నూతన దంపతులను ఆశీర్వధించిన.

*నూతన దంపతులను ఆశీర్వధించిన
. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండలం, లోని పెద్ద కోమటిపల్లి వంశీ వెడ్స్ నందిని వివాహ రిసెప్షన్ కు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి వారి వెంట రాష్ట్ర సభ్యులు చదువు రామచంద్రారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ మోర్ రవీందర్ రెడ్డి మండల అధ్యక్షులు మోరే వేణుగోపాల్ రెడ్డి జిల్లా నాయకులు చెవ్వ శేషగిరి అన్నం శ్రీనివాస్ ఎర్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

సరస్వతి పుష్కరాలకు రానున్న రెండు రోజుల్లో లక్షలల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
సరస్వతి పుష్కరాల కొనసాగుతున్న నేపథ్యంలో 10 వ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏర్పాట్లను పరిశీలించి వాకి టాకీ ద్వారా రానున్న రెండు రోజులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సరస్వతి ఘాట్ లో భక్తల రద్దీని పరిశీలించి కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, రక్షణ చర్యలు, విఐపిలు పుణ్య స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని, కంటైనర్ ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మెయిన్ ఘాట్ నుండి సరస్వతి ఘాట్ వరకు ఏర్పాటు చేసిన మట్టి రోడ్డులో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విఐపిల కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ లో క్రమం తప్పక నీటి సరఫరా ఉండే విధంగా చూడాలని సూచించారు. ఘాట్ ల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని భక్తుల రద్దీని పరిశీలించి పుష్కరాల సేవలు ఏవిధంగా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని త్వర త్వరగా దర్శనాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి కాళేశ్వరం లోని పలుగుల జంక్షన్, తాత్కాలిక బస్టాండ్, ఇప్పల బోరు జంక్షన్, పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులతో మాట్లాడారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా పోలీసులు అప్రత్తంగా ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగ కుండా సురక్షిత ప్రయాణాలు చర్యలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

గురుకుల కళాశాలలను రద్దు చేసే ఆలోచనను.

గురుకుల కళాశాలలను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలి.

తహశీల్దార్ కు వినతి పత్రం అందజేత.

చిట్యాల ,నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్ కళాశాలలో *12*జూనియర్ కళాశాలలను రద్దు చేసి విద్యార్ధులకు అన్యాయం చేసే
ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేందర్ కు వినతి పత్రం అందజేశామని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్ చేశారు.

అనంతరం మల్లయూమాట్లాడుతూ నిరుపేదలు, ఫఆర్థికంగా లేని విద్యార్థులు కళాశాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడం వలన తమ చదువులు కొనసాగించ లేక పోతారని తెలిపారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని అన్నారు.

ఈ ప్రభుత్వం మూసివేసే గురుకుల జూనియర్ కళాశాలలో 8 బాలికల వి, 4 బాలురవి అని తెలిపారు.

ప్రభుత్వం రద్దు చేసే గురుకుల జూనియర్ కళాశాలలు* జోగులాంబ, గద్వాల జిల్లా ఇటిక్యాల (బాలురు), కరీంనగర్ జిల్లా చొప్పదండి ( బాలికలు), భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ( బాలికలు) ఖమ్మం జిల్లా సత్తుపల్లి ( బాలురు) కూసుమంచి (బాలికలు), మహబుబబాద్ జిల్లా నర్సింహులపేట ( బాలికలు), సిద్దిపేట జిల్లా దుబ్బాక ( బాలురు), సంగారెడ్డి జిల్లా రాయి కోడ్ ( బాలికలు), కామారెడ్డి జిల్లా బిచ్కుంద ( బాలురు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (బాలికలు), జనగామ జిల్లా చిట్యాల నర్మెట్ట ( బాలికలు), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి (బాలికలు) ఈ కళాశాలను మూసివేసే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు లేని యెడల దళిత సంఘాల ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఇట్టి సమాచారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జెన్నే యుగేందర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల సాంస్కృతిక కార్యదర్శి దాసారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ముద్దసానికి కడసారి వీడ్కోలు.

ముద్దసానికి కడసారి వీడ్కోలు

నివాళులర్పించిన టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ హరీష్ రెడ్డి

నెక్కొండ నేటి ధాత్రి:

చెన్నారావు పేట ప్రాథమిక సహకార సంఘం సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి శుక్రవారం గుండె పోటుతో హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విలువగా విషయం తెలుసుకున్న నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో ని సత్యనారాయణ ఇంటికి చేరుకొని మృతదేహం పై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మృతి చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, ఎస్టి జిల్లా సెల్ ఉపాధ్యక్షుడు తిరుమల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు చల్ల పాపిరెడ్డి, కెవి సుబ్బారెడ్డి, రావుల మైపాల్ రెడ్డి, ఎండి అన్వర్ పాషా, కుసుమ చెన్నకేశవులు, ముదిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుముల శ్రీధర్ రెడ్డి, మట్ట బిక్షపతి, భూమాణి మధు, కోటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Farewell

సత్యనారాయణ మృతి ఎంతో బాధాకరం : మారం రాము, కొమ్ము రమేష్ యాదవ్

చెన్నారావుపేట సొసైటీ మాజీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మృతి చెందిన ఘటన తెలుసుకున్న నెక్కొండ మాజీ సొసైటీ చైర్మన్ మారం రాము, నర్సంపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొమ్ము రమేష్ యాదవ్ లు సత్యనారాయణ మృత దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మారం రాము మాట్లాడుతూ ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అందరినీ కలుపుకు పోయి ఆప్యాయంగా పలకరించే వ్యక్తి సత్యనారాయణ రెడ్డి అని సత్యనారాయణ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మనోవేదనకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఈదునూరి యాకయ్య, ఖలీల్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు.

వనపర్తి మాజీ ఎమ్మెల్యే జయ రాములు కు ఐక్యవేదిక నివాళులు

వనపర్తి: నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన దివంగత వనపర్తి
మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయరాములు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ కృషి తో జయరాములు కుటుంబ సభ్యులు.ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. వర్థంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో, జయరాములు ప్రజాప్రయోజన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జయరాములు గారి కుటుంబ సభ్యులతో పాటు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కళాకారుడు రాజారాం ప్రకాష్ బృందం, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, టి జి ఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పా
షా, శంకర్ కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, టిడిపి జిల్లా నాయకులు కొత్త గొల్ల శంకర్, జిల్లా నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, నాగరాజు, రామస్వామి, శ్రీను, విజేత రాములు, పెద్దమందడి అధ్యక్షుడు నక్క కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీశైలం, శ్రీరంగాపురం మేకల అశోక్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి,నాగరాజు, సాయి యాదవ్, మురళీకృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ స్మృతిసభ ద్వారా జయరాములు గారి ప్రజా సేవలు మరింత ముందుకు పోవాలని, ఈ తరం నాయకులకు ఆయన జీవితం స్ఫూర్తిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ధర్మకర్త

వీణవంక ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి 43వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది
అనంతరం మండల అధ్యక్షుడు రఘపాల్ రెడ్డి ఎండి సాహెబ్ హుస్సేన్ లు మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుండి ధర్మ కర్త గా ఎదిగి ముందు ముందు మరెన్నో పదవులను పొందాలని వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నాల అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్,ఒరేం శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు,కర్ర గురు,మర్రి సమ్మయ్య తదితరులు పాలుగోన్నారు.

సమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే..

సమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే..

#శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

సమ సమాజాన్ని నిర్మించే నిర్మాతలు ఉపాధ్యాయులే అని వరంగల్ డీ ఈ వో మామిడి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న 5 రోజులు ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియ పెంచాలని కోరారు. ఐదు రోజులుగా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని గ్రామాల ప్రజలకు వివరించి పిల్లల నమోదును పెంచడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. పాఠశాలల్లో నమోదును ఎలా పెంచాలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో విద్యా రంగంలో మార్పులు రానున్న తరుణంలో ఆ దిశగా బోధనలో మార్పులు తీసుకురావాలని కోరారు. బెస్ట్ టీచర్స్ యొక్క పని విధానాన్ని అందరికీ వివరించారు. వృత్యుంతర శిక్షణను వినియోగించుకోవాలని అన్నారు.

Training Camp.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ అనురాధ,కాంప్లెక్స్ హెచ్ ఎం లు, ఎం ఆర్పిలు, ఎస్ఆర్పీలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, ఎం ఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల.

జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను WWW. bsetelangana. cgg. gov. in సెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ మూడవ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు.

హైవే విస్తరణ బాధితులకు పరిహారం కోసం.!

హైవే విస్తరణ బాధితులకు పరిహారం కోసం కృషి చేస్తా

భూములు, ప్లాట్లపై ఉన్న శ్రద్ధ లక్ష్మారెడ్డికి నియోజకవర్గ అభివృద్ధిపై లేదు

జడ్చర్ల /నేటి ధాత్రి.

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

 

 

167వ నెంబరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జడ్చర్ల పట్టణ పరిధిలో నిర్మాణాల తొలగింపుతో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇప్పించడానికి ప్రయత్నిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. దీని కోసం బాధితులందరూ తమ దరఖాస్తులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన పార్టీ నేతల ఇళ్లను కాపాడుకోవడానికి హైవే అలైన్ మెంట్ మార్చారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల్లోని హైవే బాధితులకు పరిహారం ఇచ్చిన కేంద్రం, జడ్చర్లకు మాత్రం పరిహారం ఇవ్వకపోయినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు.
జడ్చర్ల పట్టణంలోని 20వ, 2వ వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా అనిరుధ్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి మొదలుకొని కల్వకుర్తి రోడ్డులోని జడ్చర్ల వంద పడకల ఆస్పత్రి వరకూ ఉన్న ఇళ్లు, భవనాలను తొలగించడం జరిగిందని, అయితే ఇతర ప్రాంతాల్లో ఇళ్లు కొట్టేసినప్పుడు నష్టపరిహారం ఇచ్చారని, కానీ జడ్చర్ల పట్టణంలో మాత్రం పరిహారం ఇవ్వకపోయినా గతంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దీని కోసం కనీసం ఒక లేఖ అయినా ఇచ్చారా.. అని నిలదీశారు. ఈ విషయం గురించి తాను ఎన్నికలకు ముందు కూడా మాట్లాడానని గుర్తు చేశారు. ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం అధికారులతో ఈ విషయం గురించి తాను మాట్లాడానని, జడ్చర్ల పట్టణంలో నష్టపోయిన బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసానని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కార్యకర్తకు సంబంధించిన ఇల్లు కొట్టాల్సి వస్తుందని నేషనల్ హైవే డిజైన్ మార్చారని, ఈ కారణంగానే రోడ్డుకు ఒక వైపు ఎక్కువగా కొట్టేసి, మరోవైపు తక్కువగా కొట్టారని ఇదెక్కడి న్యాయమన్నారు. ఇప్పుడు అఖిల పక్షం సమావేశం పెట్టుకున్నప్పుడు గతంలో ఎవరి ఇళ్లు పోకూడదని హైవే అలైన్ మెంట్ మార్చారో గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని అనిరుధ్ రెడ్డి హితవు పలికారు. ఈ అలైన్ మెంట్ మార్చినప్పుడు లక్ష్మారెడ్డి ఏం ఆలోచించారని, ఈ విషయంగా అసలు ఆయనకు అవగాహన ఉందా? అని విమర్శించారు. ప్రభుత్వ భూములకు, దేవుని భూములకు ఎన్వోసీలు తెచ్చుకోవాలి, ప్లాటింగ్ చేసి ఎలా అమ్ముకోవాలనే ఆలోచన తప్ప నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా మాజీ ఎమ్మెల్యేకు లేదని దుయ్యబట్టారు. ఈ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించడానికి తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దీని కోసం రహదారి విస్తరణలో నష్టపోయిన జడ్చర్ల పట్టణ వాసులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను తన క్యాంపు కార్యాలయంలో అందించాలని కోరారు. ఈ విషయాన్ని తాను కేంద్ర జాతీయ రహదారుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులందరికీ పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు.

పోయిన ఫోన్ లనుCEIRపోర్టల్ ద్వారా బాధితులకు అప్పగింత.

పోయిన ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులకు అప్పగింత

మొగుళ్లపల్లి మే 24 నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

మండలంలోని ఇప్పలపల్లి, బంగ్లాపల్లి గ్రామాలకు చెందిన గడ్డం కుమార్, బోయిన హర్షవర్ధన్,లు గత కొన్ని రోజుల క్రితం తమ చరవాణిలను ఎక్కడో పోగొట్టుకున్నారు. బాధితులు ఎంత వెతికిన చరవాణి దొరకపోవడంతో. మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో. ఎస్సై బొరగల అశోక్ ను బాధితులు సంప్రదించి విషయం వివరించడంతో. ఎస్ఐ. అశోక్ స్పందించి హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సిఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ జ్యోతి కి ఆదేశాలు జారిచేయడంతో. పోగొట్టుకున్న వారి ఫోన్ లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి శనివారం రోజున బాధితులను పోలీస్ స్టేషన్ కు రప్పించి చరవాణిలను హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, బాధితులకు అప్పగించారు. చరవాణి ని ట్రేస్ చేయడంలో ముఖ్యపాత్ర వహించిన సీఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ కానిస్టేబుల్ జ్యోతిని ఎస్ఐ. అభినందించగా. చరవాణిని పోగొట్టుకున్న బాధితులు గడ్డం కుమార్ బోయిన హర్షవర్ధన్, ఎస్సై అశోక్ ను పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు.

సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు

సి.ఐ రాజ్ కుమార్ గౌడ్

మరిపెడ నేటిధాత్రి:

మరిపెడ మండల కేంద్రములో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదురోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సైబర్ క్రైమ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనితా దేవి అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్.రాజ్ కుమార్ గౌడ్ హాజరై ఉపాధ్యాయులు ఎవరు కూడా సైబర్ నేరస్థుల ఉచ్చులోపడొద్దని అన్నారు.సైబర్ నేరస్థుల వలలో చిక్కుకొని డబ్బులు నష్టపోవద్దని, ఆన్లైన్ బెట్టింగ్ లతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు.మార్కేట్లలో విరివిగా వాడుతున్న సోషల్ మీడియా లో పై అవగాహన కల్పించారు.యాప్ లను అవసరం మేరకే వాడాలని దుర్వినియోగం చేయొద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సంతోష్ కుమార్,అంజమ్మ,రిసోర్స్ పర్సన్స్ లింగాల మహేష్ గౌడ్, దోమల లింగయ్య,యాదగిరి,వెంకన్న,శ్రీను,మంగూ,మంగీలాల్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాలీసెట్ ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ.

పాలీసెట్ ఫలితాలలో విద్యార్థుల ప్రతిభ

గంగాధర నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

శనివారం విడుదలైన పాలీసెట్ ఫలితాలలో సురభి కాన్వెంట్ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన MD. అస్రార్ అయాన్ పాలీసెట్‌లో 120కు గాను 114 మార్కులు సాధించి 106వ ర్యాంకును పొందాడు. అదే విధంగా M. హృశికేశ్120కు గాను 108 మార్కులు సాధించి 396వ ర్యాంకును అందుకున్నారు. ఈ ర్యాంకులను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం హృదయపూర్వకంగా అభినందించింది. విద్యార్థుల కృషిని, అధ్యాపకుల సహకారాన్ని, తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని వారు కొనియాడారు.

పిడుగు పడి రెండు ఎడ్లు మృతి.

*పిడుగు పడి రెండు ఎడ్లు మృతి

గంగాధర నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

మండలానికి చెందిన కాచిరెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు దేశేట్టి లక్మివీరమల్లయ్యకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి. ఈ ఎడ్ల విలువ దాదాపు రూ.2 లక్షలుగా ఉంటుందని రైతు వాపోయారు. పిడుగు ఒక్కసారిగా పడడంతో ఎడ్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాయి. రైతు లక్మివీరమల్లయ్య ఆ ఎడ్లపైనే ఆధారపడిన నేపథ్యంలో, ఈ ఘటన అతనికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కల్గింది. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం

 

గంగాధర నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

తెలుగుదేశం పార్టీ చొప్పదండి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం శనివారం గంగాధరలో మాజీ మండల అధ్యక్షుడు మల్కాపూరం రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కల్యాణపు ఆగయ్య హాజరై ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ అధ్యక్షులను నియమించాల్సిన అవసరముందని, అలాగే గ్రామ స్థాయిలో అన్ని పదవులను పూర్తి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీని నియోజకవర్గ స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. గతంలో చొప్పదండిలో పార్టీకి ఉన్న గౌరవాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు మల్కాపురం రాజేశం గౌడ్, వైద భూపాతి, కొడిమ్యాల నర్సయ్య, పూరేళ్ళ మనోజ్ గౌడ్, గంటె మునిందర్, జవ్వాజి కాంతయ్య, నెల్లి కానుకయ్య, దొపతి సత్యం, ఉప్పు నారాయణ, మంగళరాపు శ్రీనివాస్ రెడ్డి, ఓరుగల్ల తిరుపతి, ఎలిగేటి శ్రీను, గజ్జెల కరుణాచారి, ముదిగంటి బాలు, కొలిపాక వినోద్ కుమార్, జరతి నర్సయ్య, మిష్కమ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్.

నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్

చర్ల నేటి ధాత్రి:

 

చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు మూడో దఫాలో కేటాయించవలసిన వ్యక్తులను మొదటి దశలోనే కేటాయించడం సరైంది కాదని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగా పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గుర్తించాలని కోరారు తక్షణమే రాజకీయాలకతీతంగా నిరుపేదలను గుర్తించి న్యాయం చేయాలని తెలియజేశారు లేకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో అర్హులైన వారిని గుర్తించి ఉద్యమిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు సామల ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నం మోహన్ పార్టీ కోశాధికారి పంబి కుమారి పార్టీ మండల ఈసీ మెంబర్ ఏకుల వెంకటేశ్వర్లు పార్టీ మండల ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ ఉప్పరిగుడం సెక్టార్ అధ్యక్షులు రాజు కుదునూరు సెక్టార్ అధ్యక్షులు వర్షిక త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు

పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను బాధితులకు అప్పగిస్తున్న.

పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను బాధితులకు అప్పగిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుధాకర్

మొగులపల్లి నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి, బంగ్లాపల్లి గ్రామాలకు చెందిన గడ్డం కుమార్, అన్న బోయిన హర్షవర్ధన్ లు ఇటీవల వారి సెల్ ఫోన్ లను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బి అశోక్ ఆదేశాల మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి శనివారం పోలీస్ స్టేషన్ లో బాధితులకు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ చేతుల మీదుగా సెల్ ఫోన్ లను అప్పగించారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను ట్రేస్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్..కానిస్టేబుల్ జ్యోతిని ఎస్ఐ బి అశోక్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ లు అభినందించారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా౹౹ఎ. చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
టీపీసీసీ అద్యక్షులు & ఎమ్మెల్సీ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగ,నారాయణ్. పాల్గొన్నారు.

ROB మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరు పెట్టడంపై హర్షం.

ఆర్ఓబికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరు పెట్టడంపై హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

జహీరాబాద్. గతకొద్దీ రోజులుగా పట్టణంలోని జాతీయ రహదారి నెంబర్ 65 పై గల రైల్వే లైన్ మీదుగా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి మాజీ మంత్రి స్వర్గీయ మొహమ్మద్ ఫరీదుద్దీన్, నామకరణం చెయ్యాలని డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించుకొని సీఎం పాల్గొన్న బహిరంగ సభలో స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఆర్బ్బ బ్రిడ్జిని జహీరాబాద్ ప్రాంత ముద్దు బిడ్డ మొహమ్మద్ ఫరీదుద్దీన్ పేరిట నామకరణం చేస్తున్నననే ప్రకటనను ఝరాసంగం మండల మైనారిటీ నాయకులు షేక్ సజావుద్దీన్ సద్దాం హుస్సేన్ స్వాగతిస్తు మాజీ మంత్రి పెట్టడంపై జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కార్, ఇంచార్జ్ చంద్రశేఖర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి మొహమ్మద్ ఫరీదుద్దీన్ గ్రామ సర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు, ఓసారి శాసన మండలి సభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మైనారిటీ శాఖ, సహకార, మత్య్స శాఖ మంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సేవలు అందించి ప్రజలలో మంచిపేరు సంపాదించుకున్నారని షేక్ సజావుద్దీన్ సద్దాం హుస్సేన్ అన్నారు.

2025-26 సంవత్సరమునకు గాను సాగు ప్రణాళిక ఉద్యాన శాఖ.

సిరిసిల్ల జిల్లాలో 2025-26 సంవత్సరమునకు గాను సాగు ప్రణాళిక ఉద్యాన శాఖ

జిల్లా ఉద్యాన శాఖ అధికారి కే.ఆర్. లత

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల జిల్లాలో 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి గాను ఉద్యాన శాఖ అందించే పథకాల ప్రణాళిక ఖరారైంది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వార పామ్ ఆయిల్ చెట్లు నాటించడం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా సూక్ష్మ సేద్యం, తుంపర్ల సేద్యం, శాశ్వత పందిరి నిర్మాణం ద్వారా కూరగాయల సాగు, సమీకృత అభివృద్ధి మిషన్ ద్వార పండ్ల తోటల పెంపకం, కూరగాయలు, పూల తోటల పెంపకం, మల్చింగ్, పాత తోటల పునరుద్ధరణ, , ఉద్యాన యాంత్రీకరణ, జాతీయ వెదురు మిషన్ ద్వారా తోటల చుట్టూ వెదురు చెట్లు పొలం సరిహద్దులపై నాటించడం కొరకు ఉద్యాన శాఖ కార్యాచరణ రూపొందించింది. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ , రాజన్న సిరిసిల్ల 2025-26 సం.లో అందించనున్న పథకముల వివరాలు నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద ఆయిల్ పామ్ తోటలు పెంచుట.
ఈ పథకంలో ఒక అయిల్ పామ్ మొక్కకు ఖరీదు రూ.193, ఇందుకు గాను ఒక మొక్కకి రూ.20 మాత్రమే రైతు వాటా గా కట్టవలసి వస్తుంది. ఎకరానికి 50 మొక్కల నాటించబడును అంతర పంటలకు మరియు పంటల నిర్వహణ కొరకు ఎకరాకు 4,200 రూపాయలు 4 సంవత్సరాల పాటు చెల్లిస్తారు. 2025-26 సం.లో ఆయిల్ పామ్ సాగు కొరకు 2000 ఎకరాలు, భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది.
సూక్మ సేద్య పథకము.ఈ పథకం క్రింద షెడ్యుల్ కులాలు / షెడ్యుల్ తెగలు – 100 % రాయితీ, మరియు సన్న కారు / చిన్న కారు రైతులకు 90%,ఇతర రైతులు – 80 % రాయితీ ఇవ్వబడును. రైతుల అందరికి G. S. T ( వస్తు సేవ పన్ను) వర్తించును 2025-26 సం.లో పండ్ల తోటలు , కూరగాయల తోటలకు మరియు ఇతర తోటలకు బిందు సేద్యం కొరకు 437 ఎకరాలు, తుంపర సేద్యం కొరకు 212 ఎకరాలు భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగినది.
సమగ్ర ఉద్యాన మిషన్ పథకము.
ఈ పథకం క్రింద పండ్ల తోటల పెంపకానికి 50%, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40% మరియు
సబ్సిడీ ఇవ్వబడును. 2025-26 సం.లో డ్రాగన్ ఫ్రూట్ తోట కొరకు 12.50 ఎకరాలు, బొప్పాయి తోట కొరకు 22.50 ఎకరాలు, మామిడి తోట (High Density పద్దతిలో ) కొరకు 25 ఎకరాలు, జామ తోట (High Density పద్దతిలో ) 5 ఎకరాలు, కూరగాయల నారు కొరకు 87.50 ఎకరాలు, పూల సాగు 47.50 ఎకరాలు, సుగంద ద్రవ్యాల విత్తనాల కొరకు 17.50 ఎకరాలు, మామిడి తోటల పునరుద్దరీకరణ కొరకు 50 ఎకరాలు, మల్చింగ్ కొరకు 125 ఎకరాలు, భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది . మరియు ఉద్యాన యాంత్రీకరణ పనిముట్లు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, పవర్ స్ప్రేయర్లు , బ్రష్ కట్టర్ల కు రాయితీ ఇవ్వబడం జరుగుతుంది..రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
ఈ పథకం క్రింద కూరగాయల సాగు శాశ్వత పందిరి నిర్మాణం కొరకు 2025-26 సం.లో 30 యూనిట్ల భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది.వెదురు మిషన్ పథకం
ఈ పథకం క్రింద వెదురు మొక్కలు పొలం సరిహద్దులపై నాటించడం కొరకు 2000 మొక్కల భౌతిక లక్ష్యం కేటాయించడం జరిగింది.రైతులు సద్వినియోగం చేసుకోవాలి.ఉద్యాన పంటలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఉద్యాన శాఖ అమలు చేస్తున్న పథకాల ను రైతులు సద్వినియోగం చేసు కోవాలి. ఆసక్తి కలిగిన రైతులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు. బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులు జత చేయాలి. మరిన్ని వివరాలకు ఉద్యాన అధికారుల వివరాలు

1. వి. గోవర్ధన్ , ఉద్యాన అధికారి ( సిరిసిల్ల డివిజన్) -8977714049.,2. సి హెచ్. లోకేష్, ఉద్యాన అధికారి (వేములవాడ డివిజన్) – 8977714048. ని సంప్రదించగలరు.

ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.

పరకాల నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తో కలిసి హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల,నడికూడా మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,కుంకుమేశ్వర స్వామి ఆలయకమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కమిటీ మరియు సమన్వయకమిటి సభ్యులు చిన్నల గొనాద్,మంద రాంచెందర్,బొచ్చు చెందర్,చందుపట్ల రాఘవరెడ్డి,పంచగిరి జయమ్మ, మార్క రఘుపతి గౌడ్,పసుల రమేష్,మడికొండ సంపత్ కుమార్,మాజీ జెడ్పిటిసి పాడి కల్పన దేవి ప్రతాపరెడ్డి దుబాసి వెంకట స్వామి,అనిల్,పోరండ్ల వేణు,ఒంటెరు శ్రవణ్, మంద నాగరాజు,దార్న వేణుగోపాల్,గడ్డం శివ,లక్కమ్ వసంత,బొమ్మకంటి చంద్రమోలి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version