* ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్*
జహీరాబాద్. నేతి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళా దినోత్సవం సందర్బంగా స్థానిక అంగన్వాడీ కేంద్రం లో మహిళా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని. ఇసందర్బంగ మేధాపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మహిళలని ఉద్దేశించి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాలని. ప్రతి ఆడబిడ్డ లో తన తల్లిగా చెల్లిగా అక్కగా చూడాలని. స్త్రీ లేనిదే జననం లేదు అని.ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం అని అయన కొనియాడుతూ స్పూర్తిని ఎత్తిపడుతూ హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు.