కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్న ఎంపీ మల్లు రవి.
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:
నేడు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి సాయంత్రం 3 గంటలకు భారీ ర్యాలీగా గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ (డిసిప్లేనరి) కమిటీ చైర్మన్గా నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ని ఏఐసీసీ నియమించిన సందర్బంగా నేడు సాయంత్రం గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ (డిసిప్లేనరి) కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్నారు. కావున ఈ సందర్బంగా 119 నియోజకవర్గల నుండి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా?..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 50వరకు పరిశ్రమలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మహీంద్రా&మహీంద్రా,దిగ్వాల్ పిరామిల్,రాక్ వూల్,విఎస్టీ,గిరిధర్ ఎక్స్ ప్లోజెస్,హాట్ సన్, మరియు కొత్తగా వచ్చేవి నీమ్జ్,ఇండస్ట్రీరియాల్ పార్క్,చాలా ఉన్నాయి.ఒక ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అక్కడ ఉన్న భూముల ధరలు,ఆ ప్రాంతంలో ప్రజా జీవనానికి అవసరమయ్యే కనీస ఖర్చులు పెరిగిపోతాయి,నియోజకవర్గంలో యువతకు ఉపాధి,ఉద్యోగాలు అయితే రాలేదు కానీ అన్నిటి ధరలు పెరిగిపోయాయి.ఒక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తుంది అవి తక్కువ ధరలకు భూములు,నీరు,విద్యుత్,పెట్టుబడిపై రాయితీలు,ట్యాక్స్ మినహాయింపు,రోడ్డు రవాణా సౌకర్యం మొదలైనవి కల్పిస్తారు,అందుకు స్థానిక పరిశ్రమలలో నైపుణ్యం లేని యువతకు 70% నుండి 80% మరియు నైపుణ్యం ఉన్న యువతకు 50% నుండి 60% స్థానికులనే భర్తీ చేయాల్సి ఉంటుంది కానీ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో ఎక్కడా కూడా స్థానికులకు ప్రాధాన్యత నిచ్చింది మాత్రం అంతంత మాత్రమే స్థానిక యువత ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు,దిగ్వాల్ రసాయన కర్మాగారం వల్ల ప్రజలకు ఉపాధి లేదు కానీ త్రాగడానికి నీరు దొరికే పరిస్థితి లేదు,చిలమామిడి శివారులో గల గిరిధర్ ఎక్స్ పోర్ట్ వల్ల చుట్టు ప్రక్కల ఇండ్లు కూలిపోయే పరిస్థితి, గోవిందపూర్ లో గల హాట్ సన్ పరిశ్రమలో డైరీకి సంబంధించి ఉత్పత్తి అవుతాయి కానీ దానికి కావాల్సిన పాలను ఎక్కడో బయటి నుండి తెప్పించుకుంటున్నారు ఉద్యోగాలు చూస్తే నైపుణ్యం గల వారు అంతా తమిళనాడు వారే నైపుణ్యం లేని వారిని యుపి,బీహార్,వారిని తీసుకున్నారు దీనిపై ఆరా తీసుకుందామంటే అక్కడ అధికారులు కనీసం మాట్లాడాటానికి కూడా సిద్ధంగా లేరు, నియోజకవర్గంలో సుమారు 2లక్షల 80 వేల మంది యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కానీ అది మర్చిపోయారు.వీటన్నిటిని బట్టి చూస్తే ఈ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి దొరకాలేదు కాని కాలుష్యం,కనీస వసతుల ధరలు పెరిగిపోయాయి మరియు ఇక్కడి సంపదను ఇతరులు కొల్లగొట్టుకుపోతున్నారు దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు/ ప్రభుత్వంపై ఉన్నది కానీ ప్రభుత్వం అది మర్చిపోయింది.పరిశ్రమల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగాలు కల్పించాలి లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం, స్థానిక యువత మొత్తం దీన్ని అర్థం చేసుకొని ప్రతిఘటించాల్సిన బాధ్యత యువతపై ఉన్నది త్వరలో ఉద్యమించి ఈ అన్యాయాన్ని అరికట్టాలని కోరారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,శ్రీనివాస్, లు ఉన్నారు.
ఆన్ లైన్ బెట్టింగ్ ఆడేందుకు న్యాల్కల్ మండలం రుక్మాపూర్ లో రాణేమ్మ అనే మహిళను ప్రశాంత్ (21) హత్య చేసినట్లు జహీరాబాద్ డిఎస్పీ సైదా తెలిపారు. పోలీస్ స్టేషన్ లో శనివారం వివరాలను వెల్లడించారు. ఈనెల 26వ తేదీన రాణెమ్మ (48) హత్య చేసి ఆభరణాలు నగదుతో ప్రశాంత్ పరారైనట్లు చెప్పారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుందని. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని. మండలంలో పాపాయి పల్లె. రామన్నపల్లి. బస్వాపూర్. నేరెళ్ల. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేసిన మని. ప్రజలకు అండగా ఉండి ప్రజా పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అని ఆయన పాలనలో రాష్ట్రకాంగ్రెస్ ప్రజా పరిపాలన సాగిస్తుందని. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేస్తూ ఆరోగ్యారంటీలు అమలు చేస్తున్నామని. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు పాలభిషేకం చేయడం జరిగిందని . ఇట్టి ఇందిరమ్మ ఇండ్లురావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్ కి. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కే కే మహేందర్ రెడ్డికి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ నాయకులు మునిగల రాజు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్. అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు కిషన్ లక్కీ గారు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఈరోజు ఏడుగురికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రజలందరూ ఇల్లు లేని వారు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారు అందరూ లబ్ధి పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలే కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని. ఇకనైనా లబ్ధిదారులందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గం గౌడు. గ్రామపంచాయతీ సెక్రెటరీ సమీర్. జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. మాజీ ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. కాంగ్రెస్ నాయకులు సుద్దాల కరుణాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరెపల్లి బాలు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం. సుద్దాల శ్రీనివాస్. హరీష్ రెడ్డి. మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి. ప్రతాప్ రెడ్డి మండల ఫిషరీస్ అధ్యక్షుడు ఇటికల మహేందర్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రం పేటలో దాడిచేసి ఓ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 15000 లంచం తీసుకుంటుండగా పెట్టుకున్న ఎసిబి అధికారులు. నాగరాజు ను ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ కార్యాలయం కు తరలించి విచారిస్తున్న అవిశా అధికారులు.జక్కాపురం మల్లేశం స్థలం కొలిసినందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి 80 వేలకు డీల్ కుదుర్చుకున్న సర్వేయర్.గతంలో 21 వేలు ఇవ్వగా, నేడు 15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సర్వేయర్ గురించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది
మండల వైద్యాధికారి అమరేందర్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారంతో మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు పొగాకు వ్యతిరేకత దినోత్సవం గురించి మండల ప్రజలు మరియు పేషంట్లతోని పొగాకు వాడడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు తెలియజేయుచు దీనిని వాడకూడదని వాడిన వారిని వాడకుండా చూడాలని చెప్పుచు అందరి చేత పొగాకు వాడకం నిరోధించుటకు ప్రతిజ్ఞ చేపించారు ఈ సందర్బంగా వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ పొగాకుతో అనుసంధానం అయినా పాన్ మసాలాలు తంబాకులు సిగరెట్లు వాడడం వల్ల త్రోట్ క్యాన్సర్ గాని లంగ్ క్యాన్సర్ గాని వివిధ రకములైన జబ్బులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఇలాంటివి వాడకూడదని తెలియజేసి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది. అందరితోని పొగాకు వాడమని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో పి ఎచ్ ఎన్ గ్రేసీ వన్ సూపర్వైజర్స్ రమాదేవి ఎమ్ ఎల్ ఎచ్ పి లావణ్య దీప్తి మరియు ఏఎన్ఎంలు రమాదేవి స్రవంతి సునీత కళావతి దుర్గమ్మ పుష్పలత మరియు ఆశా వర్కర్స్ స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ ఫార్మసిస్ట్ జగదీశ్వర్ మరియు భూపెల్లి మొగిలి పాల్గొన్నారు
నాటుసారా అమ్మిన తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును
సీఐ రాకేష్ కుమార్
ముత్తారం :- నేటి ధాత్రి
మల్హార్ రావు మండలం ఆడ్వాలపల్లి గాదంపల్లి మొదలగు గ్రామాల నుండి ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి అడవి శ్రీరాంపూర్ గ్రామాలకు బానోత్ రాజశేఖర్ నాటు సారాయి రవాణా చేస్తూ పలుమార్లు పట్టుబడి అతనిపై కేసులు నమోదు చేయడం జరిగింది ఆ తదుపరి అట్టి వ్యక్తిని ముత్తారం మండలం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ( తహసీల్దార్ ) ఎదుట ఒక సంవత్సర కాలం పాటు ఒక లక్ష రూపాయలకు బైండోవర్ చేయడం జరిగింది బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మరల నాటు సారాయి రవాణా కేసులో పట్టుబడినందుకు అట్టి వ్యక్తికి 40 వేల రూపాయల జరిమానాను విధించగా కట్టడం జరిగింది ఈ సందర్భంగా సీఐ రాకేష్ కుమార్ మాట్లాడుతూ ముత్తారం మండలంలో ఎవరైనా నాటు సారాయి అమ్మిన రవాణా వేసిన తయారు చేసిన అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి బైండోవర్ చేసి అట్టి వ్యక్తులను ఒక సంవత్సర కాలం పాటు జైలుకు పంపడం లేదా ఒక లక్ష రూపాయలు జరిమానా విధించబడునని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఐ సాయి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు
బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం వనపర్తి నేటిధాత్రి :
బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా అధ్యర్య ములో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ విలేకరులకు తెలిపారు పోస్టర్ ను బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ఆవిష్కరించారని తెలిపారు ఈ సందర్బంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా* వనపర్తి సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా సాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి సంయుక్తంలో ఉచిత కంటి వైద్య శిబిరం వనపర్తి జిల్లా పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని తెలపడం జరిగింది సోమవారం :ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అభయాంజనేయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర,ఉంటుందని తెలిపారు వనపర్తి ప్రజలు, ఉచిత.కంటి వైద్య శిబిరం లో పాల్గొనాలని కోరాడు పోస్టర్ ఆవిష్కరణ లో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ మార్కాట్ యార్డ్ చైర్మన్ లక్ష్మా రెడ్డి.మాణిక్యం కృష్ణయ్య రెడ్డి డేగ మహేశ్వర తిరుపతయ్య యాదవ్.ధర్మ నాయక్, సూర్యావంశం గిరి, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి, చిట్యాల రాము అలీం యుగేందర్ రెడ్డి సయ్యద్ జమీల్, జహంగీర్ కుమ్మరి సత్యంనాయక్, నరసింహ కరుణాకర్ బాలరాజు మునికుమార్, రామస్వామి నందిమల్ల సుబ్బు, సౌమ్య నాయక్ మరియు ముఖ్యులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారులు పదవి విరమణ పొందిన SI మారుతి , హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు తెలియజేశారు. 42 సంవత్సరాల విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి మరియు కొనరావుపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పీ.ఎస్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు భవిష్యత్ తారాల వారికి స్ఫూర్తిదాయకమని,ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.
SI Maruthi
పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
మట్టితో కూరుకుపోయిన కల్వర్టు కు మరమ్మత్తులు చేపట్టాలి
వర్షాలు పడక ముందే తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు గ్రామస్తుల విన్నపం
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద కల్వర్టు మట్టితో పూర్తిగా నిండి పోయింది. రాబోయే వర్షాలకు ముందే అధికారులు మట్టి పూడిక తీయించి వర్షపు నీరు పైపుల ద్వారా వెళ్లే విధంగా మరమ్మత్తులు చేసి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Culvert
గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు పైపులు పూర్తిగా మట్టితో చెత్తా చెదారంతో నిండి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగింది.అలాగే వర్షపు నీరు రోడ్డుపైకి చేరి చుట్టుపక్కల ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో కాలువ పక్కన నివసించే ప్రజలు త్రీవ ఇబ్బందులకు గురయ్యారు. ఈ సంవత్సరం కూడా అలాంటి సమస్యలు ఎదురుకాకముందే అధికారులు అప్రమత్తమై స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వాపోయారు.
ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్
భూపాలపల్లి నేటిధాత్రి
కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిసిన వారితో పొగాకు వాడటం మాన్పించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కోర్టు ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పొగాకు వాడటం వలన కాన్సర్ బారిన పడుతారని, మెదడు, గుండె ఊపితిత్తులకు చాలా ప్రమాదం అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
⏩ ‘ఎంజీఎం’ నిపుణుల నివేదిక కోసం బాధితుడి ఎదురుచూపులు ⏩‘బంధన్’ ఘటనపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్ట్ వచ్చేదెప్పుడు? ⏩8 నెలలు దాటుతున్నా ఫిర్యాదుపై కనీస పట్టింపు లేదు ⏩ఐఎంఏ సమక్షంలో తప్పు ఒప్పుకున్న సదరు ఆస్పత్రి వైద్యులు! ⏩ఆ నివేదిక ఆధారంగానే చర్యలు అంటున్న డీఎంహెచ్‌వో!
కాశిబుగ్గ నేటిధాత్రి
తనకు జరిగిన అన్యాయంపై త్వరితగతిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని ‘బంధన్’ హాస్పిటల్ బాధితుడు కృష్ణ వేడుకుంటున్నారు.గత ఏడాది ‘బంధన్’ఆస్పత్రిలో తనకు అన్యాయం జరిగిందని,పలు విభాగాల అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్జరీ,పోస్ట్ ఆఫ్ కేర్‌లో ‘బంధన్’లో జరిగిన క్షమించరాని నిర్లక్ష్యంతో తాను జీవితపు చరమాంకానికి వెళ్లి బయటపడ్డానని వెల్లడించారు.
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసుల కాంక్షతో, వ్యాపార దృక్పథంతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు.
తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు కంప్లయింట్ చేసి 8 నెలలు దాటుతున్నా కనీస పట్టింపు లేకపోవడం సరికాదని,ఈ లెక్కన వ్యవస్థలో సామాన్యులకు న్యాయం అందడం,తప్పు చేసిన వారి పైన చర్యలు అంతంత మాత్రమే అనే భావన ఏర్పడుతోందని పేర్కొన్నారు.
పూర్తి వివరాలతో బాధితుడు కృష్ణ తెలిపిన ప్రకారం బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది జూలై 21న అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కృష్ణకు అదే రోజు సాయంత్రం 6 గంటలకు 4 గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.
ఈ క్రమంలో పెద్ద పేగుకు రంధ్రం పడటంతో రోగి శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ అయి పరిస్థితి విషమించింది.
ఒకరోజు తర్వాత అది గ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యులను అడగగా ఎవరూ స్పందించకపోవడంతో ఆపరేషన్ వికటించిందని భావించి జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్‌కు తీసువెళ్లారు.
అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.దాంతో ఆ రాత్రే బేగంపేట మెడికవర్ హాస్పటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యారు.
⏩పెద్దలతో ‘బంధన్’కు బంధాలు..!
మెడికవర్ ఆస్పత్రికి చేరుకునే సరికి రోగి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది.
మరో 6గంటలు ఆలస్యం అయితే ప్రాణానికి ప్రమాదమని అక్కడి సీనియర్ వైద్యులు తెలిపారు.
అక్కడ ట్రీట్‌మెంట్ అనంతరం బాధితుడు కృష్ణ తన ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత బంధన్ హాస్పిటల్‌కి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై నిలదీశాడు.
దానికి వైద్యులు నిర్లక్ష్యమైన సమాధానాన్నిస్తూ తమ వెనుక పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని, హాస్పటల్ రాజకీయ నాయకులదేనని బెదిరిస్తూ వస్తున్నారు.
‘మా బంధన్’ హాస్పిటల్ ఓపెన్ చేసింది కూడా ఓ మంత్రినే’అని తెలుసుకోవాలని బెదిరించినట్టు బాధితుడు ఆరోపించాడు.
తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు ఆధారాలతో హన్మకొండ డీఎంహెచ్‌వోకు,ఐఎంఏ వాళ్లకు ఫిర్యాదు చేశాడు.
ఐఎంఏ పెద్దల ముందు తాము బాధితుడు కృష్ణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించామంటూ ఒప్పుకున్నారు.
కానీ, ఆ హాస్పిటల్ మీద వైద్యులపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదంటూ ఐఎంఏ డాక్టర్లు స్పష్టం చేశారు.
⏩రిపోర్ట్‌కు ఇంకెంత టైం కావాలో?
అనంతరం బాధితుడు డీఎంహెచ్‌వోను గతేడాది నవంబర్‌లో సంప్రదించగా..
16 డిసెంబర్ 2024న వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఎక్స్‌పర్ట్స్(నిపుణుల) కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు.
కానీ ఎంజీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక రాకపోవడంతో బంధన్ హాస్పిటల్‌పై, వారి వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు తెలుపుతున్నారని బాధితుడు కృష్ణ వెల్లడించారు.
ఈ ఏడాది కాలంలో బంధన్ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనలు రెండు,మూడు జరిగాయని, అందులో ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందారని కృష్ణ వివరించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ఎంక్వయిరీ పూర్తి చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ అవగాహన సదస్సు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ సదస్సు కార్యక్రమం శనివారం చేపట్టారు.ముఖ్య అతిథిగా డాక్టర్ పరికిపండ్ల అశోక్, డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంచిర్యాలలో సామాజికంగా, బిసి ఉద్యమంలో ముందు ఉండి నడిపిస్తూ సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు మార్పు కోసం పనిచేస్తున్న వడ్డేపల్లి మనోహర్ ని గుర్తించి తెలంగాణ నేత్ర అవయవాల శరీర దాతల అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కన్వీనర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ పరికిపండ్ల అశోక్ నియమించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్,అదేవిధంగా బెటాలియన్ అధికారులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గా ఎన్నిక చేసినందుకు డాక్టర్ పరికిపండ్ల అశోక్,రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజలలో నేత్రదానము,అవయవాల దానము శరీర దానం పైన మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తృతంగా ప్రజలకి అవగాహన కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
కరకగూడెం మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన పోలెబోయిన క్రిష్ణయ్య (హెల్త్ డిపార్ట్మెంట్-కరకగూడెం)తండ్రి గారైన పోలెబోయిన.ఎర్రసమ్మయ్య అనారోగ్యంతో మరణించారు.శనివారం దశదినకర్మలకు పినపాక మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు బాధిత ఇంటికి వెళ్లి,మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, గ్రామ మాజీ సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ,స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
నిజాంపేట పట్టణంలో నివాసముంటున్న బీహార్ కు చెందిన మహిళ మనిషేదేవ్ పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్న సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలో 108 ఈఎంటి స్వామి అంబులెన్స్ లో ప్రసారం చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.
జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ సమక్షంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారులు తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని,వెహికిల్ అలవెన్సులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వేంకటేశ్వర రావు,బెల్లంపల్లి ఇంచార్జీ డి ఎల్ పి ఓ సఫ్తర్ అలీ,జైపూర్,చెన్నూరు, బెల్లంపల్లి మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు,అజ్మత్ అలీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
— కుల వివక్షత చూపరాదు • రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామాలలో ఎవరు కులవివక్షత చూపరాదని అందరు సమానులే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు గ్లాసుల పద్ధతిని వీడనాడాలని, అంటరానితనం, కుల వివక్షత పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు హక్కులు కల్పించిందని హక్కుల ద్వారా మనిషి స్వేచ్ఛగా జీవించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చప్పేట నరసింహారెడ్డి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.
సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం రోజున రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు నిర్వహించారు.ఈ కావాతును పాత సీఎంఎస్ గోదాం వద్ద ఏసీపీ సతీష్ బాబు ప్రారంభించారు.పట్టణంలోని అంబేద్కర్ కూడలి నుండి డిపో సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాతు సాగింది.ఈ సందర్భంగా పరకాల ఎసిపి మాట్లాడుతూ తాము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఏఆర్ఎఫ్ అధికారి సరస్వతి పరకాల సిఐ క్రాంతికుమార్,శాయంపేట సీఐ పి.రంజిత్ రావు,ఆత్మకూరు సీఐ ఆర్.సంతోష్,పరకాల ఎస్సైలు శివకుమార్,రమేష్,శాయంపేట ఎస్ఐ.పరమేష్,దామెరా ఎస్ఐ అశోక్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు అనైతికం.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం కృషి చేయాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే బడిబాట కంటే ముందే సర్దుబాటు ఏంటి…..?
ప్రయత్నం చేయకుండానే పాఠశాలల మూసివేతలా…?
ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కావాలి కానీ ఏదో కారణంతో మూసివేయడం కారాదు.
ప్రభుత్వం ఈ సర్దుబాటు నిర్ణయాన్ని వెంటనే పునః పరిశీలించాలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.
కేసముద్రం/ నేటి దాత్రి
పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం సరికాదని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ సర్దుబాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా సురేందర్ మీడియాతో మాట్లాడుతూ…
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయా వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులను మరొక పాఠశాలలో సర్దుబాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
ఇటీవలే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని,బడిబాటలో అత్యధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయాలని సూచించిన ప్రభుత్వం, కనీసం ఉపాధ్యాయులకు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకుండానే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం ప్రకటించడం అనైతికమని విమర్శించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జూన్ 6వ తేదీ నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఉపాధ్యాయ లోకం కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అత్యధికంగా చేర్పించాలనే కసితో ఉన్నారని, ఇప్పటికే పలుమార్లు గ్రామాల్లో బడిబాట ర్యాలీలు తీయడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని వివరించారు.
ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పం, పట్టుదలతో ఉపాధ్యాయులు ఉన్నారని, చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు.
విద్యార్థులను పాఠశాలలో చేర్పించే అసలు బడి బాట కార్యక్రమం ముందే ఉండగా, కనీసం ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమ ప్రయత్నం చేయనివ్వకుండానే కొన్ని పాఠశాలలను మూసివేస్తామనడం, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామనడం ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. కనీస ప్రయత్నం చేయించకుండానే పాఠశాలలను ఎలా మూసివేస్తారని, ఏ ప్రాతిపదికన ఉపాధ్యాయ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కావాలి కానీ పాఠశాలలను ఏదో ఒక కారణంతో మూసివేయడం కారాదు అని సూచించారు.
ఒకవేళ బడిబాట కార్యక్రమ అనంతరం కూడా అడ్మిషన్లలో ఎలాంటి పురోగతి లేనట్లయితే అప్పుడు ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
అంతే కాదు చాలా పాఠశాలల్లో త్రాగు నీటి సౌకర్యం లేదని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి త్రాగునీటి సౌకర్యం కల్పించేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు .
ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకొచ్చేలాగా ప్రభుత్వం పనిచేయాలని ఈ సందర్భంగా సురేందర్ డిమాండ్ చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.