పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను బాధితులకు అప్పగిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుధాకర్
మొగులపల్లి నేటి ధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి, బంగ్లాపల్లి గ్రామాలకు చెందిన గడ్డం కుమార్, అన్న బోయిన హర్షవర్ధన్ లు ఇటీవల వారి సెల్ ఫోన్ లను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బి అశోక్ ఆదేశాల మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి శనివారం పోలీస్ స్టేషన్ లో బాధితులకు హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ చేతుల మీదుగా సెల్ ఫోన్ లను అప్పగించారు. ఈ సందర్భంగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను ట్రేస్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్..కానిస్టేబుల్ జ్యోతిని ఎస్ఐ బి అశోక్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ లు అభినందించారు.