బి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ నాయకుడు.

బి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ నాయకుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శంకర్ సాగర్ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వెంకటేశం ,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్,సీనియర్ నాయకులు కలిమ్,ఆర్ సుభాష్,మర్తుజా ,విజయ్,వెంకట్ సాగర్,రాథోడ్ భీమ్ రావు నాయక్,మోహన్ రాథోడ్,రాథోడ్ ప్రేమ్ సింగ్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ‘ కార్యక్రమం.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ‘ కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు మే 24న సిరిసిల్ల మండలం, బోనాల గ్రామం, రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ” కార్యక్రమంను నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో రైతులు పంటలకు సిఫార్సు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలని , అధిక మోతాదులో యూరియా వాడకం వలన కలిగే నష్టాలను వివరిస్తూ, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్, పేడ ఎరువులను వినియోగించాలని సూచించారు.

 

భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను వాడడం వలన సాగు ఖర్చు తగ్గిoచవచ్చు అని సూచించారు.

 

అoతేకాకుండా, చీడ పీడల ఉధృతిని బట్టి సరియైన మోతాదులో రసాయనిక మందులను వాడడం మరియు జీవ ఎరవుల పై అవగాహన కల్పించారు.

 

అలాగే పంట మార్పిడి అవశ్యకత మరియు పచ్చిరొట్టెల ఎరవు లాభాల గురించి తెలపడం జరిగింది.

 

వాటితో పాటు పామాయిల్ సాగు వలన కలిగే లాభాలను గురించి తెలపడం జరిగింది.

 

పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించడం, పంట వైఫల్యాల సమయంలో పంట భీమా పొందే విధీ విధానాలను మరియు రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం యొక్క ఆవశ్యకతను విపులంగా వివరించారు.

 

సుస్థిరమైన వ్యవసాయంలో పంట మార్పిడి యొక్క ప్రాముఖ్యతను, సాగునీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం మరియు కశేరుక కీటకాల, నిర్వహణపై సమాచారాన్ని వివరించారు.

 

రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

అనంతరం శాస్త్రవేత్తలు, రైతులు, అధికారులు, ఈ కార్యక్రమంలో తెలుసుకున్న అంశాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

 

ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల, వ్యవసాయ శాస్త్రవేత్తలు, డా. కె. కనక దుర్గ మరియు కె. భవ్యశ్రీ., యo.ఏ.ఓ., సిరిసిల్ల కె . సందీప్ , హార్టికల్చర్ ఆఫీసర్ వి.గోవర్ధన్, విద్యార్థులు, ఆర్. ఆశిష్ మరియు జె. శిరీష , రైతులు, మరియు మహిళా రైతులు పాల్గొన్నారు.

అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.

అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాశిబుగ్గ నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పరిధిలోని రూ 99.80 లక్షలతో చేపట్టిన ఏకశిల జంక్షన్ అభివృద్ధి పనులకు,98 లక్షలతో గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి పనులకు మరియు 80 లక్షలతో గొర్రెకుంట అంబేద్కర్ జంక్షన్ నుండి రెడ్డిపాలెం క్రాస్ రోడ్ వరకు నిర్మించనున్న వరద కాలువ నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ప్రజా సమస్యల మీద డివిజన్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించామని,ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు.డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాను అని తెలిపారు.ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. త్వరలో డివిజన్ లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇప్పటికే గీసుగోండ,సంగెం,ఆత్మకూరు, దామెరలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో 3 బ్యాచ్ లు పూర్తి చేసుకున్నారన్నారు. మహిళా సోదరీమణులను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని,దానికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.డివిజన్ లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మంచినీరు, శానిటేషన్,లైటింగ్ కూడా ప్రాధాన్యతమైనవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

చదువుల తల్లి గుల్లపల్లి అభినయ ఉన్నత చదువులకు.!

చదువుల తల్లి గుల్లపల్లి అభినయ ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం

కరీంనగర్ నేటిధాత్రి:

హెల్పింగ్ హాండ్స్(ఎన్ఆర్ఐ, యూఎస్ఏ) సహకారంతో రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోక్కెరకుంట గ్రామానికి చెందిన గుల్లపల్లి అభినయ ఇంటర్మీడియట్ లో 984 మార్కులు సాధించిన సందర్భంగా ఇంజినీరింగ్ మొదటి విద్యా సంవత్సరానికి గాను పది వేల రూపాయలు ఆర్ధిక సహయం అందించామని యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్, రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఇంజినీరింగ్ విద్యలో భాగంగా తర్వాత మూడు సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మొత్తంగా నాలుగు సంవత్సరాలకు గాను యాభై ఐదువేల రూపాయలు సహయం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్, రిటైర్డ్ టీచర్ తౌటు కిషన్ రెడ్డి, బత్తిని అజయ్, జేరిపోతుల మహేష్, గజ్జెల నవీన్ కుమార్, ఎండి చోటే, తదితరులు పాల్గొన్నారు.

పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే.

పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పర్యటనలో భాగంగా కరకగూడెం మండలంలోని సమత్ బట్టుపల్లి, బట్టుపల్లి గ్రామపంచాయతీ, రేగళ్ల గ్రామపంచాయతీ, కన్నయ్య గూడెం గ్రామపంచాయతీలలో 70 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన పలు సిసి రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి, తిరుపతయ్య, తోలం నాగేశ్వరరావు, ఎర్ర సురేష్, మండల మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అది ఎన్కౌంటర్ కాదు బూటకపు ఎన్కౌంటర్ ఆర్సిఎస్.

అది ఎన్కౌంటర్ కాదు బూటకపు ఎన్కౌంటర్ ఆర్సిఎస్ స్పష్టీకరణ

కరీంనగర్ నేటిధాత్రి:

సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు @ బస్వరాజ్తో సహా ఇరవై ఆరు మంది ఆదివాసి కామ్రేడ్ను పట్టుకొని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయడాన్ని రైతుకూలీ సంఘం (ఆర్సిఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరి సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. పీడిత ప్రజలతో సహా ఆదివాసుల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి బూటకపు ఎన్ కౌంటర్లో అమరులైన కామ్రేడ్స్ అందరికీ రైతు కూలీ సంఘం (ఆర్సిఎస్) రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది. వారి అమరత్వం వృధా కాదని ప్రకటిస్తుంది. మోడీ- అమిత్ సృష్టించి, నడుపుతున్న నరహంతక “ఆపరేషన్ కగార్” ఆపరేషన్ రక్తదాహానికి మరో సజీవ సాక్ష్యం ఇది. ఈనరహంతక చర్యలను ఖండించవలసిందిగా ప్రజలను ప్రజాస్వామిక వాదులను మేధావులను కోరుతున్నది. వాస్తవానికి సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు ఇటీవల అనారోగ్యానికి గురై ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పట్టుకొని తీసుకొని వచ్చి చత్తీస్ గడ్, నారాయణపూర్ అడవుల్లో ఆయనతో పాటు మరో ఇరవైఆరు మంది అమాయక ఆదివాసి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసి అత్యంత దారుణంగా హత్య చేసి ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించడం పట్ల రాజ్యాధిపతుల ఫాసిస్ట్ స్వభావం మరోసారి బహిర్గతమైనది. కొద్ది నెలలుగా కొనసాగుతున్న నరమేధం వలన సుమారు ఐదు వందల పైచిలుకు అమాయక ఆదివాసి ప్రజలు, పీడితవర్గ సమూహాల కోసం నిలబడి పోరాడుతున్న ప్రజాపోరు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈహంతక చర్యలు ఇకనైనా నివారించబడాలంటే తక్షణమే భేషరతుగా ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. సాయుధ బలగాలను వెనక్కి తీసుకొని శాంతియుతంగా చర్చల ద్వారా పీడిత వర్గాల కోసం పనిచేస్తున్న మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతుకూలీ సంఘం (ఆర్సిఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

సిపిఐ 23వ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి సిపిఐ.

సిపిఐ 23వ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి-సిపిఐ

కరీంనగర్ నేటిధాత్రి:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మహాసభ కరపత్రాన్ని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్భంగా సిపిఐ నగర కార్యదర్శికసిరెడ్డిసురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఆవిర్భవించిందని బ్రిటిష్ వలసవాదుల నుండి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని స్వాతంత్రోద్యమంలో పాల్గొని కీలక భూమిక పోషించిన పార్టీ సిపిఐ అని దేశం కోసం దేశ ప్రజల కోసం జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపిందని పెట్టుబడిదారి విధానానికి, దోపిడీకి, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక కర్షక ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించి అనేక విజయాలు సాధించిన ఘనమైన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. దున్నేవాడికే భూమి కావాలని భూమి కోసం భక్తి కోసంవెట్టి చాకిరి,విముక్తి కోసం, బానిసత్వం పోవాలని విరోచితంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాట రహితంగానికి సిపిఐ నాయకత్వం వహించిందని పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచిన పార్టీ అని నాలుగు వెల ఐదు వందల మంది అమరవీరుల ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. మహాసభలు ఈనెల 27వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ లోని మధు గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రారంభమవుతాయని ఈయొక్క ప్రారంభానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ లు హాజరవుతారని అన్నారు. ఈనెల 27, 28 తేదీలలో జరిగే మహాసభల్లో 300 మంది జిల్లాలో ఎంపిక కాబడ్డ ప్రతినిధులు పాల్గొంటారని, ఈసభలలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిస్తారని మహాసభల జయప్రదం కి కార్యకర్తలుకృషి చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి కోరారు. ఈకరపత్రంఆవిష్కరణలో సిపిఐ నగర సహాయ కార్యదర్శిలు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు కోశాధికారి బీర్ల పద్మ జిల్లా కౌన్సిల్ సభ్యులు నలవాల సదానందం, గామినేని సత్యం,తoగెళ్ల సంపత్, తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పాత్రికేయులతో.మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం జహీరాబాద్ పర్యటనలో కొత్తగా ఏమీ ఆశించేది లేదని .బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ కి భారీగా నిధులు మంజూరు చేస్తే బాగుండేది అని నాలుగు నియోజక వర్గాల రైతులు. సంతోషం వ్యక్తం చేసేవారన్నారు .జిల్లా లోని పలు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయిస్తే అన్ని వర్గాల వారు హర్షించేవారని ఇసంధరభంగా తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ దయ బట్టరు.కొత్తగా ఇచ్చిందేమి లేకపోగా గత కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటికే రిబ్బన్ కటింగ్ లు చేసి చేతులు దులుపుకున్నారు అని అన్నారు .రానున్న రోజుల్లో ప్రజలు కూడా చేతి వాటం తప్పకుండా చూపెడతారు అని గుర్తు పెట్టుకోవాలని .ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు .

నియోజకవర్గం అబివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు.!

నియోజకవర్గం అబివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా వివిధ ప్రారంభోత్సవం మరియు సభలో పాల్గొన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు
నియోజకవర్గం అబివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని, శుక్రవారం జహిరాబాద్ బహిరంగ సభ వేదిక పై స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు సిఎం రెవంత్ రెడ్డి ని అభ్యర్థించారు. ప్రతి గ్రామ పంచాయతీకి షాదీ ఖానా లకు సాగునీటి సౌకర్యానికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.

రఫీ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత చర్లపల్లి.

రఫీ,కుటుంబాన్ని పరామర్శించిన ఆర్టిఐ నేత,చర్లపల్లి చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా శుక్రవారం మొగుళ్లపల్లి మండలం గుడి పహాడ్ గ్రామానికి చెందిన మమ్మద్ రఫీ ఇటీవల అనారోగ్య కారణాల వలన మరణించాడు మృతుని,ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని రఫీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను పరామర్శించిన ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, మృతుని సోదరులు మహ్మద్ రాజ్ మహమ్మద్ ,అక్బర్ ,పాషా ఈ కార్యక్రమంలో, బుర్ర సమ్మయ్య కాంగ్రెస్ నాయకుడు రాజు, లింగంపల్లి,రాజేశ్వరరావు గిరబోయిన ఐలయ్య మేకల దేవేందర్ ,సాంబయ్య తదితరులు నివాళులర్పించారు

నూతన వదువరులను ఆశీర్వదించిన సోద రామకృష్ణ.

నూతన వదువరులను ఆశీర్వదించిన సోద రామకృష్ణ

పరకాల నేటిధాత్రి:

 

మండలంలోని అలియాబాద్ గ్రామానికి చెందిన జంగిలి జయపాల్ రావు నీరజ దంపతుల కూతురు సుస్మిత వెంకట సాయి తేజ్ ల వివాహ మహోత్సవం పట్టణంలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలోపరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఏకు రాజు,నాయకులు బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు.

పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం.

పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రీమ్ 100 ఆధ్వర్యంలో.. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, సినిమా హీరో, డ్రీమ్ 100 ఫౌండర్ మాలినేని కృష్ణ ఆధ్వర్యంలో రూ.1 భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలు ఆసుపత్రికి వచ్చి ఆకలితో బాధపడకుండా.. ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ‘అన్నదానం మహా దానం’ అన్నారు. కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. నిరుపేదలను ఆకలితో బాధపడకుండా ప్రతి ఒక్కరూ అన్నదానం చేయుటకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయలక్ష్మి తిరుపతి, హరి సింగ్, గుమ్మల్ల రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక.

శ్రీ రామాంజనేయ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక.

-అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్.

-ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ రామాంజనేయ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక శుక్రవారం జరిగింది.అధ్యక్షుడిగా పుప్పాల కమలాకర్,ఉపాధ్యక్షుడిగా శేరు రాజేశం,ప్రధాన కార్యదర్శిగా మారం నారాయణ,సహాయ కార్యదర్శిగా సోమిడి ప్రభాకర్,కోశాధికారిగా తోడేటి రవి లను ఏకిగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా మర్రి శ్రీకాంత్,సందెల శ్రీనివాస్,పునగుర్తి గట్టయ్య,బుడిమే కుమార్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ట్రాక్టర్ యూనియన్ బలోపేతం కోసం కృషి చేస్తామని యూనియన్ అభివృద్దే లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ ఓనర్లు,డ్రైవర్లు,రైతులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు.

ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ డివిజన్ లోని ( ఏకలవ్య గురుకుల మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్ )కొత్తగూడ నందు ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు నేటితో ముగీయనున్నదని కొత్తగూడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అజయ్ సింగ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో బైపీసీ ఎంపీసీ సీఈసీ ల ప్రవేశాల కొరకు అర్హత గల విద్యార్థులు మే 24 న నేటితో దరఖాస్తు ముగుస్తున్నందున విద్యార్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ ప్రాంత వాసుల ఆశల పై నీళ్లు చల్లిన రేవంత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పాత్రికేయులతో.మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం జహీరాబాద్ పర్యటనలో కొత్తగా ఏమీ ఆశించేది లేదని .బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ కి భారీగా నిధులు మంజూరు చేస్తే బాగుండేది అని నాలుగు నియోజక వర్గాల రైతులు. సంతోషం వ్యక్తం చేసేవారన్నారు .జిల్లా లోని పలు నియోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయిస్తే అన్ని వర్గాల వారు హర్షించేవారని ఇసంధరభంగా తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ దయ బట్టరు.కొత్తగా ఇచ్చిందేమి లేకపోగా గత కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన వాటికే రిబ్బన్ కటింగ్ లు చేసి చేతులు దులుపుకున్నారు అని అన్నారు .రానున్న రోజుల్లో ప్రజలు కూడా చేతి వాటం తప్పకుండా చూపెడతారు అని గుర్తు పెట్టుకోవాలని .ఈ సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు .

జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటం.

జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటం

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి

శాయంపేట మండల సిపిఐ పార్టీ 2వ మహాసభ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మాం దారి పేట వాసుల సమగ్రాభి వృద్ధికై సిపిఐ రాజీలేని పోరా టాలు నిర్వహిస్తుందని, గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇందిర మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి అన్నారు.

మండ లం.లోని పెద్ద కొడేపాక శివారు లో సిపిఐ శాయంపేట మండల 2వ మహాసభ ఘనంగా జరిగింది మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి జెండా ఆవిష్క రించారు.

అనంతరం ఎండీ అంకుషావలి అధ్యక్షతన జరిగిన మహాసభలో తోట భిక్షపతి మాట్లాడుతూ ఎన్ని కల సందర్భంగా హామీలను అమలు చేయడంలో పాలక పార్టీలు విఫలం అయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయిందని, దేశాన్ని కార్పొరేట్ లకు తాకట్టు పెట్టి దివాళా తీయించిందని అన్నారు.

మోడీ నమ్మిన బం టు ఆదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను దోచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు.

విపక్ష పార్టీల నాయకు లపై సిబిఐ, ఈడిలను ప్రయోగి స్తున్న మోడీ ప్రభుత్వం ఆదానీ పై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని, విభజన హామీలను అమలు చేయ కుండా రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం చేసారని అన్నారు.

రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తిగా ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా అర్హులైనపేదలకు అందించా లని, జిల్లాలో అసంపూర్తిగా ఉన్నా దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

మండలం లో ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు గుడిసె వాసులకు పట్టాలిచ్చి ఇందిర మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

జిల్లాలోని రైతాంగా నికి సాగునీరందించే ఎస్.ఆర్. ఎస్.పి, దేవాదుల కాలువ సమస్యలపై ఈ మధ్యకాలంలో సిపిఐ పోరాటం చేసిన ఫలితం గా రెండవ పంటకు కూడా నీళ్ళు ఇవ్వటానికి అధికార యంత్రాంగం ముందుకు వచ్చిందని తెలిపారు.

ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ కోసం జరిగిన పోరాటంలో సిపిఐ దే ఉమ్మడి జిల్లాలో అగ్రగామి పాత్ర అని, గ్రామాల్లో ఉపాధి హామీ, పట్టణoల్లో మున్సిపల్ వర్కర్స్, సంఘటిత, అసంఘ టిత కార్మికుల సమస్యలపై, నిలువనీడలేని పేదలకు ఇండ్ల స్థలాల కోసం గుడిసెల పోరా టాలు నడిపింది సిపిఐ అని, జిల్లా సమగ్ర అభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహి స్తుందని వారు అన్నారు.

Secretary Thota Bhikshapati.

 

ఈ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం, మండల సహాయ కార్యదర్శి అనుకారి అశోక్, సీనియర్ నాయకులు ఇల్లందుల సాంబయ్య, నాయకులు వల్లాల రమేష్, ఎండీ అంకుషావలి, సముద్రాల రవి, ముండది రమేష్, ఎండీ మైనొద్దిన్, సాంబయ్య, బోగి రమాదేవి, ఎండీ గౌసియా, రమాదేవి, బొంకురి కోమల, జోడు లక్ష్మీ మరియు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ మండల సమితి ఎన్నిక

సిపిఐ మండల కార్యదర్శిగా బత్తిని సదానందం, మండల సహాయ కార్యదర్శులుగా అనుకారి అశోక్, సముద్రాల రవి, 9 మంది కార్యవర్గం, 18 మందితో మండల కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఎన్నికలప్పుడే రాజకీయాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధే.!

ఎన్నికలప్పుడే రాజకీయాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఒక్క సారి కాదు 50 సార్లు కలుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.494.67 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తాను జడ్పీటీసీ స్థాయి నుంచి వివిధ పదవులు అలంకరించానని, అధికారంలో లేకపోయినా నిత్యం జనంలో ఉండి పనిచేశానని, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మాత్రం అధికారంలో పోగానే ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారని విమర్శించారు. తాను రాజకీయ విమర్శలు చేయదలచుకోలేదని, కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమించిన 1200 మంది అమరులయ్యారని, 10 ఏండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవే కాకుండా 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామని, పరిశ్రమల రాకతో ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. నిమ్ లో హుండాయ్ సంస్థకు 450 ఎకరాలు కేటాయించామని, త్వరలోనే సంస్థ కార్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నదాని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా జహీరాబాద్ మారనున్నదన్నారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తున్నామని, గతంలో కేసీఆర్ లాగా కేంద్రంతో సఖ్యత プ ఉండేవారు కాదని, చెరువు మీద కడుక్కోకపోతే…మనకే వాసన వస్తుందని విమర్శించారు.

నిమ్స్ భూ నిర్వాసితుకుల పరిహారం పెంచాం.

12500 ఎకరాల్లో ఏర్పాటైన నిమ్ లో చాలా మంది భూములు కోల్పోయారని వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తరువాత నిమ్డ్ అభివృద్ధి కుంటుపడిందని స్థానిక నాయకులు తనవద్దకు వచ్చి చెబుతే భూ సేకరణలో వేగం పెంచామని చెప్పారు. గత ప్రభుత్వం భూములు కోల్పోయిన ఎస్సీలకు రూ.2.50 లక్షలు, ఇతరుల సీలింగ్ భూమికి రూ.5 లక్షలు మాత్రం చెల్లించిందని తాను అధికారులను పిలిచి పేదలకు న్యాయం చేయాలని ఆదేశించిన సందర్భాన్ని సీఎం గుర్తు చేశారు. అంతే కాకుండా నిన్జ్ లో మొత్తం 5612 కుటుంబాలు భూములు కోల్పోయాయని, ఆ కుటుంబాలకు వారు కోరుకున్న చోట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మొత్తం కుటుంబాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి అందరికీ ఇండ్ల పట్టాలు అందించే బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. అందుకోసం తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఇతర అధికారులను ఆదేశించారు.

Politics

చరిత్ర మెదక్ ను మరచిపోదు…

మెదక్ నుంచే ఎంపీగా స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించి దేశ ప్రధానిగా సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే 1984 లో ఆమె ఆకరి రక్తం బొట్టు భూమిలో వదిలి పెట్టారన్నారు. మెదక్ ప్రజలు నాటి ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కు అండగా నిలబడుతూ వస్తున్నారన్నారు. ఇందిరమ్మ హయాంలోనే మెదక్ కు ఇక్రిశాట్, ఓడీఎప్, బీడీల్, బీహెచ్ఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయన్నారు. ఇందిరాగాంధీ తో పాటు బాగారెడ్డి, ఈశ్వరీబాయి, గీతారెడ్డి ఇలా ఎందరో మెదక్ గుర్తుండిపోయే నాయకులున్నారన్నారు. నిన్జ్ ను జహీరాబాద్ కు గీతారెడ్డి తీసుకువచ్చారని, ఈ ప్రాంతం అభివృద్ధిలో వారి పాత్ర గొప్పదని సీఎం గుర్తు చేశారు.

బసవేశ్వరుడు బాటలో కాంగ్రెస్ పాలన.

విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ యాత్రలో భాగంగా బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని రాహుల్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కులగణన చేపట్టిందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచిక భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి అన్నారు.

అన్నదాతకు అండగా ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉన్నదని సీఎం చెప్పారు. రూ.26 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, ఎకరాకు రూ.5 వేలుగా ఉన్న రైతు భరోసాను రూ.6వేలకు పెంచామని, భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే రూ.12 వేలు అందిస్తున్నాం, వరి వేస్తే ఉరే అని గత ప్రభుత్వ పెద్దలు చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోసన్ ఇస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఆడబిడ్డల కోసం గత 18 నెలల కాలంలో ఉచిత బస్సు ప్రయాణానికి రూ.5500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత ఏడాదిలో స్వయం సహాయక సంఘాలకు రూ.20వేల కోట్ల బ్యాంకు లింకేజీలు ఉంటే ఈ ఏడాది రూ.21 వేల కోట్ల లింకేజికి పెంచామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రానున్న నాలుగేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సులను, పెట్రోల్ బంకులను అమ్మా ఆదర్శ పాఠశాలల నిర్వహణ, నిత్యావసరాల సరుకుల పంపిణీ వంటి వాటిలో మహిళల బాధ్యతలు పెంచి వారిచే నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.

Politics

నిండుమనుసుతో దీవించండి…

రాష్ట్ర ప్రభుత్వ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నదని, ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యువత, నిరుద్యోగులకు సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఎప్పుడూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎవరు ఏమనుకున్నా సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని ఇతర స్థానాలను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని, వన్ ట్రిలియన్ ఎకనామీ రాష్ట్రంగా, తెలంగాణ ను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. టోక్యో, న్యూయార్క్ సిటీలకు సరసనా భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ కానున్నదని అంతవరకు నిద్రపోనున్నారు. ఇదెలా ఉండగా జహీరాబాద్ చెక్కల పరిశ్రమ ఏర్పాటు కోసం నిఱ్ఱ లో 100 ఎకరాల కేటాయిస్తామని, నిధులు కూడా అందిస్తామని, సింగూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సంజీవరెడ్డి, నీలం మధు ముదిరాజ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

-చదువు అన్నారెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి

 

కాలేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కుట్రలకు తెరలేపిందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేశాడని, రైతుల సాగునీటి ఘోష తీర్చేందుకు భగీరథుడిలా కంకణం కట్టుకున్నారన్నారు. తెలంగాణను ధాన్యకారంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు. కేసీఆర్ తెలంగాణకు ఏం అన్యాయం చేశాడని నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. వీటిని ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు నోటీసులుగానే పరిగణిస్తామని తెలిపారు. విచారణ పేరుతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తే..తెలంగాణ మరోసారి మర్ల పడుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను ఇబ్బందులు పెడితే..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఫలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయత్నం.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మాధవరెడ్డి వినతి..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందనతో..వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన సివిల్ సప్లై కమిషనర్..

6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జీఓ జారీ..

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.

రైతుల అభివృద్దే నా లక్ష్యం.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

అకాల వర్షాలతో నోటికాడికచ్చిన పంటలు నీటిపాలయ్యాయి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద,వ్యయసాయ మార్కెట్ వద్ద, వరి కళ్ళాల వద్ద రైతులు ఆరబోసిన,అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన వరిదాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యాయి.రైతుల కష్టాలను చూసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెంటనే స్పందించారు.రాష్ట్ర మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని ఈ నెల 22 న వినతిపత్రం సమర్పించి వేడుకొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభ్యర్థన మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్ లను ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాకు 7500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వగా వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల తడిసిన వరిధాన్యాన్ని బాయిల్డ్ వరిధాన్యంగా పరిగణించి వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన కాఫీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో వాటిని చూసిన రైతులు,సమాచారం పలువురు నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

రైతుల అభివృద్దే నా లక్ష్యం…. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

Narsampet MLA Donthi Madhav Reddy..

 

నర్సంపేట నియోజవర్గంలో రైతుల అభివృద్దే లక్ష్యంగా కృషిచేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.యాసంగి సాగులో అనుకూల పంటలు పండించిన రైతులను వరిధాన్యం అమ్మకాల సమయంలో రైతులకు మేలు జరిగినప్పటికీ కొందరి రైతులకు అకాల వర్షాలతో నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నది ఎమ్మెల్యే పేర్కొన్నారు.గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని సుమారు 4 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని తెలిపారు.రైతుల కన్నీళ్లను తుడ్చాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర మార్కెటింగ్ , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయాలని విన్నవించుకోగా సానుకూలంగా స్పందించి వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి జీవో జారీచేయండం చేయడం నర్సంపేట ప్రాంత రైతులకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రత్యేక చొరవతో నియోజకవర్గ రైతులను ఆదుకున్నందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Farmer Varanganti Praveen Reddy..

 

 

రైతులను ఆపదలు ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను అమ్మకాలు చేపట్టే వద్ద అకాల వర్షాల తీవ్రనష్టం చేశాయని, ఈ నేపథ్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రభుత్వంతో కోట్లాడి
రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక జీ.ఓ తెప్పించారని నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు వరంగంటి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలకు నిల్వ ఉంచిన ధాన్యం గత ఐదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయని దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి కొనుగోలు చేయడానికి రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ నుండి ఉత్తర్వులు జారీచేయడం రైతుల్లో ఆనందం వెళ్ళబుచ్చితోందని రైతు ప్రవీణ్ రెడ్డి తెలియజేశారు.

సకాలంలో రైతులకు అండగా ప్రభుత్వం ఉండడం అభినందనీయం..

Coffee issued by the government.

 

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్..

గత వారం రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని రైతులు అరుగాలం పండించిన వారి ధాన్యం పట్ల నష్టపోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వరంగల్ జిల్లాకు 6350 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణిస్తూ కొనుగోలు చేయాలని జీవో జారీ చేయడం అభినందనీయమని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం పరిధిలో వరిధాన్యం రైతులకు నష్టం వాటిల్లుతుందనే పిర్యాదులు సమాచారం మేరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి ఈనెల 22న రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కలిసి ప్రత్యేక మెమోరండం అందించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి సూచనల మేరకు వెంటనే స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారని తెలిపారు. రైతుల కోసం ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రభుత్వంపై చేపట్టిన విజయంగా భావిస్తున్నట్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Palai Srinivas, Chairman of Narsampet Market

 

 

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.

తీవ్రవాదం అంతమొందాలి
ప్రపంచ శాంతి వర్ధిల్లాలి

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాములు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

ప్రపంచ దేశాలను పట్టి పిడిస్తున్న తీవ్రవాదం అంతమొందించాలని. అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుతూ అఖిలభారత హనుమాన్ ప్రచార రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీరామ ధర్మ ప్రచారకుడు గాదెపాక రాములు స్వామి మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అఖండ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిన్న మొన్నటి వరకు మన దేశంపై ఉగ్రవాదులు దాడులు నిర్వహించి అమాయకులైన ప్రజలను పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ఎంతటి వారినైనా ఆ భగవంతుడు క్షమించడని వారికి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థించే చేతుల కన్నా తోటి వారికి సేవ చేసే భాగ్యం మిన్న అనే సూక్తితో ఒకరినొకరు సేవ. స్నేహభావంతో మెలిగినప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనే భావన ప్రతి మనిషిలోని ఉన్నప్పుడే ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థిక అభివృద్ధితోపాటు సుఖసంతోషాలతో ఉంటాయని ఆయన తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బాధ్యతగా సమాజంలోని గౌరవింపబడే విధంగా ఉన్నత స్థానాల్లో నిలబడాలని ఆయన కోరారు. దీనికోసం స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అఖండ జ్యోతిని వెలిగించానని ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version