జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల.

జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను WWW. bsetelangana. cgg. gov. in సెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ మూడవ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు

ముత్తారం :- నేటి ధాత్రి:

 

ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ముత్తారం ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎస్ ఐ నరేష్ తెలిపారు

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.

మండల విద్యాశాఖ అధికారి రఘపతి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల విద్యాశాఖ అధికారి కోడెపాక రఘుపతి తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష
కేంద్రంలో 160 మంది విద్యార్థులు, బాలికల గురుకుల పాఠశాల కేంద్రంలో 190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీ నుండి గురువారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరిగాయి. మొత్తం 443 మంది విద్యార్థులకు గాను.. 4 గైర్హాజరు కాగా.. 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ.. ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version