సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చిన్న బోనాల మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గాం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, మరియు జిల్లా కలెక్టర్ కి , సంబంధిత జిల్లా పశు వైద్యాధికారులకు విన్నవించడం ఏమనగా, నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బోనాల లో నిన్న మమిండ్ల నాగరాజు అనే రైతు యొక్క ఆవు పిడుగుపాటు గురై మరణించడం జరిగినది తెలిపారు. ఆ రైతు యొక్క జీవన ఉపాధి పశువులపైనే ఆధారపడి ఉన్నందున, సుమారు 50 వేల నుండి 80 వేల విలువగల ఆవు మరణించినందునకు, ఆ రైతు రోధిస్తున్నాడు తెలిపారు.కావున వెంటనే ప్రభుత్వం తరఫున రైతుకు నష్ట పరిహారాన్ని చెల్లించి, జీవన ఉపాధిని కల్పించాలని స్థానిక మాజీ కౌన్సిలర్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలిపారు.

పిడుగు పడి రెండు ఎడ్లు మృతి.

*పిడుగు పడి రెండు ఎడ్లు మృతి

గంగాధర నేటిధాత్రి :

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

మండలానికి చెందిన కాచిరెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలతో కూడిన ఈదురు గాలులతో పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు దేశేట్టి లక్మివీరమల్లయ్యకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి. ఈ ఎడ్ల విలువ దాదాపు రూ.2 లక్షలుగా ఉంటుందని రైతు వాపోయారు. పిడుగు ఒక్కసారిగా పడడంతో ఎడ్లు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాయి. రైతు లక్మివీరమల్లయ్య ఆ ఎడ్లపైనే ఆధారపడిన నేపథ్యంలో, ఈ ఘటన అతనికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కల్గింది. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి

* పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి.*

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, డప్పుర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటుతో గ్రామానికి చెందిన మల్గి ఇస్మాయిల్ కుమారుడు సాబేర్ (15) మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులైన మరో ఐదుగురికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామ శివారులో గురువారము సాయంత్రం 3:30 పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి. కుప్పా నగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప.తనకున్న మేకలను మేత కోసం గ్రామ పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.ఒక్కసారిగా పిడుగుపడడంతో.మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు… పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప కు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు.
మేకలు మృతి చెందిన వార్త విన్న వెంటనే కుప్పా నగర్ గ్రామ సెక్రెటరీ స్వప్న ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఝరాసంగం మండల ఎంఆర్ఓ తిరుపతి రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు ఝరాసంగం సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ రైతులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version