సేవలందించిన కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు
నగదు బహుమతి అందించిన జిల్లా ఎస్పీ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని విధి నిర్వహణలో అప్రమత్తతతో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించి వారికి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
ఇటీవల వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ (CPR) నిర్వహించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గంగరాజును, అలాగే సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యసాహసాలతో రక్షించిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్‌లను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రాణాపాయం లెక్కచేయకుండా సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణరక్షణ చేసినందుకు వారికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేసి సత్కరించారు.ప్రజల ప్రాణరక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, ఇదే సేవాభావంతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అంతేకాకుండా జిల్లా పోలీస్ వారు కూడా అభినందించారు.
