మీనాక్షి నటరాజన్ ను కలిసిన.!

మీనాక్షి నటరాజన్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

భూపాలపల్లి నేటిధాత్రి

ఢిల్లీలోని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విస్లావత్ దేవన్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు.

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ సమావేశం మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ కార్యక్రమం కన్వినర్ బనగాని రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ
ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించుటకు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దీని ద్వారా ఓకే సారి ఎన్నికలు జరిగితే ఆదేశం ఆర్థికంగా అభివృద్ధి పరంగా ప్రజాధనం వృధా జరగదని పరిపాలన సైతం వేగంగా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు సైతం ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు సైతం ఇలాంటి డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకుంటారని దీనివల్ల సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటారని మనమందరం ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాగతించి జిల్లా మండల స్థాయిలో బూతు స్థాయిలో విస్తృత ప్రచారం చేసి పార్టీలకు అతీతంగా యువకులను మేధావులను బాగాసామ్యం చేసుకొని వారి సహకారంతో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు ఇది ఒక మంచి కార్యక్రమం అని ప్రజలందరికీ వివరించాలని చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాన్నె మొగిలి దుప్పటి భద్రయ్య బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిప్ నాయకులుసోమా దామోదర్, మంద మహేష్ పున్నం చందర్, మిట్ట కుమార్,రాజశేఖర్, నరేందర్, సాయి పటేల్, ప్రవీణ్,హరిలాల్, రాజన్న, మల్లన్న, సంపత్, రామదాసు, రాకేష్ రెడ్డి,నరేష్, సమ్మయ్య,సంతోష్, తదితరులు పాల్గొన్నా
రు అనంతరం వివిధ గ్రామాల నుండి యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది వీరిని జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిదర్ రెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జాయిన్ అయినా వారు రజనీకాంత్ నవీన్ వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నారు

ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన.

*ఇసుక రవాణా ఆపివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

*బిజెపి జిల్లా అధికార ప్రతినిధి

కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట(నేటిదాత్రి).

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో యువతకు మరియు చాలా కుటుంబాలకు ఉపాధిగా ఉన్న ఇసుక రవాణా ప్రభుత్వం నిలిపివేయడం వల్ల చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయని వారికి ప్రభుత్వం తగిన విధంగా సహాయం చేసి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవర్లుగా పనిచేస్తూ ఇసుక ట్రాక్టర్లను నడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండడం వల్ల ఇదే ప్రధాన ఉపాధిగా భావించి చాలామంది ఆ తరువాత ట్రాక్టర్లను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసి తమ ఉపాధిని కొనసాగిస్తూ ఉండేవారు అని ఇప్పుడు ఇసుక రవాణా ఆపివేయడం వల్ల వారు ఉపాధి కోల్పోయి వారితో పాటు వారి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడడం ఫైనాన్స్ లు కట్టలేక వారాంతపు చిట్టీలు కట్టలేక గిరి గిరి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆ కుటుంబాలకు ఏర్పడ్డదని మహేందర్ రెడ్డి అన్నారు.

గత రెండు రోజుల క్రితం వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో డ్రైవర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితులు బాగోలేక కుటుంబాన్ని నడపలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ట్రాక్టర్ డ్రైవర్లకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయాలని రాజీవ్ యువశక్తి పథకం కింద వీరందరికీ రుణాలు మంజూరు చేసి వారి పరిస్థితికి తగ్గట్టు వ్యాపారం లేదా వేరే పని చేసుకునేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఇదే విషయాన్ని ఆ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టించుకోని స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై మంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చి డ్రైవర్లకు ఓనర్లకు న్యాయం జరిగే విధంగా పని చేయాలని వారిని డిమాండ్ చేశారు లేదంటే వారి తరపున భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రభుత్వంపై పోరాడి వారికి కావలసిన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఎల్లవేళలా పని చేసి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే ఎన్నోసార్లు ట్రాక్టర్ ఓనర్లు డ్రైవర్లు జిల్లాకు చెందిన మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి వారి బాధలను చెప్పుకున్న వారి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని ఆ విధంగా ఒప్పించే ప్రయత్నం చేయడం లేదని డ్రైవర్లు ఉపాధి కోల్పోయిన కార్మికులు నిరాశలో ఉన్నారని వారికి సరియైన హామీ ప్రభుత్వం నుంచి రాకుంటే భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇనుప ముక్కను తొలగించిన కాంగ్రెస్ నేత.

ప్రమాదాకరంగా ఉన్న ఇనుప ముక్కను తొలగించిన కాంగ్రెస్ నేత

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రంలో రోడ్డు మీద ప్రమాదకరంగా ఉన్న ఇనుప కరెంటు స్తంభం ముక్క. నడికూడ నుండి ధర్మారం వరకు రోడ్డు వెడల్పు లో భాగంగా ఇనుప కరెంట్ స్తంభాలను తొలగించగ మిగిలిన ముక్క రోడ్డు మీద ప్రమాదకరంగా ఉండి వాహనాధారులు ప్రమాదానికి గురయ్యేవారు. నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు చొరవ తీసుకుని కటర్, గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో ఇనుప కరెంట్ స్తంభం ముక్కను తొలగించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. దీనితో పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆర్.ఎం.పి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఆర్ఎంపీ,పీఎంపి వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన సమయంలో మద్దతుగా శాసనసభ మండలి కౌన్సిల్ లో గ్రామీణ ప్రజలకు రాష్ట్రంలోని 45 వేల ఆర్ఎంపీల సేవలు ఎంత అవసరమో వివరించి ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అంటూ ఖరాఖండిగా మాట్లాడారని ఆర్ఎంపీ,పిఎంపి అసోసియేషన్ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్ పేర్కొన్నారు.ఆర్.ఎం.పి ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆర్ఎంపీల సేవలను కొనియాడుతూ కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజాసేవ చేసిన సేవలను ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవాలని తెలపడం అభినందనీయమని అన్నారు. ఇదేవిధంగా ఆర్ఎంపీల గుర్తింపు పట్ల అన్ని వేదికల మీద మొదటి నుంచి ఆర్ఎంపీ,పిఎంపి లకు మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఈ సమస్యను కౌన్సిల్లో లేవనెత్తడానికి ముఖ్య కారకులైన సందర్భం ఉందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతిపక్ష నాయకులందరూ ఆర్ఎంపీలకు మద్దతుగా నిలవాలని స్వామినాథ్ కోరారు.
ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం సార్ లకు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపి,పిఎంపి అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించిన..

*నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించిన..

*చల్లా రామచంద్రారెడ్డి చల్లా బాబు రెడ్డి..

పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 26:

 

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నందు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం క్లస్టర్ ఇన్ చా ర్జులు, భూత్ ఇన్ చార్జీ
లు,యూనిట్ ఇన్
చార్జీ ల తో నియోజకవర్గ
స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి)
ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ ని కోల్పోవడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఇంకా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఉన్నారని వారి మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Constituency

గత 20 సంవత్సరాలుగా పుంగనూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు చేశారని ఇకమీదట వారి ఆటలు సాగని సాగనివ్వమని హెచ్చరించారు.
పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి అనేకమంది జైలుకు వెళ్లారని అటువంటి వారికి అందరికీ తగిన గుర్తింపు ఇస్తామని గ్రామాలలో మరియు కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పది రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఉంటుందని అటువంటి వారికే పదవులు వరిస్తాయని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు
భూత్ ఇన్, చార్జులు, యూనిట్ఇన్చార్జులు , క్లస్టర్ ఇన్చార్జులు మరియు పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణం అనంత నగర్ 26వ వార్డులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వికృతి భరత్ కుమార్ కి 42500 రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఆది శ్రీనివాస్ కి, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రెడ్దిమల్ల భాను, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, దళిత నాయకులు కొంపెల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా వందరెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని అలాగే ఖరీదైన వైద్యం చేయించుకోలేనినిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలుస్తుందని సందర్భంగా లబ్ధిదారులకు కోలాపురి నర్సయ్యకు .60000. కట్ల రమ్యకు.20000.రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముందటితిరుపతి యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆత్మకూరు నాగరాజు ముందటి రమేష్ సంపత్ నక్క రవి గొర్రె రాజు గుండి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.

హిందూ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే

బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

అయోధ్య నుండి అక్షింతలు రాలేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ బియ్యన్ని ఊరు రా ఇంటింటా పంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని నిన్న కరీంనగర్ లో జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం లో కేటీఆర్ మాట్లాడిన విధానాన్ని పరకాల పట్టణశాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు గాజులు నిరంజన్ ఖండిస్తున్నామని అన్నారు.అనంతరం మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముల వారిని కించపరించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని,అక్షింతలకు,తలంబ్రాలకు తేడా తెలియని కేటీఆర్ మాట్లాడిన వైఖరి హిందూ సమాజాన్ని కించపరచడమేనని,హిందువుల మనోభావాలు దెబ్బతినెలా మాట్లాడిన కేటీఆర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

• మైనార్టీలకు మోసం కాంగ్రెస్ ప్రభుత్వం..

• టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ మాట్లాడుతూ… మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మైనారిటీకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరం మీకు మైనారిటీల ఓట్లు కావాలి కానీ మైనారిటీల మంత్రి పదవి వద్ద గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మైనార్టీలకు తోహ ఇచ్చారు. మరియు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మైనారిటీ అవసరం లేదా అని మీ యువ నాయకుడు షేక్ సోహెల్ ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గత కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

 

KG to PG విద్యను ప్రారంభిస్తా, కార్పొరేట్ కళాశాల కాళ్లు విరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్, గత దశాబ్ద కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు. కెసిఆర్ తీర్పుతో విద్యా వ్యవస్థ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళి. ది అన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్-2024 ప్రకారం 2వ తరగతి నుండి 5వ తరగతి చదువుతున్న 82% విద్యార్థులకు 2వ తరగతి బుక్స్ చదవడం రావడం లేదు, 8వ తరగతి చదువుతున్న 65% మంచి విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్ పైన అవగాహన లేదు, బీహార్ జార్ఖండ్,ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం విద్యావ్యవస్థలో అధమ స్థానంలో ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ, 5వ, 8వ,10వ తరగతి విద్యార్థుల సామర్ధ్యాన్ని రాష్ట్రాల వారిగా నిర్వహించే పరీక్షలో టాప్-5 వరస్ట్ పర్ఫామెన్స్ రాష్ట్రాల్లో తెలంగాణను ఉంచిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో 2017-18 నుండి పర్ఫామెన్స్ ఆఫ్ గ్రేడింగ్ ఇండెక్స్ సూచిక ద్వారా రాష్ట్రాల విద్య వ్యవస్థ పనితీరుకు ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది, ఈ ఇండెక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రం జాతీయలోనే అధమ స్థానంలో నిలిచింది. 2022 సూచిక ప్రకారం సెకండరీ విద్య తర్వాత డ్రాప్ అవుట్ లలో తెలంగాణ రాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, జాతీయస్థాయిలో ఈ సగటు 13.2% గా ఉంటే,తెలంగాణ రాష్ట్రంలో 22.2% గా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వ పెద్దలు నారాయణ,శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు.

కెసిఆర్ హయంలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు అధిక నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యాభివృద్ధికి రూ.23,108 కోట్ల రూపాయలను ప్రభుత్వం కే ప్రతిపాదించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ప్రారంభించాలని సంకల్పించి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో 8 వేల పై చిలుకు టీచర్ ఉద్యోగాలనే భర్తీ చేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసింది. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయ బదిలీలు, మోషన్లు చేపట్టలేదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు ప్రమోషన్లను కల్పించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయడానికి గత ప్రభుత్వం హాయంలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈఓ లను నియమించలేదు. కేజీ టు పీజీ విద్య నేపంతో ప్రారంభించిన సంక్షేమ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాటి బిఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వారి కోళ్ల ఫారాలు, అభ్యభవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం. గత దసరా సమయంలో టిఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లో ఉన్న భవనాలకు అద్దె చెల్లించలేదని ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ ఛానల్ ద్వారా భవనాలకు మధ్య చెల్లిస్తామని, పాఠశాలలు నడవకుండా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో తిరిగి ప్రారంభించారు. శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండా ప్రారంభించిన ఈ పాఠశాలలతో రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చాలావరకు మూతపడ్డాయి, ఉన్న పాఠశాలల్లో సరైన విద్యార్థులు లేకుండా పోయింది.

కెసిఆర్ హయంలో నిర్వీర్యమైన విద్యావ్యవస్థను తిరిగే గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. కులం,మతం,ఆర్థిక సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి విధమైన విద్యను అందజేయడానికి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించడం చారిత్రక నిర్ణయం. విద్య ద్వారానే జీవితానికి సార్థకత ఏర్పడుతుందన్న అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు డబ్బులు ఉన్న పిల్లలకే ఐఐటీ,నీట్ అనే విధానం పోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో నీళ్ల చారు అన్నం తినవలసి వచ్చింది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించడానికి డైట్ చార్జీలను 200 శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి

ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

పరకాల,దామెర నేటిధాత్రి

పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ పిఎసిఎస్ డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,ఓబీసీ మోర్చా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చంద్రర్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ కొట్టే రమేష్, కో కన్వీనర్ గండు ముఖేష్, సీనియర్ నాయకులు గువ్వ సాంబయ్య,ఆలేటి పోషాలు, దామెర పృథ్వీరాజ్,శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు ఎక్కలదేవి రమేష్, గోగుల సమ్మిరెడ్డి,గండు పరుశురాం,బూత్ అధ్యక్షులు బి.రమేష్,చెల్పూరి రాజు, గూడూరు శ్రీనివాస్,మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి.

మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి
బీజేపీ మత చాందసవాద రాజకీయాలను మానుకోవాలి…ఏఏం సి చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య
`మతం అంటే నమ్మకం విశ్వాసం… మతం అంటే రాజకీయం కాదు బీజేపీ నాయకులు గుర్తేరుగాలి
`బతుకమ్మ పట్టుకున్నాడు బోనాల పండుగలలో బోనమెత్తిన నాయకుడు మా ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు
`అన్ని మతాచారాలను, మత విశ్వాసాలు గౌరవించే నాయకుడు ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు
`మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే కుటిల బుద్ది బీజేపీ నాయకులు మానుకోవాలి
`జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ నిధానం
`లౌకిక వాదం, బావసారుప్యత కాంగ్రెస్‌ పార్టీ విధానం : కాంగ్రెస్‌ నాయకులు

వర్ధన్నపేట,నేటిధాత్రి:

నియోజక వర్గ కేంద్రములో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏద్దు సత్యం,వర్ధన్నపేట ,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ , కోతపెల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ కమ్మాగొని ప్రభాకర్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్‌ లు విలేఖర్లతో మాట్లాడుతూ.గతములో వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు గుళ్ళు కడితే బిచ్చా గాల్లు అవుతారు, బడులు కడితే విద్యావంతులు అవుతారని మాట్లాడిన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించి రాజకీయ రంగును పులుముతున్నారు మన శాసన సభ్యులు కేఆర్‌ నాగరాజు డా: బీ అర్‌ అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్‌ హైడాలోజిలో మాట్లాడడం జరగింది.కేఆర్‌ నాగరాజు మాట్లాడిన మాటలు డా: అంబేద్కర్‌ చెప్పినవే . ఓ. ఏస్‌.నేడు ఈ దేశములో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు స్వేచ్చా గా జీవిస్తూ ఐఏఎస్‌,ఐపీఎస్‌,డాక్టర్లు,లాయర్లు,ఇంజనీర్లు, పొలిటీషియన్లు అయ్యారు అవుతున్నారాంటె, డా:బీ.అర్‌ అంబేద్కర్‌ చలవే. మి లాగా నిత్యం మతం ,బజనలు చేసుకుంటూ పోతే మా వర్గాలు ఈ దేశములో జీవించే స్థానమే లేదు.
ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్‌ ని జవహర్‌ లాల్‌ నెహ్రూ క్యాబినెట్లో న్యాయ శాఖ మంత్రి నీ చేసి గౌర వించింది . మి లాగా (బీజేపీ) గుళ్ళు, గోపురాలు, బజనలు,కీర్తనలు నమ్ముకుంటు,చేసుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ లు వంద సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా మో,నేటి వరకు అలానే ఉండే వాళ్ళము. నేడు ఈ దేశములో బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేయకుండా ,లౌకిక ప్రజాస్వామ్య లోకి రాండి.135 సంవత్సరాల నుండి మొదులుకొని నేటి వరకు ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ,నిమ్న ,అణగారిన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తూ వస్తుంది.నేడు కూడా కాంగ్రెస్‌ పార్టీ జై బాపు,జై బిమ్‌,జై సంవిధాన్‌ నినాదంతో బ్రహ్మ నడంగ ముందుకు వెళుతున్నా ము.భవిష్యత్‌ ఎన్నికలలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలుస్తోంది. గురువింద గింజ లాగా మాటలు మాట్లాడి మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నుండి డిమాండ్‌ చేస్తున్నాం.

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్.

ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని ఐకెపి వివోఏ రమేష్,లింగన్న,పద్మ,వినోద, కొమురయ్య,గట్టయ్య లను ముందస్తుగా అరెస్టు చేసి మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 వేల రూపాయల జీతంతో పాటు ఇన్సూరెన్స్,ఉద్యోగం భద్రత, డ్రెస్ కోడ్ వంటి అనేక డిమాండ్లను కచ్చితంగా తీర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పర్చిన ఏ ఒక్క హామిని కూడా తీర్చలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదులోని సెర్ఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకోవడం తమకు తగదని అన్నారు.

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక

బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకేదేశం ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

ఒకేదేశం ఒకేఎన్నిక పై అవగాహన కార్యక్రమం బిజెపి భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
డాక్టర్.సిరంగి సంతోష్ కుమార్
హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భాగం పడడంతో పాటు సమయం వృధా అవుతుందని అన్నారు వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.తరచూ ఎన్నికలు రావడం వలన ఎన్నికల కోడ్ ఉండడంతో ఆయా రాష్ట్రాల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది గతంలో జమిలి ఎన్నికలు అనేవి 1952 నుంచే ఎన్నికలు జరిగినవి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలను మార్చి రాష్ట్రపతి పాలన పెట్టడం తద్వారా దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంతి లాల్,బిజెపి నాయకులు మార్త రాజభద్రయ్య,చందుపట్ల రాజేందర్ రెడ్డి,బెజ్జంకి పూర్ణ చారి,కుక్కల విజయకుమార్, మార్త బిక్షపతి,సంగా పురుషోత్తం,దంచనాల సత్యనారాయణ,మారేడుగొండ భాస్కరాచారి,ఆకుల రాంబాబు,బూత్ అధ్యక్షులు మరాఠి నరసింగరావు,ముత్యాల దేవేందర్,సంఘ నరేష్, ఉడుత చిరంజీవి,బీరం రాజిరెడ్డి,గాజుల రంజిత్ బిజెపి కార్యకర్తలు  పాల్గొన్నారు.

రాష్ట్రములో విద్యాశాఖ మంత్రినీ నియమించాలి.

రాష్ట్రములో విద్యాశాఖ మంత్రినీ నియమించాలి

ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్

నేటిధాత్రి : హన్మకొండ

తెలంగాణ రాష్టంలో విద్యార్థి నిరుద్యోగ యువత మద్దతుతో గెలిచినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రనీకి విద్యాశాఖ మంత్రినీ కేటాయించకపోవడం చాలా బాధాకరం అని మంద నరేష్ అన్నారు విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్రములో ఒక్క విద్యాశాఖ మంత్రి నీ కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయ్యింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రములో ప్రతిపక్షములో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే విద్యార్థి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తాము అని హామీ ఇవ్వడంతో విద్యార్థి నిరుద్యోగ యువత మొత్తం కాంగ్రెస్ పార్టీనీ నమ్మి ఓట్లు వేయడంతో తెలంగాణా రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు న్యాయం చేయడంలో విఫలం అయ్యిందని మంద నరేష్ అన్నారు ఇప్పటి వరకు రాష్ట్రములో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయ్యిందని అన్నారు విద్యారంగానికి తీవ్రంగా అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందని అన్నారు.

బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి.!

కేసీఆర్ కు బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ చెన్నూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్‌ రాజా రమేష్‌, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్ మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించడంలో ధైర్యం చేయని బండి సంజయ్ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం అవివేకమని అన్నారు. కేంద్రంలో మంత్రి పదవి చేపట్టిన ఆయన రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి నోరు జారితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు జాడి శ్రీనివాస్,రామిడి కుమార్,గడ్డం రాజు,టైలర్ రాజు, జక్కనబోయిన కుమార్, స్వరూప మాజి కౌన్సిలర్ల పోగుల మల్లయ్య,రేవేల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపెల్లి తిరుపతి,యువ నాయకులు ఆర్నే సతీష్,కొండ కుమార్, లక్ష్మీ కాంత్, ఆశనవేణి సత్యనారాయణ,చంద్రకిరన్, సాయి కృష్ణ,దినేష్,క్రాంతి, నస్పూరి శివ,గోనే రాజేందర్, బుధగడ్డ రమేష్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తి దాయకం…

*భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తి దాయకం…

*సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి.వెంకటరత్నం..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 24:

 

బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధనకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల రాజీలేని పోరాటం యువతకు స్ఫూర్తి దాయకమని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి.వెంకటరత్నం అన్నారు. సోమవారం తిరుపతి నారాయణపురం లోని ఐఎఫ్టియు కార్యాలయంలో భగత్ సింగ్ 94వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా పి.వెంకటరత్నం మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ దేవ్ పోరాటాలు చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధులపై బ్రిటిష్ ప్రభుత్వ మారణకాండను వ్యతిరేకిస్తూ వారు చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయక మన్నారు. స్వాతంత్రం ద్వారా దేశంలో రాజకీయ అధికార మార్పిడి జరిగిందే తప్ప భగత్ సింగ్ ఆశయం మేరకు దోపిడీ లేని సమాజం అవతరించలేదన్నారు. నేటి మతోన్మాద దుశ్చర్యల పాలన అంతమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పిడిఎస్యు జిల్లా కార్యదర్శి హెచ్. లోకేష్ మాట్లాడుతూ నేటి యువతరం 23 ఏళ్లకే పక్కసారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేయడం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆరోపించారు. భగత్ సింగ్ మీరోచిత జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. భగత్ సింగ్ ఏ లక్ష్యంతో అయితే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ స్వాతంత్రం నేటికీ అందలేదన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం పిడిఎస్యు రాజీలేని పోరాటాలను చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కన్వీనర్ పి.లోకేశ్వర్,
పి ఓ డబ్ల్యు జిల్లా కన్వీనర్ ఎం.అరుణ, ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు ఆర్.సుజాత అలాగే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు..

సిరిసిల్ల పట్టణ ప్రజా వైద్యశాల డాక్టర్ అనిల్ కుమార్ అనారోగ్యరీత్యా కన్నుమూశారు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ (ప్రజా వైద్యశాల) ఈరోజు మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన సుదీర్గ కాలంగా సిరిసిల్ల ప్రజానీకానికి (ప్రజా వైద్యశాల నెలకొలిపి) వైద్య సేవలు అందించారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).

 

గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.

ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.

నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version