చందాలు వేసుకొని రజితోత్సవ.!

వృద్ధులు లబ్ధిదారుల గుండెల్లో కేసీఆర్..

చందాలు వేసుకొని రజితోత్సవ సభకు సిద్ధమయ్యారు.

వృద్ధాప్య పెన్షన్ ను రజితోత్సవ సభకు విరాళమివ్వడం అభినందనీయం.

వితంతు వృద్ధురాలు నీలమ్మను అభినందించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది..

నర్సంపేట నేటిధాత్రి:

 

గత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చి ప్రభుత్వాన్ని చేజార్చుకోవడం అటు ఇటు అయినప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందించిన సంక్షేమ పథకాలతో వృద్ధులలో, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈనెల 27న కెసిఆర్ తలపెట్టిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున జరగనున్న నేపథ్యంలో అందుకు అయ్యే ఖర్చులకోసం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం రూరల్ మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళ తనకు నెలకు రూ.2 వేల చొప్పున కేసీఆర్ అందించిన పెన్షన్ ను తన కుమారుడు భయ్యా నవీన్ తో కలిసి నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేసింది.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇకనుండి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడిచి పెట్టకపోతుందని మూర్ఖులకు నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు మహిళా తన ఒక నెల పెన్షన్ ను విరాళంగా ఇవ్వడం,వృద్ధులు,ప్రజలు, పేదోళ్ల గుండెల్లో మాజీ సీఎం కేసీఆర్ పాతుకుపోయారని అందుకు ఈ సంఘటన ఉదాహరణ బయ్య నీలమ్మ అని ఎమ్మెల్యే పెద్ది వివరించారు.

BRS Silver Jubilee Celebration.

కెసిఆర్ అందించిన సంక్షేమ పథకాలు, పెన్షన్ దారులు, రోజువారి కూలీలు సైతం రోజువారి కూలీ డబ్బులు,చందాలను, కెసిఆర్ వల్ల పొందిన పెన్షన్లు ఇతర లబ్ధిలను పోగుచేసుకొని గ్రామ గ్రామాల నుండి రజితోత్సవ సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన వితంతు వృద్ధ మహిళ బయ్య నీలమ్మ తను కెసిఆర్ వల్ల లబ్ధిపొందానని కృతజ్ఞతతో ఒక నెల పెన్షన్ 2000 రూపాయలను రజితోత్సవ సభ నిర్వహణ ఖర్చు కోసం విరాళంగా అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. విరాళం అందించిన నీలమ్మ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని బిఆర్ఎస్ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఒడిసి ఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్,మాజీ కౌన్సిలర్లు, నాగిశెట్టి పద్మ ప్రసాద్,దేవోజు తిరుమల సదానందం,పాషా, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వితంతు మహిళా పెన్షన్ విరాళం.

BRS Silver Jubilee Celebration.

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన బయ్య నీలమ్మ అనే వితంతు మహిళా బిఆర్ఎస్ అధినేత,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన రూ. 2 016 పెన్షన్ ను అందుకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లాలో తలబెట్టబోయే బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు విరాళంగా రూ.2 వేల16 ఒక నెల పెన్షన్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సోమవారం నర్సంపేట పట్టణంలోని అందజేశారు.
ఈ సందర్భంగా వితంతు ఫెన్షన్ దారురాలు నీలమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు నెలకు 200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని తెలిపారు.నేడు కేసీఆర్ ప్రభుత్వం నుండి 2 వేల రూపాయల పెన్షన్ తో నెల రోజుల పాటు గడిచే విధంగా అనుకూలంగా ఉందని అన్నారు.పెన్షన్ దారులకు ప్రతీ నెల క్రమం తప్పకుండా అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఖర్చుల కోసం తన వంతుగా కృతజ్ఞతతో అందించినట్లు నీలమ్మ పేర్కొన్నారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నీలమ్మను  అభినందించారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్.!

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్
తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జైపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు సైబర్ క్రైమ్ లకు గురవుతున్నారని,ప్రలోభపెట్టేమాటలకు లొంగకూడదని,ముక్కు మొహం తెలియని వారిని నమ్మి నగదు లావదేవీలు చేయకూడదని,ఏదైనా అనుమానంగా అనిపిస్తే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

యువకులారా మత్తును వీడండి

నేటితరం యువత గంజాయికి, మాదకద్రవ్యాలకు, మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని,యుక్త వయసులోనే వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తాగి వాహనాలు నడుపుతూ ఘోర ప్రమాదాలకు గురవుతున్నారని,జల్సాలకు అలవాటు పడి మద్యం,గంజాయి మత్తులలో క్షణికా ఆవేశాలకు లోనై నేరాలు చేస్తూ చేతులారా భవిష్యత్తును చెరసాలలో బందీగా మార్చుకుంటున్నారని వాపోయారు.సోషల్ మీడియా ప్రభావానికి లోనై అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని,ఆన్లైన్ లో బెట్టింగులు కాస్తూ డబ్బులు కోల్పోయి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని,ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఇవన్నీ చాలా విచారకరమని అన్నారు.యువకుల్లారా మత్తును వీడండి.చెడు అలవాట్లను వదిలేసి చదువు పైన దృష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని,విద్యలో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు,కుటుంబానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగించాలని, సత్ప్రవర్తన తోని జీవించాలని తెలిపారు.

 

Chief guest

 

తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి*

పిల్లల ప్రవర్తనలో మార్పు గురించి ముందుగా తల్లిదండ్రులకి తెలుస్తుందని, పిల్లలను మార్చుకునే శక్తి తల్లిదండ్రులకే ఎక్కువగా ఉంటుందని,ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూనే ఉండాలని,వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ప్రతి పల్లెటూరు లో సీసీ కెమెరాలు ఉండటం చాలా అవసరమని, దొంగతనాలు,నేరాలు జరగకుండా చూడడానికి, ఒకవేళ జరిగిన నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరా ఎంతగానో సహాయపడతాయని,నిఘా నేత్రాల ద్వారా ప్రజలకు పోలీసులకు ఎంతో ఉపయోగం ఉందని,గ్రామస్తులంతా కలిసి సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.

పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది

ప్రజలకు ఏ కష్టం వచ్చినా,ఏ సమయంలోనైనా 100 నెంబర్ కు డయల్ చేయాలని చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో పోలీసులు అందుబాటులోకి వస్తారని మీ సమస్యలను పరిష్కరిస్తానని,రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు శాంతి భద్రతలకు రక్షణ వలయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజలు కూడా బాధ్యతగా పోలీసు వారితో సహకరించాలని కోరారు.ప్రజలందరూ కూడా సామరస్యంగా తమ యొక్క సమస్యలను తీర్చుకోవాలని,క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచిది కాదని, జనాలు తెలిసి తెలియక తప్పులు చేసి కేసులలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ చుట్టూ,కోర్టు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారని,ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా మంచిగా సమాజంలో ప్రతి ఒక్కరితో ఐకమత్యంగా జీవించాలన్నారు.పోలీస్ శాఖ ఎల్లప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని న్యాయం కొరకు పోరాడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై శ్రీధర్,పోలీసులు,స్థానిక నాయకులు,మిట్టపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ.!

సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ జానపద గేయ చిత్రీకరణ..

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పాట సిరిమల్లె చెట్టు కింద రాగులమ్మ పాట చిత్రీకరణ ములుగు జిల్లా తాడ్వాయి మండలలోని గంగారాం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగింది, నరేష్ మాట్లాడుతూ ఎన్నో పాటలు యూట్యూబ్ ఛానల్ కు పాటలు రాశారని పేర్కొన్నారు సామాజిక నేపధ్యంలో సాగే పాట అతి త్వరలోనే ఎన్ ఎస్ ఆర్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ లో ఈ పాట విడుదల కాబోతుంది అని చెప్పారు ఈ పాట లో హీరో నాగునాయక్, హీరోయిన్ సత్య ఈషా, విష్ణు మహంకాళి,కెమెరా మెన్ శ్రీరాజు నాగేళ్ళ, ప్రొడ్యూసర్ లకావత్ రాములు సత్తమ్మ పర్యవేక్షణలో ఈ పాట రాబోతుందనీ అందరూ ఆ పాటను ఆదరించాలని కోరారు కార్యక్రమంలో స్థానిక తాడ్వాయి మండలమాజీ ఎంపీపీ నరేష్, రేణికుంట్ల సంతోష్ , చింతల రమేష్ ,పుల్ల రవి, కాట్రేవుల ఐలయ్య, సరిగొమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలి.

కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలి: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:

 

కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలని, ఈత వనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలనితెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఉన్న ఈత వనమును కబ్జాకు గురి కాకుండా పరిరక్షించాలని కోరుతూ కల్లుగీత కార్మికులు ఈత వనం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా ఈత వనంలో ఉన్న కంపచెట్లను తొలగిస్తున్నారని, ఎవరైనా పర్మిషన్ తీసుకొని కంప చెట్లను తొలగించడంతోపాటు ఈత వనంలో ఉన్న కంపమొద్దులను తొలగించే విధంగా చొరవ తీసుకొని ఈత వనం ను పరిశుభ్రంగా ఉంచాలని
ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈత వనంలో ఉన్న కంప చెట్లు విపరీతంగా పేరిగాయని, వాటిని తొలగించాలని ఆయన అన్నారు. ఈత వనం ఉన్న భూమిలో కొందరు మా భూమి అని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈత వనం ఉన్న భూమిని కాపాడాలని గీత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని ఆయన అన్నారు.సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్దార్ సర్వాయ పాపన్న నేడు సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని, భారత రాజ్యాంగంలో చెప్పినట్లుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం కై ఉద్యమించాలని ఆయన అన్నారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లు గీతకార్మిక సంఘం గ్రామ శాఖఅధ్యక్షులు బుర్కల అంజయ్య గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు బండమీది వెంకటయ్య, బోడిగే నగేష్ గౌడ్, యాదయ్య గౌడ్, శంకర్ గౌడ్, బురకల శేఖర్, రాజ్ కుమార్, సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి.

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ.. తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడుంపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం.

జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం:

 

నేటిధాత్రి

 

 

 

 

తేదీ: 21-04-2025 నాడు జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ఆధునికరణ కొరకై పాఠశాల పూర్వ విద్యార్థి గుండేటి ప్రసాద్ మమత దంపతులు గారు విరాళాలు అందజేయడం జరిగినది. ఇట్టి కంప్యూటర్ గదిని వారి తల్లి గారైన గుండేటి గంగుబాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎం అర్జున్ గారు మాట్లాడుతూ నేటి యుగంలో పిల్లలకు తప్పనిసరిగా కంప్యూటర్ విద్యపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కంప్యూటర్ గది ఆధుని కొరకు సహకరించిన గుండేటి రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. బోగోరి గంగాధర్ లక్ష్మీ నర్సు, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశం, పి దరందీప్, పి శశిధర్, డి ఏడుకొండలు, జి అశోక్ ,రాజ్యలక్ష్మి, లక్ష్మి, ఉమాదేవి, నీలిమ, షాహినా, రవీందర్, సుమన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

బాలికల గురుకుల పాఠశాలలో.!

బాలికల గురుకుల పాఠశాలలో పోషణ పక్వాడ్ పై అవగాహన కార్యక్రమం

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలకేంద్రము లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రిన్స్ పాల్ బిక్షపతి సమక్షంలో పోషణ పక్వాడ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద నిర్వహించడం జరిగింది,ఈసాద్7 ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమము యొక్క ఉద్దేశం 11 నుండి 18 సంవత్సరాల బాలికలు తీసుకోవలసిన సమతులఆహారము వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఆడపిల్లలయినందన ఇంటి పనులు వంట పనులు కూరగాయల తోటలు పండ్లు పూల మొక్కలు పెంచుకోవడం మొబైల్ కి దూరంగా ఉండడం విద్య యొక్క ప్రాముఖ్యత బయట వారు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మవద్దని 18 సంవత్సరాలు అయ్యే వరకు వివాహ ఆలోచన చేయరాదని అన్ని రంగాలలో ఆడపిల్లలు అని వెనకడుగు వేయకుండా క్రీడారంగాలు వ్యాయామము క్రికెట్ అన్ని వృత్తి కోర్సులను చదువుతోపాటు నేర్చుకోవాలని వివరించడం జరిగింది,అనంతరం సూపర్వైజర్ మాధవి పిల్లలందరితో పోషకహార ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ భాగ్యలక్ష్మి అరుణ జ్యోతి భాగ్యమ్మ ప్రతిభ సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయురాలు మాధవి, సూపర్వైజర్హాజరైనారు

దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం.

ప్రభంజనం ప్రభంజనం
దుంపేట యు.పి.యస్ పాఠశాల ప్రభంజనం

  నేటిధాత్రి

 

 

జిల్లా స్థాయి క్విజ్ పోటీలో మా 5వ తరగతి విద్యార్థి ఊడుగుల శ్రీవాన్ టీం జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించినందున ఊడుగుల శ్రీవాన్ కి పాఠశాల ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు, పాఠశాల శ్రేయోభిలాషులందరి తరుపున హార్దిక శుభాకాంక్షలు.
ఇంతటి ఘనత సాధించినందున మా విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ
ఉపాధ్యాయుల బృందం యు.పి.యస్ దుంపేట

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం

పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ వార్షికోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల ప్రభావతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మందల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు,మాజీ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని వసతులు కల్పించబడి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రూపొందించబడిందని, తల్లిదండ్రులు అందరూ ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. వేముల ప్రభావతి మాట్లాడుతూ శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా చర్లపల్లి పాఠశాలకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయ అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిధులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను, గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్, మేకల సత్యపాల్, పోలంపల్లి విజేందర్,నిగ్గుల శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,రమేష్,ఆయాలు సరోజన,రమ,సుశీల,అరుణ, విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్.

ఆన్లైన్ సైబర్ నేరాల నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది.

ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP లో నమోదు అయిన 38 పిటిషన్లలో సుమారుగా 45,00,000/- లక్షల మోసాలు పాల్పడుతూ భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి.

 

అని నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుంది అని తెలిపారు .

అందులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు వారిని మోసం చేయగా అట్టి యజమానులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నాలుగురు వ్యక్తులువిలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రమేష్ సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్,కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరూట్ల వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

 

ఈ సమావేశంలో వేములవాడ టౌన్ ఎస్.ఐ రమేష్, సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్,షమీ పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఆర్.!

అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల నేటి ధాత్:

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక సోషల్ వెల్ఫేర్ వెలుగు బాలికల గురుకుల పాఠశాలలో రిటైర్డ్ డిడబ్ల్యు ఓ అధికారి చిన్నయ్య ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నిసోమవారం రోజున గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించా:రు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు.

అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు , ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీజ చిట్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చిలుకల రాయకోమురు, దబ్బేట అనిల్ శ్రీనివాసు రాజమౌళి మార్కండేయ తదితరులు పాల్గొన్నారు

బస్సు సౌకర్యం లేక అవస్థలు.

బస్సు సౌకర్యం లేక అవస్థలు

బయటకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిందే

నేటిధాత్రి :

 

 

మహిళలు, విద్యార్థులు, ప్రజలు,వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం బయటికి పోవాలంటే ప్రజలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు కిలోమీటర్ల మేరకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాత బస్సు సర్వీసులను పునరు ద్ధరించాలి.

వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు

39 వ్యవసాయ మోటార్స్ మరియు 750 మీటర్స్ సర్వీస్ వైర్ స్వాధీనం.

వీటి విలువ మొత్తం కలిపి 10,67,500/- రూపాయలు

 

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

వ్యవసాయ మోటార్ల దొంగలను పోత్కపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈరోజు పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరు నిందితులు గత రెండు నెలలుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో లో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీస్ లను నిందితులు దొంగలించారు. ఈ దొంగతనాలకు సంబంధించి సర్కిల్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసుల దర్యాప్తు చేస్తున్న పోత్కపల్లి పోలీసులు ఈ రోజు పోత్కపల్లి మండల పరిధిలో శానగొండ గ్రామ శివారు జమ్మికుంట వెళ్లే రహదారిలో పోత్కపల్లి ఎస్సై ఉదయం10:00 గంటల ప్రాంతం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీ లో ఇద్దరు వ్యక్తులు సిరిగిరి ప్రసాద్ మరియు అంగిడి సాయికుమార్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరినీ పోలీసులు అదుపులకి తీసుకోని ట్రాలీ ని ఆపి తనిఖీ చేయగా అనుమనస్పదంగా వ్యవసాయ మోటర్స్, కరెంట్ సర్వీస్ వైర్ కనిపించగా దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వీరి దగ్గర నుంచి 39 మోటార్స్,750 మీటర్స్ సర్వీస్ వైర్, ట్రాలీ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే….

 

Police

 

సిరిగిరి ప్రసాద్, తారకరామ కాలనీ, ఓదెల, పాత ఇనుపసామను వ్యాపారం చేస్తూ జీవిస్తాడు. సరియైన గిరాకీ లేక ఇబ్బందులు పడుతూ, అతిగా మద్యానికి, జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దుద్దేశ్యం తో ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక లో డబ్బులు పెట్టి పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. ఎలాగైనా డబ్బులు సంపదిన్చాలనే చెడు ఉద్దేశ్యంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, గత 2 నెలల నుంచి ఓదెల గ్రామస్థుడు ఐన అంగిడి సాయికుమార్ s/o సమ్మయ్య తో పరిచయం ఏర్పడి, ఇద్దరం కలిసి మధ్యం సేవిస్తూ రాత్రి సమయలలలో ఇద్దరం కలిసి చిన్న చిన్న పాత ఇనుప సామాను దొంగాలించి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొనేవారు. వీరి జల్సాలకు డబ్బులు సరిపోక, చుట్టుపక్కల రైతుల కరెంటు మోటర్లు దొంగతనం చేసి అమ్ముకొని నిర్ణయించుకొన్నాని పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 39 వ్యవసాయ కరెంట్ మోటార్ లు, 750 మీటర్స్ కరెంట్ సర్వీస్ వైర్ ( కాచాపూర్ శివార్ లోని 6 మోటార్లు, కొనరాపేట్ శివారు లోని 1 మోటార్, మల్యాల శివారు లోని 100 మీటర్ల వైరు, మడిపల్లి కెనాల్ దగ్గర 01 మోటార్, శివపల్లి శివారు లోని బావి వద్ద 1 మోటార్, కొమిరె SRSP కెనాల్ దగ్గర్ 6 మోటార్ లు, కొలనూర్ శివారులోని 5 మోటర్లు మరియు పోత్కాపల్లి, శానగొండ శివారులోని 4 మోటర్లు, 17 బావుల వైర్లు 170 మీటర్లు, రూప్ నారాయణ పేట మానేరు లోని 23 బోరు మోటార్ ల వైర్లు 270 మీటర్లు, ఓదెల శివారులోని 6 మోటార్లు మరియు రూపనారాయణపేట శివారులోని 200 మీటర్ల వైరు ) ఆటో ట్రాలీలో తిరుగుతూ మోటార్లను ఎత్తుకెళ్ళడం వీరి అలవాటు. బోర్ ల మోటార్ లు, సర్వీస్ వైర్ లు దొంగలించి రైతులకు తీవ్ర నష్టం చేసి రైతులను భయాందోళనలకు గురి చేసారు.
ఈ దొంగలను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు 13 మంది సిబ్బందిని అభినందించి డీసీపీ రివార్డులు అందజేశారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

శాయంపేట మండల సమస్య తీరేది ఎన్నాడో!

ఆర్టీసీ బస్సు రాదు.. అవస్థలు తీరవు

ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది విద్యార్థులు మహిళలు ఉద్యోగాలు కూలీల ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణం చేస్తే ప్రజలు బస్సు సౌకర్యం లేక అవస్థలు అనుభవిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఇతర ముఖ్యమైన పనులకు వెళ్లాలంటే మండల కేంద్రం నుండి జిల్లాకు పోవడానికి 30 కిలోమీటర్ల దూరానికి పోవుట గూర్చి ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల ప్రయాణం భారంగా మారింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించని మండలం

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆడబిడ్డల కళ నెరవేర్చిన ప్రభుత్వం వెంటనే బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

బస్సులు నడిపితేనే ప్రయాణం సులువు

శాయంపేట మండల కేంద్రం నుంచి హన్మకొండకు వెళ్లా లంటే ఆటోలో ప్రయాణిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తుంది బస్సులు నడిపితేనే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రజలు కోరడమైనది.

మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు

శాయంపేట మండలంలోని మారుమూల గ్రామాలకు లేని బస్సు సర్వీసులు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రజలు 8,000 మంది నివసిస్తారు. 24 గ్రామ పంచాయతీలోని ప్రజలు సుమారుగా 30 వేల మందికి పైగా ఉంటారు జిల్లా నుండి మండలానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థల పాలవు తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి వెంటనే పాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’

భూభారతితో భూములకు భరోసా

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని, రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని, రైతుల భూ సమస్యలు శాశ్వతంగా తీరుతాయని, ఇకపై గ్రామాల్లో భూ పంచాయితీలు, వివాదాలు ఉండవని అన్నారు. భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం, పోర్టల్ తెచ్చామని, భూ భారతిపై ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.

 

Land issues

రైతులను మోసం చేయడానికే గత బీఆర్ఎస్ సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చిందని, పేదలకు ఇచ్చిన భూములను సైతం ధరణి పేరుతో కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణి పేరుతో రైతులను, సామాన్యులను కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేదాకా తిప్పిందని, 20 లక్షల ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని అన్నారు. సాదా బైనామాలతో పాటు ఇతర ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు. పేర్లు, సర్వే నంబర్లు, ఎకరాలు తప్పు పడినా గతంలో కార్యాలయాలు చుట్టూ తిరిగిన పనులు కాలేదని, ప్రస్తుతం చట్టం ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఒక్క రూపాయి చెల్లించకుండా రైతులు నేరుగా MRO, ఆర్డీవో, కలెక్టర్ల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. మే 1 నుంచి ప్రతి రెవెన్యూ గ్రామాలకు అధికారులు వచ్చి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు.
భూభారతి కింద భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని, దీంతో భవిష్యత్‌లో రైతులకు భూ సమస్యలు, వివాదాలు రావన్నారు. భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు, ఈ చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు, ఈ పోర్టల్‌పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కోరారు.

అధికారుల తీరు మార్చుకోవాలి.     

ఏజెన్సీ చట్టాలను గౌరవించండి…

అధికారుల తీరు మార్చుకోవాలి.     

భారతదేశంలో అందరు
బతుకులు మారిన ఆదివాసి బతుకులు మారడం లేదు

ఏజెన్సీలో ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ..

గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి..

నూగూర్ వెంకటాపురం

నేటి ధాత్రి /ములుగు జిల్లా వెంకటాపురం:

 

 

ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించకుండా, ఏజెన్సీలో ఉన్న విలువైన శాసనాలను గౌరవించాలని. ఆదివాసీల అభివృద్ధి కోసం, నిరంతరం పాటుపడాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలో జరిగిన జీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సాయి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, అభివృద్ధి పథకాలు మారినా, ఏజెన్సీలోని ఆదివాసీల బ్రతుకులు మారడం లేదని, ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఇచ్చిన హక్కుతో చట్టసభలకు ఎన్నిక అవుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు గిరిజనేతరులకు,కొమ్ముగాస్తూ, ఆదివాసి గూడేల అభివృద్ధికి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల మాయమాటలకు ఆదివాసీలు మోసపోతూనే ఉన్నారని అన్నారు. ఏజెన్సీలోని ప్రత్యేక చట్టాల అమలుకు, ప్రభుత్వ పథకాల పంపిణీలో, ఆదివాసీల అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల, 1/70, ఎల్ టి ఆర్ లాంటి చట్టాలు నీరు గారి పోతున్నాయని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సి వస్తుందంటే, పాలకుల, ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణి వళ్ళనే అని మండిపడ్డారు. పాలకులు వస్తుంటారు, పోతుంటారు, ఉద్యోగులు మాత్రం ఆత్మస్తుతి పరినిందలా వ్యవహరించ కుండా, ఆత్మ సాక్షిగా, ఆదివాసీల అభివృద్ధికి, చట్టాల అమలుకు కట్టబడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన హక్కులకోసం, మన్యం బిడ్డల అభివృద్ధి కోసం, గోండ్వానా సంక్షేమ పరిషత్ నిరంతరం విశ్రమించకుండా పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంటి,నరేష్ పాల్గొన్నారు

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన.

అనారోగ్యంతో బాధపడుతున్న శశి ను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనీటి మాణిక్ రావు
అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శశి,విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మోహీ ఉద్దీన్,తులసి దాస్,గణేష్ తదితరులు వారి నివాసానికి చేరుకుని పరామర్శించడం  జరిగింది.

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

ఘనంగా. ఈస్టర్. పండుగ వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 


జహీరాబాద్ నియోజకవర్గం గ్రామాల్లో..ఘనంగా. ఈస్టర్ పండుగ వేడుకలు. నిర్వహించారు. యేసు క్రీస్తు. వారు. మానవాళి. పాప పరిహారం. నిమిత్తం. సిలువ వేయబడి.. తిరిగి మూడవ రోజు నాడు తిరిగి లేచాడని. క్రైస్తవులు. నమ్ముతారు..ఆయన. శుక్రవారం నాడు.సిలువ వేయబడి.. శనివారం నాడు.. సమాధిలో.. ఉంచబడి.. ఆదివారం ఉదయం. ముడున్నర. గంటల సమయం లో సమాధిలో నుండి. తిరిగి పునరుతానుడై. లేప బడుతాడు..ఆ తరువాత కొందరు శ్రీలకు. అటు తరువాత ఐదు వందలకు పైగా. మనుషుల కు కనిపించి. అటు తరువాత. ఆయన.. పరలోకం వెళ్లిపోయడు.. అందు నిమిత్తం.. ఇస్టర్.. పండుగ ను. నిర్వహించు కొంటారు.. ఈ పండుగ కార్యక్రమం లో. పాస్టర్ లు. సంఘపెద్దలు. భక్తులు. యువకులు. తదితరులు పాల్గొన్నారు

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్.

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్, రూ. 25వేలు స్వాధీనం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం గుంత మర్పల్లి గ్రామంలో పేకాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్సె నరేష్ తెలిపారు. నమ్మద గిన సమాచారంతో ఆదివారం సాయంత్రం గుంత మర్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 25,090ల నగదుతో పాటు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version