ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలి.

ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలి

ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించాలి

మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని,ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలని,ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్సీ ,తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.ప్రభుత్వ బడులు నిలబడాలి- చదువుల్లో అంతరాలు పోవాలి అనే నినాదం తో తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సిరిసిల్ల చేరుకున్నారు.ఈ సందర్బంగా ఆయన తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వం తో పాటు ప్రజలపై కూడా ఉందన్నారు.ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని,తరగతి గదికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని,
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పొరస్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ,కార్యవర్గ సభ్యులు నాగమణి,టి.ఎస్ యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మన మూర్తి, టి.ఎస్.యూ.టీ.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు,జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్ రావు,కోశాధికారి అంబటి రమేష్,కార్యదర్శులు పాముల స్వామి,కొత్వాల్ ప్రవీణ్,తిరుపతి జాదవ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి రామరాజు ,జిల్లా అధ్యక్షులు సిలువేరి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం.

నరసింహులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని .

ఇందుకుగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. గత ప్రభుత్వం.

ఎన్నో ప్రాజెక్టు ల. పేరిట. అప్పులు.చేసిన కూడా. వాటిని కట్టుకుంటూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని

ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.

మంత్రి పొన్నం ప్రభాకర్ కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ.నియోజవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు.

అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా ప్రభుత్వమే చేస్తుందని లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేసుకుంటూ.

ఇల్లు నిర్మాణం చేపట్టి పనులు వేగవంతంచేసి ఇందిరమ్మ ఇంటి సహకారం ఇందిరమ్మ కలను సహకారంచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రజా ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో.

అటువంటి వాటికి తావు లేకుండా ఉంటుందని

ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారులకు నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన లబ్ధిదారులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. ఏఎంసి వైస్ చైర్మన్.

నేరెళ్ల నరసింహం గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి.

సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఏం సి డైరెక్టర్ పరశురాములు. కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం రాజశేఖర్. జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ. తిరుపతి. కిషన్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గండ్ర జ్యోతి రెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా గండ్ర జ్యోతి రెడ్డి జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుణ్ణి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, ప్రజా క్షేత్రంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

హరీశ్​రావు​ జన్మదిన వేడుకలో రోగులకు పండ్లు పంపిణీ.

హరీశ్​రావు​ జన్మదిన వేడుకలో రోగులకు పళ్ళు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలో షేక్ సోహెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల శివారులోని శ్రీ కితకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఝరాసంగం జరిగిన వేడుకల్లో
మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ఫారూఖ్ పటేల్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన.

ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

నేటి ధాత్రి – బయ్యారం :-

 

 

బయ్యారం సొసైటీ చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిపినారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటపతి మాట్లాడుతూ, ఎల్లప్పుడూ మండల అభివృద్ధి గురించి ఆలోచించించే మూల మధుకర్ రెడ్డి భవిష్యత్ లో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.బయ్యారం ఏజెన్సీ అభివృద్ధి కై పాటుపడుతున్న ప్రజా నాయకుడని కొనియాడారు.అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు,నిరంజన్, రాకేష కార్తీక్,జాన్,ప్రసన్నకుమార్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం.!

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నే.

ఆవిర్భావ వేడుకలో జెండా ఆవిష్కరించిన గూట్ల తిరుపతి

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం* ఘనంగా నిర్వwహించుకోవడం జరిగినది.

మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి* జాతీయ జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడుతూ..

ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ

ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి యువకులు 1200 మంది చనిపోయిన దాన్ని చూసి సోనియా గాంధీ మనసు చలించిపోయి

తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును పెట్టి ఆమోదింపచేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియా గాంధీ ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.

అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందియాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ప్రజాపాలనను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకపోయిన ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎన్నో మన్ననలు పొందుతున్నారు.

గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ బీసీల అందర్నీ ఎలాంటి సంక్షేమ పథకాల అందించక అనేక ఇబ్బందులకు గురిచేస్తూ తమ స్వలాభం కోసం కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అదే తీరుగా ప్రజాసంక్షేమ పథకాల అమలు అందరికీ అందిస్తున్నారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కామిడి రత్నాకర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్.

యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరైన నాయకులు

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ (చందు) వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అక్బర్,జుబేర్ యూత్ కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ నథానెయల్,టిపిసిసి జిల్లా మీడియా&కమ్యూనికేషన్ కన్వీనర్ అశ్విన్ పాటిల్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,అక్షయ్ జాడే,మాజీ కౌన్సిలర్ నాగేష్,నర్సింహా యాదవ్,పాండు యాదవ్,మోహీన్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఐనవోలులో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు

అయినవోలు నేటిదాత్రి:

ఐనవోలు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కలపల్లి చందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వినర్ తంపుల మోహన్, బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా భరోసా అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్ అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు చేతగాని అడ్డగోలు హామీలు ఇచ్చి తాము అధికారం చేపట్టే సరికి రాష్ట్ర పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాకపోతే, ప్రభుత్వం గద్దె దిగిపోవాలని కేసీఆర్ నాయకత్వంలో మరోమారు బంగారు తెలంగాణను సాధించేందుకు భారస పార్టీ సిద్ధంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారస గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, మండల నాయకులు కావటి స్వామి, కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుపెల్లి రాజు, పట్టపురం ఎల్లగౌడ్,బొక్కల స్వామి, గద్దల ప్రభాకర్,సంతోష్,రవి తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం నేతలు

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వనపర్తి జిల్లా తెలుగుదేశం నేతలు ఘన o గా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు .

 

 

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు కన్వీనర్ బి రాములు న్యాయవాది షాకీర్ హుస్సేన్ కాగితాల లచ్చన్న చిన్నయ్య కృష్ణయ్య ,ఉపేంద్ర, రాజుఎం శేఖర్, కొత్తగొళ్ల శంకర్ దస్తగిరి డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణం లోని క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ను ఆవిష్కరించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గా ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమైనది.ఉద్యమానికి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్పూర్తిగా నిలిచింది స్వరాష్ట్రంలో సగర్వంగా జీవిస్తున్నామంటే. అందుకు అమర వీరుల త్యాగాలే కారణం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప , మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి మొగుడంపల్లి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్ ,నాయకులు బరూర్ దత్తత్రి,వెంకట్, సాగర్,దీపక్ ,సందీప్,నిఖిల్,ప్రశాంత్ రెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి

ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శికాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు

వనపర్తి నేటిధాత్రి:

 

వనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి కి
రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ పార్టీ టి పి సీసీ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి,కాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సి ఎం రేవంత్ రెడ్డిని ఒక ప్రకటనలో కోరారు .తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టిందని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నేత మండ్ల దేవన్న నాయుడు తెలిపారు
నియోజకవర్గంలో బడా నాయకులమని చెప్పుకునే నాయకులను మట్టి కరిపించిన చిన్న మారుమూల గ్రామం
సర్పంచ్ .ఎంపీటీసీ. ఎంపీపీ ఎమ్మెల్యే గా గెలిచిన తూడి మేఘా రెడ్డి కి ప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి కేటాయిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని మండ్లదేవన్న నాయుడు తెలిపారు

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో.

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో మాజీ మేయర్ల పాత్ర ఏంటి?

అధికారిక కార్యక్రమాల్లో వేదికపై మాజీలను పిలిచినమున్సిపల్ కమిషనర్ పైచర్యలు తీసుకోవాలి

బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న కమిషనర్

_సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

కరీంనగర్ నగరంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్ల పంపిణీ అధికారిక కార్యక్రమంలో వేదికపై బిజెపి పార్టీకి చెందిన మాజీ మేయర్ సునీల్ రావు,
డి.శంకర్ కొంతమంది మాజీ కార్పొరేటర్లూ వేదికపై ఉండటం వేదికపై సీట్లలో కూర్చోవడానికి ఆహ్వానించిన నగరపాలక కమిషనర్ పైచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా బిజెపికి చెందిన నాయకులు వేదిక పై కూర్చున్న కమిషనర్ మౌనంగా ఉండటం ఉండి ప్రజలను అవమానపరుస్తున్నారని బిజెపి కార్యక్రమాల్లాగా అధికార కార్యక్రమాలు కమిషనర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

Municipal Commissioner

 

 

పదవి కాలం పూర్తయిన ఇంకా మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వేదికలపై పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో అరవై మంది కార్పొరేటర్ల పదవి కాలం పూర్తయిన బోర్డుపై ఉన్న వారి పేర్లు ఇంకా తొలగించడం లేదని వెంటనే వాటిని తీసేయాలని సురేందర్ రెడ్డి,రాజు ఈసందర్భంగా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం అల్పుగొండ సావిత్రి అధ్యక్షత జరిగింది.

జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని. పాపారావు మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువుల కోసం, జీలుగులు గతంలో 1000 రూపాయలు లోపు ఉండే, వాటి ని రెండు వెల వందచిల్లర రెట్టింపు కంటే ఎక్కువ శాతం పెంచారు.

ఇది రైతులపై భారం పడుతుంది.

వ్యవసాయ అధికారుల దాడుల్లో క్వింటాళ్లకొద్ది నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి, వాటిని కొనుగోలు చేసిన రైతులు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతారు, అప్పులు తెచ్చి పెట్టుబడిపెట్టి పంటలు పండక, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, నకిలీ విత్తనాలను విక్రయించే దళారులను అధినేయంగా శిక్షించాలని, ధాన్యం సేకరించిన రైతులకు కింటాకు 500బోనస్, రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఇందిరమ్మ రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడుల కోసం సాయం అందించాలని అన్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు.

కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెట్టుబడులకు కూడా సరిపోవని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని సీటు ప్లస్ అదనంగా 50% మద్దతు ధర చట్టం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గొడిశాల. వెంకన్న, మోడీ వెంకటేశ్వర్లు, జల్లే జయరాజు, నీరుటి.

జలంధర్, చందా వెంకన్న, సోమవరపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్న ఎంపీ మల్లు రవి.

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్న ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

 

నేడు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి సాయంత్రం 3 గంటలకు భారీ ర్యాలీగా గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ (డిసిప్లేనరి) కమిటీ చైర్మన్గా నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ని ఏఐసీసీ నియమించిన సందర్బంగా నేడు సాయంత్రం గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ (డిసిప్లేనరి) కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్నారు. కావున ఈ సందర్బంగా 119 నియోజకవర్గల నుండి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు.

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుందని. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని. మండలంలో పాపాయి పల్లె. రామన్నపల్లి. బస్వాపూర్. నేరెళ్ల. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేసిన మని. ప్రజలకు అండగా ఉండి ప్రజా పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అని ఆయన పాలనలో రాష్ట్రకాంగ్రెస్ ప్రజా పరిపాలన సాగిస్తుందని. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేస్తూ ఆరోగ్యారంటీలు అమలు చేస్తున్నామని. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు పాలభిషేకం చేయడం జరిగిందని . ఇట్టి ఇందిరమ్మ ఇండ్లురావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్ కి. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కే కే మహేందర్ రెడ్డికి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ నాయకులు మునిగల రాజు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్. అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు కిషన్ లక్కీ గారు తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ…

మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఈరోజు ఏడుగురికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రజలందరూ ఇల్లు లేని వారు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారు అందరూ లబ్ధి పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలే కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని. ఇకనైనా లబ్ధిదారులందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గం గౌడు. గ్రామపంచాయతీ సెక్రెటరీ సమీర్. జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. మాజీ ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. కాంగ్రెస్ నాయకులు సుద్దాల కరుణాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరెపల్లి బాలు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం. సుద్దాల శ్రీనివాస్. హరీష్ రెడ్డి. మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి. ప్రతాప్ రెడ్డి మండల ఫిషరీస్ అధ్యక్షుడు ఇటికల మహేందర్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో.

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో
ఉచిత కంటి వైద్య శిబిరం
వనపర్తి నేటిధాత్రి :

 

 

 

బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా అధ్యర్య ములో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ విలేకరులకు తెలిపారు
పోస్టర్ ను బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ఆవిష్కరించారని తెలిపారు
ఈ సందర్బంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ
, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా*
వనపర్తి సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా సాయి నేత్రాలయ కంటి ఆసుపత్రి సంయుక్తంలో
ఉచిత కంటి వైద్య శిబిరం
వనపర్తి జిల్లా పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని తెలపడం జరిగింది సోమవారం
:ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు
అభయాంజనేయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర,ఉంటుందని తెలిపారు వనపర్తి ప్రజలు, ఉచిత.కంటి వైద్య శిబిరం లో పాల్గొనాలని కోరాడు
పోస్టర్ ఆవిష్కరణ లో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ మార్కాట్ యార్డ్ చైర్మన్ లక్ష్మా రెడ్డి.మాణిక్యం కృష్ణయ్య రెడ్డి డేగ మహేశ్వర తిరుపతయ్య యాదవ్.ధర్మ నాయక్, సూర్యావంశం గిరి, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి, చిట్యాల రాము అలీం యుగేందర్ రెడ్డి సయ్యద్ జమీల్, జహంగీర్ కుమ్మరి సత్యంనాయక్, నరసింహ కరుణాకర్ బాలరాజు మునికుమార్, రామస్వామి నందిమల్ల సుబ్బు, సౌమ్య నాయక్ మరియు ముఖ్యులు పాల్గొన్నారు.

దశదినకర్మల్లో పాల్గొన్న రేగ.

దశదినకర్మల్లో పాల్గొన్న రేగ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…

 

 

 

కరకగూడెం మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన పోలెబోయిన క్రిష్ణయ్య (హెల్త్ డిపార్ట్మెంట్-కరకగూడెం)తండ్రి గారైన పోలెబోయిన.ఎర్రసమ్మయ్య అనారోగ్యంతో మరణించారు.శనివారం దశదినకర్మలకు పినపాక మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు బాధిత ఇంటికి వెళ్లి,మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, గ్రామ మాజీ సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ,స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్.!

జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ సమక్షంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారులు తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని,వెహికిల్ అలవెన్సులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వేంకటేశ్వర రావు,బెల్లంపల్లి ఇంచార్జీ డి ఎల్ పి ఓ సఫ్తర్ అలీ,జైపూర్,చెన్నూరు,
బెల్లంపల్లి మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు,అజ్మత్ అలీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పలువురు కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version