏదో తేడా ఉందని మాత్రం ప్రాథమికంగా అనిపిస్తోంది. కానీ అదేంటో మాకు ప్రస్తుతానికి తెలియదు’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

‘ఎన్నికల ప్రకటన నాటి నుంచీ పోలింగ్ రోజు వరకూ మహిళలకు రూ.10 వేలు అందాయి. మొత్తం రూ.2 లక్షలు ఇస్తామన్న హామీలు వెళ్లాయి. ఆ పది వేలు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అట. ఎన్డీయేకు, నితీశ్ కుమార్‌కు ఓటేస్తే మిగిలిన మొత్తం వస్తుందట. ఇంత మంది మహిళలకు డబ్బు పంచడాన్ని నేను బిహార్‌తో సహా దేశంలో ఎక్కడా చూడలేదు’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము ఓడిపోయి ఆర్‌జేడీ గెలిస్తే జంగల్ రాజ్ వస్తుందని కూడా కొందరు భయపడ్డారని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఇది కూడా తమ ఓటమికి ఒక కారణమని అన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version