ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్ర పటానికి పాలాభిషేకం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం పది వేల పెన్షన్ అమలు గురించి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటులో ప్రస్తావించాడని, కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కు ముందడుగు పడడంతో శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సంఘం పట్టణ అధ్యక్షులు కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఎంపీ గడ్డ వంశీకృష్ణ చిత్ర పటానికి ఫలాభిషేకం చేశారు. చాలీచాలని పెన్షన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికలకు ముందు రిటైర్డ్ కార్మికులంతా గడ్డం వంశీకృష్ణ దృష్టికి సమస్యను తీసుకు వెళ్లడంతో ఎంపీగా ఎన్నికైన సందర్భంగా సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకున్నందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని కుమ్మరి మల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మికులు సాతి శంకరయ్య, మెరుగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని

బీ ఆర్ ఎస్ అధ్యర్యములో రైతులు రాస్తా రోకో

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యర్యములో రైతులు వనపర్తి లో రాస్తా రోకో చేశారు రైతులకు అండగా ఉంటామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతులకు అండగా ఉంటామని చెప్పారు.
రాత్రి వనపర్తి జిల్లా లో కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను మార్కెట్ యార్డ్ లో పరిశీలించి ప్రభుత్వం ధాన్యాని కొనుగోలు చేసేవరకు పోరాడుతామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతుల కు ధైర్యం చెప్పారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్,రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల క్రితం వచ్చిన వడ్లను సంచులు లేవని,ట్రాస్ఫోర్ట్ లేదని కొనుగోళ్లు చేయకపోవడం వడ్లు వర్షాల వల్ల నీటి పాలు అయినాయని ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు
ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక రైతులను ప్రభుత్వం నట్టేట మంచిదని విమర్శించారు.
రైతులతో కలసి దాదాపు గంటసేపు రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి నిరసన తెలిపారు.రాస్తా రోకో దగ్గిరి కి వచ్చిన తహసీల్దార్ తడసిన వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,భానుప్రకాష్ రావు,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, సూర్యవంశం.గిరి,ఇమ్రాన్, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి,చిట్యాల రాము బాబు నాయక్,పాషా,నారాయణ నాయక్,రైతులు పాల్గొన్నారు.

రోడ్డుకు మోక్షం ఎప్పుడో !

రోడ్డుకు మోక్షం ఎప్పుడో!

కంకర వేశారు గాని రోడ్డు వేయడం మరచారు

సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణ ము అసంపూర్తిగా నిలిచి పోయింది. పనులు పూర్తి చేసే విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు కంకర పోసి వదిలి వేసిన రోడ్డుపై రాకపో కలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు పనులు చేపట్టా లని పలుమార్లు అధికా రులకు చెప్పిన స్పందన లేదు రెండేళ్ల క్రితం సూర్య నాయక్ తండా నుండి కొప్పుల గ్రామా నికి నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 262. 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది రెండు ఏండ్లు క్రితం రోడ్డు పనులు ప్రారంభించారు సూర్య నాయక్ తండా నుండి కొప్పుల వెళ్లే రోడ్డుపై కంకర పోశారు కాగా మంజూరైన నిధులకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మధ్యలోనే వదిలేశారు.

BT construction Surya Nayak Thanda.

చాలా కాలంగా సూర్య నాయక్ తండా నుండి కొప్పుల ప్రజలు వాహనదారులు ప్రయాణానికి అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని అసంపూర్తిగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్.!

నూతన ఎస్సై ను మార్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల మండల నూతన ఎస్సై సైదా రాహుఫ్ కు సన్మానం చేసిన మండల పిఎస్ఆర్,పివిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్,ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, యువజన నాయకులు ఎస్కె వాజీద్ పాషా, నాయకులు ఎస్కె ఖాసీం, దుర్గం బాలకృష్ణ, సోషల్ మీడియా సభ్యులు మండలోజు కిరణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్.

ఎన్నికల హామీల అమలుకోసం పోరాడాలి-సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఎన్నికల హామీల అమలు కోసం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పోరాడాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ రామడుగు గ్రామశాఖ మహాసభ జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అర్హులైన వారికీ ఇండ్లు ఇవ్వకుండా సొంత పార్టీ కార్యకర్తలు రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని, ప్రజల సమస్యలను పట్టించుకొనే నాదుడులేరని వెంటనే స్తానిక ఎన్నికలు పెట్టాలన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్ష్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే, ప్రజా ఉద్యమాలు తప్పవని సృజన్ కుమార్ హేచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, మండల నాయకులు కీర్తి కుమార్, దాము భూమయ్య, యోగి బీరయ్య, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు.!

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు గంజాయి అమ్మకం దారుల పట్టివేత…

గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠిన చర్యలు తప్పవు – డీసీపీ కరుణాకర్

ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

 

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో విలేఖరుల
సమావేశంలో డిసీపీ పి కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు గా అమ్ముచున్న గంజాయి ముఠాను పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.. పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుచున్న వ్యక్తులను పట్టుకొని ని విచారించగా గంజాయి అమ్మడానికి వచ్చినట్టు తెలియ చేయగా నిందితుల వద్ద ఉన్న గంజాయిని
చూపించగా అది 9.664 కిలోల ఎండు గంజాయి గా ఉంది, అట్టి గంజాయిని మరియు ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు డిసిపి పి.
కరుణాకర్ అన్నారు ఈ సందర్భంగా పట్టుబడిన కిరణ్
వివరాలు:-ఎ 1.
గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం.
ఎ 2. జాడి ప్రకాష్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. ఎ) 3. గుజ్జుల సాయి తేజ, గ్రామం.
ద్వారకా నగర్, గోదావరిఖని.
ఎ 4. కొమురవెల్లి పవన్, గ్రామం. రామగుండం. ఎ 5. ఇందిబెల్లి సందీప్ గ్రామం. అంతార్గాం. ఎ 6. లింగన్నపేట విష్ణువర్ధన్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. మరియు
పరారీలో ఉన్న నిందితులు ఎ 7. ఖేల కుమార్, గ్రామం. ఉరుమనూర్, కలిమేల, ఒడిస్స రాష్ట్రము. స్వాధీనం చేసుకున్న గంజాయి దాదాపు 9.664 కిలోల పట్టుకున్న గంజాయి విలువ రు. 4,80,000/-
ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుకున్న గంజాయిని డిప్యూటీ తాసిల్దార్ బాలసాని శ్రీనివాస్.
రెవిన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ ఇరుకుల వీరేశం ఏఎస్ఐ రత్నాకర్ హెచ్ సి జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ ల సమక్షంలో పంచనామ నియమించారని అన్నారు
యువకులు ఈజీ మనీ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారని గంజాయి మహమ్మారి బారినపడి ఎంతో విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మత్తు కు అలవాటు పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వ్యక్తులు
4698
ఎక్కడ కనబడ్డ విక్రయించిన పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు అదేవిధంగా ఆర్థిక నేరాలకు చేస్తున్న పలువురిని చకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్సై దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిపి పి కరుణాకర్ ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్సై దీకొండ రమేష్ ఏఎస్ఐ రత్నాకర్ జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

బేషరతుగా చర్చలు ప్రారంభించాలి.

మారుపాక అనిల్ కుమార్
డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నరమేధాన్ని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు శివనగర్, తమ్మెర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతు, నక్సలిజాన్ని అంతం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోతుంది అని ప్రశ్నించారు. మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరిపి, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 2025లో ఇప్పటివరకు మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు కలిపి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు అని, దేశ చట్టాలు, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలను పక్కన పెట్టి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించేందుకు సాయుధ బలగాలను వినియోగిస్తోంది అని అన్నారు. కర్రెగుట్ట కొండలను పారా మిలిటరీ బలగాలతో చుట్టివేయటం, ఆదివాసీల హక్కులను పూర్తిగా పట్టించుకోకపోవటం అభీష్టకరమైంది కాదన్నారు.

శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం నిర్లక్ష్యం.

సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తమ శాంతియుత చర్చల సన్నద్ధతను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకపోతే, మావోయిస్టులు ఒకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలి అని,
మావోయిస్టుల ప్రతిపాదనకు బదులుగా ప్రభుత్వం షరతులు విధించడం శాంతి లక్ష్యాలకే వ్యతిరేకమని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే శాంతిని సాధించాలి. అందుకే అన్ని ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి తక్షణ కాల్పుల విరమణ, బేషరతు చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. భౌతిక నిర్మూలన కాదు, రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలి అని డి హెచ్ పి ఎస్ స్పష్టం చేస్తోంది అని అన్నారు.

పెహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నాం….

పెహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నాం….

రాజుపేట జామియా మజ్జిద్ అధ్యకుడు ఎం డి ఇషాక్….

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో గల జామియా మజీద్ యిమామియా లో ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అందరు కలిసి ముక్తకంఠంతో పెహల్గామ్ దాడిని ఖండించారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించి ఫ్లకార్టులతో నిరసనను తెలియజేసినారు అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన ఎండి ఇషాక్ మాట్లాడుతూ అమాయక ప్రజలైన పర్యటకుల ను అతి కిరాతకంగా కాల్చి చంపడం దారుణమని ఇటువంటి చర్య చేసిన వ్యక్తులు ఎటువంటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని ముస్లిం మతస్తులు ఎవరు ఎదుటి వ్యక్తిని చంపడానికి కానీ గాయపరచడానికి కానీ ఒప్పుకోరు అటువంటి హత్యలు చేసిన వారు ముస్లిం మతస్తులు కారు వారు కాఫిర్లు భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ కులమతాలకి అనుకూలంగా అన్నదమ్ముల సేవా భావంతో కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నాం ఇటువంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా వారికి కఠిన చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇకపై ఇటువంటి చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి కులమత బేధాలు లేకుండా ప్రజలందరినీ క్షేమంగా చూసుకోవాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇస్మాయిల్ జి క్రియా, దావూద్ కౌషల్ జాంగిర్ హుస్సేన్ అక్బర్ రఫీ, ముస్లిం పెద్దలు పిల్లలు అందరూ హాజరైనారు.

మాజీ మంత్రి హరీశ్ రావు రేపే నాగిరెడ్డి పల్లి రాక…

మాజీ మంత్రి హరీశ్ రావు రేపే నాగిరెడ్డి పల్లి రాక…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,సిద్దిపేట శాసన సభ్యులు టి హరీష్ రావు మేమాసం 4 వతారీకు ఆదివారం ఉదయం జహిరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించతలపెట్టిన
దుర్గా భవాని ఆలయజాతర కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటన లో తెలిపారు.

న్యాల్కల్, డప్పూరు మీదుగా ఆర్టీసీ బస్సులు.

న్యాల్కల్, డప్పూరు మీదుగా ఆర్టీసీ బస్సులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు న్యాల్కల్, డప్పు ర్ మీదుగా జహీరారాబాద్ వరకు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ బస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాలకు పైగా నిలిచిపోయిన ఈ రూట్ లో బస్సులు ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం.

కేంద్ర జనగణన, కులగణన చారిత్రాత్మక నిర్ణయం

బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని, కులగణనతో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం నిర్ణయానికి ప్రజలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఈ విజయం తమదే అంటూ గొప్పులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.60 యేండ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కులగణన ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణన, జనగణనలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉండే భారతీయులందరూ భాగస్వాములు కావాలని సందీప్ పేర్కొన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

◆ సందర్భంగా పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ
శుభాభినందనలు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. “పత్రికా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం. సత్యాన్ని వెలికి తీసే కర్తవ్య నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజంలో వారి సేవ అమూల్యం” అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం.. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించటం మీడియా కర్తవ్యం.. నిష్పక్షపాతంగా వృత్తి నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులకు వందనం..ఒక సందేశంలో పేర్కొన్నారు.

నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

పహల్గామ్ దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రామకృష్ణాపూర్ బంద్ ప్రశాంతంగా కొసాగింది. ఈ బందులో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని తమ దుకాణాలను మూసివేసి సంఘీభావం ప్రకటించారు. అమాయకులైన పర్యాటకులను ముష్కరులు లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడడం హేయనీయమైన చర్య అని అందుకే స్వచ్ఛందంగా బందు పాటిస్తున్నామని పలువురు వ్యాపారస్తులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు వేడుకలు

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండలంలో శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టినరోజు సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కస్తూరిబాయి వృద్ధాశ్రయంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ,జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తాటి కృష్ణ, పి ఎ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్ ,మండల సీనియర్ నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,వాలీబాబా, తడూరి రఘు ,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, మేడారం మాజీ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, పి ఎ సి ఎస్ డైరెక్టర్ సిద్ధంశెట్టి లక్ష్మణ్ రావు ,జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, మండల నాయకురాలు పార్వతి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు సోషల్ మీడియా వారియర్స్, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నూతన సీఐని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ నూతన సీఐగా పదవి బాధ్యతలను చేపట్టిన లేతాకుల రఘుపతి రెడ్డిని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అనంతరం పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మెరుగు సాంబయ్య, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ అయూబ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షులు దూదేల సాంబయ్య, వేముల సారంగం, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నాంపల్లి వెంకటేశ్వర్లు,నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజ్ మురళీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, గండి గిరి, నాగుర్లపల్లి మాజీ సర్పంచ్ రాజహంస, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 5వ వార్డు అధ్యక్షులు పున్నం నరసింహారెడ్డి, 8వ వార్డు అధ్యక్షులు గిరగని రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగొని శ్రీనివాస్, 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 5వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు అశోక్, ఎరుకల రమేష్, హిందు రాజు, దేశి సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో ఐఎన్టియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ రాములు, సివిల్ ఫిట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కాసర్ల ప్రకాష్ ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం.

మాజీ ఎంపీఎమ్మెల్యేరావులదంపతులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆ ర్ సి

వనపర్తి నేటిదాత్రి :

 

 

మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వరలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి శ్రీశైలంమల్లికార్జున నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలోగుర్రం జగదీశ్వరయ్య
మల్లికార్జున్ లోటస్ సెలూన్ రామకృష్ణ కలిసిపూలబోకె ఇచ్చి శాలువతో రావులను ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

అధికారులు మారినా బోర్డులు మారలే.!

అధికారులు మారినా బోర్డులు మారలే..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల తహసిల్దార్ కార్యాలయంలో నయబ్ తహసిల్దార్ బదిలీ అయి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు మాత్రం పాతదాన్నే కొనసాగిస్తోన్నారు. ఈ బోర్డులో సమాచారాన్ని అం దించే అధికారుల పేర్లు లేకపోవడంతో ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలనే అయోమయంలో ఉన్నారు. ఇందులో సీనియర్ సహాయకులు ఎవరన్నది ఇప్పటి వరకు బోర్డులోను, కార్యాలయంలోను లేకపోవడం గమనార్హం. కొత్త అధికారుల వివరాలతో బోర్డును నవీకరిం చకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వెంటనే బోర్డు మార్చాలని వివిధ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా.!

వక్ఫ్ సవరణ చట్టం 2025 కు వ్యతిరేకంగా మే 6వ తేదీ మంగళవారం జహీరాబాద్‌లో జరిగే మహిళల నిరసన సమావేశంలో పాల్గొనమని విజ్ఞప్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రారంభించిన దేశవ్యాప్త నిరసన ఉద్యమం “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్”లో భాగంగా, “సేవ్ ఎండోమెంట్, సేవ్ కాన్స్టిట్యూషన్” అనే పేరుతో మహిళల చారిత్రాత్మక కేంద్ర సర్వసభ్య నిరసన సమావేశం 2025 మే 6 మంగళవారం ఉదయం 10:01 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు స్థానిక ప్రచారకర్త హజ్రత్ మౌలానా అతిక్ అహ్మద్ కాస్మి అధ్యక్షతన జరుగుతుందని ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి కానో మరియు ఎండోమెంట్స్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ జహీరాబాద్ తెలియజేశారు. ఈ సమావేశానికి హజ్రత్ మౌలానా ఘియాస్ అహ్మద్ రషాది, కన్వేజ్, వక్ఫ్ బచా క్యాంపెయిన్, తెలంగాణ, శ్రీమతి న్యాయవాది జలీసా యాస్మిన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఇంచార్జి, వీరితో పాటు జామియా గుల్షాన్ గర్ల్ టీచర్స్ డిపార్ట్‌మెంట్ హెడ్, జామియా గుల్షన్ హనీస్ ఖైరీ- జమాతే ఇస్లామీ మహిళా విభాగం అధిపతి బుష్రా అఫ్రోజ్, సున్నీ దావత్-ఏ-ఇస్లామీ మహిళా విభాగం ఇన్‌చార్జి జహీర్ అబా, మౌలానా అబ్దుల్ ముజీబ్ ఖాస్మీ – ముఫ్తీ నజీర్ అహ్మద్ హస్సామీ, మిస్టర్ ముహమ్మద్ నజీముద్దీన్ ఘోరీ, స్థానిక జమాత్ ఘోరీ ఈ సమావేశానికి సయ్యద్ జియావుద్దీన్ మౌలానా మసూమ్ ఆలం కూడా హాజరుకానున్నారు. జహీరాబాద్ నగరం మరియు హదీసు పరిసర ప్రాంతాల మహిళలు మరియు బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జాతీయ ఐక్యత మరియు ఇస్లామిక్ మద్దతును ప్రదర్శించాలని జమియత్ ఉలేమా, జమాతే-ఇ-ఇస్లామి, సఫా బైతుల్ మల్, సున్నీ దావత్-ఇ-ఇస్లామి, జమియత్ అహ్లే యాత్ ముస్లిం యాక్షన్ కమిటీ మరియు అన్ని ఇతర సంస్థల నాయకులు విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version