ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది…
ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది…
కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి..
కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.!
ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు..
పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం…
రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్)

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామయంపేట నుండి నిజాంపేట మండలం విడిపోయింది. అంతేకాకుండా కొన్ని కార్యాలయాలు తరలిపోవడం జరిగాయి. రామయంపేట ప్రధానంగా పట్టణ అభివృద్ధి రోజురోజుకు దీనస్థితిలోకి జారిపోతుంది. నిజమాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి లకు వెళ్లడానికి ఇది కేంద్ర బిందువు. నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణికులు రాకపోకలు జరిగే పట్టణం. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రధానంగా రోడ్లు, నిర్మాణం లేకపోవడం వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం అభివృద్ధి లేకపోవడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్రస్థాయి వరకు ప్రధాన పార్టీల్లో ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉండి ఆయా పార్టీలకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పదేపదే ఒకరి పార్టీని ఒకరు ఒకరి నాయకులను మరొకరు దూషించుకోవడం తప్ప అభివృద్ధి విషయంలో కలసికట్టుగా ఉంటే ఇప్పటివరకు రామాయంపేట ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల సైతం ఎంతో అభివృద్ధి చెందాయని అక్కడ అన్ని రకాల వ్యాపారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామయంపేటకు సమీపంలో ఉన్న మండలాలు ఎంతో సుందరంగా వేగంగా అభివృద్ధి జరిగినా రామయంపేట మాత్రం అదే స్థితిలో ఉంది. పట్టణంతోపాటు మండలంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. ఎవరి స్వార్థం వారిది, సొంత లాభం కోసం కొంతమంది. రోడ్ సైడ్ నాయకులంతా కోటీశ్వరులుగా మారి అధికార పార్టీ ఏది వచ్చిన ఉన్న పార్టీని వదిలేసి తమ సొంత పనులకోసం, సొంత అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. కొందరు కార్యకర్తలు వారినీ అనుసరించే పార్టీలు మారడంతో ప్రజల అవసరాలు కనీస కష్టాలు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు పట్టణ మధ్యలో ప్రతి గల్లి గల్లి రోడ్డు పక్కల గుంతలతో వర్షాకాలం వస్తే ఇంట్లోకి నీరు రావడం, మున్సిపాలిటీ ప్లానింగ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఏ మాత్రం కూడా రామాయంపేటకు మార్పు లేకపోవడం అయినప్పటికీ రామయంపేట వెనుకబడి ఉండడానికి కారణమేంటని అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, మరియు పార్టీ భేదాలు విడిచిపెట్టి రామాయంపేటకు ఉపయోగపడే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా ఇప్పటికైనా రామాయంపేట ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అధినాయకులు స్థానికంగా లేకపోవడం వారు తమ తమ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిలు, ప్రణాళికలు చేస్తున్న రామాయంపేటకు ఏమాత్రం లాభం లేకుండా నష్టం జరుగుతున్న, వెంట ఉన్న నాయకులు కార్యకర్తలు గాని అధినాయకులను అడ్డగించకపోవడం పట్టణ ప్రాంతం గ్రామం పట్ల ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించకపోవడం వల్ల కూడా రామాయంపేట పూర్తిగా రాజకీయ ప్రలోభాల నాయకుల వంచన మరియు పార్టీలు మారుతూ తమ స్వార్థం చూసుకోవడం వల్ల పూర్తిగా వెనుకబడిపోయిందని చెప్పవచ్చు నియోజకవర్గం మార్పుతో పాటు నియోజకవర్గ మారుతుందన్న అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏమాత్రం కదలకపోయినా ఆమె వెంటనే అనడం వల్లనే నియోజకవర్గం మారిపోవడం ఇక్కడున్న కార్యాలయాలు అధికారులు వెళ్లిపోవడం జరిగాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఎలుకకుర్తి రోడ్డు బైపాస్ వల్ల ఇప్పటికే నియోజకవర్గం నుంచి మండలానికి మండలం నుంచి మున్సిపాలిటీకి కుంచకపోయినా రామాయంపేట మరొక చిన్న పల్లెగా గ్రామంగా మారిపోనున్నది. బైపాస్ రోడ్ల వల్ల ఇక్కడ జనాలు రాకపోవడం రాకపోక లేకపోవడం సముద్ర గర్భంలో దీపంగా మారిపోతున్న రామాయంపేటకు వెలుగునిచ్చేది ఎప్పుడని ప్రజలు అడుగుతున్నారు. రాజకీయంగా ప్రజాసంఘాలు యువజన సంఘాలు వాణిజ్య సంఘాలు ఒక అభివృద్ధి వేదికగా మారి దీనిపై ఏదన్న ఒక కమిటీ వేసి అభివృద్ధికి ఆలోచిస్తే తప్ప రామాయంపేట అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. మన భవిష్యత్ తరాలకు ఇప్పటి రామయంపేట ఇస్తే వారి మనసులో మనం చేసిన పొరపాటులను ఇచ్చినట్లే అవుతుంది. భవిష్యత్ తరాలకు అన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అప్పుడే అభివృద్ధి జరుగుతుందని భావన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు, పార్టీల నాయకులు, అన్ని వర్గాలు, కుల సంఘాల్లో ఏకతాటి పై ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.