ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసి అందజేత.

ఎమ్మెల్యే సహకారంతో ఎల్ఓసి అందజేత
• కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

నిజాంపేట: నేటి ధాత్రి
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రౌవు సహకారంతో 2,50,000 ఎల్ఓసి అందజేయడం జరిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మనుబోతు మైసవ్వ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో 2 లక్షల 50 వేల ఎల్ఓసి చెక్కును కాంగ్రెస్ నాయకులు జేల్లా లక్ష్మణ్ కుటుంబ సభ్యులు రాజుకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్ఓసికి సహకరించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కు, మైనంపల్లి హనుమంతరావుకు ఎల్లవేళల రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, రాములు, నరేష్ పాల్గొన్నారు

పోయిన ఫోన్ లనుCEIRపోర్టల్ ద్వారా బాధితులకు అప్పగింత.

పోయిన ఫోన్ లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులకు అప్పగింత

మొగుళ్లపల్లి మే 24 నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

మండలంలోని ఇప్పలపల్లి, బంగ్లాపల్లి గ్రామాలకు చెందిన గడ్డం కుమార్, బోయిన హర్షవర్ధన్,లు గత కొన్ని రోజుల క్రితం తమ చరవాణిలను ఎక్కడో పోగొట్టుకున్నారు. బాధితులు ఎంత వెతికిన చరవాణి దొరకపోవడంతో. మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో. ఎస్సై బొరగల అశోక్ ను బాధితులు సంప్రదించి విషయం వివరించడంతో. ఎస్ఐ. అశోక్ స్పందించి హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సిఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ జ్యోతి కి ఆదేశాలు జారిచేయడంతో. పోగొట్టుకున్న వారి ఫోన్ లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి శనివారం రోజున బాధితులను పోలీస్ స్టేషన్ కు రప్పించి చరవాణిలను హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, బాధితులకు అప్పగించారు. చరవాణి ని ట్రేస్ చేయడంలో ముఖ్యపాత్ర వహించిన సీఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ కానిస్టేబుల్ జ్యోతిని ఎస్ఐ. అభినందించగా. చరవాణిని పోగొట్టుకున్న బాధితులు గడ్డం కుమార్ బోయిన హర్షవర్ధన్, ఎస్సై అశోక్ ను పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

పెండింగ్ బిల్లుల విడుదలకు కార్యదర్శుల విజ్ఞప్తి

కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి:

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో గ్రామ పంచాయతీ కార్యకలాపాల నిర్వాహణ కోసం పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. మార్చి నుండి నిర్వహణ సాధ్యం కాదని వారు పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం మండలంలో ఎంపీడీవో కమలాకర్ కు, ఎంపీవో రాములుకు వినతిపత్రాలు అందజేశారు. గతేడాది ఆగస్ట్ నుండి పెండింగ్లో ఉన్న చెక్కుల చెల్లింపులు మరియు జీపీ నిర్వహణ నిధులు విడుదల చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు వినోద్, రాము, లక్ష్మణ్ బాలరాజ్, కృష్ణ, సునీల్, సాయిబాబా, గులాబ్, హుస్సేన్, భాస్కర్, రవి, అంబయ్య, శేఖర్, వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version