హత్యకు దారితీసిన అనుమానం.. రాత్రంతా భర్త శవంతో..

హత్యకు దారితీసిన అనుమానం.. రాత్రంతా భర్త శవంతో..

 

 

 

 

 

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది.

– భర్తను చంపి తెల్లారేవరకు శవంతోనే ఉన్న భార్య

చెన్నై: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను హతమార్చిన భార్య రాత్రంతా భర్త శవంతో గడిపిన సంఘటన కడలూరు(Kadaluru) జిల్లా నైవేలిపట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నైవేలి పంచాయతీ బీ2-బ్లాక్‌లో ఎన్‌ఎల్‌సీ నుంచి పదవీవిరమణ పొందిన కొలంజియప్పన్‌ (63) నివశిస్తున్నారు.

 

ఆయన భార్య మరణించడంతో భర్తకు దూరమైన పద్మావతి (55) అనే మహిళను 20ఏళ్ళ కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ కొలంజియప్పన్‌పై పద్మావతి నెల రోజుల క్రితం నైవేలి పోలీస్‏స్టేషన్‌(Nyveli Police Station)లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారని తెలిసింది.

 

ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి గాఢనిద్రలోవున్న కొలంజియప్పన్‌ గొంతును పద్మావతి కత్తితో కోయడంతో అతడు మృతిచెందినట్లు తెలిసింది. భర్త శవం వద్ద పద్మావతి ఉదయం వరకు ఉన్నట్టు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపింది. ఆమెను అరెస్టు చేసి బుధవారం ఉదయం కోర్టు ఉత్తర్వుల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version