ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసులు…

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసులు…

సమిష్టి జీవన, పద్ధతులు, సహజీవనం,పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు ఆదివాసులు…

బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసులే…

ఆదివాసులు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడుతుండేవి…

ఆదివాసి ప్రాంతాల్లో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి…

ఆదివాసుల హక్కులను పరిరక్షించాలి…

సనాతన ప్రజల తెగలు నేడు అంతరించిపోతున్నాయి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసి ప్రజలు. సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శకతకు నిలువెత్తు సాక్షులు వారు. పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకుని తరతరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసులు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తున్నారు. వారికి అడవి అంటే ప్రాణం. ప్రకృతితో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధానాలపై ఆధారపడి ఆదివాసులు అడవి బిడ్డలుగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో బ్రతుకుతున్నారు. విద్య వైద్యం అందని ఆదివాసీల జీవితాలు చాలా దుర్భరంగా మారాయి. అతి పురాతన సనాతన ప్రజల తెగలు అంతరించిపోతున్నాయి.సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. దేశంలో ఆదివాసీ జనాభా 12 కోట్ల మంది ఉన్నారు. ఆదివాసి ప్రజలు ఐదు మరియు ఆరవ షెడ్యూల్ ఏజెన్సీ ఏరియాలో నివాసం ఉంటున్నారు. 20% పైగా భూభాగంలో విస్తరించి ఉన్నారు. ఆదివాసి ప్రజల పాదాల కింద 80% ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నది. ఆదివాసుల జ్ఞానం,సంస్కృతి పాలన వ్యవస్థలపై ఆధారపడి అభివృద్ధి పథకాలు ఉండాలి. ఆదివాసీలు వారి పేరు ప్రతిబింబించే విధంగా ఉపఖండంలోని తొలి నివాసులు మరియు ఒకప్పుడు వారు ప్రస్తుతం ఉన్న దానికంటే చాలా పెద్ద ప్రాంతాల్లో నివసించారు. చుట్టూ దట్టమైన అరణ్యం. కొండకోనల మధ్య ఆవాసం. సంప్రదాయాలు,కట్టుబాట్లతో జీవనం. విలక్షణమైన అహార్యం. గొప్ప ఐక్యత. అడవి తల్లి ఒడిలో నిత్యం ఒదిగి సాగే పయనం. ఇలా ప్రత్యేక జీవనశైలి ఆదివాసుల సొంతం. వాళ్లే దేశానికి మూలవాసులు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న గిరి మాణిక్యాలు. ఆదివాసి ప్రజలు అనేక రకాలుగా అన్యాయాలకు గురయ్యారు. కానీ వారు తమ సంస్కృతిని మరియు హక్కులను కాపాడుకోవడానికి నిరంతరం ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసి ప్రజలకు వారి సాంప్రదాయ భూములు, అడవులు మరియు సహజ వనరులపై యాజమాన్యం మరియు యాక్సెస్ హక్కులు ఉంటాయి. ఆదివాసులు బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు. అడవులతో సన్నిహిత సంబంధం కలిగి, ప్రకృతి వనరులపై ఆధారపడి జీవిస్తారు. తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల వారు బ్రతుకు పోరాటంలో నైపుణ్యం సాధించారు.

ఆదివాసి ప్రజలు అడవి ఆధారిత జీవనం సాగిస్తారు. మరియు వారి మనుగడ కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడతారు. ఆదివాసి ప్రజలు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో నిండి ఉంటాయి. వీటిని వారు తరతరాలుగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసీలు వనరుల దోపిడీ, గుర్తింపు లేకపోవడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆదివాసి చట్టాలు అక్కరకు రాని చుట్టాలుగా మారాయి. ఆదివాసి తెగల వాయిద్య పరికరాలు వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీలు తమ హక్కులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూమి హక్కు, అటవీ సంరక్షణ, విద్య, ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సమస్యలు ఆదివాసీల హక్కులను కాపాడటం మరియు వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఇది సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ఒక ముఖ్యమైన అడుగు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి బిడ్డలు తమ మనుగడను సాగిస్తూ అడవిని ప్రాణంగా ప్రేమిస్తూ వీరు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, పొగాకు తదితర పంటలు ఎక్కువగా పండిస్తారు. అయినప్పటికీ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. పాలకుల తీరుతో ఆదివాసీలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. చాలా గ్రామాలకు నేటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. వైద్య సదుపాయాలు మృగ్యం. ఏదైనా రోగం వస్తే డోలిమోతలే దిక్కవుతున్నాయి. ఆదివాసీలు విలక్షణమైన భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. వాటిని పరిరక్షించడం, గౌరవించడం, మరింత ముందుకు తీసుకుపోవడం మనందరి కర్తవ్యం.

చెల్పూర్ లో రూ 5 కోట్లతో ఆధునిక హంగులత.!

చెల్పూర్ లో రూ.5 కోట్లతో ఆధునిక హంగులతో బస్టాండ్ నిర్మాణం

జెన్కో అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో రెండెకరాల విస్తీర్ణంలో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే.
ప్రయాణికులకు ఏడాది లోపు అందుబాటులోకి రానున్న చెల్పూర్ బస్టాండ్.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జెన్కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే.

ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి..

ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి

సూర్య హాస్పిటల్ డాక్టర్స్ ఎం. గీతా పావని ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు మరియు ఎన్.ఎస్. పవన్ రెడ్డి జనరల్ ఫిజీషియన్ ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు…*

నేటి ధాత్రి:మణుగూరు

పినపాక మండలం జానంపేట గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు భద్రాచలం సూర్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది..
ఈ వైద్య శిబిరానికి భద్రాచలం సూర్య హాస్పిటల్ కు చెందిన ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం గీతా పావని మరియు జనరల్ ఫిజీషియన్ ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డి మరియు హాస్పటల్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ ఉచిత వైద్య శిబిరంలో హాజరైన పినపాక మండలంలోని పలు గ్రామాలకు చెందిన రోగులను ఉద్దేశించి డాక్టర్ ఎం. గీతాపావని మాట్లాడుతూ ప్రారంభ దశలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే నిరుపేద కుటుంబాల్లో ఈ కిడ్నీ వ్యాధి బారిన ఎక్కువ మంది పడుతున్నారని కిడ్నీ సమస్యలతో అనేక రకాలుగా బాధించబడుతున్నారని, వీరందరికీ సరైన చికిత్స అందించడానికి భద్రాచలంలోనే సూర్య హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని… నిరుపేదల సేవే భగవంతుని సేవగా భావించి అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు…
తదుపరి డాక్టర్ ఎన్ ఎస్ పవన్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ వ్యాధిగ్రస్తులు సరైన ఆహార నియమాలు పాటిస్తూ సక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడినట్లయితే షుగర్ గాని బీపీ గాని కంట్రోల్లో ఉంటాయి వాటి వల్ల ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. షుగర్ మరియు బిపి కంట్రోల్ లో లేకపోతే కిడ్నీ వ్యాధి బారిన ఇప్పుడు ఎక్కువమంది పడుతున్నారని.. వైద్యంలో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని ఎవరు ఎలాంటి జబ్బులకు భయపడవలసిన అవసరం లేదని తెలియజేశారు… భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు వస్తున్నారు

ఈ కార్యక్రమంలో దరిదాపు 300 మంది రోగులను డాక్టర్లు పరీక్షించి వారికి తగు సలహాలు సూచనలతో పాటు సుమారు నాలుగు లక్షల రూపాయల మందులను ఉచితంగా పంపిణీ చేశారు…

ఈ కార్యక్రమంలో భద్రాచలం సూర్య హాస్పిటల్ సిబ్బంది మరియు ఇతర గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version