శ్రీ ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.

శ్రీ ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని శివ మార్కండేయ దేవాలయం లో కొలువైయున్న దేవతా మూర్తులైన శ్రీ వెంకటేశ్వర శివ మార్కండేయ స్వామి చెష్టి దృశ్యం ఓం చండీ ఓం పూర్ణప రుత్తి అవబ్రతశ్రానాము పూజా కార్యక్రమంతో ద్వాదశ బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ బాసని సూర్య ప్రకాష్ పద్మ దంపతులు,బాసని చంద్ర ప్రకాష్ పద్మశాలి రాష్ట్ర మిని మం వెజినెస్ అడ్వైజర్ నెంబర్ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ కొము రయ్య ,రిటైర్డ్ టీచర్ దేవాల యం కమిటీ నెంబర్ వనం సదానందం ,వంశీ, కందగట్ల గోపాల్, ,శ్రావణ్ భద్రకాళి అర్చకులు, శివ మార్కండేయ వెంకటేశ్వర దేవాలయం అర్చకులు రాజకుమార్ , కరుణాకర్ ,మహిళలు భక్తులు, వివిధ బంధువుల పెద్ద నాయకులు పాల్గొన్నారు.

వరి పంటను పరిశీలించిన అధికారులు.

వరి పంటను పరిశీలించిన అధికారులు

బాలానగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో వరి పంట నేలపై ఓరిగి నేలపై వరి గింజలు రాలాయి. సుమారు మండలంలో 300 ఎకరాలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బి.వెంకటేష్ శనివారం గౌతాపూర్ గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీని మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా శనివారం ఎంపీఓ శ్రీపతి బాబురావు సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిస్టర్ లను పరిశీలించి సిగ్రిగేషన్ షెడ్డు లో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వేసవికాలం తాగునీరు సరఫరా లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ పైపు లైన్లు లీకేజీలు ఉంటే వెంటనే సరి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి పావని,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 6 నుంచి నెల రోజులపాటు ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్ లలో అండర్- 14, 16, 19, 23 వయసు వారు పాల్గొనవచ్చని చెప్పారు. శిక్షణలో పాల్గొనేవారు
https://hycricket. org వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను.

అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలి
సర్పంచులు లేకపోవడంతో స్తబ్దుగా ఉంటున్న గ్రామపంచాయతీలు
వివాదాలకు నిలయంగా మారుతున్న ఖాళీ స్థలాలు
పరిష్కారం చూపలేకపోతున్న ఖాకీలు

నేటి ధాత్రి ఐనవోలు : 

 

అయినవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో గూడు లేని నిరుపేదలకు గత ప్ర భుత్వాలు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయగా మిగులు భూమి అన్య క్రాంతం అవుతుంది.వివరాల్లోకి వె ళితే హనుమకొండ జిల్లా,ఐనవోలు మండలం,కక్కిరాలపల్లి గ్రామంలో
గత ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల నుండి భూమిని కొనుగోలు చేసి తిరిగి గూడు లేని నిరుపేదలకు పం పిణీ చేయగా, మిగులు భూమి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉం ది.కాగా ఊర చెరువు కట్టకింద ఉన్న సర్వే నెంబర్ 2,6 లో 4 ఎకరాల 06 గుంటల భూమి డబుల్ బె డ్రూం ఇండ్లకి,1ఎకరం పల్లె ప్రకృతి వనాని కి పోగా మిగతా ఎనిమిది గంటల మిగులు భూమి కలదు.అలాగే ఎస్సీ కాలనీ 9వ వార్డులో మెయిన్ రోడ్డుకు అను కొని ప్రభుత్వం కొన్ని దళితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయగా మిగులు భూమి ఉంది. 

Government lands

గ్రామ పంచాయతీ పాలకవర్గం లేక పో వడంతో అడిగే వారు లేక కొందరి కబ్జాదారుల కన్ను అట్టి మిగులు భూము లపై పడింది. అంతేకాకుండా ఎస్సీ కాలనీలో ఉన్న మిగులు భూమి పక్కన ఉన్న వారి మధ్య అట్టి భూమి కోసం తరచు గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అట్టి భూములు అన్యక్రాంతం కాకుండా అధికారులు స్పందించి గ్రామ పం చాయతీ ఆధీనంలోకి తీసుకుంటే ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకునే వీలుంటుందని గ్రామస్తులు వేడుకుంటున్నారు. దీనిపై వివరణ కోసం తాసిల్దార్ విక్రమ్ కుమార్ ను చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.గ్రామ కా ర్యదర్శి నిర్మల్ కుమార్ ను వివరణ కోరగా ఎస్సీ కాలనీలో ఇండ్ల స్థ లాలు పంపిణీ చేయగా మిగులు భూమి ఉన్నప్పటికీ గ్రామ పంచా యతీ రికార్డులో లేదన్నారు.ఇట్టి విషయాన్ని ఎమ్మార్వో దృష్టికి తీసు కెళ్తానన్నారు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎన్నో పంచాయతీలు వస్తున్నాయి కానీ వివాద కారణమైన స్థలం ప్రభుత్వం కేటాయించిన స్థలం కావడంతో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

UCCRIML ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ.

యు సి సి ఆర్ ఐ ఎం ఎల్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ.

 

 

కారేపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

 

కారేపల్లి మండల కేంద్రంలో శనివారం మేడే వారోత్సవాలను పురస్కరించుకొని జాకెట్ నాగేశ్వరరావు తాటి అంజయ్య లు పోలీస్ స్టేషన్ సెంటర్ నందు మేడే జెండాను ఆవిష్కరించారు

ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలేబోయిన ముత్తయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాల బాధ్యులు ఎర్రబాబు బాణాల లక్ష్మీనారాయణ ఓ పి డి ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వారు మాట్లాడుతూ భూమి స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం కోసం సాగుతున్న పోరాటాలతో కార్మిక వర్గం నాయకత్వం వహించాలని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదం

ఈనాడు మరింత సందర్భాచితంగా ఉన్నదని వారన్నారు ప్రపంచ కార్మికుల ఐక్యతతో పోరాడితే హక్కులు సాధించుకోవచ్చని ఇప్పటికే

మన దేశంలో నిరుద్యోగం మహమ్మారిలాగా తయారైందని కార్మికుల వేతనాలు తగ్గిపోయాయి ప్రజల్లో అన్ని రంగాల వారు అసంతృప్తితో రగిలిపోతున్నారని మరొకవైపు అన్ని దేశాలు అభివృద్ధిలో ముందు నడుస్తుంటే

మన దేశం మాత్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని వారన్నారు 10 ఏళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే అభివృద్ధి నిరోధక విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ అమెరికా అగ్రరాజ్య

అధిపతి వాద ప్రయోజనాలకు కూడిగం చేస్తున్నది దేశాలపై పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తున్నది రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నదని అనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ను ప్రభుత్వం

ఈ పరిస్థితి ఏమాత్రం మార్చలేదు నిరుద్యోగం ధరల పెరుగుదల అనారోగ్యం అవినీతి వంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతూనే ఉన్నారు వారిని పక్కదారి పట్టించడానికి ఇస్తున్న ప్రకటిస్తున్న ఉచిత పథకాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి మన దేశంలో

ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే దేశంలోని ప్రజాస్వామ్య విధానాన్ని రద్దుచేసి ధన్యవాదాలు భూమిపంచాలు సామ్రాజ్యవాదుల ప్రభావం నుండి ప్రత్యేకించి అమెరికా ఆగ్రరాజ్య ప్రభావం నుండి బయటపడి స్వతంత్రమైన విదేశాంగ

విధానాన్ని చేపట్టాలి పోరాటాల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ప్రజలకు ప్రజాస్వామ్యకు హక్కులు కల్పించాలి

ఈ విధంగా భూమి ప్రజాస్వామ్యం స్వాతంత్రం కోసం పోరాటం ఒక్కటే ప్రజల ముందున్న మార్గం పాలకవర్గాలు కులమత ప్రాంతీయ వైశ్యాలను రెచ్చగొట్టి ప్రజలను ఐక్యం కాకుండా చూసి పోరాటంలోకి రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు

శ్రీ భేదాలు అధిగమించే ప్రజలను సంఘటిత పరుచు వారు సాగించే పోరాటానికి నాయకత్వం వహించడం సమాజంలో అత్యంత పురోగమి వర్గమైన కార్యవర్గం యొక్క కర్తవ్యం కమ్యూనిస్టు విప్లవకారులు నాయకత్వంలో మన దేశం కార్మిక వర్గం

ఈ సవాలను స్వీకరిస్తుందని తన చారిత్రిక కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తుందని మేము విశ్వసిస్తున్నాము మేడే సందర్భంగా కార్మిక వర్గం ముందున్న ఒకే ఒక కర్తవ్యం ఇదే ప్రపంచ కార్మికులారా ఏకంకండి మేడే వర్ధిల్లాలి అంటూ నినదించారు

ఈ కార్యక్రమంలో నవోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

చెల్పూర్ లో రూ 5 కోట్లతో ఆధునిక హంగులత.!

చెల్పూర్ లో రూ.5 కోట్లతో ఆధునిక హంగులతో బస్టాండ్ నిర్మాణం

జెన్కో అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో రెండెకరాల విస్తీర్ణంలో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే.
ప్రయాణికులకు ఏడాది లోపు అందుబాటులోకి రానున్న చెల్పూర్ బస్టాండ్.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జెన్కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే.

వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

వనపర్తి నేటిధాత్రి :

 

అకాల వర్షాల వల్ల తడిసిన వడ్లను ప్రభుత్వం కొంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు.
శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన వర్షానికి చిట్యాల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రానికి వచ్చిన వడ్లు తడిసి పోయాయని అన్నారు శనివారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి తడిసిన వడ్ల ను పరిశీలించారు. వ్యవసాయ మార్కెట్, పౌరసరఫరాల శాఖ అధికారులకు తడిసిన వరి వడ్లను ఆరబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
రైతులకు అవసరమైన టార్ఫాలిన్ లు అందజేయాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని వద్ద యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సిహెచ్.భీమ్రావు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగే స్వామి జెండాను ఆవిష్కరించి,కేకును కట్ చేశారు.అనంతరం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కార్మికులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.1947 మే 3న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య బేబీ కృపాలాని ఐఎన్టీయూసీ ని స్థాపించారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కులు,సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిపెట్టిన ఘన చరిత్ర ఐఎన్టియుసి యూనియన్ ది అని కొనియాడారు.30 మిలియన్లకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక కార్మిక సంఘం అని అన్నారు. జాతీయస్థాయిలో ఇన్ని సభ్యత్వాలు కలిగి ఉండడానికి ప్రధాన కారణం జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి,జాతీయ ప్రధాన కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ లు కార్మికుల హక్కులను సాధించడమే ధ్యేయంగా నేటి వరకు కృషి చేయడమే అన్నారు.రానున్న రోజులలో యూనియన్ను మరింత బలమైన కార్మిక సంఘంగా నిర్మించడం కోసం వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు పేరం రమేష్,ల్యాగల శ్రీనివాస్,ఫిట్ కార్యదర్శి నంబయ్య,జిల్లా కార్యదర్శి బీమ్ రవి, ఉపాధ్యక్షులు జే.నర్సింగ్,ఫిట్ అసిస్టెంట్ కార్యదర్శిలు మహేష్ రెడ్డి,శ్రీను,రవి, కార్యదర్శులు చందు పటేల్,బి.అశోక్,చిన్నయ్య, మహేందర్ రెడ్డి,రాజు,మల్లేష్ పాల్గొన్నారు.

పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు.!

పోలీస్ వ్యవసాయ శాఖలో బిజెపి ఫిర్యాదు.

మహదేవపూర్ నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఎర్ర చెరువు వద్ద పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్ర నిర్వాహకులపై స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారికి బిజెపి మండల అధ్యక్షుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని పిఎసిఎస్ నిర్లక్ష్యం అడవికి సమీపంలో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం వలన అడవిలోని వర్షపు నీరు వడ్ల కల్లం లో వచ్చి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది అని, అలాగే కొనుగోలు కల్లం వద్ద ఉన్న నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని, ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తడిసిన ప్రతి ధాన్యం గింజలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైతుల కన్నీటికి కారణమైన టి ఏ సి ఎస్ కొనుగోలు కేంద్ర నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మనోజ్, శ్రీధర్, రవి ,వంశీ, వెంకటేష్, పూర్ణచందర్,రాజు ,లుపాల్గొన్నారు.

సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే.

సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే జెండా ఆవిష్కరణ.

కారేపల్లి నేటి ధాత్రి :

 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్టు-లెనినిస్టు)యు.సి.సి.ఆర్.ఐ(యం-యల్) పార్టీ ఆధ్వర్యంలో 139వ మేడే దీక్షా దినాన్ని ఘనంగా నిర్వహించటం జరిగింది. మేడే వారోత్సవాల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి.పోరాడే వానిదే ఎర్రజెండా మార్క్సిజం లెనినిజo మావో ఆలోచన విధానం వర్ధిల్లాలి అనే తదితర నినాదాలు చేశారు.
ఈ మేడే కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోలెబోయిన ముత్తయ్య గారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శ్రమని నమ్ముకొని పోరాడి పని దినాలను తగ్గింపు కొరకు తమ హక్కులు సాదించుకొన్న కర్శకులకు కార్మికులకు 139వ మేడే విప్లవ శుభాకాంక్షలు తెలియజేసారు.కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిఢిఆర్) జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాణాల లక్ష్మణా చారి మరియు కార్యకర్తలు కొమరం బీమ్ సెంటర్ లో ఎగరవేయడం జరిగింది.
ఈ మేడే వారోత్సవాల్లో నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనగా నవోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని వద్ద యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో ఐఎన్టియుసి 78వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు సిహెచ్.భీమ్రావు,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగే స్వామి జెండాను ఆవిష్కరించి,కేకును కట్ చేశారు.అనంతరం బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కార్మికులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.1947 మే 3న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఆచార్య బేబీ కృపాలాని ఐఎన్టీయూసీ ని స్థాపించారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కులు,సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిపెట్టిన ఘన చరిత్ర ఐఎన్టియుసి యూనియన్ ది అని కొనియాడారు.30 మిలియన్లకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక కార్మిక సంఘం అని అన్నారు. జాతీయస్థాయిలో ఇన్ని సభ్యత్వాలు కలిగి ఉండడానికి ప్రధాన కారణం జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి,జాతీయ ప్రధాన కార్యదర్శి బి.జనక్ ప్రసాద్ లు కార్మికుల హక్కులను సాధించడమే ధ్యేయంగా నేటి వరకు కృషి చేయడమే అన్నారు.రానున్న రోజులలో యూనియన్ను మరింత బలమైన కార్మిక సంఘంగా నిర్మించడం కోసం వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని నాయకులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు పేరం రమేష్,ల్యాగల శ్రీనివాస్,ఫిట్ కార్యదర్శి నంబయ్య,జిల్లా కార్యదర్శి బీమ్ రవి, ఉపాధ్యక్షులు జే.నర్సింగ్,ఫిట్ అసిస్టెంట్ కార్యదర్శిలు మహేష్ రెడ్డి,శ్రీను,రవి, కార్యదర్శులు చందు పటేల్,బి.అశోక్,చిన్నయ్య, మహేందర్ రెడ్డి,రాజు,మల్లేష్ పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా 10వత ర గతి క్లాస్ టాప్ ర్యాంకర్.!

వనపర్తి జిల్లా 10.వత ర గతి క్లాస్ టాప్ ర్యాంకర్ వి శ్రీనితారెడ్డిని సన్మానించిన

కాంగ్రెస్ పార్టీ ఏన్ ఎస్ యూ ఐ నాయకులు

వనపర్తి నేటిధాత్రి :

వనపర్తి పట్టణం వల్లభ్ నగర్ కు చెందిన వి కొండారెడ్డి కూతురు శ్రీనిత రెడ్డి 10.వతరగతి క్లాస్ ఫలితాల లో 588/600 మార్కులు వనపర్తి జిల్లా క్లాస్ టాప్ ర్యాంకర్ గా విజయం సాధించిందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏన్ ఎస్ యూ ఐ జిల్లా నాయకులు బి శ్రీకాంత్ గంధం కుమార సంగాకర ఎంజి నబీల్ అనిల్ కుమార్ క్లాస్ టాప్ ర్యాంకర్ శ్రీనీత రెడ్డి నివాసానికి వెళ్లి వారికి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డీ నేటర్ డి వెంకటేష్ ఒక ప్రకటన లో  తెలిపారు.

ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు.

ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రకృతి వైశాల్యాలు
రూపాయి కూడా ఆదుకోలేదు.

మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళాం తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది.

తడిసిన ధాన్యాలకు కొనుగోలు చేయండి మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.

మహాదేవపూర్- నేటిధాత్రి:

 

ప్రకృతి వైఫల్యానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, అనుకోకుండా ప్రకృతి వైఫల్యాలకు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం చేయడానికి ఖండించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో నాయకులు మాట్లాడుతూ,గురువారం అర్ధరాత్రి రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలోని పిఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రంలో వడ్లు తడవడం జరిగిందన్న విషయం వాస్తవమే , కానీ ప్రకృతి సంభవించిన వైఫల్యానికి అమాయక రైతులు నష్టపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులకు భరోసా కలిగించడం జరుగుతుందని అన్నారు. పేద రైతులకు అష్టపోకుండా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తక్షణమే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు తరలించి కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించడం కూడా జరిగిందని అన్నారు. పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో 176 రైతుల వడ్లు అందగా వాటిలో 63 రైతుల వడ్లు ఎక్కువ శాతం తడవడం జరిగిందని, ప్రతి ఒక్క రైతుకు నష్టం కలగకుండా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడంతోపాటు, రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని తరలించడం జరిగిందని, నేటికీ కూడా వడ్లను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కానీ కాంగ్రెస్ బిజెపి, రాజకీయం చేస్తుందని, కొనుగోలు కేంద్రం వద్ద వచ్చి ప్రభుత్వం వైఫల్యం, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పై బురదజల్లే విధంగా వ్యవహరించడం సమంజశం కాదని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మార్లు ప్రకృతి వైఫల్యంతో పత్తి ,మిర్చి,వరి, రైతులు పంటలు కోల్పోయిన దాఖలాలు ఉన్నాయని కానీ, ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి అన్నారు. నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా తడిసిన వడ్లను కొనుగోలు ప్రక్రియ చేపట్టి రైతులకు ఆదుకొనుటకు మంత్రి భరోసా కలిగించడం జరిగిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టం వాటిల్లకుండా ఇస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు రాణి భాయ్, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, ఎంపీటీసీ సుధాకర్, సమ్మయ్య, మాజీ చైర్మన్ రామన్ రావు, లు ఉన్నారు.

ఎర్రబెల్లి హాయంలో అభివృద్ధి శూన్యం.

ఎర్రబెల్లి హాయంలో అభివృద్ధి శూన్యం
-కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

 

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాయంలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.

పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్ తో కలిసి సోమశేఖర్ మాట్లాడుతూ తొర్రూరు పట్టణంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టణంలోని ఖమ్మం వరంగల్ హైవే రోడ్డుపై డివైడర్ ఏర్పాటు చేయడం జరిగిందని, మున్సిపాలిటీ భవనం, జూనియర్ సివిల్ కోర్టు, బాలికల గురుకుల పాఠశాల భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉండి తొర్రూరు పట్టణంలో ఏ ఒక్క ప్రభుత్వ భవనాలను నిర్మించలేదని, అభివృద్ధి పనులకు కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేసి వదిలేసారని అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని బిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య,మంగళపల్లి రామచంద్రయ్య,జీనుగా సురేందర్ రెడ్డి,గుండాల నర్సయ్య, ధరావత్ సోమన్న,దొంగరి శంకర్,ఆలువాల సోమయ్య,ముద్దసాని సురేష్, బసనబోయిన రాజేష్, బసనబోయిన మహేష్,చిదిరాల రవి, ధరావత్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు బయోచార్ మరియు పత్తి సాగుపై శిక్షణ.!

రైతులకు బయోచార్ మరియు హెచ్ డి పి సి పత్తి సాగుపై శిక్షణ కార్యక్రమానికి పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం రైతు వేదికలో ఆరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ ద్వారా నిర్వహించబడిన రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు పత్తి సాగులో తాజా మార్పులపై దృష్టి సారించాలన్నారు..
ఈ సందర్భంగా అరణ్య సీఈఓ శ్రీమతి పద్మ కోప్పుల మాట్లాడుతూ, వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే బయోచార్ ప్రయోజనాలను వివరించారు. “బియోచార్ మట్టిలో పోషకాలు మరియు నీటిని నిలిపే సామర్థ్యాన్ని పెంచుతుంది, సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది,” అని ఆమె చెప్పారు. “ఇది మట్టిలో కార్బన్ను వందల సంవత్సరాలపాటు నిలుపుతుంది. ఇది వాతావరణానికి మేలు చేసే పరిష్కారం.” రైతులు బయోచార్తో కంపోస్టింగ్ ప్రారంభించాలని ఆమె సూచించారు. “మీ మట్టి, మొక్కలు మరియు భూమి మిమ్మల్ని ధన్యవాదాలు చెబుతాయి,” అని ఆమె అన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి (డి ఏ ఓ ) శ్రీ కె. శివప్రసాద్ హెచ్ డి పి సి పత్తి సాగుపై వివరాలు పూర్తి వివరాలు తెలియచేశారు.
“ఎకరాకు ఎక్కువ విత్తనాలు వేసి, తక్కువ దూరంతో సాగు చేస్తే దిగుబడి బాగా పెరుగుతుంది,” అని ఆయన అన్నారు. “దేశంలో పెరుగుతున్న పత్తి డిమాండ్ను తీర్చడానికి, తక్కువ దిగుబడిని అధిగమించడానికి హెచ్ డి పి సి సరైన మార్గం” అని ఆయన పేర్కొన్నారు.
సహాయ సంచాలకులు బిక్షపతి మాట్లాడుతూ పాత పద్ధతి వ్యవసాయం నూతన పద్ధతిలో వ్యవసాయం గురించి తేడాలను రైతులకు వివరించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ గత ఏడాది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి గత ఏడాది వచ్చిన సమస్యల గురించి వాటికి ఏ విధంగా అధిగమించాలని రైతులకు సూచించడం జరిగింది, అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ సోమవారం నుండి చేయడం జరుగుతుంది అని తెల్పడం జరిగింది,
రైతులకు ఉచితంగా బయోచార్ను అందిస్తూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ పనిచేస్తోందని తెలిపారు.
నూజీవీడు సీడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, హెచ్ డి పి సి పత్తి సాగు రైతుల్లో మంచి ఆదరణ పొందుతోందన్నారు.
ఈ పద్ధతిలో సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల ఎక్కువ పత్తి దిగుతుంది. ఈ సీజన్లోనే 59 జిల్లాల్లో 35,000 ఎకరాల్లో హెచ్ డి పి సి పత్తి నమోదు చేయడం దీనికి నిదర్శనం అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ దిగుబడులు మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థిరమైన సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు కీలకమైన అడుగు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు బిక్షపతి మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఆరణ్య ఎన్జీవో సీఈవో పద్మ నూజివీడు సీడ్స్ నరసింహారెడ్డి, ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది..

నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం.

నర్సంపేట మునిసిపల్ కమిషనర్,సీఐ లకు సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

మునిసిపాలిటీలో కమిషనర్ గా పదోన్నతి పొందిన నాగరాజు,పట్టణ సీఐ రఘుపతి రెడ్డిలకు బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానం చేశారు. నర్సంపేట మున్సిపాలిటిలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు మున్సిపాలిటీ కమీషనర్ గా ఇటీవల పదోన్నతి పొందడంతో తన కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ లో నూతనంగా విధుల్లో చేరిన టౌన్ సీఐ రఘపతి రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు ఘనంగా సన్మానించారు.

CI Raghupathi Reddy.

 

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మోకుదెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్, మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్,బీసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి సాంబరాతి మల్లేశం, పట్టణ అధ్యక్షులు గండు రవి గౌడ్, ఉపాధ్యక్షులు చీర వెంకట్ నారాయణ, యువజన నాయకులు బైరి నాగరాజు,రామగోని శ్రీనివాస్ గౌడ్,జామళాపురం అశోక్,పుల్లూరి కుమారస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మే 20 న జేరిగే సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలి.

మే 20 న జేరిగే సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలి
వనపర్తి నేటిధాత్రి :

 

 

శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు మండల సదస్సు బి. కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులు ,రైతు ,కూలీల కర్తవమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు , వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బందుకు పిలుపునిచ్చాయని అన్నారు. దేశంలోని నూటికి 90 శాతం ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నదని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కార్మికులు మే 20 న తలపెట్టిన భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని కేంద్ర ప్రభుత్వ విధానాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. . ఈ సదస్సులో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, వనపర్తి అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షులు జి. జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు బాల కిష్టమ్మ ,సరళ, నారాయణమ్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సానిటరీ వర్కర్స్ అధ్యక్షులు మౌలాల్, నాయకులు ఎన్. కురుమూర్తి, బోన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పరమేశ్వర చారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు

రైతును మోసం చేస్తే సహించం.

రైతును మోసం చేస్తే సహించం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ధాన్యం కొనుగోలు సెంటర్లలో తరుగు పేరుతో రైతును మోసం చేస్తే సహించమని కఠిన చర్యలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలో జీవనజ్యోతి ప్లేరపి మహిళ సమైక్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు తరుగు లేకుండా లాభం పొందాలని వారు సూచించారు. అదేవిధంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకురావాలని అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు, గన్నీలు,వేయింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబాల వివరాలు పంట నష్టం వివరాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంట నష్ట వివరాలను వ్యవసాయ ఉద్యాన శాఖల వివరాలను సక్రమంగా పంపించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వ్యవసాయ శాఖ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్ వడ్లకొండ నారాయణ గౌడ్ మండల నాయకులు అధికారులు ఎమ్మార్వో ఎంపీడీవో మహిళా సమైక్య అధికారులు సిసి బాబా మహిళలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి.

#రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

ఈ 20 న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో సన్నాహాక సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నమిండ్ల స్వామి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ
కేంద్రంలో మూడో సారీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తున్నదన్నారు. కార్మిక వర్గ సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి ముందుకు తీసుకువచ్చిందని,వీటికి వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలను అనిచి వేస్తూ కార్మిక హక్కులను కాలరసిందన్నారు. 2025 -26 బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేటాయింపులు చేసింది సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టి, కార్పొరేట్ గుత్తా సంస్థలకు పెట్టుబడుదారులకు వేలకోట్ల రూపాయలు రాయితీలు ప్రకటించిందని ఆరోపించారు.సంఘటిత అసంఘటిత కార్మికులు, రైతులు వ్యవసాయ కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ నెల 20 న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మాలోతు సాగర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుచ్చాకాయల కృష్ణరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి జిల్లా నాయకులు హన్మకొండ శ్రీధర్, నాయకులు బేసికె మొగిలి, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version