ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న.

* ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్*

జహీరాబాద్. నేతి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళా దినోత్సవం సందర్బంగా స్థానిక అంగన్వాడీ కేంద్రం లో మహిళా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని. ఇసందర్బంగ మేధాపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళలని ఉద్దేశించి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని. ప్రతి ఆడబిడ్డ లో తన తల్లిగా చెల్లిగా అక్కగా చూడాలని. స్త్రీ లేనిదే జననం లేదు అని.ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం అని అయన కొనియాడుతూ స్పూర్తిని ఎత్తిపడుతూ హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు.

అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వెల్నెస్ కేంద్రం.

అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ వెల్నెస్ కేంద్రం

#చెట్ల తీగలతో ముసురుకున్న ఆసుపత్రి

#పాములకు పక్షులకు నివాసంగా మారిన ఆసుపత్రి

#ఆసుపత్రికి రావాలంటే జంకుతున్న జనం

#పట్టించుకోని అధికారులు

హన్మకొండ జిల్లా, నేటిధాత్రి(మెడికల్):

Hospital

హనుమకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన వెల్నెస్ కేంద్ర భవనం చుట్టుప్రక్కల పిచ్చి మొక్కలు పెరగడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం చెట్లతీగలతో ముసురుకుంది. అసలు ఇక్కడ వెల్నెస్ కేంద్రం ఉందా లేదా అనే భావన కలుగుతుంది. వెల్ నెస్ కేంద్రానికి రోజుకి కనీసం వందకు మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పత్రిక పాత్రికేయులు వస్తుంటారు అదేవిధంగా వెల్నెస్ కేంద్ర భవనం మొదటి అంతస్తుకి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు టీకాలు తీసుకోవడానికి వస్తుంటారు,వెల్నెస్ సెంటర్ భవనానికి చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగి తీగలు పారి మొదటి అంతస్తులోకి విస్తరించడంతో వాటి నుండి పాములు కీటకాలు వచ్చే అవకాశం ఉండడంతో రోగులు మరియు సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి రావాలి కానీ హాస్పిటల్ కి వస్తేనే సమస్య ఎదురయ్యేలా ఉంది ఇక్కడి పరిస్థితి ఇదిలా ఉంటే గర్భిణీలు ప్రసూతి కోసం చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల నుండి ఆసుపత్రి కి వస్తుంటారు, రోజుకు వందకు మందికి పైగా అవుట్ పేషెంట్స్ వస్తుంటారు వందకు మంది పైగా ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు, అందులో 30 నుండి 50 ప్రసవాలు జరుగుతాయి.ఆసుపత్రిలో డాక్టర్లు మరియు సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్య ఆసుపత్రి అంటేనే రోగులు జంకుతున్నారు మెరుగైన వైద్యం అందడం లేదనీ రోగుల బంధువులు అంటున్నారు,ఆసుపత్రిలో బెడ్స్ కూడా తక్కువగా ఉన్నాయని దీనికి తోడు ఆసుపత్రి గోడల చుట్టూ పిచ్చి చెట్లు ఉండడంతో రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు అంటున్నారు.

ఆశా వర్కర్ పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై ఎస్సీ.

ఆశా వర్కర్ పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా రాయికల్ లో దళిత మహిళ అయినా ఆశా వర్కర్ పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితునిపైఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఆశా వర్కర్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగాఒక కామాంధుడు దౌర్జన్యం చేసి,బెదిరించిఅత్యాచారానికి పాల్పడ్డాడని, ఘటన జరిగి వారం రోజులు కావస్తున్ననిందితుని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదని తక్షణమే నిందితునిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం కఠినంగా వ్వవ రించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఇవి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్వవహరించి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, మహిళల రక్షణ కోసంతగిన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో బాధితురాలికి సరైన వైద్యం అందించలేదని, పోలీస్ యంత్రాంగం నిందితుడికి అండగా ఉండి బాధితురాలికి అన్యాయం చేసి వైఖరి అవలంబిస్తున్నట్టు కనబడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొనినిర్లక్ష్యంగా వ్వవహ రించిన పోలీస్ అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుని కఠినంగా శిక్షించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బాధితురాలికిసరైన వైద్యం అందించాలని,ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని,ప్రభుత్వ ఉద్యోగం, మరి ఇతర ఆర్థిక సహాయసహకారాలుఅందించాలనివారు రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, అంతిరెడ్డి,సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిబల్లెం స్వామి,సిపిఎం నాయకులు ఎస్ కే. జహంగీర్, యాదయ్య, నరసింహ,వెంకన్న,లక్ష్మమ్మ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం.

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం

పరకాల నేటిధాత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామంలో శనివారం రోజున ఉపాధి హామీ పని వద్ద గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి మహిళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం మహిళలు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం.

చిన్న ఘనాపూర్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం ప్రారంభం….

– విద్యార్థులకు ఐడి కార్డులు అందజేసిన ఉపాధ్యాయులు….

కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :-

School

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనాపూర్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించిన మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణ రావు , అదేవిధంగా విద్యార్థి నీ విద్యార్థులకు ఐ. డి కార్డులను అందచేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో మరి పాఠశాలలు నాలుగు మాత్రమే ఉన్నాయని అందులో చిన్న ఘనపూర్ పాఠశాల ఎంపిక కావడం జరిగింది. ఈ పాఠశాలలో ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు ఎల్కేజీ యూకేజీ తరగతి గదులు విద్యాబోధన జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఎల్కేజీ యూకేజీ విద్యార్థుల విద్యార్థులని ప్రవేటు పాఠశాలలకు పంపించకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు పంపించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలల్లోనే రికార్డులను రిజిస్టర్ లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జిగా ప్రధానోపాధ్యాయులు సీతారాం , రమణ అదేవిధంగా సిఆర్ పి బృందం రాజశేఖర్ సాయి రాములు ప్రాథమిక పాఠశాల సిబ్బంది సరిత, ప్రియాంక, ప్రమీల, దివ్య, గ్రామంలోని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పట్లోరి సత్యనారాయణ తెలపడం జరిగింది.

School

విజయవంతంగా ముగిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు.

విజయవంతంగా ముగిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు.

జహీరాబాద్ నీటి ధాత్రి:

Bonalu

ఝరాసంగం మండల్ కొల్లూర్ గ్రామంలో.ఆలయ ధర్మకర్త శ్రీమతి భ్రమరాంబ రాములు గౌడ్ ఆధ్వర్యంలో రెండు రోజులు కనుల పండుగ సాగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవం.ఆలయ కమిటీ చైర్మన్ డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త మాట్లాడుతూ.ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ ఎస్సై నరేష్ మునిపల్లి మాజీ జెడ్పిటిసి ఫైతరి సాయికుమార్ రైతుబంధు మండల అధ్యక్షులు పరశురామ్ గౌడ్ ఝరాసంగం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం సింగర్ సంధ్య పాటిల్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి బస్వారాజ్ పాటిల్ సతీష్ గౌడ్ రమేష్ గౌడ్ డప్పురు సంగమేష్ నందు పటేల్ శ్రీకాంత్ పటేల్ వేణుగోపాల్ రెడ్డి దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

చేనేత చౌక్ లో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్..

రాజన్న సిరిసిల్ల టౌన్,నేటిదాత్రి:

గత వారం రోజుల నుండి సిరిసిల్లా జిల్లా చేనేత చౌక్ లో ప్రధాన రహదారిపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు.దీంతో
రహదారిలో వెళ్లే వాహనదారులకు గాని, బాటసారులకు గాని ఇబ్బందులు తలెత్తడం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చేనేత చౌక్ లో ఓల్డ్ బస్టాండ్ సమీప నా ఎక్కువ రద్దీగా జనసంచారం ఉన్న ప్రదేశంలో సిగ్నల్ పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇదొక విడ్డూరమని చెప్పవచ్చు అని భావిస్తున్నారు. వాహనదారులకు గాని,బాటసారిలకు గాని ప్రమాదం తలెత్తకుండా వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ట్రెండి వాల్కాస్ షోరూం ప్రారంభించిన మాజీ చైర్మన్.

ట్రెండి వాల్కాస్ షోరూం ప్రారంభించిన మాజీ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిర్ చౌరస్తాలో నూతనంగా ట్రెండి వాల్కాస్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా షోరూం యజమాని మహేష్ ఆహ్వానం మేరకు ట్రెండీ వాల్కాస్ షోరూమ్ ను సందర్శించిన టిజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి తో అందరూ అభివృద్ధి చెందాలని అన్నారు వారితోపాటు ఈ కార్యక్రమంలో వారితోపాటు బిజీ సందీప్ వెంకట్ జగదీశ్వర్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మాకొద్దు.

ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మాకొద్దు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

నెల రోజుల నుంచి కూలీ పనులు కల్పించడం లేదు పని చేసిన తర్వాత కొలతలు మేమే తీసుకోవాలి ప్రశ్నిస్తే మీ ఇష్టమున్న చోట చెప్పుకొండి అంటూ దబాయింపు ఎంపిడిఓ ముందు మొర పెట్టుకున్న కూలీలు
ఉపాధి హామీ పథకంలో తమకు సరిగా కూలీ పని కల్పించడం లేదని, పనిచేసిన తరువాత కొలతలు కూడా తమే చేసుకోవాల్సి ఉందని మం డల పరిధిలోని తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది ఉపాధి కూలీలు శుక్రవారం ఎంపిడిఓ సుధాకర్ కు మొర పెట్టుకు న్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుకు వ్యతిరేకంగా కూలీలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తమ కు నెలరోజుల నుంచి సరిగా కూలీకల్పించడం లేదన్నారు. కప్పాడ్ గ్రామా నికి చెందిన వ్యక్తిని తమ గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించా దంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడన్నారు. పని విషయంలో ఏదైనా అడుగుతే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇష్టం ఉంటే చే యండే లేదంటే పని మానుకుండి తమకు దబాయిస్తున్నాడని వారు. వాపోయారు. ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ కు ఎంపిడినో ఫోన్ చేసి ఆయన పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు పని కల్పించ కపోతే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరిం చారు. విధులకు సక్రమంగా హాజరు కానిఉపాధి హామీ ఈసి ప్రతాప్ రెడ్డిపై కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

హజ్ హౌస్ పెండింగ్ పనులను ప్రారంభించాలని డిమాండ్.

జహీరాబాద్‌లో ముస్లిం వివాహ మందిరం మరియు హజ్ హౌస్ పెండింగ్ పనులను ప్రారంభించాలని డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 1 కోటి వ్యయంతో ఆమోదించబడిన మినీ హజ్ హజ్ మరియు ముస్లిం వివాహ మందిరం యొక్క పెండింగ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, మాజీ హజ్ కమిటీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, 2022 లో, జహీరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హజ్ హజ్ మరియు ఖూర్ (ఖోర్) శంకుస్థాపనను మాజీ బ్రిక్స్ ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు వేశారని, కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ, వాటి నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హజ్ గృహాల నిర్మాణ పనులను ప్రారంభించగా, ఇప్పటివరకు అది మెత్ కే పరిమితమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ్ నరసింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించాలని, జహీరాబాద్‌లోని ముస్లిం వివాహ మండపం, హజ్ గృహం పెండింగ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని హజ్ కమిటీ మాజీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ డిమాండ్ చేశారు.

బండి బలం.. కమలం విజయం!

బండితోనే కమల వికాసం.

బండితోనే కమలనాధుల్లో ఊపు

బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.

తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్‌ పెంచించే బండి.

బండి మాటలతోనే యువత బిజేపి వైపు చూపు.

జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందు అందరికీ అనుమానాలే.

అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ కనిపించిన నిరాశావాదం..

నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో నెలకొన్న అనుమానం.

పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వం.

అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ చేరిన గెలుపు తీరం.

బిజేపిని గెలిపించి చూపిస్తా అన్నాడు.

కాంగ్రెస్‌ ను ఓడిరచి చూపించాడు.

టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.

ఎమ్మెల్సీలను గెలిపించి చూపించిన ఘనత బండిదే.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి సంకేతం.

టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి సంకేతం.

మంత్రిగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం.

బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం.

బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ నేతల ఆకాంక్ష.

బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా.

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి చారిత్రక విజయం సాధించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని గెలిపించడంతో బిజేపి గొప్ప విజయాన్ని అందుకుంది. తెలంగాణ రాష్ట్రములోని బిజేపి నాయకులంతా అదే స్పూర్తిని అనురించాలి. తమ తమ రాజకీయ చతురతను, రాజకీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే తెలంగాణలో బిజేపి తిరుగులేని శక్తిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. వచ్చే ఎన్నికలలో నాటికి బిజేపి ఎదురులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓసారి లోతుగా విశ్లేషిస్తే మంత్రి బండి సంజయ్‌ చూపిన చొరవ అంతా ఇంతా కాదు. గత ఆరు నెలల కాలంగా ఒక్కో ఇటుకను పేర్చినట్లు తన ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేశాడని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ఒక తార్కాణం. ఎన్నికలలో బండి వ్యక్తి గత రాజకీయానికి బిజేపి బలం తోడై కమలం విజయం ఉత్తుంగ తరంగంలా విజయకేతనం ఎగరవేసింది. తెలంగాణ బిజేపి నాయకులు, శ్రేణులు బండి సంజయ్‌ను కొనియాడుతున్నారు. అసలు టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే కాదు, సరికొత్త చరిత్ర సృష్టించడం కూడా బిజేపికే చెల్లింది. నిజానికి టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు. కానీ యూనియన్లు పాలు పంచుకునే రాజకీయానికి కొత్త తరహా రాజకీయం కూడా చూపించింది బండి సంజయ్‌ అని చెప్పకతప్పదు. గతంలో ఇలా ఏ పార్టీ ధైర్యం చేయలేదు. టీచర్స్‌ ఎమ్మెల్సీలలో పార్టీల అభ్యర్థులను రంగంలోకి దింపే సాహసం చేయలేదు. బండి సంజయ్‌ అంటేనే ఒక సాహసం. ఒక ధైర్యం. నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. నలుగురికి దారి చూపించే సరికొత్త మార్గం వేసేవారికే సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. అది తెలంగాణ రాజకీయాలలో తన మార్క్‌ రాజకీయాన్ని చూపించి, విజయాన్ని సొంతం చేసిన ఏకైక నాయకుడు బండి సంజయ్‌. బండి సంజయ్‌ తోనే తెలంగాణలో బండితోనే కమల వికాసమని మరో సారి రుజువైంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా బండితోనే బిజేపికి ఊపు…బిజేపికి గెలుపు అని చెప్పకతప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బిజేపి రాజకీయాలలో బండి సంజయ్‌ కు ముందు, తర్వాత అని చెప్పడం కరక్ట్‌. గతంలో తెలంగాణలో బిజేపి ప్రభావం లేదని కాదు. ఆ పరంపరను కొనసాగించడమే కాదు, ఊపును తెచ్చి విజయ తీరాలను బిజేపి ఒంటరిగా అందుకునేలా బండి నాయకత్వం పని చేసింది. తెలంగాణలో సహజంగా హైదరాబాద్‌ లో బిజేపి ఎంతో కొంత కీలక భూమికనే పోషించేది. ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడూ జిహెచ్‌ఎంసిలో సీట్లు పది దాటింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో కనీస ప్రభావం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్‌ రంగంలోకి దిగారో అప్పుడే సీన్‌ మారిపోయింది. బిఆర్‌ఎస్‌ కు సీన్‌ సితారైంది. బిజేపి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఒక్క అంశం చాలు. బండి రాజకీయం ఎలా వుంటుందో చెప్పడానికి…గత ఎన్నికల ముందు బండి దూకుడుకు ఎందుకు కళ్లెం వేశారో ఎవరికి అర్థం కాలేదు. ఎన్నికల దాక బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వుండే ఆ రాజకీయాలే మరోలా వుండేవి. కాంగ్రెస్‌ పార్టీ అధికారపు అంచులను తాకేది కాదు. బిఆర్‌ఎస్‌ కు 39 సీట్లు వచ్చేవే కాదు. కానీ అనుకోని రాజకీయ ఎత్తుగడలు బండిని లాగేయాలని చూసినా, పార్టీ కోసం నిరంతరం పరిశ్రమించే నాయకుడు సంజయ్‌. ఇప్పటికీ మించి పోలేదు. బిజేపి నాయకుల చూపంతా బండి నాయకత్వం వైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మరో సారి బండి చాతుర్యం సాక్ష్యంగా నిలిచింది. బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు కార్యకర్తలు మరింత బలంగా నమ్మడానికి కారణమైంది. తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్‌ పెంచించే బండి సంజయ్‌ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ యువతను బిజేపి వైపు మళ్లించడంలో బండిపోషించిన పాత్ర అందరికన్నా పెద్దది. ఒకప్పుడు బిజేపి చిన్న చిన్న పట్టణాలకే పరిమితం. ఇప్పుడు తెలంగాణ లో ప్రతి పల్లెల్లో బిజేపి జెండా ఎగురుతోంది. ప్రతి గ్రామంలో బిజేపి పార్టీ ఏర్పడిరది. ప్రతి ఊరులోనూ బిజేపి బలంగా మారుతోంది. జాతీయ నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిషాల జపం యువత చేస్తున్నారంటే ముమ్మాటికి అది బండి సంజయ్‌ కృషి అని చెప్పాలి. బండి మాటలతోనే యువత బిజేపి వైపు చస్తున్నారు. జాతీయ రాజకీయాల వైపు యువత ఆలోచనలు చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎర్ర జెండాలు కనిపించేవి. ఆ జెండాలు పోయి, అంతటా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. అందుకు ప్రధాన కారణం బండి సంజయ్‌. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే బిజేపి అభ్యర్థుల ఎంపికపై ముందు అందరికీ అనుమానాలే వుండేవి. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో బిజేపి శ్రేణులలో నిరాశావాదం ఆవహించింది. అంతెందుకు నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో అనుమానం అలాగే వుంది. కానీ బండి సంజయ్‌ ప్రచార రంగంలోకి దిగిన తర్వాత ఆ మాటలు మాయమై పోయాయి. పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వంతో కాంగ్రెస్‌ పార్టీ ఖంగుతిన్నది. బిజేపి ప్రచారంలో దూసుకుపోతుంటే అప్పుడే కాంగ్రెస్‌ చేతులెత్తేసింది. అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ గెలుపు తీరం చేర్చింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలో మిగతా బిజేపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర అంతా ఒక ఎత్తు. బండి సంజయ్‌ సాగించిన ప్రచారం మరో ఎత్తు. ఎందుకంటే బిజేపిని గెలిపించి చూపిస్తా అని బండి సంజయ్‌ శపధం చేశాడు. బిజేపి అభ్యర్థులను గెలిపించి, కాంగ్రెస్‌ ను ఓడిరచి చూపించాడు. టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి బండి నాయకత్వమే సంకేతం. టీచర్స్‌ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం. జనం సమస్యల పరిష్కారమే బండి సంకల్పం. కేంద్ర మంత్రిగా వున్న వాళ్లు గతంలో కంటికి కనిపించే వారు కాదు. అధికారిక కార్యక్రమాలు తప్ప జనంలో నడిచింది లేదు. కారు దిగి ప్రజల వద్దకు వచ్చే వాళ్లు కాదు. కానీ బండి అలా కాదు. సికింద్రాబాద్‌ లో గుడి విషయంలో అలజడి నెలకొంటే జనం మధ్యలో వున్నారు. అశోక్‌ నగర్‌లో గ్రూపు అభ్యర్థులు నిరసనలు తెలియజేస్తుంటే వారికి సంఫీు భావం తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా కాకుండా, ఒక బిజేపి సామాన్య కార్యకర్తగా నిరుద్యోగుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి విజయం సాధించడం ఆ పార్టీకి ఎంతో ఊపునే కాదు, మరింత ఊపిరి పోసినట్లైంది. దాంతో బండి సంజయ్‌ పై బిజేపి నాయకులలో మరింత నమ్మకం పెరిగినట్లైంది. అందువల్ల బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో కోరుతున్నారు. బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా బలంగా విశ్వసిస్తున్నారు. కేంద్ర బిజేపి నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది. ఈ సారి అధ్యక్ష ఎంపిక బండి సంజయ్‌కే అప్పగించాలని అనుకుంటోంది. మంత్రి పదవి బండి సంజయ్‌ కు అడ్డంకి కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో వుండి కూడా బండి మంత్రిగా కొనసాగడం ఇబ్బంది ఏ మాత్రం కాదు. మంత్రిగా కొనసాగిస్తూనే బండికి అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను.

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలి

-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి

-రైతుల నష్టపరిహారంకై బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు

-ఈటల చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

National

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి నేతృత్వంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులతో కలిసి ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా ఎంతోమంది రైతులు భూములను కోల్పోయి నిరాశ్రయులవుతున్నారని, వారికి మార్కెట్ ధర కల్పించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒక ఎకరాకు మూడు కోట్ల రూపాయలను విలువచేసే భూములు కోల్పోతున్నప్పటికీ..వారికి తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఇట్టి విషయంలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ గ్రీన్ ఫీల్డ్ హైవే సందర్భంగా భూములను కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారని, ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భాజపా శ్రేణులు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి రైతులు అడ్డూరు రాజేందర్ సత్యనారాయణ రెడ్డి రామచంద్ర రావు బండారు రవీందర్ బండారు శ్రీనివాస్ బండారు తిరుపతి కొల్లూరు స్వప్న గుర్ర సునంద రెడ్డి మోరే పద్మ శనిగరపు శ్రీనివాస్ మొగులపల్లి టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాల రైతులు పాల్గొన్నారు

వరంగల్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీ

“వరంగల్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీ” గా ఎస్. అంకిత్ కుమార్

వరంగల్, నేటిధాత్రి :

వరంగల్ పోలీస్ కమిషనరేట్ “ఈస్ట్ జోన్ డీసీపీ” గా అంకిత్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంకిత్ కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ట్రైనీ ఐ. పి. ఎస్ గా పని చేశారు. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్న రవీందర్ ను సీఐడీ విభాగం ఎస్పీ గా బదిలీ అయ్యారు

పురుషులతో సమానంగా మహిళలు

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి : 

మండల ప్రజా పరిషత్ పరకాల కార్యాలయములో అంతార్జీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల పరిధిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ఎదుగుతున్నారని అయినప్పటికీ కుటుంబంలో ఎవరి పాత్ర వారు పోషించినప్పుడే సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ యన్. శ్రీలత,సూపరిండెంట్ సిహెచ్ శైలశ్రీ,ఈ టెక్నికల్ అసిస్టెంట్ సుమలత,పంచాయతీ కార్యదర్శులు బి.సుమలత , మహ్మద్ రిజ్వానా,కంప్యూటర్ ఆపరేటర్ అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం కోమల,ఈసీ రజనీకాంత్ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే
ఎస్సై శ్రీనివాస్ రెడ్డి

నిజాంపేట , నేటి ధాత్రి

కేసులలో కోటు చుట్టూ తిరిగే వారికి ఈనెల 8 తారీకున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టేనని రాజీ మార్గమే రాజా మార్గమన్నారు.

సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం బస్టాండ్ సమీపం లోని రాజీవ్ రహదారి పై శుక్రవారం సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఏ హెచ్ కె ఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టమును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వారు మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలు తగ్గుతాయని అన్నారు.ఇందారం ఓసిపి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి పవర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు హెచ్ కె ఆర్ సంస్థ చొరవ చూపాలని ఎమ్మెల్యే వివేక్ వారిని కోరారు.

సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం..

సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం..

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలోని మల్గి గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు జరిగిన సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.మల్గి శివారులోని మల్లన్న స్వామి ఆలయానికై సీసీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగింది.ఇట్టి రోడ్డును డాక్టర్ రాజశేఖర్ శివ చారి స్వామీజీ పూజలు చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ మల్గి గ్రామ సర్పంచ్,మల్లన్న స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతి,మాజీ ఎంపీటీసీ శివానంద నాయకులు సిద్ధారెడ్డి, కుశాల్ పాటిల్ ,అర్జున్,వైద్యనాథ్,బీరప్ప, తుకారం,మారుతి,హనుమంత్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ నూతన సీపీ గా సన్ ప్రీత్ సింగ్ నియామకం.

వరంగల్ నూతన సీపీ గా సన్ ప్రీత్ సింగ్ నియామకం

– రామగుండానికి అంబర్ కిషోర్ ఝా బదిలీ,

– రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌ ల ట్రాన్స్ ఫర్
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ,

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ను రామగుండం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సూర్యపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్ ను వరంగల్ కమిషనరేట్ కు బదిలీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసును సీఐడీకి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదేవిధంగా పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతనను తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా ఆమె స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పి.కరుణాకర్‌ను బదిలీ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్‌, రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కంరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగాఅఖిల్ మహాజన్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డీసీపీగా ఆక్షాన్స్ యాదవ్, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, సిరిసిల్లా ఎస్పీగా గీతే మహేష్‌ బాబా సాహెబ్‌, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్‌, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సెంట్రల్‌ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సూర్యపేట్ ఎస్పీగా నరసింహా, సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, సీఐడీ ఎస్పీగా రవీందర్ బదిలీ అయ్యారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం.

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం

అర్హులైన పోడు రైతులకు హాక్కుపత్రాలు ఇవ్వాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పాలకుల ఎన్నికల హామీల అమలుకై, పోడు రైతులకు అటవీ హాక్కుపత్రాలకై ప్రజా ఉద్యమాలే ఏకైక శరణ్యమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఎంసీపీఐ(యు) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కార్యదర్శి కలకోట్ల యాదగిరి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్న పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోగా పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తుల ఆస్తులు వందలరేట్లు అధికంగా పెరిగాయని దేశ సంపద వనరులు దోచుకునే విధంగా పాలకులంతా అదే పనిలో ఉన్నారని ఆరోపించారు.ఆకలి, దారిద్రం,నిరుద్యోగం,ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని దీనికి తోడు ప్రజల మత బలహీనతలను ఆసరా చేసుకొని విభజించు పాలించు అనే విధంగా దేశ సమైక్యత సమగ్రతను విచ్చిన్నం చేసే విధంగా మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని
అవేదన వ్యక్తం చేస్తూ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను భ్రమలకు ఆశలకు గురిచేసి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి తమ ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు.పోరాడే వ్యక్తులు శక్తులను అప్రజస్వామికంగా అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హింసను ప్రేరేపించుటకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దశాబ్దాల క్రితం పోడు వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని,ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా ప్రజలను చైతన్యపరిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యం ఎర్రజెండాపై ఉందని అందుకోసం కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు గనపాక నర్సయ్య, రాఘవరావు గోపాల్,లక్ష్మి, యాకయ్య, గంగాధర నర్సయ్యగ్ జి ఎల్లమ్మ, రాజేందర్, రామ తదితరులు పాల్గొన్నారు.

అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్న బి ఆర్ ఎస్

అధికారం కోల్పోయి ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో నేను జై తెలంగాణ అంటూ తిరుగుతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక సంస్కారహీనులుగా మాట్లాడు సభ్య సమాజం తలదించుకునే విధంగా విచక్షణ కోల్పోయి కేటీఆర్ ముప్పు కోసం కేకే పై కారుకూతలు కూస్తావా నీ జిల్లెల్ల గ్రామంలో పది సంవత్సరాలు సర్పంచ్ గా చేసి ఏం చేసినావు నిరూపించాలి బాత్రూంలో పైసలు దోచింది నిజం కాదా గ్రామంలో అరాచకం ఎవరికి తెలవద కేటీఆర్ పర్యటనలు అప్పుడు క్రషర్ వల్ల రైతులు నష్టపోతున్నారని అని నిరసన తెలుపలేదా ఎల్లారెడ్డి పేట మండలంలో చిన్నారిపై అగైత్యానికిపాల్పడిన మీ నాయకుడు కాదా పై నాయకుడిపైఏ చర్యలు తీసుకున్నారు కనీసం చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగ్యస్వామిగా పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి రావాల్సిన టికెటు మీ నాయకుడు గద్దలగా తందికపోయింది నిజం కాదా కేకే మహేందర్ రెడ్డి కి జరిగిన అన్యాయం విషయంలో కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు సిగ్గుపడతారు తెలుసుకో సిరిసిల్ల పట్టణంలోని దళిత గిరిజన మైనార్టీ హాస్టల్లో జరిగిన అగైత్యానికి ఎవరు పాల్పడ్డారు తెలుసుకోవాలని మేము గెలవకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్లకి అండగా ఉన్నామని మీరు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఏం చేసిండు ఆయన కంట్రిబ్యూషన్ ఎంత మొట్టమొదటిగా జెండా పార్టీ పార్టీ ఉద్యమంలో సబ్బండ వర్గాలను మమేకం చేసి ఉద్యమాన్ని లేపిన వ్యక్తి కేకే అని ఉద్యమం ఉనికి కాపాడాలని ప్రజలు కేటీఆర్ ను గెలిపిస్తే మీరు ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా మారి వారికి ఎన్నో కాంట్రాక్టులు ఇప్పించింది మీరు కాదా మీరు దొంగలాగా రాజకీయాలు చేసేది మీరా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేది మీ ప్రభుత్వ పాలనలో 3500 కోట్లు ఇసుకను తరలించాలని ధర్నాలు చేస్తే స్పందించలేరు ఇందులో కేటీఆర్ వాటా ఎంత నేరెళ్లఘటనలో ఒక వ్యక్తి చనిపోయితే దళితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఎందుకు స్పందించలేదు అప్పుడు ప్రశ్నించని మీరు ఇప్పుడు ప్రశ్నిస్తారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలు చెప్పడానికి కేటీఆర్ ను కలిసిన పట్టించుకోలేదని జిల్లా ఉద్యమ సమయంలో కేటీఆర్ ను కలిసిన జిల్లా ఏర్పాటు విషయం వివరించినామని తంగళ్ళపల్లి మండలంలో కొన్ని గ్రామాలను మున్సిపల్ చేస్తారంటే కలపడానికి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేసింది మేమే కాదా ప్రజలను హాస్పిటల్లో చేర్పించి నట్టు నటించి డాక్టర్ దగ్గర కమిషన్ తీసుకున్నది నువ్వు కాదా అగ్రికల్చర్ కాలేజీలో భూములకు పోయి 12 కుటుంబాలకు న్యాయం జరగలేదని కానీ నీ భార్య పేరు మీద సర్వే నెంబర్ 1.2.గుంటల భూమి పట్టా పొందిన ముచ్చట వస్తాము కాదా మీ పార్టీ నాయకురాలు సరస్వతి ఒకటి నాలుగు సార్లు ప్రభుత్వ లోన్ తీసుకున్నది నిజం కాదా ఆమె 2.20. గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించు కున్నదివాస్తవం కాదా గత అధికార మందాన్ని ఇప్పుడు చూపిస్తే ఊరుకోం. మీ నాయకుడు మీకు ఇదే నేర్పిస్తున్నాడా అక్రమ మైనింగ్ ద్వారా క్రషర్ నడిపించి పక్క పొలాల రైతులను ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా ప్రగతి భవన్ ఊరి అవతల కట్టిన దావతులకు అండగా మార్చిన నీవు కాదా మీ అగ్రికల్చర్.కాలేజీ నిర్మాణంలో భూమి కోల్పోయిన మీ ఊరి వ్యక్తి నీ వల్ల గుండె ఆగి చనిపోయారు నా భూమి నాకు ఇప్పించమంటే కుల బహిష్కరణ కేసు పెట్టింది వాస్తవం కాదా అప్పుడు నీళ్ళు ఇచ్చారనిఅడ్డగోలుగా మాట్లాడుతున్న మీరు ఇప్పుడు నీళ్లు ఎందుకు రావడం లేదో చెప్పాలి. కాల్వ నిర్మాణం కోసం రైతు చంద్రారెడ్డి నష్టపరిహారం ఇస్తానని ఇవ్వలేదు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇప్పుడు మాత్రం ఇస్తానని అనడం సిగ్గుచేటు ఏది నిజమో ఏది అబద్ధము తెలుసుకొని మాట్లాడాలి ఓడిపోయి ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి విమర్శించడం సరికాదు అని అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దారి నిర్మించినావా అలాగే మమ్మల్ని కాపాడు మహాప్రభు అంటూ కేకే మహేందర్ రెడ్డి చుట్టూ మీ నాయకులు తిరుగుతున్నారు మీ నాయకులు వెంటనే కేకే మహేందర్ రెడ్డి కి బే షరతుగాక్షమాపణ చెప్పాలని సందర్భంగా ఇకనైనా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో నేరెళ్ల నరసింహం గౌడ్ మునిగల రాజు పెట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి రాము పొన్నాల పరిసరం ఆరేపల్లి బాలు చుక్క శేఖర్ జలంధర్ రెడ్డి బాలసాని శ్రీనివాస్ గౌడ్ సామల గణేష్ కాబట్టి మల్లేశం యాదవ్ బండి పరశురాం అని సుద్దాల శ్రీనివాస్ గుగ్గిళ్ళ అభినయ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version