ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం నర్వ గ్రామం పంచాయతీలో ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు.గ్రామంలో త్రాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి, సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశించారు.అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పనులను కూడా ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆగిడి స్రవంతి,పంచాయతీ కార్యదర్శి రమాదేవి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ.

గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీని మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా శనివారం ఎంపీఓ శ్రీపతి బాబురావు సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిస్టర్ లను పరిశీలించి సిగ్రిగేషన్ షెడ్డు లో కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని సూచించారు. నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వేసవికాలం తాగునీరు సరఫరా లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ పైపు లైన్లు లీకేజీలు ఉంటే వెంటనే సరి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి పావని,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version