ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల పరిశీలన

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థలాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో అధునాతనమైన అంగులతో విశాలవంతమైన వాతావరణంలో 30 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో మంజూరు చేయగా ఆ నిధులతో నిర్మించబోయే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి స్థల సేకరణను పరిశీలన చేసినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. రూ.200 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.ఈ ప్రాజెక్టు సాధించడంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి కృషి ప్రాధానంగా నిలిచిందని పలువురు ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం విద్యారంగ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయని,నియోజకవర్గ పిల్లలు ఇక మెట్రో స్థాయి వసతులతో కూడిన పాఠశాలలో చదివే అవకాశం పొందనున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి రావడం గర్వంగా ఉందన్నారు. ఈ పాఠశాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను సులభంగా పొందడం విశేషమని, నియోజకవర్గ భవిష్యత్ తరాల విద్యాభివృద్ధికి బలమైన పునాది కానుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version