శిథిలావస్థలో హద్నూర్ పంచాయతీ భవనం
◆:- నూతన భవనం నిర్మించాలని డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలపరిధిలోని హద్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ
భవనం నిర్మింపబడి కొన్ని దశాబ్దాలు పూర్తి అయినందున పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్ని సంవత్సరాల నుండి పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉందని చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, సంవత్సరాలు గడుస్తున్నాయి తప్ప ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, గ్రామాన్ని అభివృద్ధి పరిచి, గ్రామ ప్రజల సంక్షేమాన్ని కోరే, గ్రామ పరిపా లన ప్రారంభమయ్యే గ్రామ పంచాయతీ కార్యాలయమే శిథిలావస్థలో ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని, ఇక గ్రామ అభివృద్ధి ఎలా జరుగుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వీలైనంత త్వరలో భవన నిర్మాణం గురించి చర్యలు తీసుకోని పంచాయతీకి నూతన భవన నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు, సీహెచ్ నరేష్, ఏ వెంకటరెడ్డి, మంగలి లక్ష్మణ్, అనిల్ కుమార్, గ్రామప్రజలు కోరుతున్నారు.
