ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లను పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణ కేంద్రంలో పంక్షన్ హల్ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ద్వారా మైనారిటీలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం ద్వారా మంజూరు అయిన 150 కుట్టు మిషన్ ల పంపిణి కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాల్గొని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుళ్ల కొత్వాల్ కలిసి మైనారిటీ మహిళకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు,పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్ గారు కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాజా &మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్ ల దగ్ధం.

నాలుగు లేబర్ కోడ్ ల దగ్ధం

శ్రీరాంపూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని శ్రీరాంపూర్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్ ల ప్రతులను దగ్ధం చేశారు. మంగళవారం ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బ్రహ్మానందం మాట్లాడుతూ.. దేశంలో కార్మిక వర్గం బ్రిటిష్ కాలం ( 1926 ) నుండి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అనేక చట్టాలను సాధించుకున్నట్లు తెలిపారు.మొత్తం 44 కార్మిక చట్టాలు కొనసాగుతున్నాయని అందులో 29 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం కుదించి నాలుగు లేబర్ కోడ్ లుగా మారుస్తున్నారని ఆరోపించారు.వేతనాలు,వృత్తి భద్రత,ఆరోగ్యం,పని పరిస్థితులు,సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాల కోడ్ లు వీటి ద్వారా 29 కార్మిక చట్టాలు రద్దు చేయబడతాయన్నారు. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడం కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నాలుగు కోడ్లను తీసుకొస్తున్నారని అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి కార్మిక వర్గం ఒక పెద్ద మిలిటెంట్ ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. జాతీయ వ్యాప్తంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్న కార్మిక సంఘాలు కార్మికులని ఈ నాలుగు లేబర్ కోడ్ లు అమలైతే జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనిల్,సుధాకర్,వెంకటి,సురేష్,రాజేష్,నగేష్,రాంబాబు, సమ్మయ్య,శేఖర్,రాము, విజయేందర్,శారద,కవిత, శిరీష,లక్ష్మీ,మల్లేశ్వరి, కమలమ్మ పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు.

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు

మండల వ్యవసాయ అధికారి గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో రైతులకు జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మండ లానికి ఈ వానాకాలం వేసుకో డానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై శాయం పేట పిఎసిఎస్ కు 266 బస్తాలు మరియు ప్రగతి సింగారం గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 233 బస్తాలు కెటాయించడం జరిగింది. ఒక్కో బస్తా సైజ్ 30 కిలోలు ఉండగా, బస్తా ధర 2137 రూపాయల 50 పైసలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రైతులు తమ యొక్క పట్టాదారు పాసు పుస్తకం మరియు ఆధార్ ల జిరాక్స్ తీసుకొని వెళ్లి సమర్పించి విత్తనాలు కొనుగోలు చేయవలిసిందిగా తెలియ జేయడమైనది. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పచ్చి రొట్టె ఎరువులైన జీలుగ వాడడం వల్ల పంటలకు మరియు నేల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇవి ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో, మట్టిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి మట్టిలోకి తీసుకువెళ్తా యి. తద్వారా తదుపరి పంటకు కావాల్సిన నత్రజని మొక్కలకు అందుతుంది.
మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి, మట్టి జీవక్రియలను ఉత్తేజితం చేస్తాయి.రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ఖర్చు తగ్గిస్తుంది.సేంద్రియ పదార్థం పెరిగి, మట్టి సూత్రధర్మాలు పెరిగి, నీటి నిలువ సామర్ధ్యం పెరుగుతుంది.కొన్నిరకాల హానికర పురుగులను నియంత్రించేందుకు ఉపయోగ పడుతుంది.కావున మండలం లోని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి.

వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బుర్రకాయల గూడెం లోవడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న మహిళలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం తెలుసుకొని వడ్ల కొనుగోలు కేంద్రం నీ సందర్శించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకునీ,ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడీ వారికి ధైర్యం నింపి నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిధర్ రెడ్డి వారితో బిజెపి నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు మంద మహేష్ సోమ దామోదర్ మా దాస్ మొగిలి తదితరులు పాల్గొన్నారు

 నూతన వధూవరులను ఆశీర్వదించిన.

 నూతన వధూవరులను ఆశీర్వదించిన ధన్నసరి సింగిల్ విండో మాజీ చైర్మన్ బండారి వెంకన్న

కేసముద్రం నేటి ధాత్రి:

మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ సతీమణి మహబూబాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా తమ్ముడు
చిరంజీవి రోహిత్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వెన్నెల ను
ఆశీర్వదించిన ధన్నసరి సింగిల్ విండో మాజీ చైర్మన్ బండారి వెంకన్న                              
మహబూబాబాద్ చిట్టి మల్ల రామకృష్ణ.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శాయంపేట నేటిధాత్రి;

 

 

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల 2001-2002 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఆదివారం రోజు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకు న్నారు పదవ తరగతి పూర్తి చేసి 23 సంవ త్సరాలు గడిచిపోయిన సంద ర్భంగా అప్పటి గురువులు కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను పంచు కున్నారు.

తమతో పాటు పదవ తరగతి వరకు చదువు కున్న అమరులైన విద్యార్థుల ను ఉపాధ్యాయులను చిత్రప టాలకు పూలమాలవేసి నివా ళులర్పించడం జరిగింది.

ఉపాధ్యాయులు మాట్లాడు తూ గట్లకానీపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగి నది చారిత్రాత్మక మైన రోజులు కొనియాడారు.

ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుల బృందం మల్లారెడ్డి, సలేంద్ర,సాయన్న, సాంబయ్య, ధర్మారావు, షేక్ హాజీ నూరాని, రాజయ్య, శారద, కుమార స్వామి, ప్రస్తుత హెచ్ఎం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే విద్యార్థినీ విద్యార్థులు కార్యవర్గ సభ్యు లుగా నియమితులైన వారు బొమ్మకంటి కుమార్, కోరే మహేందర్, సముద్రాల లింగ మూర్తి, బొమ్మకంటి నరేష్, అందే మల్లికార్జున్, విన్నపరెడ్డి రాజేష్ రెడ్డి, ముస్కు రాజేం దర్, దాసి సతీష్, ప్రవీణ్ , కార్తీక్, రాజు, సురేష్, అశోక్ మహిళలు కార్యవర్గ సభ్యులు చేన్నబోయిన సరిత, గడ్డం శ్రీదేవి, జున్నుతుల మౌనిక, వేముల శైలజ, గౌతమి, కవిత, సుజాత, రాధిక తదితరులు పాల్గొన్నారు.

బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు ఉన్నత స్థాయికి వెళ్ళాలి.

బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు ఉన్నత స్థాయికి వెళ్ళాలి

జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి చిర్ర రఘు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలో వేసవి క్రీడ శిక్షణ శిబిరాలను వివిధ మండలాలలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా నేడు గణపురం జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో నిర్వహిస్తున్న బాల్ బ్యాడ్మింటన్ క్యాంపు ని జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి చిర్రా రఘు సందర్శించారు.డి వై ఎస్ ఓ మాట్లాడుతూ క్రీడాకారులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని బాల్ బ్యాడ్మింటన్ క్రీడలలో మెలకువలు నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశించారు.

District Youth Sports Department Officer Chirra Raghu

ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ కోచ్ రవీందర్ , ఫిజికల్ డైరెక్టర్, పి ఈ టి ప్రెసిడెంట్ ఎస్ రమేష్ పి ఈ టి సెక్రెటరీ ఎస్ సురేష్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు దాతల సహాయంతో ఉదయం టిఫిన్స్ మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ భోజన సౌకర్యానికి సహకరించిన దాతలు హనుమకొండ పీసీ సతీష్ అంజాద్, రాజు,పీసీ సదయ్య, కంచర్ల సతీష్, పసునూటి శంకర్, సతీష్, మైలారం అశోక్, రవి రెక్స్, జెన్కో కృష్ణకర్ అందించడం జరిగింది. బాల్ బ్యాట్మెంటన్ వేసవి శిక్షణలో భాగంగా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సామర్థ్యాల అభివృద్ధి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

సామర్థ్యాల అభివృద్ధి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

ప్రారంభమైన 5 రోజుల ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం

కేసముద్రం నేటి ధాత్రి:

ఎఫ్ ఎల్ ఎన్ తో సామర్ధ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల్లో మంచి ఫలితాలను తీసుకురావచ్చని కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యాశాఖాధికారులు కాలేరు యాదగిరి, మరియు జంగా రూపారాణి అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 2 మండలాల ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎఫ్.ఎల్.ఎన్. 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ శిక్షణను బాగా ఉపయోగించుకొని విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేలా కృషి చేయాలన్నారు. అనంతరం 158 మంది ఉపాధ్యాయులకు మూడు గదుల్లో మండల రిసోర్సు పర్సన్లు శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలోని ఎఫ్ఎల్ఎన్ అంశాల పై శిక్షణ ఇచ్చారు. వివిధ కృత్యాలు, పరస్పర చర్చల ద్వారా అర్ధవంతమైన శిక్షణ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్పి కె.సారంగం, ఎం.ఆర్.పీ. లు గనె యాదగిరి, బొరిగం రాములు, ఏదునూరి అశోక్, ఎన్నం భాస్కర్, వెలమల భాస్కర్, వట్నాల సత్యనారాయణ, మేకల సురేష్ నాయుడు, జి. మోహనకృష్ణ, ఘనపురం కృష్ణ, ఎస్.భాస్కర్, ఎం.ఐ.ఎస్. కో ఆర్డినేటర్ ఎస్.కె. ఖాదర్, కంప్యూటర్ ఆపరేటర్ వెన్ను భిక్షపతి, సీఆర్పీలు ఎం.డి. సుల్తానా, బండారు స్వాతి, ఇస్సంపల్లి ఉదయ్, చీర మురళి, నేలకొండ నాగవాణి, పులి సరిత, ధారావత్ రవి, నేరెళ్ల పద్మ తదితరులు పాల్గన్నారు.

హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష.!

పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని నాగవీధిలో పసునూటి సౌమ్య శంకర్ ల కుమారుడు పసునూటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా గణపురంలోని హనుమాన్ మాలాధారణ స్వాములకు తడి బిక్ష అనంతరం పొడి బిక్ష కార్యక్రమం చేయడం జరిగింది. హనుమాన్ మాల దారణ స్వాములు భిక్ష ఘనంగా చేసి పసునూటి అభిరామను స్వాములు సుఖసంతోషాలతో విద్య బుద్ధి కలిగి ఉండాలని దీవించారు.

పనికర లో హనుమాన్ నగర సంకీర్తన.

పనికర లో హనుమాన్ నగర సంకీర్తన

నెక్కొండ నేటి ధాత్రి:

నెక్కొండ మండలం పనికర లో మంగళవారం ఆంజనేయ స్వామికి విశిష్టమైన రోజుగా భావించి గ్రామంలోని హనుమాన్ మాలాధారులు గ్రామంలో ఉదయం 8 గంటల నుండి నగర సంకీర్తన చేసి గ్రామంలోని అన్ని దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. గురు స్వాములు చాట్ల సారంగం ,సముద్రాల అనిల్ ,ఘనగాని మధు, ల ఆధ్వర్యంలో హనుమాన్ మాల ధరించిన పత్రిక విలేకరులు కొత్త రవీందర్ రెడ్డి ,దేసూ.లక్ష్మణ్ , లు ఈ శోభ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామంలో 30 నుండి 50 మంది స్వాములు హనుమాన్ దీక్ష తీసుకుంటారని నియమనిష్ఠలతో ఇరు సంధ్యలు చన్నీళ్లస్నానాలు ఆచరించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీక్ష ఎంతో కష్టమైనదని స్వామి వారి ఆశీస్సులతో ఏ కష్టం లేకుండా కొనసాగుతున్నాదని గురు స్వాములు తెలిపారు. సుమారు 6 గంటల నగర సంకీర్తన పూర్తి చేశారు. అనంతరం పూజారి బూరుగుపల్లి భవిశాస్త్రి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి ఇరుముడులు ఎత్తుకొని స్వాములు స్వామివారి సన్నిధికి వెళ్ళిపోయారు .ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు బుర్ర సతీష్, రాచకొండ యాదగిరి, పైండ్ల మధు, మెండే కుమారస్వామి,కోల సతీష్, దామెర కొండ లక్ష్మీనారాయణ, పవన్ , తరుణ్ ,ప్రవీణ్, హరీష్ ,దీక్షిత్ రెడ్డి, రాము, శ్రీకాంత్ ,అభి, స్వామివారి సన్నిధికి వెళ్ళిపోయారు.

ప్రసవానికి వస్తే ప్రాణాలు కోల్పోయింది.

ప్రసవానికి వస్తే.. ప్రాణాలు కోల్పోయింది.

కల్వకుర్తి / నేటిదాత్రి :

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం కేంద్రంలో వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన రేణుక (27) కల్వకుర్తి లోని శ్రీ సాయి ప్రైవేట్ హాస్పిటల్ లో స్కానింగ్ చేయించుకొని వాటి రిపోర్ట్స్ డాక్టర్ కు చూపించగా.. రక్తం తక్కువగా ఉన్నదని.. ఆపరేషన్ చేయాలని బాధితులకు చెప్పగా.. వెంటనే ఆపరేషన్ చేశారు. పాప బానే ఉంది. ఆమెకు బ్లడ్ తక్కువగా ఉన్నది కావున నాగర్ కర్నూలు వెళ్లి బ్లడ్ తీసుకురమ్మని చెప్పాగా.. ఆదివారం సాయంత్రం బాధితులు నాగర్ కర్నూల్ కి వెళ్లి బ్లడ్ తీసుకొని రాగా.. ఇంతకు చాలా రక్తస్రావము కావున రక్తం ఎక్కించాలన్నారు.

Sri Sai Private Hospital

మూత్రం బందవడంతో ఐసి లో ఉంచి వాళ్లను చూడనివ్వకుండా వాళ్లు కొద్దిసేపటి తర్వాత వచ్చి హాస్పిటల్ యజమాని తీసుకొని వచ్చి మలక్పేట లోని యశోద హాస్పిటల్ చేరిపించి రెండు లక్షలు నగదు అడగగా టెస్టులు చేసి మొత్తం లక్ష రూపాయలు కడతమని చెప్పారు ఒక లక్ష రేపు కడతామని చెప్పారు 80000 శ్రీ సాయి హాస్పిటల్ డాక్టర్ కట్టడం జరిగిందని అప్పుడు వారు హాస్పిటల్ లో జాయిన్ చేసుకొని ఇబ్బందికరంగా ఉంది సీరియస్ గా ఉంది మేము ఏమి చెప్పలేమని 48 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని చెప్పారు అప్పటికే కళ్ళకు టేపులు వేయడం జరిగిందన్నారు. శ్రీ సాయి హాస్పిటల్ యజమాన్యం అంబులెన్స్ మాట్లాడే వెంబడి రావడమే కాక.. తన సొంత సొమ్ముతో వైద్యానికి ఇచ్చాడన్నారు. ఇది ఇక్కడే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. లేకపోతే తను రిఫర్ చేయలే కానీ.. అక్కడి వరకు వెంబడి వచ్చి అంబులెన్స్ మాట్లాడి డబ్బుల సహాయం చేసి ఎవరూ చేయరు ఇలాంటి హాస్పిటల్ కు అనుమతి ఇచ్చిన యజమాన్యం పట్టించుకోని వీటిని సీజ్ చేయాలని బాధితులు కోరారు.

జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు.!

జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ ఆరోపణ

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు.పట్టా పాస్ బుక్ ఉండి అన్ని అర్హతలు ఉన్న కూడా ఎంక్వయిరి రిపోర్ట్ లు అర్హులకు కాకుండా అనర్హులకు అనుకూలంగా ఇస్తూ రెవెన్యూ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోయే విదంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అంతే కాకుండా విద్యార్థుల విద్యాబ్యాసానికి అవసరమైన సర్టిఫికేట్స్ విషయంలో బీద విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని,గంగారపు రమేష్ తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జైపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి పై సమగ్ర విచారణ జరిపి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.శేఖర్, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఫోరం రజతోత్సవజాతరను జయప్రదం చేద్దాం.

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జాతరను జయప్రదం చేద్దాం.

రజతోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

హైదరాబాద్ జలవిహార్ రజతోత్సవ సభకు తరలిరావాలి.

టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా.

“నేటిధాత్రి”, వేములవాడ.

 

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాల పోస్టర్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం యూనియన్ ప్రతినిధుల మధ్య ఆవిష్కరించారు.

తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సభ కు జర్నలిస్టు సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజె రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

టీజెఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఈనెల 31 వ తేదీన 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించే రజతోత్సవ సభకు జిల్లా నుండి జర్నలిస్ట్ సోదరులు పెద్ద ఎత్తున కదలి రావాలని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం టీజేఎఫ్ రజతోత్సవాల సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

2001 మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ఊపిరిగా టీజెఎఫ్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు.

ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి రాష్ట్రం సాధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు.

టీజెఎఫ్ ఏర్పడి 25 సంవత్సరాలు, పూర్తి అవుతున్న సందర్బంగా
హైదరాబాద్ లోని జలవిహార్ లో ‘జర్నలిస్ట్ ల జాతర ‘ను నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు అన్నీ రాజకీయ పార్టీల ముఖ్యలు హాజరవుతారన్నారు.

హైదరాబాదులోని జలవిహార్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు.

ఈ జాతరకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టు సోదరులు హాజరుకావాలని కోరారు.

టీయూడబ్ల్యూజే -H143 రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో టెంజు జిల్లా అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల గట్టు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, యూనియన్ సీనియర్ ప్రతినిధులు గరదాస్ ప్రసాద్, పరకాల ప్రవీణ్, చల్ల ప్రసాద్ రెడ్డి తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంగల శ్రీనివాస్ తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టు సోదరులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.

బెస్ట్ అవైలబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.

ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్

నర్సంపేట నేటిధాత్రి:

రాష్ట్రవ్యాప్తంగా 2025,2027 విద్య సంవత్సరం కోసం ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్లలో, షెడ్యూల్ క్యాస్ట్, గిరిజన సంక్షేమ, శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా షెడ్యూల్ కులాల, గిరిజన ఒకటవ తరగతి, ఐదో తరగతి విద్యార్థుల కోసం, నోటిఫికేషన్ విడుదల చేసి, అర్హులైన విద్యార్థులను లక్కీ డ్రా ఎంపిక చేయాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో నేటి వరకు బెస్ట్ అవైలబుల్ స్కీం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం అర్హులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థిను ఆదుకోవాల్సిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్, భాస్కర్, సతీష్, కుమార్,అరవింద తదితరులు పాల్గొన్నారు.

కొత్తవారిని పరిచయం చేసే మన ఆప్తమిత్రుడు టీ.

శీర్షిక

హైదరాబాద్ నేటి ధాత్రి:

అందరిప్రియనేస్తం టీ”(తేనీరు)
ప్రాంతాలకు అతీతంగా…
కొత్తవారిని పరిచయం చేసే మన ఆప్తమిత్రుడు టీ..!
మస్తిష్కంలోని సమస్యలతో సతమతమౌతుంటే
అమ్మ చేతి స్పర్శలా మనసుకు ఉపశమనం కల్పించే
మన ఆప్తమిత్రుడు టీ ..!
ప్రతి విద్యార్థి కనురెప్పలపై దాడిచేస్తున్న నిద్దురను
తరిమేస్తూ చదువుల్లో సహకరించు మన నేస్తం టీ ..!
దేశ సరిహద్దుల్లో మంచుకొండల్లో పహారా కాస్తున్న
సైనికులకు ఆపద్బాంధవుడులా నేనున్నా నంటూ
వెచ్చగా గొంతులోకిజారిపోతూ…
నూతనోత్తేజం అందించు మన ఆప్తమిత్రుడు టీ ..!
అమీరు గరీబు అనే తారతమ్యం లేక
అందరినీ ఉషోదయ వేళ పలుకరిస్తూ ..
జోష్ నింపే మన అమృత నేస్తం టీ ..!
పున్నమి వెన్నెల రేయిలో సన్నగా వీచే చల్లగాలిలో
మదిలో మరుగున పడిన జ్ఞాపకాల మమతలను
గుర్తుకు తెచ్చే మన ఆప్తమిత్రుడు టీ ..!
మనం ముద్దుగా పిలుచుకునే”టీ”(తేనీరు)..
మనందరికీప్రియనేస్తం.మీకు ప్రశాంతమైన మరియు రుచికరమైన అంతర్జాతీయ టీ దినోత్సవ మే 21 శుభాకాంక్షలతో…
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218.

ఉగ్రవాదుల చర్యలను పసిగట్టడంలో కేంద్రం విఫలం.

ఉగ్రవాదుల చర్యలను పసిగట్టడంలో కేంద్రం విఫలం

మతోన్మాద విధానాలతో లౌకికత్వానికి ప్రమాదం

ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధినేటిధాత్రి:

దేశంలో ఉగ్రవాదుల పన్నాగాలను పసిగట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఈ క్రమంలోనే పహెల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పైశాచిక దాడి జరిగిందని ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు.
మంగళవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)- ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం కామ్రేడ్ షేక్ నజీర్ అధ్యక్షతన వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు కర్షకులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదాని అంబానీ లాంటి పెట్టుబడుదారులు ఎదేచ్ఛగా దేశ సంపదను అనుభవిస్తున్నారని ఆరోపించారు. శ్రమజీవులకు ఎలాంటి కనీస సౌకర్యాలు తగిన విధంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి దేశ లౌకికత్వాన్ని సమగ్రతను దెబ్బతీసేందుకు మతపరమైన విధానాలకు చర్యలు చేపట్టడం ఆందోళన కలిగిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతులకు తీరని నష్టం జరుగుతున్నదని అలాగే దేశాన్ని రక్షించాల్సిన కీలక బాధ్యతను నిర్వర్తించాల్సిన పాలకులు అది విస్మరించి తగిన విధంగా భద్రతను ఏర్పాటు చేయకుండా, నియామకాలు చేపట్టకుండా, ఉగ్రవాదులు పర్యాటకుల ప్రాణాలు బలి కొనడానికి కారణమయ్యారని ఆరోపించారు ఏ లక్ష్యం లేకుండానే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఎంతో సాధించామని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏ రకమైన మతోన్మాదం అయినా ప్రజలకు తీవ్రమైన హాని కలిగిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష సామాజిక ప్రజా సంఘాలు రాజకీయాలకతీతంగా ప్రజలను సమీకరించి ఉద్యమాలను చేపట్టేందుకు శ్రీకారం చుట్టాలని అందులో ఎంసిపిఐ(యు) కార్యకర్తలు ముందు ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పర్యటకుల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్,కుంభం సుకన్య, వసుకుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్, ఎన్ రెడ్డి హంసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరస్వతి మాత విగ్రహాన్ని.!

సరస్వతి మాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ డిమాండ్

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పత్రిక ప్రకటన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కొద్ది సంవత్సరాల క్రితం తన సొంత ఖర్చులతో మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి శ్రీసరస్వతి మాత తల్లి విగ్రహాన్ని ఇటీవల కొందరు హిందూ వ్యతిరేక శక్తులు దుశ్చర్యకు పాల్పడి ధ్వంసం చేసి విగ్రహ చేతు విరగొట్టడం జరిగిందని ఈఘటనను భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని, ఈదుశ్చర్యకు పాల్పడినటువంటి వారిని పట్టుకొని శిక్షించడంలో పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే పోలీసు యంత్రాంగం దాడి జరిగిన వెంటనే హిందూ సంఘాలకు తెలవడంతో హుటాహుటిన విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం అర్ధరాత్రి సమయంలో విగ్రహానికి మరమత్తులు చేపించడంలో ఆంతర్యం ఏంటని దుండగులను మాత్రం విస్మరించారని అన్నారు. దుశ్చర్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈశుక్రవారం సరస్వతి మాత విగ్రహాన్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూరేల శ్రీకాంత్ గౌడ్, బూతు అధ్యక్షులు రాగం కనకయ్య, గోపు అనంతరెడ్డి, శక్తి కేంద్రం ఇంచార్జి కొత్త రమేష్, ఆర్ఎస్ఎస్ నాయకులు కలిగేటి ఎల్లయ్య, సీనియర్ నాయకులు పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జూనియర్ ఎన్టిఆర్ జన్మదిన వేడుకలు.

ఘనంగా జూనియర్ ఎన్టిఆర్ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలకేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నందమూరి తారకరామా రావు(జూనియర్ ఎన్టీఆర్) జన్మదినాన్ని పురస్కరిం చుకుని దాసరి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.అనంతరం రోగులకు అరటిపండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో అమ్మ అశోక్,,దాసరి విష్ణు,ప్రణయ్, నవీన్, అఖి ల్,మోహన్,పవన్,సుమంత్ కిరణ్,తేజ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ సీఎం పర్యటన చరిత్రత్మకం కావాలి.

జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం పర్యటన చరిత్రత్మకం కావాలి

◆ సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి

◆ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలి — రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు.

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ ,బందోబస్తు, బారికేడ్లు , ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు,హెలిప్యాడ్ , హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి సభ లో పాల్గొంటారని తెలిపారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ శేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ,ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .

జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో నాయకులు

జైపూర్ ,నేటి ధాత్రి :

 

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చెన్నూర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై చర్చించడం జరిగిందని అన్నారు.

మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున రాష్ట్ర మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు మంచిర్యాల మున్సిపాలిటీ ఇటీవల కార్పొరేషన్ గా ఉన్నతీకరణ జరిగిన సందర్భంగా ఇక్కడ ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ఏ ప్రకటించాలని కోరడం జరిగింది.

అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 5 డిఎ లను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పిఆర్సి కమిటీ నివేదిక తెప్పించుకొని 51% తో వేతన సవరణ చేయాలని,

ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సిపిఎస్ తొలగించి పాత పెన్షన్ ఇవ్వాలని,గో 317 ను సమీక్షించి స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలని,సిపిఎస్,యుపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలనే విధానం ఓపిఎస్ ఇవ్వాలని,చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఇతర 57 డిమాండ్లను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా టీఎన్జీవో పక్షాన కోరడం జరిగిందని తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తానని, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని తెలపడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పోన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,కోశాధికారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కేజియారాణి,రామ్ కుమార్,నరేందర్,తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్,కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version