ముత్తారం మండలం పారుపెల్లి గ్రామం సలాకుల సారయ్య పుత్రుడు అందీప్ – సమత వివాహ రిసెప్షన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు నాంసాని సమ్మయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది…
కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి.. కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.!
ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు..
పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం…
రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్)
Ramayampet
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామయంపేట నుండి నిజాంపేట మండలం విడిపోయింది. అంతేకాకుండా కొన్ని కార్యాలయాలు తరలిపోవడం జరిగాయి. రామయంపేట ప్రధానంగా పట్టణ అభివృద్ధి రోజురోజుకు దీనస్థితిలోకి జారిపోతుంది. నిజమాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి లకు వెళ్లడానికి ఇది కేంద్ర బిందువు. నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణికులు రాకపోకలు జరిగే పట్టణం. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రధానంగా రోడ్లు, నిర్మాణం లేకపోవడం వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం అభివృద్ధి లేకపోవడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్రస్థాయి వరకు ప్రధాన పార్టీల్లో ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉండి ఆయా పార్టీలకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పదేపదే ఒకరి పార్టీని ఒకరు ఒకరి నాయకులను మరొకరు దూషించుకోవడం తప్ప అభివృద్ధి విషయంలో కలసికట్టుగా ఉంటే ఇప్పటివరకు రామాయంపేట ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల సైతం ఎంతో అభివృద్ధి చెందాయని అక్కడ అన్ని రకాల వ్యాపారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామయంపేటకు సమీపంలో ఉన్న మండలాలు ఎంతో సుందరంగా వేగంగా అభివృద్ధి జరిగినా రామయంపేట మాత్రం అదే స్థితిలో ఉంది. పట్టణంతోపాటు మండలంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. ఎవరి స్వార్థం వారిది, సొంత లాభం కోసం కొంతమంది. రోడ్ సైడ్ నాయకులంతా కోటీశ్వరులుగా మారి అధికార పార్టీ ఏది వచ్చిన ఉన్న పార్టీని వదిలేసి తమ సొంత పనులకోసం, సొంత అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. కొందరు కార్యకర్తలు వారినీ అనుసరించే పార్టీలు మారడంతో ప్రజల అవసరాలు కనీస కష్టాలు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు పట్టణ మధ్యలో ప్రతి గల్లి గల్లి రోడ్డు పక్కల గుంతలతో వర్షాకాలం వస్తే ఇంట్లోకి నీరు రావడం, మున్సిపాలిటీ ప్లానింగ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఏ మాత్రం కూడా రామాయంపేటకు మార్పు లేకపోవడం అయినప్పటికీ రామయంపేట వెనుకబడి ఉండడానికి కారణమేంటని అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, మరియు పార్టీ భేదాలు విడిచిపెట్టి రామాయంపేటకు ఉపయోగపడే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా ఇప్పటికైనా రామాయంపేట ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అధినాయకులు స్థానికంగా లేకపోవడం వారు తమ తమ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిలు, ప్రణాళికలు చేస్తున్న రామాయంపేటకు ఏమాత్రం లాభం లేకుండా నష్టం జరుగుతున్న, వెంట ఉన్న నాయకులు కార్యకర్తలు గాని అధినాయకులను అడ్డగించకపోవడం పట్టణ ప్రాంతం గ్రామం పట్ల ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించకపోవడం వల్ల కూడా రామాయంపేట పూర్తిగా రాజకీయ ప్రలోభాల నాయకుల వంచన మరియు పార్టీలు మారుతూ తమ స్వార్థం చూసుకోవడం వల్ల పూర్తిగా వెనుకబడిపోయిందని చెప్పవచ్చు నియోజకవర్గం మార్పుతో పాటు నియోజకవర్గ మారుతుందన్న అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏమాత్రం కదలకపోయినా ఆమె వెంటనే అనడం వల్లనే నియోజకవర్గం మారిపోవడం ఇక్కడున్న కార్యాలయాలు అధికారులు వెళ్లిపోవడం జరిగాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఎలుకకుర్తి రోడ్డు బైపాస్ వల్ల ఇప్పటికే నియోజకవర్గం నుంచి మండలానికి మండలం నుంచి మున్సిపాలిటీకి కుంచకపోయినా రామాయంపేట మరొక చిన్న పల్లెగా గ్రామంగా మారిపోనున్నది. బైపాస్ రోడ్ల వల్ల ఇక్కడ జనాలు రాకపోవడం రాకపోక లేకపోవడం సముద్ర గర్భంలో దీపంగా మారిపోతున్న రామాయంపేటకు వెలుగునిచ్చేది ఎప్పుడని ప్రజలు అడుగుతున్నారు. రాజకీయంగా ప్రజాసంఘాలు యువజన సంఘాలు వాణిజ్య సంఘాలు ఒక అభివృద్ధి వేదికగా మారి దీనిపై ఏదన్న ఒక కమిటీ వేసి అభివృద్ధికి ఆలోచిస్తే తప్ప రామాయంపేట అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. మన భవిష్యత్ తరాలకు ఇప్పటి రామయంపేట ఇస్తే వారి మనసులో మనం చేసిన పొరపాటులను ఇచ్చినట్లే అవుతుంది. భవిష్యత్ తరాలకు అన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అప్పుడే అభివృద్ధి జరుగుతుందని భావన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు, పార్టీల నాయకులు, అన్ని వర్గాలు, కుల సంఘాల్లో ఏకతాటి పై ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గిరిజన ప్రజా ప్రతినిధుల పైన మండిపడ్డ ఆదివాసీ సంఘాలు..
మొక్కజొన్న ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్..
నూగూరు వెంకటాపురం (నేటి దాత్రి )
మార్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం
College’s
న్యాయ కళాశాల ఆదిమ తెగల న్యాయమైన డిమాండ్ అని ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం ఏజెన్సీ న్యాయ కళాశాల సాధన సదస్సు వెంకటాపురం మండలం లోని కాఫెడ్ గ్రౌండ్ లో జరిగింది. జి ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి గిరిజన ప్రజా ప్రతినిధుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలను విస్మరిస్తున్నాయని ముఖ్య అతిధులుగా పాల్గొన్న పాయం సత్యనారాయణ,కొర్స నర్సింహా మూర్తి, ఉయిక శంకర్, మైపతి అరుణ్ కుమార్ మండిపడ్డారు. జి ఎస్పీ ముందుకు తెచ్చిన న్యాయమైన డిమాండ్ న్యాయ కళాశాల అన్నారు. ఆదివాసీలను న్యాయ వ్యవస్థలు విస్మరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యంత అన్యాయానికి గురయ్యేది ఆదిమ తేగలని తెలిపారు. న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఆదివాసీలు న్యాయ విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని నాయకులు అన్నారు.ఏజెన్సీ నుండి రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని ఆదివాసీ సంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తూ ఉంటే ఎందుకు స్పందించడం లేడని నిలిదిశారు..బహుళజాతి విదేశీ విత్తన కంపెనీలను గిరిజనేతరులు ఏజెన్సీ లోకి తెచ్చి ఆదివాసీ రైతులను దగా చేస్తున్న వారిని వదిలి పెట్టేది లేదన్నారు. కాంగ్రెస్, భారాసా పార్టీలను అడ్డుపెట్టుకొని ఆదివాసీ రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా దారుణాలకు పాల్పడుతున్న కంపెనీ ఆర్గనైజర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
బ్యాట్ మెంటెన్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నెటిదాత్రి : వనపర్తిలో సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా బ్యాట్ మెన్టెన్ పోటీలలో డబుల్స్ సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన సయ్యద్ జీషాన్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు .15 వ వార్డ్ మున్సిపల్ మాజి కౌన్సిలర్ ,బండారు కృష్ణ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోజ్ పెద్దింటి.వెంకటేష్, జోహెబ్బు హుస్సేన్. ,చిట్యాల రాము, ధర్మా నాయక్, మురళీ సాగర్ ,నీలస్వామి, శ్రీను, సల్మాన్,ఖలీల్ తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి,ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం
కాంగ్రెస్ పార్టీతోనే డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి
గతంలో ఏకలవ్య గురుకుల పాఠశాల మోడల్ స్కూల్స్ వివిధ గురుకులాలు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ స్కూలుకు 200 కోట్లు విడుదల కావడంతో సంబరాలు జరుపుకున్నారు
మరిపెడ నేటిధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కొరకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసిననందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మరిపెడ మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి యువ నాయకులు నూకల అభినవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు, రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు నిన్న ఒక్కరోజు 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించేందుకు 11,000 కోట్ల రూపాయాలను మంజూరీ చేయడం పట్ల ఆయన హర్హంవ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నప్పటికి నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన ఎజెండాగా 11 వేల కోట్ల రూపాయలను కేటాయించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనే 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మించేందుకు 600 కోట్ల రూపాయలను కేటాయించామని.. మొత్తంగా 58 పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలను కేటాయించడం విద్యకు ప్రజాప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని ఆయన అన్నారు, తాము అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు నిర్మించి విద్యలో అసమానతలు లేకుండా చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు,ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రవి నాయక్, అప్సర్, మెన్స్ అశోక్ కుమార్ గౌడ్,రామ్ లాల్ , వీరభద్రం గౌడ్, కృష్ణ, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతంలో ఆదివారం జరిగిన 145 వ నగర సంకీర్తన రంగులమయంగా జరిగింది. అత్యంత వైభవంగా కొనసాగిన సంకీర్తన కార్యక్రమంలో భక్తులు శ్రీ కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ శోభయాత్ర జరిపారు. చిన్నారులు, మహిళలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు శ్రీ కృష్ణ గీతాలకు నృత్యాలు చేస్తూ ఆనంద పరవశంలో మునిగితేలారు.
శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులోని శాంతిఖని గని ఆవరణలో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆధ్వర్యం లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఎక్స్ టెన్షన్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు గ్రామాలైన బట్వాన్ పల్లి, పెర్కపల్లి, ఆకెనపల్లి, లింగపూర్, తాళ్ల గురిజాల గ్రామాల ప్రజలను వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపకుండా వందలాది పోలీసులు సింగరేణి ఎస్ ఎన్ పి సి. సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. కావున ప్రభావిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని ప్రభావిత గ్రామాలైన బట్వాన్ పల్లి, పెర్కపల్లి, ఆకెనపల్లి, లింగపూర్, తాళ్ల గురిజాల గ్రామాలలో గ్రామాల వారీగా మళ్లీ నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి లో వినతిపత్రం అందచేసిన ప్రభావిత గ్రామాల రైతులు,ప్రజలు.సింగతి కిరణ్ కుమార్ కందుల రాకేష్ కుమార్.ఆకిరెడ్డి శంకర్.కందుల శంకరయ్య.గోమాస శ్రీనివాస్ మాజీ ఎంపీపీ. తొంగల మల్లేష్ మాజీ ఎంపీపీ.సింగతి నరేందర్ . గోమాస వినోద్ కుమార్. అచ్చె శివ తదితరులు పాల్గొన్నారు.
మల్గి గ్రామ బి ఆర్ పార్టీ కార్యాలయం లో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి అణగారిన వర్గాలల్లో విద్య వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు అఖిల్ శాంతు మహేష్ హనుమంత జగన్నాథ్ గౌడ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలి..
రామయంపేట మార్చి 10 నేటి ధాత్రి (మెదక్)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే జయంతుల, వర్ధంతుల కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తున్నప్పటికీ రామాయంపేట మున్సిపల్ నాయకులకు మాత్రం తమకు సంబంధంలేని అంశం అంటూ గాలికి వదిలేస్తున్నారని మహనీయుల పండగల రోజు సైతం కార్యక్రమాన్ని చేస్తున్న తామే అక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పని తొలగించి మహనీయులను నీటితో శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని పోచమ్మ అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ పరిస్థితి మారాలంటే ఎంత సమయం పడుతుంది, ఎప్పటికీ మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలుగుతుందో , ఈ విషయాలను ప్రజలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు, నాయకులు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అని పేర్కొన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా జయంతి ఉత్సవాలు అధికారికంగా స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల ఆవేదన. చేశారు.
రక్తదానము, అవయవదానం అనే రెండు దానములు నేటి పరిస్థితుల్లో సమాజంలో అవసరము ఉన్నవారికి సరియైన సమయంలో దొరకనట్లయితే అపాయకరమని లయన్స్ క్లబ్స్ ఇంటర్ నేషనల్ జిల్లా 320 డి గవర్నర్ నగేష్ పంపాటి అన్నారు.. ఆదివారం (09.03.2025 న)
Blood
రాగి కన్వెన్షన్,హైదరాబాద్ లో సాయంత్రం జరిగిన లయన్స్ జిల్లా 320-డి 19 వ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్** లో రామాయంపేట లయన్సక్లబ్ చార్టర్ సభ్యులు లయన్ డా. ఏలేటి రాజశేఖర్ రెడ్డి రూపొందించిన తన 18 వ రక్త, అవయవ దాన ప్రచార గోడపత్రిక ను విడుదల చేస్తు అన్నారు.గత కొంతకాలంగా రక్త అవయవ దాన ప్రచారానికై తీవ్ర కృషి చేస్తున్నట్లు, దానివల్ల లయన్స్ జిల్లా 320-డి లో విస్తృతంగా రక్తదాన శిబిరం లను నిర్వహించినట్లు తెలిపారు. అలాగే అవయవదానం కూడా చాలా ప్రాముఖ్యతను పొందిందని, ఎంత ప్రచారం నిర్వయించిన కూడ దాతలు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. లయన్స్ తమ తమ క్లబ్ ల ద్వారా రక్త,అవయవ దానాలకు విస్తృత ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు, ఏరియా గాట్ లీడర్ ఆర్.సునీల్ కుమార్ తో పాటు ఇతర లయన్స్ నాయకులు లయన్ ఏ. అమర్నాథ్ రావు గవర్నర్ ఎలెక్ట్ , లయన్ ఎం. విజయలక్ష్మి ఫస్ట్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ ,లయన్ డిచిపల్లి నరసింహ రాజు సెకండ్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ , లయన్ కె. సూర్యనారాయణ జి.ఎల్.టి ఎక్స్టెన్షన్ లీడర్ మరియు ఇతర లయన్స్ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది…
కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి.. కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.!
ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు..
పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం…
రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్)
Ramayampet
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామయంపేట నుండి నిజాంపేట మండలం విడిపోయింది. అంతేకాకుండా కొన్ని కార్యాలయాలు తరలిపోవడం జరిగాయి. రామయంపేట ప్రధానంగా పట్టణ అభివృద్ధి రోజురోజుకు దీనస్థితిలోకి జారిపోతుంది. నిజమాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి లకు వెళ్లడానికి ఇది కేంద్ర బిందువు. నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణికులు రాకపోకలు జరిగే పట్టణం. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రధానంగా రోడ్లు, నిర్మాణం లేకపోవడం వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం అభివృద్ధి లేకపోవడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్రస్థాయి వరకు ప్రధాన పార్టీల్లో ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉండి ఆయా పార్టీలకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పదేపదే ఒకరి పార్టీని ఒకరు ఒకరి నాయకులను మరొకరు దూషించుకోవడం తప్ప అభివృద్ధి విషయంలో కలసికట్టుగా ఉంటే ఇప్పటివరకు రామాయంపేట ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల సైతం ఎంతో అభివృద్ధి చెందాయని అక్కడ అన్ని రకాల వ్యాపారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామయంపేటకు సమీపంలో ఉన్న మండలాలు ఎంతో సుందరంగా వేగంగా అభివృద్ధి జరిగినా రామయంపేట మాత్రం అదే స్థితిలో ఉంది. పట్టణంతోపాటు మండలంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ రామయంపేట వెనుకబడి ఉండడానికి కారణమేంటని అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, మరియు పార్టీ భేదాలు విడిచిపెట్టి రామాయంపేటకు ఉపయోగపడే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా ఇప్పటికైనా రామాయంపేట ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. మన భవిష్యత్ తరాలకు ఇప్పటి రామయంపేట ఇస్తే వారి మనసులో మనం చేసిన పొరపాటులను ఇచ్చినట్లే అవుతుంది. భవిష్యత్ తరాలకు అన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అప్పుడే అభివృద్ధి జరుగుతుందని భావన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు, పార్టీల నాయకులు, అన్ని వర్గాలు, కుల సంఘాల్లో ఏకతాటి పై ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామాయంపేట అభివృద్ధి జరుగుతుందా లేదా.? వేచి చూడాల్సిందే..!
నిరుపేద కుటుంబ వివాహానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన నిరుపేద డేవిడ్ కూతురు వివాహానికి కటారెడ్డి తిరుపతిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తన అనుచరులతో నిరుపేద కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంట తిరుపతిరెడ్డి శుభ, ఆశుభ కార్యక్రమాలకు తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో.శ్యామ్ రెడ్డి,రాజ గుప్త బిక్షపతి ,సుధాకర్,దేవేందర్,సంతోష్ జి స్వామి,సాయిలు, సాయిలు,సిద్దయ్య నవీన్,నారాయణ తదితరులు పాల్గొన్నారు
చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా కొనసాగుతోంది… – చదువుకు కారణమైనోళ్ల గురించి తెలియకపోవడం దురదృష్టకరమే – సావిత్రీబాయి పూలే మహిళాలోకానికే ఆదర్శనమని చాటాలే – త్వరలో సావిత్రీబాయిపూలే విగ్రహం ఏర్పాటు చేస్తం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని :- నేటి ధాత్రి
అట్టడుగువర్గాల కోసం త్యాగాలు చేసిన చరిత్రకారులను మరుగుపెట్టే చరిత్ర ఇంకా దేశంలో కొనసాగుతోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. చదువులతల్లి సావిత్రీబాయి పూలే వర్థంతి సందర్బంగా సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అక్షరజ్ఞానం నేర్పిన సావిత్రీబాయి పూలే మహిళాలోకానికి ఆదర్శమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని, అయితే ఆమె గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు అణగారిన వర్గాలతో పాటు బ్రాహ్మణమహిళలను చదువుకు దూరంగా ఉంచిన సందర్బంలో మహాత్మాజ్యోతిరావుపూలే తన సతీమణి సావిత్రీబాయికి చదువు నేర్పించి మహిళలకు అక్షరాలు నేర్పించేలా ప్రోత్సాహం అందించారన్నారు. ఆనాడే మహిళల కోసం పాఠశాలను స్థాపించిన సావిత్రీబాయి పూలే చరిత్ర గురించి చెప్పాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ సమాజంపై ఉందన్నారు. ఆడవాళ్లు చదువుకోలేని సమయంలో వారికి అక్షరాలు నేర్పించారని, ఆనాడు ఆమె నేర్పించిన అక్షరజ్ఞానంతోనే ఈనాడు ఎంతో మంది ప్రయోజకలు అయ్యారని ఆయన గుర్తు చేశారు. చదువు రావడానికి, చదువుకోవడానికి కారణమైన సావిత్రీబాయి పూలే గురించి తెలియకపోవడం దురదృష్ణకరమని, సావిత్రీబాయి చరిత్ర గురించి ప్రతి ఒక్కరు భుజాన వేసుకుని గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంథని నియోజకవర్గంలో అనేక మంది మహనీయుల చరిత్ర తెలిసేలా విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని, త్వరలోనే పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా మంథనిలో సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
మల్యాల గ్రామంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. – ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన చందుర్తి,
నేటి ధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం రోజున ఆలయ రాజగోపుర ప్రాణ ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి, స్వామి వారి శిష్య బృందం కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వేదమంత్రాలతో సాంప్రదాయ బద్దంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాదాడి కిషన్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు కందాలయ రమణచార్యులు, ప్రముఖులు అల్లాడి రమేష్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్ చిర్రం తిరుపతి, ఈసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ విద్యాలయం చిన్నారుల నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలలో నిధులు లేక” ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతు న్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు రాక కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడా నికి కూడ పంచాయతీల్లో చిల్లిగవ్వ లేదు. సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికా రుల పాలనలోకి వెళ్లిన పంచాయతీలకు ఇప్పుడు ఈ ఆర్థిక భారం పెను సవాల్ గా మారింది. పాలకీవర్గాలు లేని పంచాయితీల్లో బాధ్యతల భారం కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పంచాయతీ పాలనలో తామే కీలకం కావడంతో కార్యదర్శులు అడక త్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పంచాయతీల్లో పనులకు అవసరమైన నిధులు లేక సొంతంగా ఇంకెంతకాలం ఖర్చులు భరించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు తప్పనిసరి. ఈ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు మారడంతో కార్యదర్శులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో ప్రతి పని అర్థికప రమైన అంశమే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు అందక ఆర్థిక ఇబ్బందులతో గ్రామపంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు. పంచాయతీలలో నిధులు లేక కార్యదర్శులే 2 సంత్సరాల నుండి ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. దీంతో తప్పనిసరి పీరి స్థితుల్లో అప్పులుచేసి పంచాయితీ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. పంచాయతీల స్థాయిని బట్టి నెలకు రూ.50 వేల నుండి లక్ష రూపాయల నిధులు అవసరం పడుతున్నాయి. గత కొంతకాలంగా ఈ భారం అంతా పంచాయతీ కార్యదర్శులు నెట్టుకొస్తున్నారు. పంచాయతీ కార్మికులకు కొన్ని నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారిని సముదా యించి పనిచేయించడానికి కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం జనవరి నెలాఖరులో పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగియగా ప్రభుత్వం ప్రత్యేకఱ ధికారులను నియమించిన సంగతి తెలిసిందే. ఇతర శాఖలో కీలకంగా ఉన్న గెజిటెడ్ అధికా రులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు తీరిక దొరికినప్పుడే గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. కార్యదర్శులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి పరిమితం అవుతు న్నారు. ట్రాక్టర్లకు అవసరమైన డీజిల్ తోపాటు పల్లె ప్రకృతి, పనులు పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డులు, స్మశాన వాటిక, నిర్వహణ వాటర్ ట్యాంకుల క్లోరినే షన్, బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై దృష్టిలో పెట్టుకొని పంచాయితీ నిధులను వెంటనే విడుదల చేయాలని కార్యద ర్శులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక స్వస్తిక్ హోటల్ లో జహీరాబాద్ పట్టణానికి చెందిన డా.మనసా మనషికంగా లోపలున్న పిల్లల కోసం మొదటి సరిగా అవగాహన సమావేశం నిర్వహించారు. మన జహీరాబాద్ పట్టణం లో మెట్టమొదటి సరిగా ప్రతేకా అవసరాలున్న పిల్లల కోసం ప్రసంగ సమస్య లక్షణాలు అయిన అటిజం, ప్రవర్తన సమస్యలు, మనషిక ఆరోగ్యం, కంటి సంబంధమైన,భాషా సమస్యలు, హైపర్ అక్టీవ్ అదే విదంగా పిల్ల మెదడు అభివృద్ధి ఆలస్యం కావడానికి కారణాలు పిల్లల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితిస్తాయి కాబట్టి తల్లిదండ్రులకు చాలా రకాల మనషిక సమస్యల కోసం చాలా మంది థెరపిస్టులు అవగాహన కల్పించారు. సమస్యలు ఉంటే పిల్లల పేర్లను నామెదు చేసుకుంటే ప్రతేకా థెరపిస్టుల ద్వారా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని మనసా తెలియజేసారు.ఈ సమావేశంలో అధ్యాపకులు మారుతి రావు ,రచయిత డా.పెద్దగొల్ల నారాయణ,విజయకుమార్ ,నంద,మనసా,వంశీ కృష్ణ ,శివశేఖర్, శ్రీనివాస్,రాజమౌళి,కృష్ణ,థెరపిస్టులు శ్రావణి,కుశల,సుభాష్ పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
*చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…. * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 33 కోట్లు రూపాయలు రుణమాఫీ … * కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సిరిసిల్ల చేనేత కార్మికులు ….
* రాజన్న సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )
గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో జీవో నెంబర్ 56 లో భాగంగా 1-4-2017 నుండి 31-3-2024 తీసుకున్నటువంటి చేనేత రుణమాఫీని మాఫీ చేయడం జరిగినది. తెలంగాణ మొత్తంలో 33 కోట్లు రుణమాఫీ చేయడం జరిగినది అంతేకాకుండా ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న రుణం వచ్చేసి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం ద్వారా చేనేత కార్మికులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. మన సీఎం రేవంత్ అన్న గారికి, టెక్స్టైల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు అన్నగారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శీనన్న గారికి, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ గారైన కేకే మహేందర్ అన్నగారికి రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ తరపున కామూరి వనిత, నలినీకాంత్ మరియు చేనేత మహిళా కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబా సాహెబ్ గీతే మంత్రి పొన్నం ప్రభాకర్ ను అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరినట్లు ఎస్పీ తెలిపారు.
ఝరసంగం లోని కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ బేబీ సింగ్ ఆదివారం తెలిపారు. కేంద్రీయ విద్యాలయాల సంఘటన్ (కేవీఎస్) 2025-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బాల్వాటిక-1, 2, 3 (ప్రీ ప్రైమరీ)తో పాటు, ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. బాల్వా టికా క్యాటగిరీ తప్ప మిగిలిన తరగతుల సీట్లను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు. భద్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అలాగే ఏక సంతానంగా ఆడపిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. దర ఖాస్తుల దాఖలుకు ఈ నెల 21న చివరి తేదీ. ఆ తరువాత నాలుగైదు రోజుల్లో ఎంపికైన వి ద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. కేంద్రీయ విద్యాలయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. పూర్తి వివరాల కోసం https://kvsangathan.nic.in/en/ వెబ్సైట్ చూడవచ్చు.
`ఓ వైపు ఏసిబి దాడులు జరుగుతున్నా అధికారుల్లో భయం లేదు
`నిత్యం ఎక్కడో అక్కడ దొరుకుతూనే వున్నారు
`ప్రజలను పీడిరచుకు తింటూనే వున్నారు
`దొరికిన వాళ్లే కాదు దొరక్కుండా లంచాలు తింటున్న వాళ్లు చాలా మంది వున్నారు
`అవినీతి ఆరోపణలున్న ప్రతి అధికారి ఇంటి మీద ఏసిబి దాడులు నిర్వహించాలి
`అక్రమాస్థులను వెలికి తీయాలి
`అక్రమాస్థులన్నీ ప్రభుత్వ పరం చేయాలి
`లంచం తీసుకొని దొరికిన వారి ఉద్యోగం వెంటనే పోవాలి
`అప్పటి వరకు సంపాదించిన అక్రమార్జన ప్రభుత్వ పరం కావాలి
హైదరాబాద్,నేటిధాత్రి:
ఉద్యోగమంటేనే లంచాలకు లైసెన్స్ ఇచ్చినట్లు భావిస్తున్నారు కొందరు అధికారులు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు వస్తన్నాయన్నది మర్చిపోతున్నారు. కష్టపడి ఉద్యోగం సంపాదించున్నాం..అంటుంటారు. ఆ కష్టం జనంకోసం చేశారా? వాళ్లుకు ఉద్యోగం వచ్చిందే ప్రజల కోసం అన్నట్లు, లంచాలు తీసుకోవడం తమకు హక్కు అన్నట్లు ఉద్యోగులు తయారౌతున్నారు. తెలంగాణలో రోజూ కనీసం నలుగురు,ఐదుగురు ఉద్యోగులు ఏసిబికి పట్టుబడుతున్నారు. నిజం చెప్పాలంటే గతం కన్నా కొత్త ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా ఏసిబి రైడ్స్ జరుగుతూనే వున్నాయి. ఉద్యోగులు పట్టుబడుతూనే వున్నారు. అడ్డంగా దొరుకుతున్నారు. వేలకు వేలు, లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటూ రెడ్ హాండెడ్‌గా దొరుకుతూనే వున్నారు. అందులో కింది స్దాయి ఉద్యోగుల నుంచి మొదలు పెద్ద స్ధాయి అధికారుల వరకు పట్టుబడుతూనే వున్నారు. అయినా ఎక్కడా లంచాలు ఆగడం లేదు. తీసుకునే వారు ఆపడం లేదు. మాకు లంచం లేకుండా పని చేయమని చెప్పే ఉద్యోగులే పెరుగుతున్నారే తప్ప, లంచం తీసుకోమని ఏ ఒక్క అధికారి చెప్పడం లేదు. ఏ శాఖ కార్యాలయం ముందు మాకు లంచం ఇవొద్దు అని బోర్డు పెట్టడం లేదు. బాజాప్త లంచాలు తీసుకుంటున్నారు. దొరికే వారు దొరుకుతున్నారు. లంచాలు తీసుకుంటున్నా దొరకని వారు మేం దొరలమన్నట్లు ఫోజులు కొడుతున్నారు. పైగా మేం లంచాలు తీసుకుంటున్నప్పుడు పట్టుకోండి చూద్దాం…అని కొంత మంది తహసిల్ధార్‌లు సవాలు విసురుతున్నారు. ఆ మెసెజ్‌లను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కూడా చేస్తున్నారు. అసలు లంచాలు తీసుకోవడాన్ని ఆపడమే తప్పన్నట్లు కొంత మంది తహసిల్ధార్‌లు గగ్గోలు పెడుతున్నారు. ప్రజల నుంచి కొంత మంది తహసిల్ధార్‌ల అనుచరులు, ప్రైవేటు సైన్యం బహిరంగంగానే లంచాలుతీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న ఎమ్మార్వోల అనుచరులకు సంబందించిన వీడియోలు అనేకం బైట పడుతూనే వున్నాయి. ఏసిబికి పట్టుబడకుండా ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకొని మరీ లంచాలు తీసుకుంటున్నారు. అలా లంచాల సొమ్ముతో జీతాలిచ్చి అనుచరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతకీ చాలా మంది తహసిల్ధార్‌లు ఉద్యోగాలు చేస్తున్నారా? లేక ప్రజల మీద వ్యాపారాలు చేస్తున్నారా? రెవిన్యూ వ్యవస్ధ కిందకు వచ్చే అన్ని శాఖల్లో ఇదేతంతు. ముఖ్యంగా ఎమ్మార్వోలకు ప్రైవేటు సైన్యం ఎందుకు? వాళ్లకు కార్యాలయంలో ఏ పని? దర్జాగా ఎమ్మార్వో కార్యాలయంలోకి ఎందుకు వస్తున్నారు? కార్యాలయంలో ఇతర ఉద్యోగుల కన్నా, ఎమ్మార్వోల ప్రైవేటు సైన్యమే ఎందుకు పెత్తనం చేస్తోంది. ఎమ్మార్వో డ్రైవర్ దగ్గర నుంచి ధరణి ఆపరేటర్‌తో సహా,ఇతర ప్రైవేటు వ్యక్తులతో కార్యాలయంలో ఆధిపత్యం. లంచాలు పుచ్చుకునేది వాళ్లే… ఆ సొమ్మును ఎవరి కంట పడకుండా ఎమ్మార్వోకు అందజేసేది వాళ్లే… అలాంటి వారికి ఎమ్మార్వో తన జీతం నుంచి డబ్బులు ఇవ్వరు. ఎమ్మారోలు తీసుకునే లంచాలను వారికి పంచుతారు. అంటే తాను తప్పు చేయడమే కాదు…వారి తప్పు బైటకు రాకుండా ప్రజలను పీడిరచి ప్రైవేటు వ్యక్తులను తహసిల్ధార్‌లు పోషిస్తున్నారు. దొంగలుదొంగలు ఊళ్లు పంచుకుంటారన్న సామెతను నిజం చేస్తున్నారు. మీడియా ఇంత పెరిగినా లంచాలు ఎక్కడా ఆగడం లేదు. ఏసిబి ఇంతగా దాడులు చేస్తున్నా లంచాలు ఆపడం లేదు. అసలు ఉద్యోగుల్లో భయమే లేదు. ఏసిబి పట్టుకున్నంత మాత్రాన ఉద్యోగం పోవడం లేదు. సస్పెండ్ అయిన కాలానికి కూడా తిరిగి మళ్లీ జీతం వస్తుంది. ఏసిబికి చిక్కిన లంచావతారులకు కూడా ప్రమోషన్లు వెంటనే వస్తున్నాయి. ఇలా అవినీతి అదికారులే ముందు అందలం ఎక్కుతుంటే ఒకరిని చూసి ఒకరు లంచాలకు మరుగుతున్నారు. కోట్లు సంపాదించి, కోటి ఖర్చు పెట్టి మళ్లీ ఉద్యోగంలో చేరుతున్నారు. ఇలాంటప్పుడు ఇక ఉద్యోగులకు భయం ఎందుకు వుంటుంది. కుటుంబం వీధినపడుతున్నందన్న బాధ ఎందుకుంటుంది? ఎలాగూ సిగ్గూ శరం విడిచేశారు. సమాజం ఏమనుకుంటే నాకేంటి? బంధువులు దగ్గర పరువు పోతే వచ్చే నష్టమేముంది? డబ్బుంటే అందరూ చుట్టాలే అన్నట్లు చట్టం కూడా వారికి చుట్టమైపోతోంది. ఉన్నతాధికారులే బంధువులైపోతున్నారు. లంచాలుతిని ఏసిబికి పట్టుబడినా మళ్లీ పై స్ధాయి అధికారులకు లంచాలిచ్చి మళ్లీ కొలువులో చేరుతున్నారు. కింది నుంచి పై స్ధాయి దాకా లంచం ఒక నిచ్చెనగా మారిపోయింది. అందుకే తప్పు చేసినా ఫరవాలేదు. ప్రజలు పీడిరచి సొమ్ము తిన్నా ఉద్యోగానికి ఏమీ కాదు? ఒక వేళ దొరికితే నాలుగు రోజులు జైలు.. ఆ తర్వాత బెయిలు…మరింత కాలం పోతే మళ్లీ కొలువు…ఇంతకన్నా ఏం జరుగుతుంది. లంచాలు తీసుకున్నారని కొలువు నుంచి పూర్తిగా తొలగిస్తారా? లేక జైలు శిక్ష వేసి ఉరి తీస్తారా? న్యాయ స్దానాన్ని కూడా మోసం చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. న్యాయ దేవత కళ్లు కప్పేస్తున్నారు. మళ్లీ కొలువులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమాజంలో లంచం ఆపమంటే ఎవరు ఆపుతారు..ఎందుకు ఆగుతారు..? ఇది వ్యవస్ధ లోపాలనే అదికారులు రెచ్చిపోతున్నారు. ఇలా అడ్డదిడ్డంగా లంచాలు తీసుకుంటూ మీడియా లేకుంటే బాగుండు అనుకుంటున్నారు. మీడియా పెరిగిపోవడం వల్ల బాజాప్తా లంచాలు తీసుకునే అవకాశం కుదరడం లేదని కొంత మంది తహసిల్ధార్‌లు మధనపడుతున్నారు. మీడియాను దూషిస్తున్నారు. జర్నలిస్టులనే ఎద్దేవా చేస్తున్నారు. గొట్టాలు పట్టుకొని తమను లంచాలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని మీడియాను కొంత మంది ఎమ్మార్వోలు దుమ్మెత్తి పోస్తున్నారు. మీడియా చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకొని వస్తుందని లేకి మాటలు మాట్లాడుతున్నారు. ఒక మీడియాకు టైటిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి వుంటే తప్ప రాదన్న సంగతి కూడా తెలియనంత దౌర్భాగ్యస్ధితిలో కొంత మంది ఎమ్మార్వోలున్నారు. మీడియా అనేది గాలికి పుట్టుకొచ్చేదికాదు. ఎవరికి వారు మీడియా అంటూ రారు. అయినా ప్రతి పౌరుడికి అవినీతిని ప్రశ్నించే హక్కు వుంది. లంచావతారులను పట్టించే స్వేచ్ఛవుంది. తప్పు చేసిన వారిని గుర్తించి చెప్పే అధికారం వుంది. దేశంలో ప్రతి పౌరుడు ఒక జర్నలిస్టే…ఈ మాత్రం పరిజ్ఞానం లేని వాళ్లు కొంత మంది ఎమ్మార్వో కొలువులు చేస్తున్నారు. అక్షరం ముక్క రాని వాళ్లు కూడా జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని జర్నలిస్టులంటే మింగుడు పడని ఎమ్మార్వోలు అంటున్నారు. ఎంత మంది ఎమ్మార్వోలకు కంపూటర్ ఆపరేటింగ్ వస్తుంది. అసలు కంపూటర్‌లో ఒక్కపదం కూడా టైపింగ్ చేయలేని ఎమ్మార్వోలు ఎంతో మంది వున్నారు. అలాంటి వాళ్లు ఎమ్మార్వోలుగా కొలువులు చేస్తున్నప్పుడు సమాజిక బాధ్యత కల్గిన వ్యక్తులు జర్నలిస్టులు కావడంలో తప్పేముంది? అవినీతి అధికారుల బాగోతాలు బైట పెడితే కొంత మందికి కలిగే నొప్పేమిటి? లంచాలు తీసుకుంటున్న అదికారులు రోజూ నిజంగానే అన్నంతింటున్నారా? లేక అందులో అదేదైనా అద్దుకొని తింటున్నారా? అదే రుచిగా వుందని లంచాలకు మరుగుతున్నారా? ఒక ఉద్యోగికి జీతం అంటే అన్నం లాంటంది. లంచం అనేది అశుద్దం లాంటిది. మేం జీతాలు తీసుకుంటాం…లంచాలు తీసుకుంటామంటే అన్నంతో పాటు అదికూడా తింటున్నట్లే అవుతుంది. ప్రజలంతా ఛీ ఛీ అంటున్నా, చీదరించుకుంటున్నా, కాండ్రిరచి ఉమ్మేస్తున్నా తుడుకుంటున్నారే గాని, లంచం తీసుకోవడం చాల మంది మానడం లేదు. ఎంగిలిని అద్దుకు తినడం ఆపడం లేదు. ఇంతకన్నా కుక్క బతుకు మరొకటి వుంటుందా? ప్రజలు ఎంత తిడుతున్నా మమ్మల్ని కాదని దులుపుకుంటూ, లంచాలు తీసుకుంటున్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరులైన ఉద్యోగులను ఏరివేసే యజ్ఞం మొదలుపెట్టింది. అయినా ఉద్యోగుల్లో ఆ వణుకు కనిపించడం లేదు. బెనుకు లేదు. లంచాలు తీసుకోవద్దన్న సోయి లేదు. అసలు ఉద్యోగాలు పోతాయన్న భయం లేకుండా పోతుండడంతో ఇప్పటి వరకు పట్టుబడని వారికి ఉద్యోగాలు ఇటీవల మళ్లీ ఇవ్వలేదు. అయినా అవినీతి అధికారులు మారడం లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అవినీతి అధికారుల పట్ల కఠినంగా వుంటున్నారు. లంచాలు తీసుకొని అడ్డంగా దొరికిన వారిని కొలువులు ఇవ్వడం లేదు. దాంతో దొరక్కుండా లంచాలు తీసుకుంటున్నారు. పైగా మమ్మల్ని పట్టుకునే అవకాశం ఇవ్వమంటూ సవాలు చేస్తున్నారు. కాని నిజాయితీగా కొలువు చేస్తామని అనడం లేదు. అందుకే లంచావతారి అని తెలిస్తే చాలు వారి సంపాదనలపై దర్యాప్తు చేస్తే తప్ప అవినీతి పరులు దారికి రారు. లేకుంటే వారి ఆగడాలు ఆపరు. లంచాలు తీసుకోకుండా వుండరు. ప్రజలను పీడిరచుకుతినడం మానరు. అద్దుక తినే అలవాటు మానుకోరు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.