ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు..

ఆన్లైన్ గేమ్స్..ఆగమైన ఊరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండల ఆయా గ్రామాలకు చెందిన యువకులు ప్రైవేట్ వ్యాపారాలు కంపెనీలో జాబ్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న.బెట్టింగ్ అలవాటు పడి నాశనం అవుతున్నారు,తన ఫ్రెండ్ను చూసి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో తెలిసివారి దగ్గర 5 నుంచి 10 రూపాయల మిత్తికి రూ.20 లక్షల వరకు అప్పులు చేస్తున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో చేసేదేమీ లేక తమకున్న భూమిలు ఫోన్లు బంగారము అమ్మి అప్పులు తీర్చేస్తున్నారు.

ఇదే గ్రామంలో వ్యవసాయంచేసుకుంటూ జీవనం సాగించే కొందరు వ్యక్తులు.. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డారు. చివరకు గేమ్స్ ఆడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా బానిసయ్యారు. గేమ్స్ లో పెట్టేందుకు తెలిసిన చోటల్లా అధికవడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి సుమారు రూ. లక్షల వేలలో వరకు అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తుండడంతో తనకున్న బంగారం ఫోన్లు భూములను అమ్మి కట్టేస్తున్నారు,

ఈజీ మనీపై ఆశతో అప్పులపాలైన యువకులు 11 నూటికి 5 నుంచి 10 రూపాయల చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ల వ్యసనం గ్రామాలకు సైతం పాకింది. తక్కువ టైమ్లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నారు. ఇందుకోసం అందిన కాదలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి గేమ్లలో పెద్దు న్నారు. సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల చాలాగ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు ఝరసంగం కోహిర్ మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండ
లంలోని ఒక్కొక్క గ్రామంలోనే సుమారు 20 మంది యువకులు ఒకరిని చూసుకుంటూ ఒకరు ఆన్లైన్ పేకాట, బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పైసలు పెట్టి భారీగా నష్టపోయారు.

మొదట్లో వందలు పెద్దే వేలు రావడంతో ఇదేదో లాభసాటిగా ఉందని నమ్మిన బాధితులు. చివరకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టే స్థాయికి చేరారు. భారీ మొత్తంలో పెట్టిన డబ్బులన్నీ కోల్పోవడంతో ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో అప్ప చేసి మళ్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒక్కొక్క గ్రామానికి చెందిన ఒక్కో యువకుడు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. అప్పులవాళ్ల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు తమకున్న ఎకరా, అర ఎకరం పొలాన్ని అమ్మి కొడుకులు చేసిన అప్పులు తీరుస్తున్నారు.

కుటుంబాల్లో గొడవలు

ఆన్లైన్ గేమ్స్ తో యువకులు ఆర్థికంగా నష్టపో తుందదంతో పాటు కుటుంబాల్లో గొడవలు జరు గుతున్నాయి. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య, భార్మా, భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. అప్పులు తీర్చేందుకు కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తుండటం, భూములు అమ్మే పరిస్థితి తలెత్తుతుండటంతో పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకు నేదాకా వెళ్లాయి. ‘ఆ పిలగాడు ఫోన్లో గేమ్ ఆడి మస్త్ పైసలు పోగొట్టిందట… మస్తు అప్పు అయ్యింది. కొంత భూమి అమ్మేసిండు, అయినా ఇంకా అప్పు ఉందట, ఇంకింత భూమి అమ్మితే గాని అప్పు తీరేట్టులేదు అనే మాటలు చల్మెడ గ్రామంలో వినిపిస్తున్నాయి.

రూ.10 మిస్తీకి తెస్తున్నరు

ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన యువకులు కొందరు ప్రైవేట్ ఫైనాన్స్ అప్పులు తీసుకుంటు న్నారు. దీనిని అదనుగా తీసుకుని ప్రైవేట్ ఫైనాన్స్
వ్యాపారులు వందకు రూ.5 నుంచి రూ.10 వరకు మిత్త వసూలు చేస్తున్నారు. దీంతో అసలుతో పాటు మిత్తీ భారీగా పెరిగిపోతున్నది. మండల కేంద్రమైన నిజాంపేటలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అను మతులు లేకుండా ఫైనాన్స్ లు నడిపే వ్యక్తులు అధిక వడ్డీకి అప్పులు ఇస్తుండడంతో పాటు, ష్యూరిటీగా భూములను ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత గడువులోగా అప్పు, మిత్రీడబ్బులు చెల్లించకుంటే ఆ భూములు తమవరం చేసుకుంటున్నట్లు తెలిసింది

అవగాహనతో అడ్డుకట్ట

గ్రామలలో అనేక మంది యువకులు ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడంతో పాటు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నది. యువత ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా పోలీసులు ఆయా గ్రామలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అధిక వడ్డీకి అప్పులిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దు

యువత బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దు. అప్పల ఊబిలో చిక్కుకోవద్దు. గ్రామాల్లో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్ పై అవగాహన కల్పిస్తాం. అలాగే, భూములు కుదవబెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిస్తున్నవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం.

ఝరాసంగం మండల ఎస్సై క్రాంతికుమార్ పటేల్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ సభ్యుడు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ విగ్నేశ్వర ఎఫ్పిఓ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ సోమవారం పట్టణంలోని ఎన్టిఆర్ నగర్ వద్ద ప్రారంభం చేశారు.ఎఫ్పిఓ అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి అధ్యక్షతన జరుగగా రామానంద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరైన కాంట పద్ధతి ద్వారా కొనుగోలు చెయ్యాలని తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంధ్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలుగూరి మధుకర్,ఎఫ్పిఓ డైరెక్టర్ చింతల సాంబరెడ్డి,బుర్ర మోహన్ రెడ్డి, చిలువేరు వెంకటేశ్వర్లు,కమిటీ సభ్యులు చిలువేరు కొమ్మలు, కొమురయ్య, రేమిడి శ్రీనివాస్, లింగాల సూరయ్య,శంకర్,హనుమయ్య, గాంగడి రాజమ్మల రెడ్డి, ఈక సత్యరాయణ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

,,నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు ,,

,,నేను రాను బిడ్డో సర్కారీ దవాఖానకు ,,

,,అధికారుల నిర్లక్ష్యం ఆశ్రద్ధతో కనీసం మందులు సూదులు లేక జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సామాన్య పేద ప్రజలకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలం అయిపోతుంది,,

◆:- పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు 500 నుండి 1000 మంది వరకు రోగులు వస్తూ ఉంటారు కానీ రోగులకు సేవలు చేయడంలో ప్రభుత్వాసుపత్రి పడకేయడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి తమ సమయాన్ని ధనమును కోల్పోతున్నారు ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లో కనీస మందులు లేక మందులుంటే సూదులు లేక చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు పేద రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు వీటన్నిటిని చూస్తూ ఆస్పత్రి ప్రధానాధికారులు నిర్లక్ష్యంగా

వ్యవహరిస్తున్నారు దీని మూలంగా ప్రజా సంక్షేమం కోరే ప్రజా పాలనపై ప్రజలు రోగులు లో లోపల గుసగుసలాడుతున్నారు ఇంత మంచి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న అధికారుల ఆశ్రద్ధతో నిర్లక్ష్యంతో ఆస్పత్రి రోజు రోజు కు రోగులకు సేవలు అందించడంలో విఫలమైపోతుంది సామాన్య రోగులు డాక్టర్లు రాసిన చీటీలతో మందులు ఇంజక్షన్లు పొందుటకు వెళితే ఈ మందులు సప్లై లేవు పైనుండే రావడం లేదని నేరుగా ప్రజలతో చెబుతున్నారు అదేవిధంగా వృద్ధులు వెళ్లి సూది తీయించుకోవాలి అంటే కనీసం సూదులు లేక ప్రైవేట్ మెడికల్ షాపుల వెనకాల తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారు జహీరాబాద్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్నది కాబట్టి జిల్లా మంత్రి ఆస్పత్రి పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందేలా స్థానిక ప్రజలు

సంతోషించేలా తగు చర్యలు తీసుకుంటారని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాము కాలానుగుణంగా వచ్చే వ్యాధులకు అంటే చర్మ వ్యాధులకు జలుబుకి దగ్గు జ్వరానికి సరైన మందులు లేవు కనీస మందులను అతి త్వరలో తెప్పించి స్థానిక పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జహీరాబాద్ ప్రజల పక్షాన జాగో తెలంగాణ ప్రశ్నిస్తుంది పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిజ్జ భాస్కర్ ఉస్మానియా యూనివర్సిటీ సభ్యులు మాదినం శివప్రసాద్ అరవింద్ ప్యార్ల దశరథ్ బాలు మొదలగు వారు పాల్గొన్నారు,

 అన్నదాత సుఖీభవ పథకం అమలు సర్కార్ సన్నద్ధం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T135205.845.wav?_=1

 

అన్నదాత సుఖీభవ పథకం అమలు సర్కార్ సన్నద్ధం.. మంత్రి కీలక సూచనలు

 

‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 19న ఈ పథకం నిధులను సర్కార్ విడుదల చేయనుంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది.

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) ఈరోజు (సోవారం) సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను కేంద్రం విడుదల చేయనుంది.
ఈ నెల 19న వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే.. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్‌పీసీఏలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

శిథిలావస్థలో హద్నూర్ పంచాయతీ భవనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T130115.975.wav?_=2

 

 

శిథిలావస్థలో హద్నూర్ పంచాయతీ భవనం

◆:- నూతన భవనం నిర్మించాలని డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలపరిధిలోని హద్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ
భవనం నిర్మింపబడి కొన్ని దశాబ్దాలు పూర్తి అయినందున పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్ని సంవత్సరాల నుండి పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉందని చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, గ్రామాన్ని అభివృద్ధి పరిచి, గ్రామ ప్రజల సంక్షేమాన్ని కోరే, గ్రామ పరిపా లన ప్రారంభమయ్యే గ్రామ పంచాయతీ కార్యాలయమే శిథిలావస్థలో ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, ఇక గ్రామ అభివృద్ధి ఎలా జరుగుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వీలైనంత త్వరలో భవన నిర్మాణం గురించి చర్యలు తీసుకోని పంచాయతీకి నూతన భవన నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు, సీహెచ్ నరేష్, ఏ వెంకటరెడ్డి, మంగలి లక్ష్మణ్, అనిల్ కుమార్, గ్రామప్రజలు కోరుతున్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T124839.865.wav?_=3

 

 

వివాహా వేడుకల్లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంగం మండల కేంద్రమైన శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం సమీపంలోని వేసవి కళ్యాణ మండపంలో బొగ్గుల జగదీశ్వర్ తాజా మాజీ సర్పంచ్ మేనత్త కూతురు
మేదపల్లి గ్రామం బి.సంగమేశ్వర్ కుమార్తె వివాహ కార్యక్రమం ఆహ్వాన మేరకు టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వివాహ కార్యక్రమంలో హాజరై వధూవరుడుని ఆశీర్వదించారు వారితో పాటు బిజీ సందీప్ బాల్ రెడ్డి నాగేశ్వర్ సజ్జన్ సద్దాం హుస్సేన్ సాగర్ పటేల్ బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు,

వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T124044.112.wav?_=4

 

వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో చలి తాండవిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఈ ప్రాంతాల గ్రామాలు, పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి మరింతగా వణికిస్తోంది. సోమవారం జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ పట్టణంలో 7.1 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్ల గాలులు వీయడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రంగా ఉండడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికాలం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జిల్లాలో అత్యల్పంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి:

సదాశివపేట్ 7.9°, న్యాల్‌కల్ 8.0°, ఝరాసంగం 8.1°, మొగుడంపల్లి 8.2°, జహీరాబాద్, నల్లవల్లి, సత్వార్ 8.6°, మల్‌చల్మె 9.1°, దిగ్వాల్ 9.3°, పుల్కల్, కంగ్టి 9.8°, నిజాంపేట్ 9.9°, రాయికోడ్ 10.3°, జిన్నారం 10.4°, కొండాపూర్, హత్నూర్ 10.6°, నాగలిగిద, మునిపల్లి, కంది 10.9°, చౌటకూర్ 11.0°, గుమ్మడిదల 11.2°, అందోల్ 11.3°, కల్హేర్ 11.4°, ముక్తాపూర్, అన్నసాగర్ 11.5°, సంగారెడ్డి (కలెక్టరేట్) 11.6°, కంకోల్ 12.1°, వట్టిపల్లి 12.2°, పాశమైలారం 12.5°, రామచంద్రపురం (గీతం) 12.6°, పటాన్‌చెరు 14.4°, బీఏచ్‌ఈఎల్ 15.1°, అమీన్‌పూర్ (సుల్తాన్‌పూర్) 15.5° కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి.. డాక్టర్ రమ్య, మండల వైద్యాధికారిణి, ఝరాసంగం

దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారు సరైన సమయానికి మందులు వేసుకోవాలి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, చిన్నారులు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీక్యాప్‌లు ధరించాలి. వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.

విజయం కోసం కృషి చేసిన నాయకుని ఘనంగా సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T123107.878.wav?_=5

 

విజయం కోసం కృషి చేసిన నాయకుని ఘనంగా సన్మానం

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి విజయం సాధించిన తర్వాత మొదటి సారి జహీరాబాద్ విచ్చేసిన సందర్భంగా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి కలిసి శాలువా పులమలలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ముల్తాన్,సిడిసి చైర్మన్ ముబీన్ జహీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి యువ నాయకులు నాగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నవాజ్ రెడ్డి, అభిలాష్ రెడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు,

ఈద్గా సమీపంలోని ఒక ప్రైవేట్ భవనంలో అక్రమంగా మద్యం దుకాణం ఏర్పాటు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T121608.973.wav?_=6

 

ఈద్గా సమీపంలోని ఒక ప్రైవేట్ భవనంలో అక్రమంగా మద్యం దుకాణం ఏర్పాటు

 ముస్లిం సంస్థలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దీనిపై ఆర్డిఓ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్‌లోని 65వ జాతీయ రహదారిపై అత్యంత రద్దీగా ఉండే బాగా రెడ్డి విగ్రహం ఫ్లైఓవర్ వంతెన సమీపంలోని ఒక ప్రైవేట్ భవనంలో ఈద్గా మరియు శ్మశానవాటిక సమీపంలో ఏర్పాటు చేసిన అక్రమ మద్యం దుకాణంపై ముస్లిం సంస్థలు మరియు స్థానిక యువకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ అక్రమ మద్యం దుకాణంపై ముస్లిం సంస్థలు మరియు స్థానిక యువకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ మజీద్, అధ్యక్షుడు ఎంపీ బే ముహమ్మద్ అయూబ్ అహ్మద్, ముహమ్మద్ ఇనాయత్ అలీ కాంగ్రాస్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జహీరాబాద్ ఆర్డీఓ, ఎక్సైజ్ శాఖ మరియు స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఒక మెమోరాండం సమర్పించింది.

ప్రార్థనా స్థలాలు ముస్లిం మరియు ముస్లిమేతర శ్మశానవాటికల సమీపంలో మద్యం దుకాణానికి ఆమోదం చట్టవిరుద్ధమని ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది ఈ ప్రాంత శాంతి, మత పవిత్రతకు మరియు స్థానిక జనాభాకు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రైవేట్ భవనంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ఇప్పటికే నివాసితులకు ఇబ్బందిగా మారింది. జిల్లా కలెక్టర్ మరియు ఎక్సైజ్ శాఖ నుండి తక్షణ చర్యలు తీసుకోవాలని మరియు అనుమతిని రద్దు చేయాలని ప్రతినిధి బృందం గట్టిగా డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సేల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ షరీఫ్ ముహమ్మద్ మెహబూబ్ ఫురి ముఖ్తార్ అహ్మద్ ముహమ్మద్ యా సుర్ఖాన్ ముహమ్మద్ షాబాజ్ అహ్మద్ బసీర్ వసీం తాజుద్దీన్ సైహుద్దీన్ మోయిన్ మరియు ఇతర యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేవాలయానికి విరాళం ప్రకటించిన NRI.

దేవాలయానికి విరాళం ప్రకటించిన NRI.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దొడ్డ సమ్మయ్య శ్రీదేవి దంపతులు (ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ సోదరుడు) .అడవి శ్రీరాంపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం మరియు అయ్యప్ప స్వామి దేవాలయానికి 1,50,000 ఒక లక్ష యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరియు ఇంత విరాళం ఇచ్చినందుకు వారి కుటుంబానికి గ్రామస్తులు ఆలయ కమిటీ మరియు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేశారు

కన్నుల పండుగగా అయ్యప్పస్వామి పడిపూజ…

కన్నుల పండుగగా అయ్యప్పస్వామి పడిపూజ

ఉత్తర నక్షత్రం సందర్భంగా అభిషేకాలు,ఘనంగా అన్నాభిషేకం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో 25 వ రజతోత్సవ మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో రెండోరోజు అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పదవ ఉత్తర నక్షత్ర ప్రత్యేక పడిపూజను శ్రీమాన్ బ్రహ్మ శ్రీ వెంకటేష్ శర్మ గురుస్వామి,ఘనాపాటి చంద్రమౌళి శర్మ తాంత్రిక పూజ,దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో

దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై గణపతిహోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ,అష్టాభిషేకాలు,మండల కళాశాభిషేకాలు చేపట్టగా మొదటిసారిగా అన్నాభిషేకం కార్యక్రమం నిర్వహించగా ప్రత్యేక ఆకర్షణగా నిలువగా భక్తులు ఎంతగానో తరించిపోయారు.పడిపూజ దాతలుగా సింగిరికొండ రజిని మాధవశంకర్ గుప్తా, అనంతుల రాజకళ రాంనారాయణ, గొర్రెపల్లి విజయలక్ష్మి శ్రీనివాస్, మద్దెనపల్లి అనితా దేవి ఉపేందర్,తోట ఉమారాణి బాల భాస్కర్ గుప్త, తోట స్వాతి రామ్మోహన్, వీరమల్ల ఇందిరా బాబు రెడ్డి కూతురు-అల్లుడు మండల మమత గౌరీ శంకర్ రెడ్డి కుటుంబాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.

ఆకర్షణ నిలిచిన అన్నాభిషేకం..

అయ్యప్పస్వామి దేవాలయంలో మొదటిసారిగా ఉత్తర నక్షత్ర, సిల్వర్ జూబ్లీ మహోత్సవ వేడుకల సందర్భంగా అయ్యప్ప స్వామికి అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వామి బ్రహ్మశ్రీ శ్రీమన్ వెంకటేష్ శర్మ అక్కడికి వచ్చిన మహిళా భక్తులతో అన్నాభిషేకం చేయించి వివిధ కూరగాయలతో అలంకరించారు. దీంతో అయ్యప్ప స్వామి ప్రత్యేక ఆకర్షణలలో భక్తులకు దర్శనమిచ్చారు.

సామూహిక పుష్పాభిషేకం..

మహా దివ్య పడిపూజ నిర్వహిస్తున్న సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వందలాదిమంది భక్తులతో అయ్యప్ప స్వామిపైన వివిధ రకాల పుష్పాలతో సామూహిక పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవాలయం పదునెట్టాంబడిపై కర్పూరలో వెలిగించగా జ్యోతిరూపంలో కనిపించగా ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగింది.ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, గురు స్వాములు, భజనబృందం,దేవాలయ అర్చకులు,పలువురు భక్తులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఇంచార్జి టిపివో వాణి ఓవరాక్షన్…

చేవెళ్ల ఇంచార్జి టిపివో వాణి ఓవరాక్షన్

•చేవెళ్ల మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణలు
* వివరణ కోరిన మీడియాతో టిపివో వాణి సినిమా డైలాగ్స్
* నేను కాల్ సెంటర్ ఏమన్నా పెట్టానా.
వివరణకు ఫోన్లు చేయొద్దు ఆఫీస్ కు వచ్చి మాట్లాడాలి
* అక్రమనిర్మాణలపై టీపీవో నిస్సహాయ వైఖరి, వారానికి ఒక్కరోజు డ్యూటీ, వచ్చినప్పుడే లెక్క.
* మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్న చేవెళ్ల ఇంచార్జి టిపిఓ వాణి.

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన మొయినాబాద్ టీపీవో, చేవెళ్ల ఇంచార్జీ టౌన్ ప్లాన్ అధికారిణి(టీపీవో) జి. వాణి ఓవరాక్షన్ పనులలో కంటే మాట్లాలోనే కనిపిస్తుంది. చేవెళ్ల మున్సిపల్ పట్టణ పరిదిలోని ఊరేళ్ళ
వార్డులో సర్వే నెంబర్ 195 లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది. ఈ అక్రమనిర్మాణంపై వార్తపత్రికల్లో
కథనాలు వచ్చాయి. వారం క్రితం మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను వివరణ కోరగా బదులుగా ఆయన టీపీవో ను అడగాలని తెలిపారు.శనివారం ఇదే విషయాన్ని ఇంచార్జ్ టీపీవో వాణి ని ఫోన్లో వివరణకోసం ఫోన్ చేసి ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అడిగిన విలేకరుతో ఆమె మాట్లాడుతూ ‘నేనేమన్నా కాల్ సెంటర్ పెట్టనా.. ఫోన్ చేసి అడగడానికి మీరు ఏదేమైనా ఆఫీస్ కి వచ్చి మాట్లాడాలి అంటూ సినిమా డైలాగులు మాట్లాడారు. టీపీఓ వాణి చేవెళ్ల ఇంచార్జ్ టీపీవో కావటంతో చేవెళ్ల మున్సిపాలిటీలో వారానికి రెండు రోజులు డ్యూటీ, అందులోను అక్రమనిర్మాణాలపై వారం రోజులుగా వార్త కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా టీపీఓ వాణి ఇప్పటి వరకు అక్రమానిర్మణానికి సంబందించి ఏ చర్యలు చేపట్టకపోవటం విడ్డురం.

* 111కు ట్రబుల్ షాట్•
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 111జీవోలో కోకొల్లలుగా వెలుస్తున్నాయి. 111జీవోలోని మొయినాబాద్ మున్సిపల్ పట్టణ పరిధిలోని మొయినాబాద్, అజిజ్ నగర్, చిలుకూరు, హిమాయత్ నగర్, సురంగల్, ఎనికెపల్లి ముర్తుజాగూడా గ్రామాలు మున్సిపల్ పరిధిలోనె ఉన్నాయి. ఈ గ్రామాలలో అక్రమ ఫామ్ హౌస్ లు, వెంచర్లు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. మొయినాబాద్ అక్రమనిర్మాణలపై వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. అక్కడా ఈ మేడం గారే విధులు వెలగబేడుతున్నారు కాని ఏ ఒక్క దానిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మొయినాబాద్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ లో వెలగబెట్టలేనిది చేవెళ్లలో అక్రమనిర్మాణాలకు అడ్డుకట్ట వేస్తారనుకోవటం కలే నని చేవెళ్ల, మొయినాబాద్ ప్రజలు ఆరోపిస్తున్నారు. నోటీసులు ఇస్తామని చెపుతున్న మున్సిపల్ అధికారుల మాటలు హాస్యస్పదమవు తున్నాయి. 3నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా యతేచ్చగా ఒక అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతున్నదనే విషయం అదుకారులకు తెలిసి కూడా ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు ఇవ్వని అధికారులు అదే విషయాన్ని రెండు నెలలుగా చెప్పటం హాస్యాని తలపిస్తుంది.

19న జరిగే సిపిఐ ప్రచార జాతా విజయవంతం చేయాలి…

19న జరిగే సిపిఐ ప్రచార జాతా విజయవంతం చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

సిపిఐ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా ఈనెల 19న జిల్లాలో నిర్వహించే సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు నవంబర్ 15న ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాత ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ ప్రచార జాతా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ లు హాజరవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదిలాబాద్ మంచిర్యాల, గోదావరిఖని, హుస్నాబాద్ హనుమకొండ మీదుగా ఈనెల 19న సాయంత్రం 4:30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి కళాజాత బృందం చేరుకుంటుందని, అదే రోజు 5:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం రాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే బస చేసి ఉదయం 10 :30 గంటలకు గణపురం నుండి ములుగు జిల్లాకు కళాజాత చేరుకుంటుందని రాజకుమార్ తెలిపారు. కావున జిల్లాలో ఉన్న సిపిఐ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, కూలీలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

భారీ బైక్ ర్యాలీ :

ఈనెల 19న సిపిఐ పార్టీ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాతా లో భాగంగా మంజూరు నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని కళాజాత అతిధులను మంజూరు నగర్ లో భారీ ఆహ్వానం పలికి పైకి ర్యాలీ ద్వారా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మోటపలుకుల రమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్ ఎండి. అస్లాం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

చోరీల పరంపరకు బ్రేక్ – జైల్లోకి నిందితుడు…

చోరీల పరంపరకు బ్రేక్ – జైల్లోకి నిందితుడు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

తోపనపల్లి మరియు బొల్లికొండ ఆయా చుట్టుపక్కల గ్రామాల్లో ఇటీవల వరుస చోరీలు జరగడంతో అప్రమత్తమైన నెక్కొండ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వ్యక్తి బానోతు అజయ్ కుమార్, వయస్సు 25, డ్రైవర్, బొల్లికొండ గ్రామానికి చెందిన అతని నుంచి 28 తులాల వెండి మరియు 1 తులం బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇతనిపై అనేక కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
నిందితుడిని మహబూబాబాద్ జైలు రిమాండ్ కు తరలించామని
నెక్కొండ ఎస్ఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

అవార్డు అందుకోబోతున్న డాక్టర్ ప్రవీణ్..

*అవార్డు అందుకోబోతున్న డాక్టర్ ప్రవీణ్..

*అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 25 వ వార్షికోత్సవ మహోత్సవం..

తిరుపతి(నేటిధాత్రి)

 

అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య 25 వ వార్షికోత్సవ మహోత్సవం లో
సకలకళా వల్లభ అవార్డును డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ అందుకోబోతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.విజయవాడ నగరంలోని గాంధీనగర్ నందు గల శ్రీ వెలిదండ్ల హనుమంతురాయ గ్రంథాలయం నందు ఈనెల 18 వ తేదీన మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు అవార్డు అందుకోబోతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని స్థానిక వాస్తవ్యులు ఎలమంచిలి ప్రవీణ్ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్నా, 17 సంవత్సరాలకే తండ్రిని కోల్పోయినా సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా కెరియర్ ప్రారంభించినా, అంచెలంచెలుగా ఎదుగుతూ తనకు వచ్చే ఆదాయంలోనే కొంత భాగం సేవా కార్యక్రమాలకి వెచ్చిస్తూ ప్రతి రంగంలోనూ తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నారు. ఎవరన్నా ఒక రంగంలో నిష్ణాతులై వారి ముద్రని వేసుకుంటారు కానీ ఎలమంచిలి ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి రంగంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారుపట్టుదలతో మరియు ఆకంటిత దీక్షతో గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాలలో దాదాపు1000 సామాజిక కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా దాదాపు 500 కార్యక్రమాలకు పైగా అతిథులుగా విచ్చేసి ఎన్నో, మరెన్నో అవార్డులు ప్రభుత్వ పురస్కారాలతో పాటు స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 50 (అర్థ సెంచరీ)పురస్కారాలను అందుకొని
1.విద్య రంగం, 2.క్రీడారంగం, 3.సినిమా రంగం,4.కళా రంగం,5.సాంస్కృతిక రంగం,6.సాంఘిక రంగం, 7.సేవా రంగం, 8.వైద్య రంగం , 9.వ్యవసాయ రంగం,
10.ఆధ్యాత్మిక రంగం,11.వ్యాపార రంగం
వంటి తదితర రంగాలలో విశిష్ట సేవలు పురస్కరించుకొని సకల కళా వల్లభ అవార్డును అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య వారు బహూకరించ నున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయమూర్తి దేవు. నరసింహారావు చేతులు మీదుగా ఈ పురస్కారాన్ని ఎలమంచిలి ప్రవీణ్ అందుకోనున్నారు.

బీహార్ లో ఎంఐఎం పార్టీ ఐదు సీట్లు గెలిచి సత్తా చాటింది..

బీహార్ లో ఎంఐఎం పార్టీ ఐదు సీట్లు గెలిచి సత్తా చాటింది

◆:- ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అయితే ఎంఐఎం పార్టీ ఐదు సీట్లు గెలిచి సత్తా చాటింది. ముస్లింలు అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం ప్రభావం చూపించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లనే.. ఇప్పుడు కూడా గెలిచింది. దీంతో తమ కంచుకోటలను కాపాడుకున్నట్లు అయింది. కాగా, కాంగ్రెస్ కంటే మెరుగైన ప్రదర్శనతో రాజకీయ వర్గాల్లో ఎంఐఎం చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాలపై తీర్పు స్పందించిన జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ .. బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాజీ మార్గమే రాజమార్గం…

రాజీ మార్గమే రాజమార్గం

రమేష్ బాబు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేసుల్లోని ఇరువర్గాలు రాజీమార్గం ద్వారా పయనించి కేసులను పరిష్కారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహె.చ్ రమేష్ బాబు తెలిపారు. కోర్టు ప్రాంగాణాల్లో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరైనారు. వారు మాట్లాడుతూ రాజీ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కక్షిదారుల యొక్క విలువైన సమయం డబ్బు వృధా కాకుండా ఉంటుందని అన్నారు. చిన్నచిన్న పంతాలు పట్టింపులకు పోయి పగలు ప్రతీకారాలు పెంచుకొని కేసుల్లో ఇరుక్కుని పోలీసులు కోర్టుల చుట్టూ తిరిగితే నష్టమే తప్ప లాభం ఉండదని ప్రతి ఒక్కరూ సోదరాభావంతో మెలగాలని జడ్జి గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నాగరాజ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ కాటారం డిఎస్పి సూర్యనారాయణ గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారీ, సీఐ నరేష్ కుమార్, పోలీసు అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

కంట మహేశ్వర ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతుంది..

కంట మహేశ్వర ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతుంది

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంలో గౌడ కులస్తులు నిర్మించనున్న కంట మహేశ్వర స్వామి దేవాలయ భూమి పూజా కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, సమాజ అభ్యున్నతి కోసం దేవాలయాలు కేవలం ఆరాధనా స్థలాలు మాత్రమే కాదు, ఐక్యతను పెంపొందించే ఆధ్యాత్మిక కేంద్రాలని అన్నారు.
“గౌడ కులస్తుల శ్రద్ధ, శక్తి, సంకల్పంతో రూపుదిద్దుకునే ఈ ఆలయం నెక్కొండకు మరో ఆధ్యాత్మిక చిరునామా కానుందని. ఈ దేవాలయం ద్వారా యువతలో ఆచార సంస్కృతులు మరింత పటిష్టం అవుతాయని, ప్రభుత్వంగా మత సంస్థల అభివృద్ధికి కావలసిన సహాయాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని ఎమ్మెల్యే మాధవరెడ్డి పేర్కొన్నారు.
కంట మహేశ్వర స్వామి ఆలయం నిర్మాణం గౌడ సమాజ ఏకగ్రీవ ఆశయమని, వారి దీక్ష, భక్తి ఈ నిర్మాణానికి బలమని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి సాయికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, మాదటి శ్రీనివాస్, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘ నాయకులు, కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వయోవృద్ధులను గౌరవించే భాధ్యత అందరిది..

వయోవృద్ధులను గౌరవించే భాధ్యత అందరిది
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ తూర్పు,నేటిధాత్రి:

 

వయోవృద్ధులను గౌరవిద్దాం – వారి అనుభవాల్ని స్వీకరిద్దామని అది మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకతాన్ (ర్యాలీ) నిర్వహించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండాఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈనెల 12 నుండి 19వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుండి భారత దేశ సంస్కృతిలో వయోవృద్ధులను గౌరవించడం మన సంస్కృతి అని,వారిపట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా ఉండేవారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో కూడా అలాగే వయోవృద్ధులను గౌరవించి వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.సమాజంలో వయోవృద్ధుల ప్రాముఖ్యత చాలా గొప్పదని, వారే దిశా నిర్దేశకులని చెప్పారు.అలాగే ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి మన కుటుంబంలో ఉన్న వయోవృద్ధులను అనగా గ్రాండ్ పేరెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారితో మర్యాదగా ఉండాలని, వారి అనుభవం పిల్లలకు చాలా స్ఫూర్తినిస్తుందని అన్నారు.ప్రస్తుతము వయోవృద్ధుల సమస్యలు మరియు పిల్లలు కొడుకులు కోడళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదని, వారిని ఇబ్బందులకు గురి చేస్తూ కొట్టడం తిట్టడం ఆస్తులు లాక్కోవడం ఇలాంటి సమస్యలు మా దృష్టికి చాలా వస్తున్నాయని,వారి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి మాట్లాడుతూ, వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూన్నామని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొడుకులు కోడళ్ళు, కూతుళ్లకి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారి బాధ్యతల్ని గుర్తింప చేస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లా మొత్తంగా వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టము మరియు టోల్ ఫ్రీ నెంబర్ 14567 గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి రాజమణి, డిఎంహెచ్ఓ సాంబశివరావు,డీఈవో రంగయ్య నాయుడు, సి డి పి ఓ లు విద్య మధురిమ,దెబోరా సూపర్వైజర్లు, డిసిపిఓ ఉమా ,సఖి అడ్మిన్ శ్రీలత,జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది,ఎఫ్ఆర్ఓ ,జిల్లా వయోవృద్ధుల కమిటీ మెంబర్స్ మల్లారెడ్డి,రాజేంద్రప్రసాద్,ప్రిన్సిపల్ వీర ఉపేందర్,టీచర్స్, సిబ్బంది 150 మంది విద్యార్థులు, జిల్లాలోని పలు ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు, వయోవృద్ధుల అసోసియేషన్ మెంబర్స్, వయోవృద్ధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version