గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టండి

గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టండి

పంచాయతీ భవనాలపై పట్టింపేది!

 

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవనం పై పట్టిం పు ఏది! కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యం కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది అధికా రంలో వచ్చి రెండేళ్లయిన నిర్మాణాలపై అలసత్వం ప్రదర్శిస్తుంది ప్రతి చిన్న గ్రామపంచాయతీ సొంత భవనం ఉండాలని లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి హామీ నుంచి నిధులు కేటాయించి అనేక భవనాలు నిర్మించింది ఇంకా కొన్ని చోట్ల నిర్మించాలి ఉండగా ప్రభుత్వం మారిన తర్వాత నిధుల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

ఏండ్లు గడుస్తున్న భవనని ర్మాణం కలగానే!

శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడో అనేది మండల ప్రజలు ఆలోచనలో పడ్డారు గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాపన చేసిన పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు అధికారుల మీద ప్రజలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మెరుగైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభు త్వం ముందుకు వచ్చి భవ నాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి గత ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

నూతన గ్రామపంచా యతీ భవనం నిర్మించండి

శాయంపేట మండల నివాసి కందగట్ల సంతోష్

శాయంపేట మండల కేంద్రంలో నివసిస్తున్న కందగట్ల సంతోష్ మాట్లా డుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గదులు లేక ఆరు బయట సమావేశాలు వస్తువులు భద్రపరచడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ,వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి నూతన భవన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందుతుందని అన్నారు కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు

ఇది బీటీ రోడ్డు.. మట్టి రోడ్డు..

ఇది బీటీ రోడ్డు.. మట్టి రోడ్డు?

నూతన బీటి రోడ్డు శిథిలం.. తాండవాసుల ఆందోళన

బాలానగర్ / నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలోని దేవుని గుట్ట తండాకు బుధవారం సాయంత్రం బీటీ రోడ్డు నిర్మించారు. 24 గంటలు ముగియక ముందే బీటీ రోడ్డు బీట్లు బీట్లుగా పైకి లేచింది. నాణ్యత లేని రోడ్డు నిర్మించారని తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుపెట్టి గ్రామీణ ప్రాంతాలలో ప్రాంతాలకు బీటీ రోడ్డు నిర్మిస్తే.. కాంట్రాక్టర్లు నాణ్యతలేని బీటీ రోడ్డు నిర్మించి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతతో కూడిన బీటీ రోడ్డు నిర్మించాలని తండావాసులు ఆనంద్ నాయక్, సంతోష్ నాయక్, రమేష్ నాయక్, శ్రీను నాయక్, కిరణ్ నాయక్ కోరారు.

టూ ది సబ్ రిజిస్టర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అంటున్న సబ్ రిజిస్టర్

టూ ది సబ్ రిజిస్టర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అంటున్న సబ్ రిజిస్టర్

మండల రెవెన్యూ సర్వేయర్ తో సర్వే చేసి ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న జిల్లా రిజిస్టర్

గంగాధర నేటిధాత్రి :

గ్రామ పంచాయతీలకు సంబదించిన రిజిస్ట్రేషన్ లు చేయడం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రజలు ఇంటి నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకు లోన్ తీసుకుందాం అంటే రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చినా ఆదేశాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మొఖ పరిశీలన చేసి ఇంటి విస్తీర్ణం, భూమి విస్తీర్ణం మరియు హద్దులు దృవీకరణ చేసి ఇస్తున్నారు. కానీ గంగాధర సబ్ రిజిస్టర్ ఈవిధంగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయను అని చెప్తున్నారు. సబ్ రిజిస్టర్ ను ఏవిదంగా ఉంటే చేస్తారని వివరణ కోరగా టూ ది సబ్ రిజిస్టర్ కు అని రాసి ఇంటి విస్తీర్ణం మరియు భూమి విస్తీర్ణం రాసి ఇస్తే చేస్తాను అని చెప్పడం జరిగింది. సబ్ రిజిస్టర్ తెలిపిన వివరాలపై జిల్లా రిజిస్టర్ ను వివరణ కోరగా మండల రెవెన్యూ సర్వేయర్ సర్వే చేసిన లెటర్ పై గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి ఇస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు అని వివరణ ఇవ్వడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version