N5TG సాహిత్య సృజన పిల్లల సమ్మర్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ

N5TG సాహిత్య సృజన పిల్లల సమ్మర్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో N5TG సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “సాహిత్య సృజన పిల్లల సమ్మర్ క్యాంప్” పోస్టర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) బి. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ… రాబోయే వేసవి సెలవులను విద్యార్థిని, విద్యార్థులు మరియు యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం రూ.10/-తో సాహిత్య రంగంలో కవిత, కథ రచనలపై ప్రాథమిక అవగాహన ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కల్పించడం అభినందనీయమైన చర్య అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇదొక ప్రత్యేకమైన, సృజనాత్మక కార్యక్రమమని, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఆలోచనతో ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో N5TG సంస్థ చైర్మన్ అంకారపు రవి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 6 నుంచి నెల రోజులపాటు ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్ లలో అండర్- 14, 16, 19, 23 వయసు వారు పాల్గొనవచ్చని చెప్పారు. శిక్షణలో పాల్గొనేవారు
https://hycricket. org వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version