సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే.

సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే జెండా ఆవిష్కరణ.

కారేపల్లి నేటి ధాత్రి :

 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్టు-లెనినిస్టు)యు.సి.సి.ఆర్.ఐ(యం-యల్) పార్టీ ఆధ్వర్యంలో 139వ మేడే దీక్షా దినాన్ని ఘనంగా నిర్వహించటం జరిగింది. మేడే వారోత్సవాల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి.పోరాడే వానిదే ఎర్రజెండా మార్క్సిజం లెనినిజo మావో ఆలోచన విధానం వర్ధిల్లాలి అనే తదితర నినాదాలు చేశారు.
ఈ మేడే కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోలెబోయిన ముత్తయ్య గారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శ్రమని నమ్ముకొని పోరాడి పని దినాలను తగ్గింపు కొరకు తమ హక్కులు సాదించుకొన్న కర్శకులకు కార్మికులకు 139వ మేడే విప్లవ శుభాకాంక్షలు తెలియజేసారు.కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిఢిఆర్) జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాణాల లక్ష్మణా చారి మరియు కార్యకర్తలు కొమరం బీమ్ సెంటర్ లో ఎగరవేయడం జరిగింది.
ఈ మేడే వారోత్సవాల్లో నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనగా నవోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.

మేడే కార్యక్రమాలను విజయవంతం చేయండి.!

“మేడే” కార్యక్రమాలను విజయవంతం చేయండి

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రంపేట ఏరియాలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 “మే డే” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆవిష్కరించారు. అనంతరం తాను మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవులు పోరాడి హక్కులు సాధించిన రోజు “మే డే” అని అన్నారు.
సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా “మేడే” కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మే 1 వ. తేదీన ఉదయం 8 గంటలకు చంద్రంపేట ఏరియాలో సి.ఐ.టి.యు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లోని జెండా చౌరస్తా వద్ద “మే డే” అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి భారీ బహిరంగ సభ , భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇట్టి “మేడే” కార్యక్రమాలు , వేడుకలలో పవర్లూమ్ , వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్,సబ్బని చంద్రకాంత్, రమేష్, శ్రీను, నర్సయ్య, శ్రీకాంత్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్ దేవి జగదీష్,చెముటి రాము , మ్యాన రాజు,గడుదాస్ వేణు,ఇమ్మశెట్టి లక్ష్మణ్,మిట్టపల్లి ప్రసాద్,బోగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version