సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్…

సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్

తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్‌ సైట్లు పని చేయని పరిస్థితి.

సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులకే సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. ఏకంగా పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్‌సైట్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో వారం రోజులుగా రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి. వెబ్ సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నంబర్లు కూడా హ్యాక్‌‌కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో రెండు కమిషనరేట్ల ఐటీ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి.
వెబ్‌ సైట్ల పునరుద్ధరణకు నేషనల్ ఇన్ఫర్‌మేటిక్స్ సెంటర్ (NIC) పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు పనిచేస్తున్నారు. రెండు కమిషనరేట్ల వెబ్‌సైట్లకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు అప్డేట్ చేయిస్తున్నారు. మరోసారి హ్యాకింగ్‌కు గురి కాకుండా అధునాతన ఫైర్వాల్స్ ఐటీ టీమ్ ఆడిట్ చేస్తోంది. రెండు కమిషనరేట్లకు చెందిన వెబ్‌సైట్లకు హ్యాకింగ్‌ చేసిన ముఠాను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు.

సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు

సి.ఐ రాజ్ కుమార్ గౌడ్

మరిపెడ నేటిధాత్రి:

మరిపెడ మండల కేంద్రములో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదురోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సైబర్ క్రైమ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనితా దేవి అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్.రాజ్ కుమార్ గౌడ్ హాజరై ఉపాధ్యాయులు ఎవరు కూడా సైబర్ నేరస్థుల ఉచ్చులోపడొద్దని అన్నారు.సైబర్ నేరస్థుల వలలో చిక్కుకొని డబ్బులు నష్టపోవద్దని, ఆన్లైన్ బెట్టింగ్ లతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు.మార్కేట్లలో విరివిగా వాడుతున్న సోషల్ మీడియా లో పై అవగాహన కల్పించారు.యాప్ లను అవసరం మేరకే వాడాలని దుర్వినియోగం చేయొద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సంతోష్ కుమార్,అంజమ్మ,రిసోర్స్ పర్సన్స్ లింగాల మహేష్ గౌడ్, దోమల లింగయ్య,యాదగిరి,వెంకన్న,శ్రీను,మంగూ,మంగీలాల్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version