మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది దీనికంతటికి కారణం అధికారుల నిర్లక్ష్యం అలసత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో నెలలో ఎన్నోసార్లు నీరు బంద్ కావడం జరుగుతుంది* దీంతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారుల పనితీరుపై ప్రజా ప్రతినిధులు ఓ కన్ను వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు నాయకులే నాలుగు గ్రూపులుగా ఉండడమే దీనికి అంతటికి కారణంగా భావిస్తున్నారు.
Mission Bhagiratha
అధికారులకు నాయకుల గ్రూప్ తగాదాలతో ఎవరు పట్టించుకోరు అనే విషయం తెలుసుకున్న అధికారులు దానిని ఆసరాను చేసుకొని జహీరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కావున అధికారులను పనితీరుపై జహీరాబాద్ లో లీడర్ లు అని చెప్పుకుంటున్న నాయకులు అధికారుల తీరు పై సమీక్షించాలని కోరుతున్నారు.
సెల్ఫోన్లను ఎత్తుకెళ్లే హక్కు ఫారెస్ట్ అధికారులకు ఎక్కడిది.
సిపిఐ (ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు.
భూపాలపల్లి నేటిధాత్రి
అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవించడం ఆదివాసుల హక్కు అని, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల అక్రమ దాడులు ఆపాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు మహా ముత్తారం మండలంలోని ఆదివాసులపై పారేస్ట్ అధికారులు చేస్తున్న దాడులను ఉద్దేశించి గురువారం బంధు సాయిలు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు కార్పొరేటు మతోన్మాద ఆదివాసి ప్రజా వ్యతిరేక విధానాల అనుసరిస్తూ దాడులు చేస్తున్న కారణంగా చతిస్గడ్ లోని ఆదివాసీలు బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకొని తెలంగాణలోని అటవీ ప్రాంతాలలో గూఢాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారని,
అదే మాదిరిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహమూత్తాల మండలం పెగడపల్లి రేంజ్ పరిధిలోని పేగడపల్లి గ్రామ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా వలసదివాసులు నివాసం ఉంటున్నారని వారు అన్నారు, వేరొక రాష్ట్రం నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనే కారణంగా ఫారెస్ట్ అధికారులు పదేపదే వారిపై దాడులు చేస్తూ వారి గుడిసెలను కూల్చివేస్తూ, వారిని విపరీతంగా కొడుతూ, వారి పంట సామాగ్రిని, అదేవిధంగా బట్టలు, సెల్ ఫోన్లు ఇతర జీవితాల వస్తువులను మొత్తం ఎత్తుకెళ్తూ ఇవ్వకుండా నరకయాతన పెడుతూ ఇబ్బందుల గురిచేస్తు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు, వలస ఆదివాసీలు భారత పౌరులు కాదా, వారికి జీవించే స్వేచ్ఛ హక్కు లేదా వారు ఎక్కడికి పోయి బతకాలి అని ప్రశ్నించారు, భారత రాజ్యాంగమే ఆదివాసీలకు ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందని వారిపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు.
వెంటనే ఆదివాసీలపై పారేస్తా అధికారుల అక్రమ దాడులు ఆపాలని వారి నుండి ఎత్తుకెళ్లిన వస్తువులు సామాగ్రిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం బహిరంగ సభను విజయవంతం చేయండి
➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమేళనం నిర్వహిచబడుతుంది.ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేసి ఈ బహిరంగ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్,రామలింగారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,సామెల్,మరియు కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,రచన్న,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మనాక్షి నటరాజన్ గారితో కలిసి వర్కషాప్ లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహిరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మహారాష్ట్రలోని సేవాగ్రామ్, గాంధీ ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నేర్చుకోవలసిన అంశాలపై ఐదు రోజుల వర్కషాప్ లో రాజకీయ భాగ్యస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొలగించుకునేలా బూత్ స్థాయిలో వెళ్ళి మహిళలు ఒక సమూహమును ఏర్పరచుకొని నాయకులుగా ఎదగాలని రాజకయాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారి, మరోవైపు రాజకీయ పార్టీలో మహిళా శక్తిగా అవతరించాలని ముఖ్య అతిధులు అన్నారు.దేశ, రాష్ట్ర రాజకీయ పాండితులచే అనేక సెషన్స్ ను నిర్వహించడం జరిగింది.భారతదేశం నుండి ఈ కారిక్రమంలో నలభై మంది మహిళలు ప్రత్యేక ఆహ్వానం మరియు అనేక ప్రక్రియల ద్వారా ఎంపిక చేయబడిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీమతి అస్మా గారు మరియు విజయలక్ష్మి పాల్గొన్నారు
పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ పేదల కోసమే…
యువత జనం కోసం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి :
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ స్డేడియం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే 40 మంది విద్యార్థులకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో డబ్బులు సేకరించి మున్సిపాలిటీ కమీషనర్ గద్దె రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందించడం అభినందనీయమని కమీషనర్ అన్నారు. ఈ సంధర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కు సంబంధించిన సమస్యలు కమిషనర్ కు వివరించగా కమీషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె, గేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ.. యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్కేపీ యువత జనం కోసం పేదల కోసమే పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాతలు గణేష్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ పేరేంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు ఇవ్వాలి
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి
ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్ల లకు 25% సీట్లు కేటాయించి, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించారు.విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 121సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చొరవతిసుకొని ప్రైవేట్ స్కూల్ లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలో శితిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శిథిల గదులు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ప్రాణం తీసిన జెనరేటర్.. నిద్రలోనే కన్నుమూసిన తండ్రీకొడుకులు
మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది.
గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. పగటి పూట కరెంట్ కోత అంతగా బాధించకపోయినా.. రాత్రిళ్లు తప్పని సరిగా విద్యుత్ అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే కరెంట్ కోతలనుంచి తప్పించుకోవడానికి కొంతమంది జెనరేటర్లు వాడుతున్నారు. తాజాగా, ఓ పోర్టబుల్ జెనరేటర్ ముగ్గురి ప్రాణాలు తీసింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ముగ్గురు తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్ తన ఇద్దరు కొడుకులు.. సుమన్ రాజ్ (15), గోకుల్ రాజ్(13)తో కలిసి ఇంట్లో నిద్రపోయాడు. రాత్రి వర్షం కారణంగా కరెంట్ పోవటంతో పోర్టబుల్ జెనరేటర్ ఆన్ చేసి పడుకున్నారు.
మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ భార్య ఆ ఇంటి దగ్గరకు వెళ్లింది. పలుమార్లు తలుపు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పొరిగింటి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లింది. అక్కడ ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. వారి నోటి నుంచి నురగలు వస్తూ ఉన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గవర్నమెంట్ స్టేన్‌లే మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు.
అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో వారిది ఆత్మహత్య కాదని తేలింది. కార్బండ్ మోనాక్సైడ్ కారణంగా వారు చనిపోయినట్లు వెల్లడైంది. జెనరేటర్ నుంచి వెలువడిన కార్బండ్ మోనాక్సైడ్ ముగ్గురి ప్రాణాలు తీసిందని డాక్టర్లు తేల్చారు. జెనరేటర్ కారణంగా ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవటంతో స్థానికంగా కలకలం చెలరేగింది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్.. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా అరవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో (Formula E Car Race Case) ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (IAS Officer Arvind Kumar) ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు వచ్చారు ఐఏఎస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేస్తూ నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదిలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ఇప్పటికే రెండు సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే అరవింద్ కుమార్‌ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఎఫ్‌ఈవో కంపెనీకి దాదాపు రూ.45 కోట్లు 71 లక్షల నగదును బదిలీ చేశారు. వాటికి సంబంధించే మూడో సారి అరవింద్ కుమార్‌ను విచారణకు పిలిచి ఏసీబీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తోంది. అయితే రెండు సార్లు కేటీఆర్‌ను విచారణ జరిపిన సమయంలో ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని గతంలో అరవింద్ కుమార్‌ను ప్రశ్నించారు. అలాగే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను కూడా ప్రశ్నించారు. ఇక రెండో సారి కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఐఏఎస్ అధికారిని ఏసీబీ ప్రశ్నిస్తోంది.
ఆర్కే బీచ్‌కు బ్లూ ఫ్లాగ్.. మంత్రి దుర్గేష్ ఏమన్నారంటే
గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
రుషికొండ బీచ్‌ను మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh), భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (MLA Ganta Srinivas Rao) ఈరోజు (గురువారం) సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అన్ని విధాలుగా ఉన్నతమైన స్థానంగా విశాఖ గుర్తింపు పొందిందని వెల్లడించారు. రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బీచ్ పరిశుభ్రత అనేది రాజకీయ నాయకులు, అధికారులపైనే కాకుండా స్థానికంగా ఉండే ప్రజలపైన కూడా ఉందన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతం బీచ్ కాకుండా రాష్ట్రంలో మరో బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వంతో మాట్లాడి క్రూజ్‌ను మళ్ళీ తీసుకురావడం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
గత సంవత్సరం కాలంగా రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి పాలన సాగిస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొనియాడారు. రాష్ట్రంలోనే బ్లూ ఫ్లాగ్ గుర్తుంపున్న ఏకైక బీచ్ రుషికొండ బీచ్ అని తెలిపారు. ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా వైజాగ్ అభివృద్ధి చెందుతుందన్నారు. మొన్ననే టీసీఎస్ వచ్చిందని.. గూగుల్ కూడా దాదాపు రావడానికి ఖాయమైందన్నారు. అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రాంతంగా రుషికొండ బీచ్ ప్రత్యేకమైనదని అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ భవనాన్ని మరియు శిక్షణ కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీహరి
◆ : సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్ లోని చార్మినార్ మోతి గల్లీ లోని సెట్విన్ ఇనిస్ట్యూట్ లోని శిక్షణ కేంద్రాన్ని మరియు హైదరాబాద్ లోని జెహ్రా నగర్ కాలనీ,పురాణి హవేలీ సెట్విన్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్రపశుసంవర్ధక,డైరి డెవలప్మెంట్,క్రీడలు,యువజన మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డా౹౹వాకిటి శ్రీహరి,తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి సందర్శించారు.
N. Giridhar Reddy
వారితో పాటు సెట్విన్ ఎం.డి.వేణుగోపాల్ రావు మరియు సెట్విన్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సంఘం సభ్యత్వ నమోదులో పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి మునిగిళ్ళ పెద్దమందడి వెల్టూరు మద్దిగట్ల మోజర్ల విరాయపల్లి పామిరెడ్డిపల్లి బలిజపల్లి చిన్న మందడి అల్వాల దొడగుంటపల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో తపస్ సభ్యత్వాన్ని చేయించుకున్నారని. తపస్ జిల్లా అధ్యక్షులు అమరేందర్ రెడ్డి తెలిపారు ఏకీకృత సర్వీస్ నిబంధనలు ను క్లియర్ చేసి ఉప విద్యాధికారి డైట్ లెక్చరర్స్ ఎంఈఓ ప్రమోషన్లు ఇచ్చి ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దమందడి మండల ఇంచార్జ్ నర్మదా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ శశివర్ధన్ మండల గౌరవ అధ్యక్షులు మధుసూదన్ తపస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగపూర్ ఈశ్వర్ రవికుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క రమేష్ మండల కార్యదర్శి తిరుపతి సురేష్ రవి తదితర తపస్ బృందం తపస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు
రోజుకో ఆపిల్ తినడం వల్ల నిజంగా ఆరోగ్యంగా ఉంటారా? అయితే, ఏ సమయంలో తినడం ఆరోగ్యానికి మంచిది? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
‘రోజుకు ఒక యాపిల్ తింటే.. డాక్టర్ అవసరం లేదు’ అనేది ఒక సాధారణ సామెత. ఇది యాపిల్ లోని పోషక విలువలు, ఆరోగ్యానికి కలిగే మేలును సూచిస్తుంది. యాపిల్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకో యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్పాహారం తిన్న ఒక గంట తర్వాత యాపిల్ తింటే ప్రయోజనం ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, రోజుకో యాపిల్ తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు
యాపిల్‌లో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.
యాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
యాపిల్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
యాపిల్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
యాపిల్ నమలడం వల్ల దవడ, దంతాలు బలంగా మారతాయి. అలాగే, నోటిలో లాలాజలం ఉత్పత్తిని పెంచి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కాబట్టి, రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, సమతుల్య ఆహారంలో భాగంగా రోజుకు ఒకటి లేదా రెండు ఆపిల్స్ తినడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్‌పై ప్రజలలో అవగాహన పెరుగుతోంది. అయితే, అదే స్థాయిలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ విషయంలో నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లో విపరీతంగా లభిస్తున్నాయి.
నేటి కాలంలో ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్ పట్ల క్రేజ్ బాగా పెరిగింది. మన శరీర కండరాలను నిర్మించడానికి, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. రోజువారీ ఆహార పదార్థాలతో పాటు, శరీర అవసరానికి అనుగుణంగా ప్రోటీన్ పొందడానికి చాలా మంది ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే, మార్కెట్‌లో నకిలీ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉత్పత్తులు ఎక్కువగా లభిస్తున్నాయి
నకిలీ ప్రోటీన్ కొనడం వల్ల డబ్బు వృధా కావడమే కాకుండా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. నకిలీ పౌడర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, చక్కెర, స్టెరాయిడ్లు, డిటర్జెంట్లు కూడా ఉండవచ్చు. ఇవి మీ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఎక్కువ కాలం తీసుకుంటే హార్మోన్ల సమస్యలతోపాటు చర్మ సమస్యలను కూడా వస్తాయి. కాబట్టి, మీరు ఉపయోగిస్తున్న ప్రోటీన్ పౌడర్ నిజమైనదా? లేక నకిలీదా? గుర్తించడం చాలా ముఖ్యం. అయితే, ఈ సింపుల్ టిప్స్‌తో నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించండి..
ప్యాకేజింగ్‌ను పరిశీలించండి
ఇప్పుడు నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి ముందుగా ప్యాకింగ్, లేబుల్‌ను తనిఖీ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ స్పష్టంగా ఉండాలి. అలా లేకపోయినా స్పెల్లింగ్ లో పొరపాట్లు ఉంటే అది నకిలీ ప్రోటీన్ పౌడర్ అని అర్థం. అసలైన ప్రోటీన్ పౌడర్ ప్యాకింగ్ శుభ్రంగా, ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. కాబట్టి, ఏదైనా ప్రోటీన్ పౌడర్ తీసుకునే ముందు దాని బ్రాండ్, బ్యాచ్ నంబర్, తయారీ వివరాలను ఖచ్చితంగా తనిఖీ చేయండి.
QR కోడ్ లేదా స్క్రాచ్ కోడ్
నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి QR కోడ్‌ను తనిఖీ చేయండి. అసలు బ్రాండ్‌లో స్కాన్ చేయగల QR కోడ్ లేదా సెక్యూరిటీ హోలోగ్రామ్ ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా వాడి అసలైనదేనా అని చెక్ చేయొచ్చు. నకిలీ దానిలో ఈ కోడ్ ఉండదు.
స్మెల్ చూడండి
నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి దానిని వాసన చూసి రుచి చూడండి. నిజమైన ప్రోటీన్ పౌడర్ రుచి, వాసన ఉంటుంది. నకిలీ ఉత్పత్తులు వింత వాసన లేదా చేదు రుచిని కలిగి ఉండవచ్చు. దీనితో పాటు, నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించడానికి మీరు మిక్సింగ్ టెస్ట్ చేయవచ్చు. దీని కోసం, పౌడర్‌ను ఒక గ్లాసు నీటిలో వేయండి. దీనిలో నిజమైన ప్రోటీన్ త్వరగా పూర్తిగా కరిగిపోతుంది. అయితే, నకిలీ ప్రోటీన్ త్వరగా కరిగిపోదు. గడ్డలుగా ఏర్పడతాయి
మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది.
– భర్తను చంపి తెల్లారేవరకు శవంతోనే ఉన్న భార్య
చెన్నై: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు(Kadaluru) జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నైవేలి పంచాయతీ బీ2-బ్లాక్‌లో ఎన్‌ఎల్‌సీ నుంచి పదవీవిరమణ పొందిన కొలంజియప్పన్ (63) నివశిస్తున్నారు.
ఆయన భార్య మరణించడంతో భర్తకు దూరమైన పద్మావతి (55) అనే మహిళను 20ఏళ్ళ కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ కొలంజియప్పన్‌పై పద్మావతి నెల రోజుల క్రితం నైవేలి పోలీస్‌స్టేషన్(Nyveli Police Station)లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారని తెలిసింది.
ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి గాఢనిద్రలోవున్న కొలంజియప్పన్ గొంతును పద్మావతి కత్తితో కోయడంతో అతడు మృతిచెందినట్లు తెలిసింది. భర్త శవం వద్ద పద్మావతి ఉదయం వరకు ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపింది. ఆమెను అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టు ఉత్తర్వుల మేరకు రిమాండ్‌కు తరలించారు.
35 ఏళ్లు వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి కొన్ని రకాల జ్యూస్ లను తాగడం మంచిది. అయితే, ఫిట్‌గా ఉండటంతో పాటు యవ్వనంగా కనిపించడానికి వేటిని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
35 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి కొన్ని రకాల జ్యూస్ లను తాగడం మంచిది. ఎందుకంటే, వయసు పెరిగేకొద్ది శరీరంతోపాటు చర్మంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఆరోగ్యకమైన ఆహారాలను తినడం చాలా అవసరం. ముఖ్యంగా పండ్లు, కూరగాయల జ్యూస్‌లు, కొన్ని రకాల విత్తనాలను తీసుకోవడం మంచిది. ఇవి మిమ్మల్ని హెల్తీగా ఉండేలా చేస్తాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. కాబట్టి, ఫిట్‌గా ఉండటంతో పాటు యవ్వనంగా కనిపించడానికి వేటిని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రీన్ జ్యూస్:
ఆకుకూరలు, దోసకాయ, నిమ్మకాయ, అల్లం కలిపి చేసిన జ్యూస్ శరీరానికి చాలా అవసరమైన పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియకు, వికారం తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీరు వారానికి ఒకసారి ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మునగాకు రసం
మునగాకు రసం అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న ఒక పోషకాహారం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, ఎముకలను బలంగా చేస్తుంది. కాబట్టి, మీరు వారానికి 2-3 సార్లు ఈ మునగాకు పచ్చి రసం తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి రసం
బొప్పాయి అనేది ఒక రుచికరమైన, పోషకమైన పండు. ఇది విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మీరు వారానికి 2 రోజులు బొప్పాయి తినండి. ఇది మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. మీ మొత్తం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.
ఎండుద్రాక్ష, అంజీర్
ఎండుద్రాక్ష, అంజీర్ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. ఎండుద్రాక్షలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంజీర్‌లో కూడా ఫైబర్, పొటాషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రాత్రిపూట 4-5 ఎండుద్రాక్షలు, 2 అంజీర్ పండ్లను నానబెట్టండి. ఉదయం వాటిని తినండి. ఇది మీ మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
విత్తనాలు
మీరు మీ ఆహారంలో విత్తనాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. మీరు చియా గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి విత్తనాలను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇవి మీ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.
జాగ్రత్తలు:
చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల రసాలను పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, ఏదైనా జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
హ్యూమలూల మేయర్ డేనియల్ గూటియరెజ్ ఓ ఆడ మొసలిని పెళ్లాడారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి కోసం ఆడ మొసలికి పెళ్లి డ్రెస్ కూడా వేశారు.
మనుషులు జంతువుల్ని పెళ్లి చేసుకోవటం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. జాతకంలో దోషాలు ఉన్నపుడు.. అది కూడా పెళ్లి సమయంలో దోష నివారణ కోసం ఇలా మనుషులు.. జంతువుల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ, మెక్సికో దేశంలో ఓ వింత ఆచారం ఉంది. మనుషులు మొసళ్లను పెళ్లి చేసుకోవటం తరచుగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఇది పెళ్లి విషయంలో దోష నివారణం కోసం అయితే కాదు.
మెక్సికో, శాన్‌పెడ్రోలోని హ్యూమలూలాలో 230 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం ఉంది. అక్కడి మగవారు మొసళ్లను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అలా చేయటం వల్ల వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండుతాయని, మత్స్య సంపద బాగుంటుందని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే వందల ఏళ్లుగా అదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ప్రతీ ఏటా మనుషులు మొసళ్లను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.
తాజాగా, హ్యూమలూల మేయర్ డేనియల్ గూటియరెజ్ ఓ ఆడ మొసలిని పెళ్లాడారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి కోసం ఆడ మొసలికి పెళ్లి డ్రెస్ కూడా వేశారు. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత మేయర్.. తన భార్య మొసలిని ముద్దులతో, హగ్గులతో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు
జూబ్లీహిల్స్(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు.
– మోదీ నైతిక విలువలతో పాలన అందిస్తున్నారు
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jublihills) నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) పేర్కొన్నారు. బుధవారం శ్రీరామ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇంకా ఏమీ అనుకోలేదన్నారు.
కేటీఆర్ అందించిన స్ర్కిప్ట్‌నే మీరూ చదువుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అంటున్నారన్న విలేకరుల ప్రశ్నకు.. సీఎం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాల ఆడిటోరియంలో బీజేపీ మహిళామోర్చా ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ’ అంశంపై నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్ రూపకల్పన చేసిన మహోన్నత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తూ నైతిక విలువలతో కూడిన పాలనను నరేంద్రమోదీ అందిస్తున్నారని అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా చెరబట్టారనే విషయాలు నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీకే ఆరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు, నేతలు డాక్టర్ ఎం.గౌతమ్‌రావు, లంకల దీపక్‌రెడ్డి, మహిళా మోర్చా నేతలు శిల్పారెడ్డి, రాజు నేత, తులసి, సమత తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.