బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..

బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.

 

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో బంగారం ధర రూ.2 లక్షలకు, వెండి ధర రూ.4 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు (Gold prices).
ఈ రోజు (మార్చి 1న) ఉదయం 11:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,73,080కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.4,300కు పైగా పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,650 దగ్గర ఉంది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.4000 పెరిగింది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,73,230కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,58,800కి చేరుకుంది. మరోవైపు వెండి ధర మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటేసింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.25 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది.

పెరిగిన బంగారం ధరలు..

పెరిగిన బంగారం ధరలు..

దేశంలో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24క్యారెట్ల బంగారం మీద గ్రాముకు రూ.229 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువైంది.

 నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ (గురువారం) పెరిగాయి. దేశంలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాము రూ.15,649గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.229 అధికం. ఇక 22క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము రూ.14,345గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువ. ఇక, 18క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,737గా ఉంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.172 అధికం.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గ్రాముకు (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్ రూ.15,649, రూ.14,345

విజయవాడ రూ.15,649, రూ.14,345

చెన్నై రూ.15,818, రూ.14,500

ముంబై రూ.15,649, రూ.14,345

ఢిల్లీ రూ.15,664, రూ.14,360

కోల్‌కతా రూ.15,649, రూ.14,345

బెంగళూరు రూ.15,649, రూ.14,345

కేరళ రూ.15,649, రూ.14,345

పూణే రూ.15,649, రూ.14,345

గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

 వామ్మో.. వెండి.. ఒక్క రోజులోనే మరీ ఇంతలా..

 వామ్మో.. వెండి.. ఒక్క రోజులోనే మరీ ఇంతలా

బుధవారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. ట్రేడింగ్ మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త పుంతలు తొక్కాయి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరల ర్యాలీ మళ్లీ మొదలైంది. మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు బుధవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఆకాశాన్ని తాకాయి. పేదల బంగారంగా పేరుపడ్డ వెండి ధర వేగంగా పెరగడం చూసి జనాలు హడలిపోతున్నారు. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 11.00 గంటలకు భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,510కు చేరుకుంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.650 అధికం. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.600 మేర పెరిగి 1,23,300కు చేరుకుంది. వెండి ధర మాత్రం సామాన్యులను హడలెత్తించే స్థాయిలో పెరిగింది. ట్రేడింగ్ మొదలైన గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.8900 మేర పెరిగి రూ.2,08,000కు చేరుకుంది (Gold, Silver Rates on Dec 17).చెన్నైలో 24 క్యారెట్ పసిడి (10 గ్రాములు) ధర గరిష్ఠంగా రూ.1,35,280కు చేరుకుంది. హైదరాబాద్‌, విజయవాడల్లో కూడా ఇదే రేటు కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,24,000గా హైదరాబాద్‌, విజయవాడల్లో రూ.1,23,300గా ఉంది. కిలో వెండి ధర చెన్నైలో అత్యధికంగా రూ.2,22,000కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడల్లో కూడా ధర ఇదే రేంజ్‌లో కొనసాగుతోంది.బుధవారం ట్రేడింగ్‌లో ఇప్పటివరకూ బంగారం ధరలు అర శాతం మేర పెరగ్గా వెండి ఏకంగా 4 శాతం మేర పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో నిరుద్యోగిత పెరుగుతుండటంతో ఫెడ్ రేట్ కోత మళ్లీ ఉంటుందన్న అంచనాలు, ఇతర సానుకూల భౌగోళిక రాజకీయ అంశాలు ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version